breaking news
Author of the book
-
తెలుగువారంతా ఒక్కటే
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: బౌగోళికంగా విడిపోయినా తెలుగువారందరూ ఒక్కటేనని ఏపీ పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ అధ్యక్షులు రావులపాటి సీతారామరావు అన్నారు. శుక్రవారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో లేఖిని మహిళా చైతన్య సాహితీ సాంస్కృతిక సంస్థ, శ్రీ వేదరిగి కమ్యునికేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ కె.వి.రమణాచారి ‘అమృత వర్షిణి’, డైరెక్ట్ కథానికా సంకలనం–2016‘ పంచసప్తతి’, అంబటిపూడి వెంకటరత్నం కథానిక సంపుటి, చంద్రప్రతాప్ ‘టాంక్బండ్ కథలు’, వేదగిరి రాంబాబు సాహిత్య రేఖలు, పుస్తకాలను ఆవిష్కరించారు. రావులపాటి సీతారామరావు మాట్లాడుతూ మన అనుభవంలోని సంఘటలను కథల రూపంలో రాస్తే అంతకన్న గొప్ప కథలు మరొకటి ఉండవని అన్నారు. పుస్తక రచయిత డాక్టర్ కెవి.రమణాచారి మాట్లాడుతూ ఎన్నో పుస్తకాలను ఆవిష్కరించిన తనకు నా పుస్తకాన్ని ఆవిస్కరించుకోవటం ఆనందంగా ఉందని అన్నారు.కార్యక్రమలో పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు. -
మన సంస్కృతీ సంప్రదాయాలు
వాక్కు సాక్షాత్తూ వాగ్దేవతకు ప్రతిరూపం. మంచిగా, మధురంగా మాట్లాడే వాళ్లకు అందరూ మిత్రులే. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. ‘మంచిమాట’, ‘తేనెచినుకులు’, ‘దీక్ష’ ‘విదురనీతి కథలు’ వంటి పాఠకాదరణ పొందిన పుస్తక రచయిత విశ్రాంత అధ్యాపకులు సూర్యప్రసాదరావు ఎందరో మహనీయులు చెప్పిన ఎన్నో మంచి మాటలను ఎంతో నేర్పుగా, మరెంతో ఓర్పుగా ఒకచోట గుదిగుచ్చారు. దానికి మకరంద బిందువులు అనే పుస్తక రూపమిచ్చారు. ఈ పుస్తకంలో భగవత్ స్వరూపాన్ని నిర్వచించే సత్యమ్.. శివమ్...సుందరమ్, గృహస్థాశ్రమ ధర్మాన్ని, విశిష్టతను వివరించే మంచిమాటలు, మన సంస్కృతికి మాత్రమే సొంతమైన ‘వందన’ ప్రాధాన్యత, అక్షరార్చన ఆవశ్యకతను ఆవిష్కరించే అక్షరం.. అక్షరాభ్యాసం, అందరూ సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షించే ఓం శాంతిః శాంతిః శాంతిః అనే వ్యాస కుసుమాలు గుబాళించాయి. రాసిన ప్రతిదానినీ ప్రామాణిక మంత్రశ్లోకాలతో సమన్వయం చేశారు రచయిత. మకరంద బిందువులు; పుటలు: 238, వెల రూ. 150; ప్రతులకు: ఎం. సూర్యప్రసారావు, విశ్రాంత అధ్యాపకులు, ఇంటినం. 5-6-18/బి, పాకబండ బజార్, పెట్రోల్ బంక్ వెనక, ఖమ్మం- 507 001. - డి.శ్రీలేఖ