breaking news
assignments
-
‘పచ్చ’ నోట్ల పరవళ్లు!
ప్రతిపక్ష ప్రజాప్రతినిధులపై ప్రలోభాల వల * వెర్రి తలలేస్తున్న అధికార పార్టీ ఆఫర్లు * రూ. 20 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు నగదు * పదవులు.. చర, స్థిరాస్తులు.. కాంట్రాక్టులు * కేసులు ఎత్తివేస్తాం.. ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని హామీ * అవినీతి సంపాదనతో బరితెగించిన టీడీపీ నాయకత్వం * పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుయుక్తులు * రాష్ట్రంలో పార్టీని బతికించుకొనేందుకు పచ్చ కుట్రలు సాక్షి, ప్రత్యేక ప్రతినిధి ‘‘మా పార్టీలో చేరిపో.. నీకు ఎంత కావాలి? చరాస్తా... స్థిరస్తా? నగదా... విలువైన ప్రాంతాల్లో స్థలాలా, పొలాలా? కాంట్రాక్టులా, గనులా? ఏ పదవైతే సరే అంటావు? పోనీ నూతన రాజధానిలో వ్యాపారాలు ఏమైనా చేసుకుంటావా? మీపై ఏవైనా కేసులుంటే ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాం’’ - రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు అత్యంత ఖరీదైన ఈ ఆఫర్లు ఇస్తున్నది ఎవరో కాదు, సాక్షాత్తూ టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన అనుచర బృందం. అధికారం ఉందనే అహంకారంతో, అవినీతి సొమ్ముతో టీడీపీ నాయకత్వం రెచ్చిపోతోంది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై సిగ్గూ ఎగ్గూ లేకుండా ప్రలోభ వల విసురుతోంది. ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తోంది. ప్రారంభ ధరే రూ.20 కోట్లు. సంతలో బేరంలా, వేలం పాటలో పెంపులా ధరను పెంచుకుంటూ పోతోంది. ప్రజాప్రతినిధులకు కొనేయడానికి అధికార పక్షానికి రూ.వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రతిపక్ష సభ్యులను తమవైపునకు తిప్పుకోవడానికి కారణమేంటి? ప్రస్తుతం రాష్ట్ర ప్రజల మదిని తొలస్తున్న ప్రశ్నలివే. పబ్బం గడుపుకునేందుకే ఫిరాయింపులు అనతి కాలంలోనే ప్రజాదరణను కోల్పోయిన టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యులను చేర్చుకునే కుట్రలకు తెరతీసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ ఫిరాయింపుల పర్వం బేరసారాలతో మొదలై బెదిరింపుల వరకూ వెళుతోంది. అంతటితో ఆగకుండా దగ్గరి బంధువులు, ఆయా సామాజిక వర్గాలు, ప్రాంతాలు, మతాలను కూడా తమ సంత బేరసారాల్లో భాగస్వాములను చేస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలనే ఆతృతతో ఇష్టానుసారంగా హామీలన్నీ గుప్పించిన తెలుగు దేశాధినేత వాటిని అమలు చేయడంలో పూర్తిగా చతికిలపడ్డారు. అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అన్ని పనుల్లో అవినీతి రాజ్యమేలుతోంది. పదేళ్ల తర్వాత అధికారం దక్కడంతో తెలుగు తమ్ముళ్లు జేబులు నింపుకొనే పనిలో పడ్డారు. పైస్థాయి నుంచి కింది దాకా ఇదే పరిస్థితి. ప్రజాదరణను పూర్తిగా కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న చంద్రబాబు ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు భారీ ఆఫర్లు ఇచ్చి పార్టీలో చేర్చుకుంటున్నారు. తద్వారా తన చేతగానితనాన్ని, పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటున్నారు. తన అవినీతి, అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే కుహకాలకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకే కళంకం తెస్తున్నారు. పబ్బం గడుపుకునేందుకు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. జాతీయ పార్టీగా ప్రకటించుకున్న టీడీపీ తెలంగాణలో ఇప్పటికే చాపచుట్టేసింది. ఆంధ్రప్రదేశ్‌లోనైనా పార్టీని బతికించుకోవడానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రక్రయకు శ్రీకారం చుట్టారు. భారీగానే ప్యాకేజీల బరువు ♦ ఉత్తరాంధ్రలోని ఓ ప్రతిపక్ష ఎమ్మెల్యేపై వల విసురుతున్నారు. రూ.20 కోట్లకుపైగా నగదు, రాజధాని ప్రాంతం వద్ద రెండెకరాల భూమిని నజరానాగా ఇస్తామని కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి బేరసారాలను సాగిస్తున్నారు. ♦ ఉత్తరాంధ్రలోని మరో జిల్లా ఎమ్మెల్యేకు మంత్రి పదవిని ఆఫర్‌గా ఇస్తున్నారు. ఆయనతోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలను తీసుకురావాలనే షరతు పెడుతున్నారు. అదే ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యేకుకార్పొరేషన్ పదవితోపాటు రూ.20 కోట్లకు పైగా ముట్టచెబుతామని ఆ ప్రాంత మంత్రి ఊరిస్తున్నారు. మరో ఎమ్మెల్యేకు కూడా పెద్ద మొత్తంలో క్యాష్ ఆఫర్ ప్రకటించారు. ♦ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధికి మంత్రి పదవితోపాటు మరెన్నో ప్రయోజనాలను ఎర వేస్తున్నారు. ఆయనతో టీడీపీ సీనియర్ నేత, మరో ఎంపీ టచ్‌లో ఉన్నారు. తనతోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా తీసుకురావాలనే అధికార పార్టీ ఒత్తిళ్లకు ఆ ప్రజాప్రతినిధి లొంగడం లేదు. ♦ ముఖ్యమంత్రి తిష్టవేసి వ్యవహారాలు నడుపుతున్న జిల్లాలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ముగ్గులోకి దింపే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మీవారిపై కేసులు ఎత్తివేస్తాం, ఎన్నో విధాలుగా ఆదుకుంటాం అని ఓ కేంద్ర మంత్రి ద్వారా రాయబేరాలు నడుపుతున్నా.. తమ పార్టీని వీడబోమంటూ ఆ ఎమ్మెల్యేలు తేల్చిచెబుతున్నారు. + నూతన రాజధాని వస్తున్న జిల్లాలోని ఓ ఎమ్మెల్యేకు కార్పొరేషన్ చైర్మన్ పదవితోపాటు భారీ ప్యాకేజీని ఆఫర్ చేసినా ఆ ప్రజాప్రతినిధి లొంగడం లేదు. పార్టీ ఫిరాయింపు ద్వారా మచ్చ తెచ్చుకునేందుకు ఆ ఎమ్మెల్యే సిద్ధపడడం లేదు. ♦ వ్యాపార పరమైన సమస్యలు, ఇతర ఇబ్బందులను ప్రస్తావిస్తూ పార్టీ మారాలని మరో ఇద్దరు ఎమ్మెల్యేలపై ఓ మంత్రి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ♦ రాజధానిలో ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్న ఓ మంత్రి తన జిల్లాలోని ఇద్దరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కోరినంత డబ్బు ఇస్తానని అంటున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్పించాలనే లక్ష్యాన్ని ముఖ్యమంత్రి తనకు నిర్దేశించారని ఆ మంత్రి చెబుతున్నారు. ♦ ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించడానికి చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. చంద్రబాబు గురించి అన్నీ తెలిసిన తాము పప్పులో కాలేయబోమని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తేల్చి చెప్పినట్లు సమాచారం. ♦ టీడీపీకి దిక్కూమొక్కూ లేని జిల్లా నుంచి సీనియర్ నేతలను చేర్చుకునేందుకు ఎంత మొత్తమైనా, ఏ పదవినైనా ఇవ్వడానికి ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఓ ఎమ్మెల్యేకు భారీ మొత్తంలో నగదు, కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఆఫర్ చేశారు. ♦ మరో జిల్లాలో ఓ ఎమ్మెల్యేని చేర్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను