breaking news
atta kodalu
-
అత్తా కోడళ్ల మధ్య ఘర్షణ! కత్తిపీటతో అత్తను దారుణంగా..
ఖమ్మం: చిలికి చిలికి గాలి వానలా మారిన అత్తా కోడళ్ల మధ్య ఘర్షణ చివరకు అత్తమీద కోడలు కత్తిపీటతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచేలా చేసింది. శనివారం సాయంత్రం పట్టణంలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని 2వ వార్డు ఇల్లెందులపాడుకు చెందిన అత్త శివారపు లలితమ్మ, కోడలు మౌనికలు శనివారం సాయంత్రం గొడవపడ్డారు. ఈక్రమంలో ఇరువురు ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా ఆగ్రహంతో అత్తపై కోడలు కత్తిపీటతో తలమీద నరికింది. దీంతో లలితమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మానికి తరలించగా.. ఈ సంఘటన ఇల్లెందులపాడులో సంచలనంగా మారింది. ఇవి చదవండి: ద్విచక్రవాహనంపై వెళ్తుండగా యువకుడి విషాదం! -
కోడలు కిడ్నాప్ అంటూ అత్త డ్రామా
నరసరావుపేటరూరల్: తన కోడలను కిడ్నాప్ చేశారంటూ ఓ అత్త చేసిన హంగామాను డ్రామాగా పోలీసులు తేల్చారు. అత్తింట్లో వేధింపులు తట్టుకోలేక బంధువుల ఇంట్లో తలదాచుకున్న వివాహితను గుర్తించి విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. రూరల్ పోలీసుల కథనం ప్రకారం ఉప్పలపాడు సమీపంలోని జగనన్న కాలనీలో సింగులూరి నాగలక్ష్మి, తన కుమారుడు కృష్ణ, కోడలు లక్ష్మీప్రణతితో నివాసం ఉంటున్నారు. కృష్ణ, లక్ష్మీప్రణతికి ఐదేళ్ల క్రితం వివాహం కాగా తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో లక్ష్మీప్రణతి పుట్టింటికి వెళ్లి వస్తూ ఉండేది. రెండునెలల తరువాత మంగళవారం అత్తింటికి వచ్చిన లక్ష్మీప్రణతిని అత్త, భర్త వేధించడం ప్రారంభించారు. భర్త తనపై చేయిచేసుకోవడంతో తట్టుకోలేక తన బంధువులకు లక్ష్మీప్రణతి సమాచారం ఇచ్చింది. బుధవారం రాత్రి బంధువులు జగనన్న కాలనీకి వచ్చి లక్ష్మీప్రణతిని తీసుకెళ్లారు. దీనిని కిడ్నాప్‌గా చిత్రీకరించిన నాగలక్ష్మి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు నమోదు చేసుకున్న రూరల్ ఎస్ఐ బాలనాగిరెడ్డి లక్ష్మీప్రణతిని బంధువుల ఇంట్లో గుర్తించి విచారణ చేపట్టారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని అత్త, భర్త వేధింపులు తట్టుకోలేక బంధువుల ఇంట్లో తలదాచుకున్నానని స్పష్టంచేసింది. దీంతో పోలీసులు అత్త, భర్తను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. -
మట్టుబెట్టింది కోడలే..
