breaking news
Antigua test
-
విండీస్‌పై టీమిండియా ఘనవిజయం
అంటిగ్వా : వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచులో టీమిండియా 318 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా విధించిన 419 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత పేస్ బౌలర్ల ధాటికి విండీస్ జట్టు 100 పరుగులకే కుప్పకూలింది. కాగా, విండీస్ తరపున కీమర్ రోచ్ (38, 31 బంతులు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా 7 పరుగులకే ఐదు వికెట్లు తీసి టెస్టుల్లో కెరీర్ బెస్ట్ గణంకాలు నమోదు చేయగా, ఇషాంత్ శర్మ మూడు, షమి రెండు వికెట్లతో చెలరేగారు. అంతకు ముందు 343/7 పరుగుల వద్ద టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో అర్థ శతకంతో ఆకట్టుకున్న రహానే రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకంతో మెరిసాడు. కాగా, హనుమ విహారి 93 పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్థశతకం, శతకంతో రాణించిన అజింక్యా రహానే మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్ తమ భోణీని ఘనంగా ఆరంభించింది. ఇక కింగ్స్‌స్టన్ వేదికగా ఆగస్టు 30 నుంచి భారత్ - విండీస్‌ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. -
కెప్టెన్‌గా ఉంటే అలాగే వ్యవహరిస్తాను
మహేంద్ర సింగ్ ధోనీ టెస్టుల నుంచి రిటైరయ్యాక కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్న విరాట్ కోహ్లీ ఇప్పటికే జింబాబ్వే, శ్రీలంకపై సిరీస్ విజయాలను అందించాడు. అయితే కెప్టెన్ అయినప్పటికీ తాను ఓ సాధారణ బ్యాట్స్ మన్ తరహాలోనే ఆలోచిస్తుంటానని కోహ్లీ తెలిపాడు. బ్యాటింగ్ సమయంలోనే కాదు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు తన ఆలోచన తీరు అలాగే ఉంటుందని.. దాంతో ఆటగాళ్లను సరైన స్థానాల్లో ఉంచి ఫీల్డింగ్ చేయించడం సులభమన్నాడు. బ్రాత్ వైట్ ఔట్ విషయంలో అటాకింగ్ ఫీల్డింగ్ సత్ఫలితాన్ని ఇచ్చిందని, బ్యాట్స్ మన్ బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలంటే తాను కూడా బ్యాట్స్ మన్ తరహాలో ఆలోచించడం ఉత్తమమని అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్ పై తొలి టెస్టులో ఇన్నింగ్స్ 92 పరుగుల విజయం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నాడు. 560-70 పరుగులు చేస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి ఉంటుందని, అదే విజయానికి బాటలు వేసిందని విరాట్ చెప్పుకొచ్చాడు. కోచ్ అనిల్ కుంబ్లేను ప్రశంసించాడు. అతడు కోచ్ అయ్యాక.. బెంగళూరులో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాం, కరీబియన్ వచ్చాక హార్స్ రైడింగ్, బీచ్ గేమ్స్ స్విమ్మింగ్, టూరిస్ట్ ప్రదేశాలు సందర్శించాం.. ఇలా అన్నీ చేస్తూనే కుంబ్లే శిక్షణలో నిమగ్నమైనట్లు వివరించాడు. ఈ విజయం ఏ ఒక్కరిదో కాదని, బ్యాట్స్ మన్, బౌలర్లు సమిష్టిగా రాణించడంతో అద్భుత విజయం టీమిండియా సొంతమైందని కోహ్లీ పేర్కొన్నాడు. -
చెలరేగిన కొహ్లీ: తొలి డబుల్ సెంచరీ