breaking news
balineni srinivasreddy
-
సోము వీర్రాజు వ్యాఖ్యలు సరికావు: బాలినేని
సాక్షి, ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి గురించి తెలిసి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు మాట్లాడటం సరికాదు అని రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కోవిడ్ ప్రభావంతో అన్ని రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితులు క్షీణించాయని తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అప్పులు చేస్తే.. సోము వీర్రాజు ఎందుకు మాట్లాడలేదని బాలినేని ప్రశ్నించారు. జలాల విషయంలో చంద్రబాబు చేస్తున్న రాజకీయలు ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా ఉన్నాయని ఆయన మండి పడ్డారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి వుంటే... జలవివాదంపై తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయాలి అని మంత్రి బాలినేని డిమాండ్ చేశారు. -
అలా జరిగితే పదవి వదులుకుంటా: బాలినేని
-
నాపై చౌకబారు ఆరోపణలు మానుకోండి
-
జయనామ సంవత్సరంలో జగనే సీఎం
ఒంగోలు అర్బన్, న్యూస్‌లైన్: జయనామ సంవత్సరంలో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పండితుడు సదాశివయ్యశాస్త్రి పంచాంగ పఠనం చేశారు. పంచాంగం ప్రకారం వైఎస్సార్ సీపీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిల గ్రహబలం బాగుందని, విశేష ప్రజాదరణ పొందుతారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బాలినేని మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయపథంలో పయనిస్తుందని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవితాలు మారతాయని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ వేమూరి బుజ్జి, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, శింగరాజు వెంకటరావు, జిల్లా ఉపాధి కల్పన విభాగం కన్వీనర్ బొగ్గుల శ్రీనివాసరెడ్డి, జిల్లా మహిళా కన్వీనర్ పోకల అనూరాధ, జిల్లా అధికార ప్రతినిధులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నరాల రమణారెడ్డి, నగర అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి, నగర ఎస్సీ సెల్ కన్వీనర్ యరజర్ల రమేష్, నగర సేవాదళ్ కన్వీనర్ కంకణాల వెంకటరావు, నగర మహిళా కన్వీనర్ కావూరి సుశీల, నగర యూత్ కన్వీనర్ నెరుసుల రాము, నగర ప్రచార కమిటీ సెక్రటరీ రాయపాటి కోటి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు టీ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.