breaking news
atm cash despensing
-
రూ. 200 కోట్లు- 2,000 ఉద్యోగాలు!
ముంబై, సాక్షి: ఏటీఎం నిర్వాహక కంపెనీ సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ తాజాగా రూ. 1,300 కోట్ల పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించింది. తొలి దశలో భాగంగా రూ. 180-200 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు వైస్‌చైర్మన్ రాజీవ్ కౌల్ వెల్లడించారు. తద్వారా రూ. 2,000 మందికి ఉపాధి లభించనున్నట్లు అంచనా వేశారు. నిధులను అంతర్గత వనరులు, రుణాల ద్వారా సమకూర్చుకోనున్నట్లు తెలియజేశారు. పీఈ దిగ్గజం బేరింగ్‌కు ప్రధాన వాటా కలిగిన కంపెనీ ఏడేళ్ల కాలంలో రూ. 1,300 కోట్ల వరకూ ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. తద్వారా దేశీయంగా ఏటీఎంల నిర్వహణ, క్యాష్ మేనేజ్మెంట్ బిజినెస్‌లను భారీగా పెంచుకోవాలని చూస్తున్నట్లు తెలియజేసింది. సీఎంఎస్ ఇన్ఫోలో.. బేరింగ్ పీఈ ఏషియాకు చెందిన సియాన్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ 100 శాతం వాటాను కలిగి ఉంది. (మెడ్‌ప్లస్‌పై వార్బర్గ్ పింకస్ కన్ను!) కంపెనీ కొనుగోలు ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ నుంచి 3,000 ఏటీఎంల నిర్వహణకు సీఎంఎస్ ఇన్ఫో కాంట్రాక్టును పొందింది. దీనిలో భాగంగా స్థల ఎంపిక, ఏటీఎంల ఏర్పాటు, క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసులు, రోజువారీ నిర్వహణ చేపట్టవలసి ఉంటుంది. ఏడేళ్లపాటు అమల్లో ఉండే కాంట్రాక్టును మరో మూడేళ్లు పొడిగించుకునేందుకు వీలుంటుంది. ఈ ఏడాది మొదట్లో సెక్యూరిటీ మేనేజ్మెంట్ కంపెనీ లాజిక్యాష్ సొల్యూషన్స్‌ను సీఎంఎస్ ఇన్ఫో కొనుగోలు చేసింది. నిశా(ఎన్ఐఎస్ఏ) గ్రూప్ నుంచి సొంతం చేసుకున్న ఈ సంస్థ కారణంగా నిర్వహణలోని ఏటీఎంల సంఖ్య 62,000 నుంచి 72,000కు పెరిగినట్లు తెలుస్తోంది. (బ్యాంకింగ్: డిజిటల్ సేవల్లో సవాళ్లేంటి?) రోజుకి రూ. 5,000 కోట్లు రిజర్వ్ బ్యాంక్ డేటా ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్‌కల్లా దేశీయంగా బ్యాంకింగ్ వ్యవస్థలో 1,13,981 ఆన్సైట్, 96,068 ఆఫ్‌సైట్ ఏటీఎంలున్నాయి. వీటికి అదనంగా బ్యాంకులు 3,27,620 మైక్రో ఏటీఎంలను సైతం కలిగి ఉన్నాయి. సీఎంఎస్ ఇన్ఫో సగటున రోజుకి రూ. 5,000 కోట్ల నగదును నిర్వహిస్తున్నట్లు చెబుతోంది. కాగా.. ఏటీఎంల నిర్వహణలో దేశీయంగా ఏజీఎస్ ట్రాన్సాక్ట్, ఎస్ఐఎస్, రైటర్స్ కార్ప్ తదితర సంస్థలు సర్వీసులు అందిస్తున్నాయి. -
కార్డు అక్కర్లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు!
బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు తీసుకోవాలంటే ఒకప్పుడు బ్రాంచికి వెళ్లి, అక్కడ పొడవాటి క్యూలో నిల్చుని తీసుకోవాల్సి వచ్చేది. తర్వాత ఏటీఎంలు వచ్చి బ్యాంకింగ్ రూపురేఖల్నే మార్చేశాయి. అయితే.. ఏటీఎం కార్డును ఎవరైనా దొంగిలిస్తే మాత్రం కాస్త కష్టంగానే ఉంటోంది. ఇప్పుడు ఈ కష్టాలకు కూడా చెక్ పెట్టేస్తున్నారు. కార్డులు జేబులో పెట్టుకోనవసరం లేదని.. అసలు కార్డు లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయని చెబుతున్నారు. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించి, మన ముఖాన్నే ఏటీఎం కార్డులా వాడుకుని డబ్బులు ఇస్తారట. ఆఫీసులో అటెండెన్సు కోసం వాడే బయోమెట్రిక్ టెక్నాలజీలో ఐరిస్ ఆధారంగా హాజరు పడుతుంది. దాన్నే కొంచెం మార్చి.. ముఖాన్ని గుర్తించి, ఒక పాస్వర్డ్ అడిగి.. దాన్ని బట్టి ఖాతాకు సంబంధించిన కార్యకలాపాలు చేసుకునే సరికొత్త టెక్నాలజీని చైనా పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇలాంటి పది మిషన్లను చైనా మర్చంట్ బ్యాంక్ వివిధ నగరాల్లో ఏర్పాటుచేసింది. ముఖాన్ని స్కాన్ చేయడం తరువాయి.. మీకు ఇష్టం వచ్చిన బ్యాంకు కార్యకలాపాలను ఈ మిషన్ల ద్వారా నిర్వహించుకోవచ్చట. టెలిఫోన్ నంబర్లను కూడా పాస్‌వర్డ్‌గా ఎంటర్ చేయాలని చెబుతున్నారు. అచ్చం ఒకేలా ఉండే కవల పిల్లలు ఇద్దరు వచ్చినా కూడా వాళ్లలో ఎవరి అకౌంటును వాళ్లకే యాక్టివేట్ చేసేలా ఈ టెక్నాలజీని రూపొందించారు. కళ్లజోడు పెట్టుకున్నా, మేకప్ వేసుకున్నా కూడా మీ ముఖాన్ని అది ఎంచక్కా గుర్తుపడుతుందట. అయితే మరీ ముఖం మొత్తం మారిపోయేలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే మాత్రం మరోసారి బ్యాంకులో గుర్తింపుకార్డులు ఇచ్చి, ముఖాన్ని స్కాన్ చేయించుకోవాలి. ఈ పద్ధతిలో కేవలం 42 సెకన్లలోనే డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చని చెబుతున్నారు.