అక్కడి టీడీపీ ఇన్చార్జి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ చేర్చుకుంటే తరువాత జరగబోయే పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని టీడీపీ నాయకత్వానికి సంకేతాలు పంపారు. ♦ కర్నూలు జిల్లా నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలను తీసుకొస్తేనే మంత్రి పదవి ఇస్తామని ఇటీవలే టీడీపీలో చేరిన ఈ జిల్లా ఎమ్మెల్యేకు టీడీపీ అధిష్టానం షరతు విధించినట్లు సమాచారం. ఇంతలోనే అంత డబ్బా? అధికార పార్టీ ఇస్తున్న ఆఫర్లను చూస్తే కళ్లు తిరగడం ఖాయం. రెండేళ్ల క్రితమే అధికారం చేపట్టిన పార్టీకి ఇంతలోనే అంత డబ్బెక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యపోవడం ప్రజల వంతవుతోంది. ఈ ఆఫర్లు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని నిత్యం వాపోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కోటరీ అంతూపొంతూ లేని బేరసారాలకు దిగుతున్నారంటే అవినీతి, అక్రమాలకు ఎంతగా బరితెగించి ఉంటారో అంచనాలకు అందడం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీలో చేరిన వారికి మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు రూ.20 నుంచి రూ.40 కోట్ల వరకు అందజేస్తామని హామీ ఇస్తుండడం గమనార్హం. ఇసుక విక్రయాలు, పట్టిసీమ ఎత్తిపోతల పథకం, పోలవరం మొదలు గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులు, విద్యుత్తు ఒప్పందాలు, ప్రైవేట్ సంస్థలకు రాయితీలు.. ఇలా అన్నింటిలో చంద్రబాబు, ఆయన తనయుడు, అనుచర గణం రూ.వేల కోట్లు పిండుకుంటున్నారు. ఒక్క చెమట చుక్కయినా చిందించకుండా సంపాదించిన ఈ అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటున్నారు. -
కంప్యూటర్లు, టీవీలకు అతుక్కుపోకండి
స్కూల్ లేదు.. హోంవర్క్ గోల అంతకంటే లేదు.. అసైన్మెంట్లు చేయాల్సిన అవసరం అసలే లేదు.. పుస్తకాలు ముందేసుకుని చదవాల్సిన పని లేదు.. ఎందుకంటే సమ్మర్లో సెలవులు ఇచ్చింది ఎంజాయ్ చేయడానికే కదా.. ఎంచక్కా సెలవుల్లో కంప్యూటర్లకు, టీవీలకు అతుక్కుని కూర్చుందామనుకునే పిల్లలపై పెద్దలు ఓ లుక్కేయాల్సిందే. లేకుంటే మీ పిల్లలను అందరూ ‘లడ్డూ’ అని పిలవాల్సి వస్తుంది. రోజుకు మూడు నాలుగు గంటలు టీవీ, కంప్యూటర్లకు అతుక్కుపోవడం, సరైన వ్యాయామం లేకపోవడంతో.. పిల్లలు బెలూన్లలా ఉబ్బిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. రెండు గంటల కంటే ఎక్కువగా టీవీ చూస్తే కంటి జబ్బులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్న విషయాన్ని గుర్తించాలి. ఒంటికి వ్యాయామం అవసరం ఎలాగూ సెలవులే కదా అని అస్తమానం రిమోట్ పట్టుకుని వీడియో, ఇండోర్ గేమ్స్ ఆడటం.. విసుగనిపిస్తే నెట్‌బ్రౌజింగ్ చేయడం, సినిమా సీడీలతో కాలక్షేపం మితిమీరితే ఇబ్బందేమరి. ఇరవై నాలుగ్గంటలూ కుర్చీలు, సోఫాలకు అత్తుక్కుపోయి టీవీలు, కంప్యూటర్ల ఆటలకే పరిమితం కావొద్దు. ఒంటికి కాస్త వ్యాయామం కూడా ఇవ్వాలి. ఫ్రిజ్ నిండా వేసవి రుచులు నింపుకొని, టీవీలు, కంప్యూటర్లతో ఆటలాడుతూ మధ్యమధ్యలో ఎంచక్కా చిరుతిళ్లు లాగించేస్తే ఆరోగ్యం పాడవడంతో పాటు లావెక్కిపోతారు. దీంతో స్కూళ్లు మొదలవగానే తోటి విద్యార్థులు ఎగతాళి చేసే ప్రమాదం ఉంది. శరీరానికి శ్రమ ఇవ్వాలి. అప్పుడప్పుడు బయటకు వెళ్లి పరుగెత్తాలి, నడవాలి, పిల్లలతో కలిసి సరదాగా ఆడుకోవాలి. - సాక్షి, విజయవాడ -
అక్రమాలకు అడ్డా...
