breaking news
Army Strikes
-
మార్కెట్లకు షాకిచ్చిన యుద్ధ వాతావరణం
ముంబై: లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఏర్పడిన యుద్ధ వాతావరణం దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రకంపనలు రేపింది. భారత సైన్యం చేపట్టిన సర్జికల్ దాడుల నేపథ్యంలో ఆరంభంలో పాజిటివ్ నోట్ తో వున్న దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవి చూశాయి. ఒక దశలో 572 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ 465 నష్టంతో 27,827 వద్ద ముగిసింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 154పాయింట్లను కోల్పోయి 8,591 వద్ద స్థిరపడింది. గత మూడునెలల్లో ఇదే అతి భారీ పతనమని ఎనలిస్టులు వ్యాఖ్యానించారు. 88 వేల మార్క్ దగ్గర ప్రధాన నిరోధాన్ని ఎదుర్కొన్న నిఫ్టీ ఈ దెబ్బతో మరో కీలక మద్దతు స్థాయి 86వేల దిగువకు పడిపోయింది. తరువాత 8,500 వద్ద కీలక మద్దతు అని, ఇక్కడ విఫలమైతే మరింత పతనం తప్పదని మార్కెట్ ఎనలిస్టులు అంచనా వేశారు. దాదాపు అన్ని రంగాల సూచీలు భారీ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఆటో, రియల్టీ రంగాలురంగాలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అటు చిన్న షేర్లూ కుప్పకూలాయి. ఇన్ఫ్రాటెల్, టీసీఎస్, ఐటీసీ, ఎంఅండ్ఎం, ఓఎన్జీసీ స్వల్ప లాభాలను ఆర్జించగా, భెల్, అదానీ పోర్ట్స్, హిందాల్కో, అరబిందో, బీవోబీ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, లుపిన్, ఐషర్, గెయిల్ నష్టపోయాయి. అటు డాలర్ తో పోలిస్తే 38 పైసల నష్టంతో 66.85 దగ్గరు ఉంది. ఒక దశలో 45పైసలకు పైగా దిగజారి రూ. 67 స్థాయికి చేరువలోకి వచ్చింది. బ్రెగ్జిట్ ఉదంతం తరువాత రూపాయి ఈ స్తాయిలో పతనం కావడం ఇదే మొదటి సారని మార్కెట్ ఎనలిస్టులు విశ్లేషించారు. అయితే ఇటీవల నష్టాల్లో పసిడి ఈ రోజు పుంజుకుంది. పది గ్రా. పుత్తడి. రూ.163 లాభంతో రూ. 31,118 వద్ద ఉంది. -
ఆర్మీ దాడి : రూపాయి క్రాష్
గత వారం రోజులుగా బలపడుతూ వస్తున్న రూపాయి ఒక్కసారిగా కుప్పకూలింది. నియంత్రణ రేఖ వెంబడి మోహరించి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు జరిపిందని డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్( డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరవల్ రణబీర్ సింగ్ వెల్లడించడంతో, రూపాయి 46 పైసలు మేర పతనమైంది. దీంతో డాలర్‌కు వ్యతిరేకంగా రూపాయి 66.91గా నమోదైంది. బ్రెగ్జిట్ అనంతరం ఇదే అతిపెద్ద ఇన్ట్రా-డే పతనం. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలుగుతూ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా రూపాయి ఈ స్థాయిలోనే పడిపోయింది. 66.65 స్థాయే రూపాయికి అత్యంత కీలకమైన సపోర్టని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిమాణాలు తదుపరి రేట్ల కోత ఆశకు విఘాతం కలిగిస్తున్నాయని అంటున్నారు. భౌగోళిక రాజకీయ సమస్యలు ఆర్బీఐ పాలసీపై కూడా ప్రభావం చూపనున్నట్టు మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు డీజీఎంఓ వ్యాఖ్యల అనంతరం మార్కెట్లు సైతం భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 573 పాయింట్లు నష్టపోయింది.