breaking news
Aravapalli
-
పురాతన ఆలయం కోతులకు ఆవాసం!
రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘గల్తాజీ’ పీఠం మర్కట మందిరంగా పేరుమోసింది. ప్రతిరోజూ ఇక్కడ మనుషుల కంటే మర్కటాలే ఎక్కువగా కనిపిస్తాయి. చుట్టూ కొండలు, ఆ కొండల నుంచి జలధారలు, ఆ జలధారలతో ఏర్పడిన జలకుండాలు ఈ ఆలయ ప్రత్యేకతలు. ఆరావళి పర్వతాల నడుమ వెలసిన విలక్షణ ఆలయం ఇది. ఆరావళి కొండల నుంచి వెలువడే జలధారలతో ఏర్పడిన నీటికుండాలు ఈ ఆలయ ప్రత్యేకతలు. విశిష్టాద్వైత స్థాపకుడైన రామానుజాచార్యుల పరంపరకు చెందిన గల్తాజీ ఇక్కడ పదిహేనో శతాబ్దిలో రామానుజ సంప్రదాయం ప్రకారం వైష్ణవ పీఠాన్ని నెలకొల్పారు. ఉత్తర భారతదేశంలో రామానుజ సంప్రదాయంలో ఏర్పడిన తొలి పీఠం ఇదే! ప్రధాన ఆలయంలో సీతారాములు కొలువుదీరగా, ఈ ప్రాంగణంలోనే సూర్యాలయం కూడా ఉంది. ఇక్కడ కనిపించే మర్కట సమూహాలు ఆనాటి వానర సేనల వారసులేనని భక్తులు నమ్ముతారు. (చదవండి: తల్లి ప్రేమకు సరిహద్దులు లేవు) -
గోనెసంచిలో మృతదేహం
అర్వపల్లి (నల్గొండ జిల్లా) : నల్గొండ జిల్లా అర్వపల్లి మండలం నాగారం బంగ్లా గ్రామంలోని ఓ పాడుబడిన బావిలో గోనె సంచిలో మూటకట్టిన మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమైంది. నాగారం బంగ్లాకు చెందిన జాముల ముత్తయ్య(85) పది రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. ఎక్కడ గాలించినా ఆచూకీ లభించలేదు. కాగా ఆదివారం ఉదయం పాడుబడిన బావిలో నీటిపై ఒక గోనెసంచి తేలుతుండగా స్థానికులు గమనించారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి మూటను బావి నుంచి వెలికి తీశారు. మూటలో ఉన్న మృతదేహాన్ని ముత్తయ్యదిగా గుర్తించారు. ఎవరో చంపి మూటకట్టి బావిలో పడేసి ఉంటారని భావిస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.