అరండల్‌పేట : నగరపపాలక సంస్థను అవినీతి జాఢ్యం వదలడంలేదు. కుళారుు కనెక్షన్ల విషయంలోనూ దిగువస్థారుు అధికారులు తమ నైజాన్ని చాటుకున్నారు. నగరంలో 1.54 అసెస్మెంట్లు ఉంటే కేవలం 80వేల కుళాయి కనెక్షన్లు మాత్రమే అధికారికంగా ఉన్నాయి. మిగిలినవి అనధికారమే. నగరంలో కుళాయి కనెక్షన్లపై ఉన్నతాధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో కళ్లు తిరిగే వాస్తవాలు బయటపడుతున్నాయి. నగరపాలకసంస్థకు నీటి మీటర్ల ద్వారా ఏడాదికి రూ. 5 కోట్ల వరకు పన్నుల రూపంలో వస్తున్నాయి. అయితే ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. నగరంలోని అపార్టుమెంట్లు, వాణిజ్య సముదాయాలకు నీటి మీటర్లను బిగించాల్సి ఉంటుంది. చాలా వరకు అపార్టుమెంట్లు, వాణిజ్య సముదాయాలకు నీటిమీటర్లు బిగించకుండానే నీటిని వినియోగించుకుంటున్నారు. అదే సమయంలో మీటర్ల ద్వారా చార్జీల వసూళ్లను సైతం ఫిట్టర్లు పట్టించుకోవడం లేదు. కనీసం వారికి డిమాండ్ నోటీసులు కూడా ఇవ్వడం లేదు. దీనివల్ల నీటి బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇప్పటి వరకు నీటిమీటర్ల మీద సుమారు రూ. 10 కోట్ల వరకు బకాయిలున్నాయంటే నిర్లక్ష్యం ఎంతలా ఉందో స్పష్టమవుతోంది. నగరంలో స్కాడాను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడం ద్వారా నీటి పన్నును పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ప్రతి డివిజన్లో ఉన్న అక్రమ కనెక్షన్లను అధికారులు సర్వే బృందాలతో గుర్తించారు. త్వరలో వారికి నోటీసులు ఇవ్వనున్నారు. దీంతో పాటు ఆస్తిపన్ను, వాణిజ్య సముదాయాలకు, షాపులకు నీటి చార్జీలను పెంచాలని యోచిస్తున్నారు. నగరాానికి సంబంధించి మొత్తం 81,841 తాగు నీటి కనెక్షన్లు ఉండగా ఇందులో కేవలం ఓవైటీ కింద 120, యూఏటీ కింద 732 అంటే మొత్తం 852 కనెక్షన్లలకు మాత్రమే మీటర్లను బిగించారు. మిగిలిన 80989 సర్వీసులకు మీటర్లు బిగించకుండా కార్పొరేషన్ అధికారులు నీటి పన్ను వసూలు చేస్తున్నారు. క్రేజీపై ఎందుకో వాత్సల్యం? నగరపాలకసంస్థ పరిధిలోని మానససరోవరం పార్కులోని క్రేజీవరల్డ్ను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చారు. ఇందులోని స్మిమ్మింగ్‌ఫూల్, ఇతర అవసరాలకు తక్కెళ్లపాడు మంచినీటి శుద్ధి కేంద్రం నుంచి పైపులైన్ ఏర్పాటు చేశారు. ఈ పైపులైన్ ద్వారా రోజూ ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటల పాటు నీటిని క్రేజీ వరల్డ్‌కు సరఫరా చేస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ పైపులైన్‌కు నీటి మీటరును బిగించకపోవడంతో పైసా కూడా కార్పొరేషన్‌కు చెల్లించకుండానే నీటిని యధేచ్ఛగా వినియోగించుకుంటున్నారు. ఈ విషయంలో ఇంజినీరింగ్ అధికారులు ఎందుకు అంత దానిపై అవ్యాజమైన ప్రేమ చూపిస్తున్నారో అర్థం కావడంలేదు. రోజుకు గంటకు మించి జనానికి నీరు విడుదల చేయని అధికారులు దానికి మాత్రం నాలుగు గంటలపాటు విడిచిపెట్టడం గమనార్హం. -
పదిలోనూ ఇంటర్నల్స్
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల్లోనూ ఇంటర్నల్స్ అమల్లోకి రానున్నాయి. ఏడాది పాటు విద్యార్థులు చేసిన అసైన్మెంట్స్, ప్రాజెక్టులు, ప్రయోగాలకు 20 శాతం మార్కులు కేటాయించనున్నారు. ప్రతి సబ్జెక్టులో రాత పరీక్షకు 80 శాతం మార్కులనే ఇవ్వనున్నారు. ప్రస్తుతం ద్వితీయ భాష మినహా మిగిలిన అన్ని సబ్జెక్టులకు రెండు చొప్పున పరీక్ష పేపర్లు ఉన్నాయి. వాటిని కూడా రెండు కాకుండా ఒకటిగానే చేసి ఆరు పేపర్లు అమల్లోకి తేవటంపై చర్చ జరుగుతోంది. నాలుగు సహ-పాఠ్య కార్యక్రమాలకు 50 మార్కుల చొప్పున 200 మార్కులను కేటాయించనున్నారు. ఈ మేరకు టెన్త్ మెమోల స్వరూపంలోనూ మార్పులు తేనున్నారు. దీనికి అనుగుణంగా పదో తరగతి పాఠ్య పుస్తకాలను రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి మార్చుతోంది. ఈ ప్రక్రియ ఈ నెలాఖరుతో పూర్తి కానుంది. వచ్చే విద్యా సంవత్సరం (2014-15) నుంచి కొత్త పాఠ్య పుస్తకాలతోపాటు కొత్త పరీక్షల విధానాన్ని అమల్లోకి తేనుంది. ప్రధానంగా రానున్న మార్పులు... పరీక్షల్లో పాఠం చివరలో ఉండే అభ్యాసం ప్రశ్నలివ్వరు. ఒకే సమాధానం ఉండే ప్రశ్నలు కాకుండా రెండు మూడు రకాల జవాబు ఉండే ప్రశ్నలనే అడుగుతారు. ప్రశ్నను పాజిటివ్ కోణంలో చూసినా, నెగిటివ్ కోణంలో చూసినా.. విద్యార్థి రాసే జవాబుకు ఆధారాలు చెబుతూ తన వాదనను బలపరచుకోవాలి. గైడ్స్, టె స్టు పేపర్లు, క్వశ్చన్ బ్యాంకుల్లో ఇస్తున్నట్లు ప్రశ్న జవాబుల విధానం ఉండదు. ప్రతి సబ్జెక్టులో 80 మార్కులకే రాత పరీక్ష. ప్రాజెక్టులు, ప్రయోగాలు, అసైన్మెంట్లకు 20 మార్కులు ఇస్తారు.ప్రస్తుతం ఉన్న ఆరు సబ్జెక్టులతోపాటు విలువల విద్య-జీవన నైపుణ్యాలకు (50 మార్కులు), కళలు-సాంస్కృతిక విద్యకు (50 మార్కులు), శారీరక వ్యాయామ విద్య (50 మార్కులు), పని విద్య-కంప్యూటర్ ఎడ్యుకేషన్ (50 మార్కులు) పేప ర్లు ఉంటాయి. వీటిని వార్షిక పరీక్షల్లో కాకుండా స్కూల్లోనే పరిశీలించి మార్కులు ఇస్తారు. వాటిని పరీక్షల విభాగానికి పంపితే విద్యార్థుల మెమోల్లో చేర్చుతారు.