breaking news
bahujanula
-
బహుజనుల అవిశ్రాంత పోరు
తాడికొండ: రాజధాని పేరిట అమరావతిలో కులవాదుల అరాచకాలు, అవినీతిని ప్రపంచానికి తెలియజేసేందుకు... రాజ్యాంగబద్ధంగా పేదలకు లభించిన హక్కులను కాపాడేందుకు... మూడు రాజధానుల వల్ల కలిగే ప్రయోజనాలను చాటిచెప్పేందుకు బహుజన పరిరక్షణ సమితి అవిశ్రాంత పోరాటం సాగిస్తోంది. రాజధాని ఒక కులానిది కాదని.. అందరిదని చాటిచెబుతోంది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తోంది. భవిష్యత్‌లో మరో వేర్పాటువాద ఉద్యమానికి నేడు అమరావతిలో కులవాదుల వ్యవహారశైలి, నిర్ణయాలు కారణం కాకూడదని పోరాడుతోంది. ఈ మేరకు మూడు రాజదానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం 1,200వ రోజుకు చేరనున్నాయి. ఎక్కడ అన్యాయం జరిగిందో.. అక్కడే పోరాటం రాష్ట్ర ప్రభుత్వం 2019, డిసెంబర్ 17న అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ఆమోదించింది. దీనిని వ్యతిరేకిస్తూ అమరావతి ఉద్యమం పేరుతో రైతుల ముసుగులో టీడీపీ నాయకులు దొంగ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం మూడు రాజధానుల దిశగా అడుగులు వేయకుండా కోరుక్టు వెళ్లి స్టేలు తీసుకువచ్చారు. అయితే, మూడు ప్రాంతాల సమానాభివృద్ధితోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని, రాష్ట్ర ఖజానా మొత్తం ఒకే ప్రాంతానికి దోచిపెట్టడం కారణంగా అందరి హక్కులకు భంగం వాటిల్లుతుందంటూ బహుజన పరిరక్షణ సమితి నాయకులు 2020, ఫిబ్రవరి 9న ఉద్యమం చేపట్టారు. ఎక్కడ రాజధాని పేరిట బహుజనులు, పేదల భూములు దోచుకున్నారో.. ఎక్కడ అమాయకులకు అన్యాయం జరిగిందో అక్కడే ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత, బహుజన సంఘాలు మద్దతు తెలిపాయి. ప్రత్యక్షంగా 67 సంఘాలు, పరోక్షంగా దాదాపు 240 సంఘాల నేతలు ఈ ఉద్యమానికి సంఘీభావం తెలిపాయి. ఈ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కులవాదులు, పెత్తందారులు, ఆరి్థక ఉగ్రవాదులు పలుమార్లు ప్రయతి్నంచినప్పటికీ బహుజన నేతలు వెరవకుండా నిరి్వరామంగా తమ పోరాటం కొనసాగిస్తున్నారు. మూడు రాజధానుల ద్వారానే బహుజనులకు మేలు 1,199వ రోజు రిలే నిరాహార దీక్షలో బహుజన పరిరక్షణ సమితి నాయకులు మూడు రాజధానుల ద్వారానే బహుజనుల ఆర్థిక, సామాజిక ఎదుగుదల సాధ్యమని బహుజన పరిరక్షణ సమితి నాయకులు అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం 1,199వ రోజుకు చేరాయి. పలువురు నాయకులు మాట్లాడుతూ 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు పేదల కోసం చేసిన ఒక్క మంచిపని అయినా ఉంటే చూపించి ఓట్లు అడగాలని సూచించారు. విభజన అనంతరం బాబు చేసిన తప్పుడు పనుల కారణంగానే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అమరావతి పేరుతో కేవలం గ్రాఫిక్స్లను ఎల్లో మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసిన చంద్రబాబు ఈ ప్రాంతంలో ముందస్తు వ్యూహంతో బినామీల ద్వారా పెట్టుబడులు పెట్టి తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేసి రూ.లక్షల కోట్లు లాభాలు పొందారని ఆరోపించారు. రిలే నిరాహార దీక్షలో పాల్గొని నిరసన తెలియజేస్తున్న బహుజన పరిరక్షణ సమితి నాయకులు (ఫైల్) -
బహుజనులను ఏకంచేసిన మహనీయుడు పాపన్నగౌడ్
మాడ్గుల: నవాబులు, జమీందారుల అరాచకాలతో నలిగిపోతున్న బహుజనులను ఏకం చేసి వారి శ్రేయస్సు కోసం పాటుపడిన మహనీయులు సర్ధార్ సర్వాయి పాపన్నౖగౌడ్ అని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ఛైర్మెన్ కె. స్వామిగౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల మండలం అవురుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని గురువారం మమబూబ్‌నగర్, కల్వకుర్తి ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, వంశీచంద్‌రెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు. పాపన్నగౌడ్ 366వ జయంతిని పురస్కరించుకుని సర్పంచ్ నారాయణగౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో స్వామిగౌడ్ మాట్లాడుతూ పాపన్నగౌడ్ ఔరంగజేబు పాలనలో కింది స్థాయి జమీందారులు గ్రామాల్లో చేసిన అరాచకాలకు ఎదురుతిరిగాడని, బహుజనులను ఐక్యం చేసి గోల్కొండకోటకు నవాబుగా రాజ్యాధికారం సాగించిన గొప్ప వీరుడు అని కొనియాడారు. మాడ్గుల, ఆమనగల్లు మండల గ్రామాలకు చెందిన గౌడగీత కార్మికులు ప్రభుత్వానికి పన్ను బకాయిలను రదుద చేసి, కొత్త లైసెన్స్‌లను మంజూరు చేస్తామని స్వామిగౌడ్ గీతకార్మికులకు హమీ ఇచ్చారు.lకార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, తెలంగాణ రాష్ట్రగౌడకల్లు గీతవృత్తిదారుల సంఘం అధ్యక్షుడు అయిలి వెంకన్నగౌడ్, గౌడసంక్షేమసంఘం తాలూకా అధ్యక్షుడు అయిళ్ళ శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీటీసీ సభ్యులు పగడాల రవితేజ, ఎంపీపీ జైపాల్‌నాయక్, ఎంపీటీసీ, సభ్యులు, గౌడనాయకులు పాల్గొన్నారు.