breaking news
automate
-
ఏడు పవర్ఫుల్ ఏఐ టూల్స్..
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం పెరుగుతోంది. దాంతో కంపెనీలు వినియోగదారులను పెంచుకునేందుకు విభిన్న విభాగాల్లో ఏఐ టూల్స్‌ను ఆవిష్కరిస్తున్నాయి. ఇప్పటికే చాలా టూల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే నిపుణులు, విద్యార్థులు, వ్యాపారులకు ఉపయోగకరంగా ఉంటున్న కొన్ని ఏఐ టూల్స్ గురించి తెలుసుకుందాం. అయితే ఈ టూల్స్‌లోని కొన్ని సదుపాయాలు ఉచితంగా లభిస్తుంటే మరిన్ని ఫీచర్ల కోసం ఆయా సంస్థల నిబంధనల ప్రకారం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుందని గమనించాలి.కర్సర్ ఏఐకర్సర్ ఏఐ విజువల్ స్టూడియో కోడ్ (VS Code) ఆధారంగా పనిచేసే ఏఐ పవర్డ్ కోడ్ ఎడిటర్.కోడ్ రాయడం, డీబగ్గింగ్, రీఫాక్టరింగ్, నేచురల్ ల్యాంగ్వేజీ ఇన్పుట్స్ నుంచి కోడ్ రూపొందించడంలో సహాయపడుతుంది.ప్రత్యేకంగా డెవలపర్లకు కోపైలట్ అసిస్టెంట్‌గా పని చేస్తుంది.ఉచిత ప్లాన్‌తో ప్రారంభించి అవసరాలకు తగ్గట్టు అప్‌గ్రేడ్ చేయవచ్చు.మిడ్ జర్నీ (Midjourney)నేచురల్ ల్యాంగ్వేజ్ ప్రాంప్ట్‌లతో ఈ ఏఐ టూల్‌ను ఉపయోగించవచ్చు.డిఫ్యూజన్ మోడల్ ఆధారంగా పనిచేసే ఈ టూల్ సృజనాత్మక ఆర్ట్, విజువల్స్, కాన్సెప్ట్ ఆర్ట్‌కి అనువైంది.డిస్క్రిప్ట్ఏఐ ఆధారిత ఆడియో, వీడియో ఎడిటింగ్ టూల్.టెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్ ఆధారంగా మీడియా ఎడిటింగ్ చేయగలదు. ఇది వీడియో, పోడ్కాస్ట్ సృష్టికర్తల కోసం ఎంతో ఉపయోగపడుతుంది.ఏఐ కో-ఎడిటర్ ఆడియో నాణ్యత పెంచుతుంది. బ్యాక్‌గ్రౌండ్ శబ్దాన్ని తొలగిస్తుంది.క్లాడ్ ఏఐ (Anthropic)రైటింగ్, కోడింగ్, టెక్ట్స్ సమ్మరైజింగ్, డేటా విశ్లేషణలో సహాయం చేస్తుంది.వెబ్, ఐఓఎస్, ఆండ్రాయిడ్‌లో అందుబాటులో ఉంటుంది.రన్ వే ఎంఎల్వీడియో, ఫిల్మ్ ఎడిటింగ్ కోసం ఏఐ ప్లాట్‌ఫామ్.ఇమేజ్ టు వీడియో, టెక్స్ట్ టు వీడియో సాధ్యం అవుతుంది.పర్ప్లెక్సిటీ ఏఐఏఐ ఆధారిత సెర్చ్ ఇంజిన్.వాయిస్ సెర్చ్, టాపిక్ డిస్కవరీ, ప్రాజెక్ట్ నిర్వహణకు సాయం చేస్తుంది.ఫ్లికి ఏఐటెక్స్ట్ వాయిస్ఓవర్ వీడియో ప్లాట్‌ఫామ్.మార్కెటింగ్, ఇన్స్టిట్యూషనల్ వీడియోల కోసం ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: ప్రపంచంలో 10 పవర్ఫుల్ మిలిటరీ దేశాలు -
చేతులు కలిపిన ఐఐసీటీ, లాక్సాఐ
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఫార్మా రంగానికి కీలకమైన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియంట్ (ఏపీఐ) విషయంలో స్వావలంబన సాధించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఏపీఐల విషయంలో ఇప్పటివరకు మనదేశం చైనా పై అధికంగా ఆధారపడుతోంది. అయితే కరో నా కష్టకాలంలో చైనా నుంచి ముడిసరుకులు, ఏపీఐలు తేవడంలో ఇబ్బందులు ఏర్పడటం తో ప్రభుత్వం సొంతంగా తయారు చేసుకుం టేనే మేలన్న అంచనాకు వచ్చింది. ఈ నిర్ణయాన్ని అమల్లో పెట్టేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) లాక్సాఐ ఇంటర్నేషనల్ అనే దేశీ కంపెనీతో జత కట్టిం ది. ముందుగా కరోనా వైరస్ చికిత్సకు ఐఐసీటీ అభివృద్ధి చేస్తున్న మందు తయారీ కోసం రెండు కంపెనీలూ పనిచేయనున్నాయి. యుమిఫెనోవిర్, రెమిడెస్విర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌లను కూడా ఈ భాగస్వామ్యంలో తయారు చేయనున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో మలేరియా చికిత్సకు ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు భారత్ ఈ మందు తయారు చేసేందుకు కూడా చైనా సరఫరా చేసే రసాయనాలపై ఆధారపడుతోంది. ఐఐసీటీ, లాక్సాఐల భాగస్వామ్యం కారణంగా ఇకపై ఈ మందులు సొంతంగా, చౌకగా తయారు చేసుకోవచ్చునని అంచనా. ఏపీఐలతోపాటు ఫార్మా రంగానికి కీలకమైన మరిన్ని రసాయనాలను సొంతంగా అభివృద్ధి చేయడం ఈ భాగస్వామ్యపు లక్ష్యం. 2007లో ఏర్పాటైన లాక్సాఐ ఇంటర్నేషనల్ కొత్త కొత్త రసాయనాలను గుర్తించడంతోపాటు ప్రపంచస్థాయి కంపెనీలకు విక్రయిస్తోంది. -
వ్యవసాయ యాంత్రీకరణకు రూ.12.88 కోట్లు
- సబ్ డివిజన్లవారీగా కేటాయింపులు - మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచన కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ యాంత్రీకరణ కింద సబ్సిడీ నిమిత్తం జిల్లాకు రూ.12.88 కోట్లు కేటాయించారు. ఎస్డీపీ(స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్) కింద 354 యంత్ర పరికరాల పంపిణీకి రూ.2.18 కోట్లు, ఎస్ఎంఏఎం కింద రూ.10.70 కోట్లు అలాట్ అయ్యాయి. ఎస్డీపీ కింద ట్రాన్స్ప్లాంటర్లు, ల్యాండ్ ప్రిపరేటరీ అండ్ ఎక్విప్మెంట్, ఇంటర్ కల్టివేషన్ ఎక్విప్మెంట్, పోస్టు హార్వెస్టింగ్ ఎక్విప్మెంట్, మినీ ట్రాక్టర్లను 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తారు. ఎస్ఎంఏఎం(సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్) కింద ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్స్, పవర్ స్ర్పేయర్లు, రోటావేటర్లు, ప్యాడీ రీపర్లు, పవర్ టిల్లర్లు అందిస్తారు. రైతులు సంబంధిత మండల వ్యవసాయాధికారులను సంప్రదించి మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జేడీఏ సూచించారు.


