breaking news
ashok dalam
-
‘అగ్రి’లో భారత్ అగ్రగామి
ఏజీ వర్సిటీ: వ్యవసాయ రంగంలో భారతదేశం ప్రపంచంలోనే అద్వితీయ శక్తిగా ఎదిగిందని, ఇంకా అనేక సవాళ్లను ఎదుర్కోవాలని నేషనల్ రెయిన్‌ఫెడ్ ఏరియా అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అశోక్ దల్వాయి పేర్కొన్నారు. జయశంకర్ వ్య వసాయ విశ్వవిద్యాలయం, ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రాన మీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐదో అంతర్జాతీయ అగ్రానమీ కాంగ్రెస్ సదస్సు ముగింపు సమావేశం శనివారం జరిగింది. వ్యవసాయం, దేశ రక్షణ రంగాల పరిశోధనలో హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ హబ్ అని అభివర్ణించారు. వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికత ఇంకా క్షేత్రస్థాయికి పూర్తి స్థాయిలో జరగలేదని పేర్కొన్నారు. ఆహార, పౌష్టికాçహారం భద్రతతో పాటు వ్యవసాయం వల్ల పర్యావరణానికి ఎదరవుతున్న సవాళ్లను పరిష్కరించడంపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని పేర్కొన్నారు. మున్ముందు అందుబాటు లో ఉన్న పరిమిత భూ వనరుల్లోనే వ్యవసాయం కొనసాగిం చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆగ్రో ప్రాసెసింగ్ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. ఐసీఏఆర్ డీడీ ఏకే సింగ్ మాట్లాడుతూ.. వీసీ ప్రవీణ్‌రావు నేతృత్వంలో వ్యవసాయ వర్సిటీ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. సమాజంలో సరైన కమ్యూనికేషన్ ఏర్పరచుకోవాలని, రైతుల పట్ల ప్రోయాక్టివ్‌గా ఉండాలని ఏకే సింగ్ సూచించారు. వీసీ ప్రవీణ్‌రావు మాట్లాడుతూ.. అందరి సహకారంతోనే పెద్ద ఎత్తున అంతర్జాతీయ సదస్సును విజయవంతం చేయగలిగామని పేర్కొన్నారు. -
13 మంది దళ సభ్యుల అరెస్ట్
పట్టుబడిన వారంతా సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ)ని వీడిన చంద్రన్న వర్గం సభ్యులే 9 తుపాకులు, 344 తూటాలు, కారు, మోటార్ సైకిల్ స్వాధీనం జంగారెడ్డిగూడెం/బుట్టాయగూడెం: తుపాకీ గొట్టంతోనే రాజ్యాధికారం అనే నినాదంతో ప్రత్యేక దళంగా ఏర్పాటైన 13 మంది సభ్యులు గల సాయుధ బృందాన్ని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు మంగళవారం వేకువజామున చాకచక్యంగా పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సీపీఐఎంఎల్ (న్యూ డెమోక్రసీ) నుంచి బయటకొచ్చి చంద్రన్న వర్గంగా ఏర్పాటైన అశోక్ దళానికి చెందిన 13 మంది సభ్యులను జంగారెడ్డిగూడెం సమీపంలోని జీలుగులమ్మ గుడి వద్ద స్పెషల్ పార్టీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి 9 తుపాకులు, 344 తూటాలు, విప్లవ సాహిత్యంతోపాటు ఒక టాటా ఏస్ వాహనం, ఒక మోటార్‌సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. వీరందరినీ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ జరిపారు. అరెస్టైన వారిలో పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం యర్రాయిగూడెంకు చెందిన దళ కమాండర్ కుంజా రవి, ఖమ్మం జిల్లా గుండాల మండలం కేశన్నపల్లికి చెందిన డెప్యూటీ దళ కమాండర్ పడిగ సురేష్ అలియాస్ వెంకటేష్, బుట్టాయగూడెం మండలం మంగయ్యపాలెంకు చెందిన కెచ్చెల పండు అలియాస్ ప్రభాకరరావు, వీరమద్దిగూడెంకు చెందిన కరకాల రాము అలియాస్ రామన్న, తూర్పురేగులకుంటకు చెందిన మోకల మురళీకృష్ణ అలియాస్ వెంకటేశ్వరరావు, కైకాల సూర్యనారాయణ, అలివేరుకు చెందిన కొక్కెర వెంకటేష్ అలియాస్ శింగన్న, కామవరపుకోట మండలం జోగడిగూడెంకు చెందిన తలారి ప్రకాష్‌తోపాటు రాములు, ఖమ్మం జిల్లా బయ్యారానికి చెందిన మహ్మద్ అబ్దుల్లా రషీద్, పాల్వంచకు చెందిన అమరాజు గట్టయ్య, పెనుమాక మండలం రేగళ్ల గ్రామానికి చెందిన పాయం వెంకటేష్ అలియాస్ మురళి, కొత్తగూడెంకు చెందిన బడపటి వీరన్న ఉన్నారు. వీరంతా పశ్చిమగోదావరి జిల్లాలో నూతనంగా దళాన్ని ఏర్పాటు చేసి ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కచ్చితమైన సమాచారం ఉందని ఎస్పీ రఘురామ్‌రెడ్డి చెప్పారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఏవీ సుబ్బరాజు ఆధ్వర్యంలో సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు ఈ దాడులు నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. కాగా, చంద్రన్న వర్గంలోని అశోక్ దళానికి చెందిన 13 మంది సభ్యులను జంగారెడ్డిగూడెం సమీపంలోని జీలుగులమ్మ గుడి వద్ద అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెబుతుండగా, వీరందరినీ బుట్టాయగూడెం మండలం ఇప్పలపాడు గ్రామ సమీపంలోని విప్పలమ్మ కొయ్య వద్ద పోలీసులు కాపుకాసి పట్టుకున్నట్టు తెలిసింది. దళ సభ్యుల వద్ద తుపాకులు ఉన్నప్పటికీ, వారు వాటిని ధరించకుండా వాహనంలోనే ఉంచుకున్నట్టు సమాచారం. దళ సభ్యులు అప్రమత్తమయ్యే అవకాశం ఇవ్వకుండా చుట్టుముట్టిన పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారని భోగట్టా. పోలీసులు తమను ముట్టడించిన సమయంలో దళ సభ్యులు పొగాకు బ్యారన్ల వద్ద గల కర్రలతో వారిపై దాడిగి తెగబడగా, పోలీసులు ప్రతిఘటించి వారందరినీ అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారు. తొలుత దళ సభ్యుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం వారిచ్చిన సమాచారం మేరకు రేగులకుంట సమీపంలోని వంతెన కింద తలదాచుకుంటున్న మరికొందరిని చాకచక్యంగా పట్టుకున్నట్లు తెలిసింది. కాగా, వారినుంచి ఆయుధాలు,బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.