breaking news
AR Antulay
-
అంతూలే మృతి
మహారాష్ట్ర తొలి ముస్లిం సీఎంగా రికార్డు సాక్షి, ముంబై: కాంగ్రెస్ కురువృద్ధుడు, మహారాష్ట్రకు తొలి ముస్లిం ముఖ్యమంత్రి ఏఆర్ అంతూలే(85) ఇకలేరు. సుదీర్ఘకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారమిక్కడి బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అపస్మారకంలో ఉన్న అంతూలే ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో మృతిచెందారు. ఆయన అంత్యక్రియలను స్వగ్రామమైన రాయగఢ్ జిల్లా అంబేత్ గ్రామంలో బుధవారం నిర్వహించనున్నారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీకి నమ్మకస్తుడైన అంతూలే 1980-82 మధ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆనాడు మహారాష్ట్రలో చోటుచేసుకున్న సిమెంట్ స్కామ్‌పై పార్లమెంటు చాలారోజులు స్తంభించడంతో ఇందిర బలవంతంపై సీఎం పదవికి రాజీనామా చేశారు. తను నెలకొల్పిన ఇందిరాగాంధీ ప్రతిభా ప్రతిష్టాన్ ట్రస్టుకు బిల్డర్ల నుంచి విరాళాలు తీసుకుని వారికి ఆనాడు ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సిమెంట్ కోటాను పెంచారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అంతూలే 1962లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1980 జూన్ 9న సీఎం అయ్యారు.నాలుగుసార్లు లోక్‌సభ ఎంపీగా, రెండు పర్యాయాలు రాజస్యసభ ఎంపీగా ఉన్న ఆయన 1995-96లో, యూపీఏ-1 ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ సంతాపం: అంతూలే మృతిపై కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్, ప్రధాని మోదీ తదితర ప్రముఖులు సంతాపం తెలిపారు. -
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అంతులే మృతి
ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఏఆర్ అంతులే(85) మంగళవారం మృతి చెందారు. గత కొంత కాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నఅంతులే బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందారు. అంతులేను ఐసీయూ వార్డులో ఉంచి వైద్యం అందించినా పరిస్థితి విషమించి మృతిచెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం రాయ గఢ్ లోని ఆయన సొంత గ్రామం అంబెట్ లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు మేనల్లుడు ముస్తాక్ అంతులే తెలిపారు.1980 జూన్ 9వ తేదీన మహారాష్ట్ర ఎనిమిదో సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన రెండేళ్లు కూడా పదవిలో కొనసాగలేదు. ఇందిరా ప్రిస్థాన్ ట్రస్టు ద్వారా అంతులే అవినీతికి పాల్పడినట్లు హైకోర్టు నిర్దారించడంతో 1982 జనవరి 13న ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.