సమైక్యాంధ్రకు మద్దతుగా కొవ్వొత్తుల ర్యాలీ
శ్రీకాకుళం అరబన్, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ పాత శ్రీకాకుళంలోని ఏపీహెచ్‌బీ కాలనీ(కలెక్టర్ బంగ్లా) వాసులు డిమాం డ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాలనీలో ఆదివారం భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ లో పాల్గొన్న మహిళలు, చిన్నారులు, యువకులు సమై క్య నినాదాలు వినిపించారు. రాష్ట్రం కలసి ఉంటేనే అభివృద్ధి పథంలో పయనిస్తుం దని పేర్కొన్నారు. ర్యాలీలో కాలనీవాసులు ఎం. శ్రీనివాసరావు, పొట్నూరు వెంకట్రావు, కర్నాయిన హరి, డి.మాధవరావు, ఉమామహేశ్వరరావు, బి.గిరి, కిరణ్, బాబీ, శంకర్ పట్నాయక్, రామచంద్రరావు, నాగేశ్వరరావు, ఎల్.రామారావు పాల్గొన్నారు.