breaking news
Apple iPhone10
-
ముప్ఫై వేల ఫోన్.. 65 లక్షలకు అమ్మేశాడు!!
ఇందులో ఎలాంటి జిమ్మిక్కు లేదు. పైగా మోసానికి పాల్పడలేదు. ఫోన్‌ను పద్ధతిగానే.. అదీ ఆన్లైన్లో అమ్మేశాడు. ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? ప్రపంచంలో మొట్టమొదటి సీ టైప్ ఛార్జ్ సపోర్ట్ ఉన్న యాపిల్ ఫోన్ ఇదే కాబట్టి. కానీ, ఇది యాపిల్ కంపెనీ రూపొందించింది కాదు. ఓ యంగ్ స్టూడెంట్ డెవలప్ చేశాడు. యూకేకి చెందిన రోబోటిక్స్ ఇంజినీరింగ్ స్టూడెంట్ కెన్ పిల్లోనెల్ ‘ఐఫోన్ X’(64జీబీ, 3జీబీ ర్యామ్) ఫోన్‌ను చాలా శ్రమించి సీ టైప్ ఛార్జర్ పోర్ట్‌కు మార్చేశాడు. ఈ-బేలో ఈ ఫోన్ ఒరిజినల్ ధర 299 పౌండ్లు (401 యూఎస్ డాలర్లు.. మన కరెన్సీలో దాదాపు 30 వేల రూపాయలు). కానీ, కెన్ తాను మోడిఫై చేసిన ఐఫోన్‌ను ఏకంగా 86 వేల యూఎస్ డాలర్లకు అమ్మకానికి పెట్టగా.. అది అమ్ముడుపోయింది. అంటే కొన్ని పదుల రేట్లకు హాట్ కేక్‌లా పోయింది అది. మన కరెన్సీలో అది 65 లక్షల రూపాయలు అన్నమాట. అంతేకాదు కెన్ ఇప్పుడు వాటర్ ప్రూఫ్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే యూఎస్బీ-సీ ఐఫోన్‌ను మోడిఫై చేసే పనిలో బిజీగా ఉన్నాడు. యాపిల్‌కు తప్పని పరిస్థితి సాధారణంగా యాపిల్ ఐఫోన్లకు లైట్నింగ్ కనెక్టర్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అయితే యూనివర్సల్ ఛార్జింగ్ సొల్యూషన్ కోసం ఆమధ్య యూరోపియన్ కమిషన్ కొత్త చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం.. యాపిల్‌తో సహా ఏ మొబైల్ తయారీ కంపెనీ అయినా సరే యూఎస్బీ-సీ టైప్ పోర్టల్, టైప్ సీ ఛార్జర్లనే మార్కెట్లోకి తేవాలి. ఈ లెక్కన కొత్త ఫోన్‌గానీ, డివైజ్‌గానీ కొన్నప్పుడు మళ్లీ ఛార్జర్ ఇవ్వరు. వినియోగదారులు పాతదే వినియోగించుకోవాలి. ఒకవేళ పాడైతే మాత్రం అప్పుడు కొత్తది కొనుక్కునేందుకు వీలు కల్పిస్తారు. ఈ ఆదేశాలతో వచ్చే ఏడాది నుంచి సీ టైప్ పోర్ట్ సపోర్ట్ చేసేలా ఫోన్లను రీ డిజైన్ చేయబోతోంది యాపిల్. ఇక యూనివర్సల్ ఛార్జర్ల ద్వారా రీయూజింగ్ ద్వారా వేస్టేజ్ తగ్గించాలన్నది ఈయూ ముఖ్యోద్దేశం. పాత, ఉపయోగించని ఛార్జర్ల కారణంగా ప్రతీ ఏటా పదకొండు వేల టన్నుల కంటే ఎక్కువ చెత్త పేరుకుపోతోంది ఈయూలో!!. కిందటి ఏడాది 420 మిలియన్ మొబైల్ ఫోన్స్, ఇతరత్ర పోర్టబుల్ డివైజ్‌లు అమ్ముడు పోయాయి. ఈ లెక్కల ప్రకారం.. సగటున ప్రతీ యూజర్ దగ్గర మూడు ఛార్జర్లు ఉండగా.. వాటిలో రెండింటిని నిత్యం ఉపయోగిస్తున్నారు. యూరోపియన్ కమిషన్ నిర్ణయం వల్ల మొబైల్ యూజర్లు, ఛార్జర్ల మీద ఒక ఏడాదికి 250 మిలియన్ల యూరోలు(రెండు వేల కోట్ల రూపాయలపైనే) ఖర్చు గణనీయంగా తగ్గనుంది. చదవండి: ఇక కొత్త ఫోన్లకు ఛార్జర్లు ఇవ్వరంట! -
యాపిల్ ఐఫోన్10 వచ్చేసింది..
