breaking news
Appointment of teachers
-
డీఎస్సీ పరీక్షల షెడ్యూలు మార్పు
సాక్షి, అమరావతి: హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ–2024 పరీక్షల షెడ్యూలును రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఈనెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ పరీక్షలు నిర్వహించేలా నూతన షెడ్యూలును రూపొందించినట్లు పాఠశాల విద్య కమిషనర్ ఎస్. సురేష్కుమార్ శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 6,100 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనితోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. టెట్ పరీక్షలు నిర్వహించింది. ఈనెల 15 నుంచి ఉపాధ్యాయ నియామకం కోసం డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కావలసి ఉంది. కానీ, టెట్ పరీక్షకు.. డీఎస్సీ పరీక్షకు నాలుగు వారాల సమయం ఉండాలని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో డీఎస్సీ పరీక్ష షెడ్యూల్లో మార్పులుచేస్తూ నూతన షెడ్యూల్ రూపొందించామని సురేష్కుమార్ వెల్లడించారు. ఏప్రిల్లో ఐఐటి జేఈఈ తదితర ఎంట్రన్స్ పరీక్షలు ఉండటంతో పరీక్ష కేంద్రాలు అందుబాటులో లేకపోవడంవల్ల మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకూ ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహించేలా షెడ్యూలు రూపొందించామని చెప్పారు. అభ్యర్థులు పరీక్షలకు సిద్ధం కావడానికి తగినంత సమయమిస్తూ నూతన షెడ్యూల్ రూపొందించామని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. డీఎస్సీ నూతన షెడ్యూల్ వివరాలు.. ► మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకూ రోజుకు రెండు సెషన్ల చొప్పున 10 సెషన్లలో సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష నిర్వహిస్తారు. ► ఏప్రిల్ 7న టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్ ప్రొఫీషియన్సీ టెస్టు నిర్వహిస్తారు. ► ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకూ స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజిటి, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ పరీక్షలను నిర్వహిస్తారు. ► మార్చి 20 నుంచి పరీక్షా రాయటానికి అభ్యర్థులకు సెంటర్లు ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. ► మార్చి 25 నుంచి అభ్యర్థులు తమ హాల్–టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ► బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులు కారని హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో గతంలో ప్రకటించిన జీఓ–11లో అర్హతలు మారుస్తూ కొత్తగా జీఓ–22ను గురువారం నుంచి అమల్లోకి తెచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఈ DSC https:// apdsc. apcfss. in/ వెబ్సైట్లో చూసుకోవచ్చునని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. -
సక్సెస్ స్కూళ్లలో ఇక పూర్తిగా ఇంగ్లిష్ మీడియం
విద్యార్థులకు బోధనపై ప్రభుత్వ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గతంలో ఏర్పాటు చేసిన సక్సెస్ స్కూళ్లను ఈ విద్యాసంవత్సరం నుంచి పూర్తిస్థాయి ఆంగ్ల మాధ్యమిక పాఠశాలలుగా మార్పుచేశారు. ఇప్పటి వరకూ సమాంతరంగా తెలుగు, ఆంగ్ల మాధ్యమ తరగతులతో నడుస్తున్న ఈ స్కూళ్లన్నీ ఇక నుంచి పూర్తిస్థాయి ఇంగ్లిషుమీడియం పాఠశాలలుగా కొనసాగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో 3,428 సక్సెస్ స్కూళ్లు ఉన్నాయి. 2014-15 విద్యా సంవత్సరంలో సక్సెస్ స్కూళ్లలో చేరిన విద్యార్థుల్లో 31.36 శాతం మంది ఇంగ్లిషు మీడియంలో చేరినవారే. సక్సెస్ స్కూళ్లలోని ప్రస్తుత తెలుగు మాధ్యమిక విద్యార్థులను (9, 10 మినహాయించి) రెండు కి లోమీటర్ల లోపు దూరంలో ఉన్న ఇతర హైస్కూళ్లలోకి మార్పు చేయనున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ స్కూళ్లలో కేవలం ఆంగ్లమాధ్యమ విద్యార్థులను మాత్రమే చేర్చుకోవాలని పదో తరగతి వర కూ అందులోనే కొనసాగించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. అయితే ఈ స్కూళ్లలో ఇప్పటికే తొమ్మిది, పదో తరగతి చదువుతున్న తెలుగు మాధ్యమం విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండేందుకు వారిని అక్కడే యథాతథంగా అవే మాధ్యమాల్లో కొనసాగించాలని సూచించింది. టీచర్ల నియామకం ఇలా ఈ స్కూళ్లలో ఆంగ్లమాధ్యమంలో బోధించడానికి ఉత్సుకత చూపే టీచర్లను గుర్తించి నియామకం చేసే బాధ్యతను జిల్లా విద్యాధికారులకు అప్పగించారు. వీరికి వేసవి తదితర సెలవుల కాలంలో ఆంగ్ల మాధ్యమంలో నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నారు. దశలవారీగా పరీక్షల విధానంలో మార్పులు: ఆంగ్ల మాధ్యమికాలుగా ప్రారంభమవుతున్న ఈ స్కూళ్లలో దశలవారీగా పరీక్షల విధానాన్ని మార్చుకుంటూ వెళ్లనున్నారు.