breaking news
Attack of an elephant
-
రైతును తొక్కి చంపిన ఏనుగులు
చిత్తూరు:ఏనుగుల దాడిలో అటవీశాఖ లైన్‌వాచర్ మృతి చెందిన ఘటన మరువకముందే మరో దారుణం చోటు చేసుకుంది. వీ కోట మండలం కారగల్లు మరో రైతు శుక్రవారం మృత్యువాత పడ్డాడు. చంద్రానాయుడు అనే రైతు పొలంలోకి ఏనుగులను తరుముతుండగా ఈ విషాదం సంభవించింది. (అటవీ ఉద్యోగిని చంపిన ఏనుగు) గురువారం రామకుప్పం సమీపంలోని ననియూల అటవీ ప్రాంతంలో ఏనుగుల దాడిలో లైన్ వాచర్ మునెప్ప మృతిచెందిన విషయం తెలిసిందే. ననియాల గ్రామానినికి సమీపంలోని పొలం వద్దకు ఏనుగుల గుంపు రావడంతో ఒక్కసారిగా అవి జనంపై తిరగబడ్డాయి. అందరూ ఏనుగుల దగ్గరి నుంచి తప్పించుకుని బయటపడ్డా.. లైన్ వాచర్ మునెప్ప మాత్రం ఏనుగుల బారిన పడి మృతి చెందాడు.వరసుగా రెండు ఇదే తరహా ఘటనలు చోటు చేసుకోవడం జిల్లాలో ఆందోళన రేకెత్తిస్తోంది. -
తప్పించుకోలేకపోయాడు
ఏనుగుల దాడిలో అటవీశాఖ ఉద్యోగి మృతి రావుకుప్పం, న్యూస్‌లైన్: ఏనుగుల దాడిలో అటవీశాఖ లైన్‌వాచర్ మృతి చెందిన సంఘటన గురువారం రామకుప్పం సమీపంలోని ననియూల అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నా రుు. ననియూల అటవీ ప్రాంతంలో లైన్ వాచర్ మునెప్ప(42) సువూరు పది సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం ననియాల గ్రావూనికి సమీపంలోని పొలం వద్దకు ఏనుగుల గుంపు వచ్చింది. వాటిని తరిమేం దుకు సహచరులు, గ్రామస్తులతో కలసి మునెప్ప వెళ్లాడు. ఓ పక్క టపాకాయులు పేల్చుతూ మరోపక్క ఏనుగులను అటవీ ప్రాంతానికి తరుముతుండగా ఏనుగులు ఒక్కసారిగా జనంపై తిరగబడ్డాయి. దీంతో జనం ఏమిచేయాలో తోచక ఒకరిపై ఒకరు పడుతూ పరుగులు తీశారు. అందరూ ఏనుగుల దగ్గరి నుంచి తప్పించుకుని బయటపడ్డారు. అయితే మునెప్ప మాత్రం అడవిలోని పొదలచాటునే చిక్కుకుపోయాడు. ఏనుగులు అతనిని చుట్టుముట్టాయి. మునెప్ప ఏనుగుల నుంచి తప్పించుకునేందుకు అరిచి కేకలు వేశాడు. ఆ సమయంలో ఓ ఏనుగు తొండంతో కొట్టి, తొక్కి చంపేసింది. అనంతరం ఏనుగులు లోతట్టు ప్రాంతానికి వెళ్లిపోయాయి. అనంతరం జనం తండోపతండాలుగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. మునెప్ప భార్య ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది. రేంజర్‌పై దాడి కుప్పం ఫారెస్ట్ రేంజర్ కాలప్ప నాయుడు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకోగానే మునెప్ప బంధువులు వారిపై దాడికి పాల్పడ్డారు. రేంజర్‌పై పిడిగుద్దులు గుద్దారు. అటవీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోలర్ కంచె మరవ్ముతు చేయకుండా దానికి వెచ్చించే వ్యయాన్ని దోచుకు తిని సిబ్బందిపై ఉద్యోగం పేరుతో ఒత్తిడి తీసుకొచ్చి వేధిస్తున్నారని వుండిపడ్డారు. వారం రోజులుగా ఏనుగులు అటవీ ప్రాంతంలో సంచరిస్తుంటే ఉన్నతాధికారులు ఇళ్లకే పరిమితమై కిందిస్థాయి సిబ్బందిని అటవీ ప్రాంతంలోకి పంపుతున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా పదేళ్ల కిందట నారాయణపురం తాండాలో ఏనుగుల దాడితో ఓ రైతు చనిపోయాడు.