► 5.8 అంగుళాల స్క్రీన్‌తో మార్కెట్లోకి ► ఐఫోన్ 8, 8ప్లస్ కూడా... యాపిల్ వాచ్ సిరీస్ 3, 4కే యాపిల్ టీవీ సైతం 8 సిరీస్ ధరలు 699 డాలర్ల నుంచి ► ఐఫోన్10 ఆరంభ ధర 999 డాలర్లు అక్టోబర్ 27 నుంచి ప్రీ–బుకింగ్... నవంబర్ 3 నుంచి డెలివరీలు క్యుపర్టినో, అమెరికా: కొత్త ఐఫోన్ సిరీస్‌కు సంబంధించిన ఊహగానాలకు తెరవేస్తూ టెక్ దిగ్గజం యాపిల్ తన తాజా ఫోన్లను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఐఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మంగళవారం ‘ఐఫోన్గీ (రోమన్ 10)’ పేరిట తన తాజా సంచలనాన్ని మార్కెట్‌కు పరిచయం చేసింది. వీటితో పాటు ఐఫోన్8, ఐఫోన్8 ప్లస్ పేరిట మరో రెండు మోడళ్లను కూడా విడుదల చేసింది. ఐఫోన్ 10ను యాపిల్ అధినేత టిమ్ కుక్ విడుదల చేయటం విశేషం. ఇవీ ప్రత్యేకతలు... యాపిల్ ఐఫోన్ 10 స్క్రీన్ పరిమాణం 5.8 అంగుళాలు. ఓఎల్ఈడీ టెక్నాలజీతో పాటు స్టెయిన్లెస్ స్టీల్ బాడీ, గ్లాస్ బ్యాక్, త్రీడీ టచ్, ఫేసియల్ రికగ్నిషన్ టెక్నాలజీ తదితర ప్రత్యేకతలు దీని సొంతం. 64, 256 జీబీ సామర్థ్యాల్లో లభ్యం. ఇక ఐఫోన్ 8లో స్క్రీన్ 4.7 అంగుళాలు, ఐఫోన్ 8 ప్లస్‌లో 5.5 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. వీటిలో 3డీ టచ్, ట్రూ టోన్ డిస్ప్లే ఫీచర్స్, ఏ11 ప్రాసెసర్ (సిక్స్ కోర్) ఉంటాయి. సిల్వర్, స్పేస్ గ్రే, బంగారం రంగుల్లో ఇవి లభిస్తాయి. ఐఫోన్ 8లో రియర్ కెమెరా 12 ఎంపీగాను, 8 ప్లస్‌లో 12 ఎంపీ సామర్ధ్యంతోను డ్యుయల్ కెమెరాలు ఉంటాయి. ఐఫోన్–8 ధర 699 డాలర్ల నుంచీ ఆరంభమవుతుండగా... 8 ప్లస్ ధర మాత్రం 799 డాలర్ల నుంచీ మొదలవుతోంది. ఐఫోన్స్‌తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 3, వాచ్ ఓఎస్4, 4కే హెచ్డీఆర్ వీడియో ఫీచర్‌తో కొత్త యాపిల్ టీవీ తదితర ఉత్పత్తులను కూడా యాపిల్ ఆవిష్కరించింది. కొత్తగా నిర్మించిన యాపిల్ పార్క్ కార్యాలయంలోని స్టీవ్ జాబ్స్ థియేటర్లో వీటిని ఆవిష్కరించారు. 2007 జనవరి 9న అప్పటి యాపిల్ సీఈవో స్టీవ్ జాబ్స్ తొలి ఐఫోన్‌ను ప్రవేశపెట్టి.. మొబైల్ కంప్యూటింగ్‌లో కొత్త అధ్యాయానికి తెరతీశారు. అదే ఏడాది జూన్ 29 నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యాక ఐఫోన్ రాత్రికి రాత్రే సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. స్టీవ్ జాబ్స్ ఎప్పటికీ తమ జ్ఞాపకాల్లో ఉండిపోతారని టిమ్ కుక్ చెప్పారు. యాపిల్ పార్క్ కార్యాలయంలోకి ఈ ఏడాది ఆఖరునాటికి కార్యకలాపాలను తరలిస్తామని తెలియజేశారు. యాపిల్ వాచ్..: యాపిల్ వాచ్ సిరీస్ 3లో ఎల్టీఈ టెక్నాలజీ ఆధారిత బిల్ట్ ఇన్ ఎలక్ట్రానిక్ సిమ్, డ్యుయల్ కోర్ ప్రాసెసర్ మొదలైనవి ప్రత్యేకతలు. దీని ధర 329 డాలర్ల నుంచి 399 డాలర్ల దాకా (సెల్యులార్ ఆప్షన్‌తో) ఉంటుంది. సెప్టెంబర్ 15 నుంచి ఆర్డర్లు స్వీకరించనుండగా, 22 నుంచి డెలివరీ ప్రారంభమవుతుంది. రోలెక్స్, ఫాసిల్, ఒమెగా, కార్టియర్ మొదలైన వాటిని దాటేసి యాపిల్ వాచ్ ప్రస్తుతం నంబర్ వన్ వాచ్‌గా ఉందని టిమ్ కుక్ చెప్పారు.