నగల కోసం ఆశపడిన కోడలే వదినతో కలిసి నాటకం మత్తు తీవ్రత వల్ల అత్త చనిపోవడంతో మొత్తం ముగ్గురిపై హత్య కేసు నిందితులను అరెస్టు చేసి, రూ.7 లక్షల విలువైన సొత్తు రికవరీ చేసిన పోలీసులు అమలాపురం టౌన్(తూర్పు గోదావరి జిల్లా) : అత్యాశ.. బుల్లితెరలో నేర కథనాలు.. ఆమెలో రాక్షసత్వాన్ని ఉసిగొలిపాయి. నగల కోసం అత్తను మట్టుబెట్టడమే కాకుండా, ఆమె వదిన, మరొకరిని హత్య, చోరీ కేసులో నిందితులను చేసింది. అమలాపురం కూచిమంచి అగ్రహారంలోని గన్నవరపువారివీధిలో ఓ ఇంట్లో గత నెల 24న విద్యుత్ మీటరు నమోదు కోసం వచ్చి అత్తా కోడళ్లకు మత్తుమందు ఇచ్చి, రూ.7 లక్షల విలువైన సొత్తు కాజేసినట్టు నమోదైన కేసును పోలీసులు కొత్త కోణంతో ఛేదించారు. ఇదంతా కట్టుకథగా పోలీసులు తేల్చారు. మత్తుమందు ప్రభావానికి గురయ్యారన్న అత్తాకోడళ్లలో.. కోడలే దీనికి సూత్రధారిగా తేలింది. మత్తు మందు ప్రభావంతో అత్త గన్నవరపు సీతామహలక్ష్మి (84) గత నెల 28న మరణించిన సంగతి తెలిసిందే. కోడలు వెంకట పద్మావతి హైదరాబాద్‌కు చెందిన ఆమె వదిన కందెపు దేవిరెడ్డి, ఈమె ప్రియుడు కందెపు శివకేశవరావుతో కలిసి ఆ కథ అల్లింది. అదికాస్తా అడ్డం తిరగడంతో, ముగ్గురు నిందితులను పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి రావులపాలెం ఫైనాన్స్ ఎదురుగా మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు. కేసు వివరాలను అమలాపురం డీఎస్పీ లంక అంకయ్య, సీఐ శ్రీనివాస్ స్థానిక పోలీసు స్టేషన్లో బుధవారం విలేకరులకు తెలిపారు. కాఫీలో మత్తు మాత్రలు కలిపి.. తన అత్త సీతామహాలక్ష్మి బంగారు నగలు, వెండి వస్తువులను నలుగురు కూతుళ్లకు ఇచ్చేస్తుందని పద్మావతికి అనుమానం వచ్చింది. వాటిని దక్కించుకోవాలని హైదరాబాద్‌లో ఉంటు న్న తన వదిన దేవిరెడ్డితో కలిసి పద్మావతి పథకం రచించింది. ఆమెను, ఆమె ప్రియుడిని హైదరాబాద్ నుంచి గత నెల 23న అమలాపురం రప్పించింది. వీరంతా విద్యుత్ మీటర్ రీడింగ్‌కు వచ్చిన ఆగంతకుడి కథ అల్లారు. ఈ క్రమంలో అమలాపురం వచ్చిన దేవిరెడ్డి, ఆమె ప్రియుడు ఓ లాడ్జిలో దిగారు. అతను లాడ్జిలోనే ఉండగా, దేవిరెడ్డి ఎవరూ గమనించకుండా పద్మావతి ఇంటికి వెళ్లింది. గత నెల 24న ఉదయం 20 మత్తు బిళ్లలను కాఫీలో కలిపి పద్మావతి తన అత్తకు ఇచ్చింది. ఆమె అపస్మారక స్థితిలోకి చేరాక, ఆమె వద్దనున్న నగలు, బీరువాలను పగులగొట్టి, బంగారు, వెండి వస్తువులను ఇద్దరూ కాజేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆగంతకుడు తన నగలు కూడా తస్కరించినట్టు పద్మావతి అవి కూడా తీసేసింది. అన్ని నగలను మూటకట్టి దేవిరెడ్డికి ఇచ్చి, అక్కడి నుంచి పంపివేసింది. తర్వాత నగలు పంచుకోవాలనేది వారి ఒప్పందం. పద్మావతి మాత్రం ఓ మత్తుమాత్ర వేసుకుని నిద్రపోతున్నట్టు నటించింది. సాయంత్రం 3.30కు పనిమనిషి వచ్చి, అత్తాకోడళ్లను చూసి కేకలు వేసింది. పి.గన్నవరం మండలం లంకల గన్నవరంలో పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్న పద్మావతి భర్త వెంకటరమణమూర్తికి స్థానికులు సమాచారం అందించారు. స్థానికుల సపర్యలతో పద్మావతి కోలుకున్నట్టు నటించింది. మత్తు తీవ్రతతో ఉన్న అత్తను అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నగలుతో దేవిరెడ్డి, ఆమె ప్రియుడు అదే రోజు హైదరాబాద్ వెళ్లిపోయారు. నగలను సొమ్ము చేసుకోవాలని ఆడపడుచు, వదిన మరో ప్లాన్ వేశారు. తన తండ్రికి అనారోగ్యంగా ఉందంటూ పద్మావతి మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చింది. హైదరాబాద్ నుంచి వదిన, ఆమె ప్రియుడు ఇక్కడకు వచ్చారు. వీరు రావులపాలెంలోని ఓ ఫైనాన్స్ సంస్థలో నగలు కుదుప పెట్టేందుకు యత్నిస్తుండగా.. వారిపై నిఘా పెట్టిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ శ్రీనివాస్, క్రైం పార్టీ హెచ్‌సీ అయితాబత్తుల బాలకృష్ణ, కానిస్టేబుళ్లు గుబ్బల శంకర్, శెట్టి రమేష్‌ను డీఎస్పీ అభినందించారు.