breaking news
Balamrutam packet
-
ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: దివంగత నేత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నుంచి మంత్రి సీతక్క వరకు మహిళలు రాజకీయాల్లో రాణిస్తారని నిరూపించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాచారంలో (మంగళవారం) సీఎం రేవంత్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన బాలామృతం ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలామృతం ఉత్పత్తికి సంబంధించిన ప్యాకింగ్స్‌ను పరిశీలించారు. గర్భిణీలను ఆదుకోవాలని ఆనాడు ఇందిరాగాంధీ గారు మహబూబ్ నగర్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని అది ఈ రోజు అంచెలంచెలుగా ఇది ఒక పరిశ్రమగా ఎదిగిందని సీఎం అన్నారు.సీఎం మాట్లాడుతూ "ఈ రోజు కొత్తగా బాలామృతం ప్లాంట్ ను ప్రారంభించుకున్నాం. ప్రజా ప్రభుత్వంలో 2 కోట్లకు పైగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఇందిరమ్మ ఇండ్లను మహిళ పేరుతోనే ఇస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత కరెంటు అందిస్తున్నాం. 3 కోట్ల 28 లక్షల తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. పట్టణ ప్రాంతంలో పేదలను ఆదుకునేందుకు లక్ష ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం వెయ్యి బస్సులకు మహిళలను యజమానులను చేశామని వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టును మహిళకు అప్పగించామని పేర్కొన్నారు. 2034 లోగా కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తన లక్ష్యమని ఆ దిశగా చర్యలు చేపడుతూ ముందుకు వెళుతున్నాం ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టడమే కాదు.. పేదల బిడ్డలు ఆకలితో ఉండకూడదనే ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీం ను తీసుకొచ్చాం. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ స్కీం మొదలు పెట్టామన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. -
బాలలకు అమృతం
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తక్కువ బరువుతో పుట్టిన చిన్నారులపై మహిళా శిశు సంక్షేమ శాఖ(ఐసీడీఎస్) ప్రత్యేక దృష్టి సారించింది. వయసుకు తగిన బరువు లేకుండా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న ఎంటీఎఫ్ స్థానంలో ‘బాలామృతం’ పేరుతో అధిక పోషక విలువలు గల పౌష్టికాహారాన్ని అందిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని చిన్నారులందరికీ రెండున్నర కేజీల బాలామృతం ప్యాకెట్లను ఈ ఏడాది మే ఒకటి నుంచి అందజేస్తోంది. జిల్లాలోని 21 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న 4,094 అంగన్వాడీ కేంద్రాల్లో రెండున్నర నుంచి మూడేళ్లలోపు చిన్నారులకు ఎంటీఎఫ్‌ను అందిస్తూ వస్తున్నారు. అయితే చిన్నారుల్లో వయసుకు తగిన బరువు లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. దీంతో ఎంటీఎఫ్ స్థానంలో బాలామృతం పేరుతో అధిక పోషక విలువలు కలిగిన పౌష్టికాహారాన్ని చేర్చారు. రోజుకు 100 గ్రాముల చొప్పున 25 రోజులకు సరిపడే విధంగా వేరుశనగ పప్పు, వేయించిన గోదుమలు, పంచదార, పాలపొడి మిశ్రమాలతో కూడిన రెండున్నర కేజీల బాలామృతం ప్యాకెట్‌ను చిన్నారుల తల్లులకు అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో స్కేళ్లు అంగన్వాడీ కేంద్రాల్లో స్కేళ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు వీటిని నామ్‌కే వాస్తేగా వినియోగిస్తూ వచ్చారు. బాలామృతం పథకం రాకతో స్కేళ్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కేంద్రాల పరిధిలోని చిన్నారులు ఎంత ఎత్తు ఉన్నారో వారం రోజులకు ఒకసారి చూడటం, వారు ఎంత బరువు ఉన్నారో పరిశీలించడం తప్పనిసరి చేశారు. వయసుకు తగిన బరువు లేకుంటే అలాంటి చిన్నారుల విషయంలో అంగన్వాడీ కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. బాలామృతం ద్వారా తక్కువ బరువు కలిగిన చిన్నారుల్లో రాకుంటే వైద్యులకు చూపించి ఆ చిన్నారి ఆరోగ్యపరమైన సమస్యలు ముందుగానే తెలుసుకునే విధంగా తల్లులను చైతన్యపరిచేందుకు ఐసీడీఎస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తల్లులతో పాటు అంగన్వాడీ కార్యకర్తలకూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే తక్కువ బరువు గల చిన్నారుల్లో మార్పు వచ్చే అవకాశాలున్నాయి.


