breaking news
Ambedkarnagar
-
తాగునీటికి తప్పని తిప్పలు
► నగర వాసులకు కష్టాలు ► పట్టించుకోని అధికారులు కరీంనగర్ కార్పొరేషన్:అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా తయారైంది మన నగరపాలక సంస్థ తీరు. ఓ వైపు నిండుకుండలా ఉన్న లోయర్ మానేరు డ్యాం. నీటి సరఫరాకు కొరత లేని నిధులు. అదనపు పైపులైన్ పనులు పూర్తరుు రెండేళ్లు అరుునప్పటికీ ముందుకు కదలని ప్రతిపాదనలు. అధికార యంత్రాంగంలో వీడని అలసత్వం. మంచినీటి కోసం ప్రజలకు తప్పని ఎదురుచూపులు. ఇదీ కార్పొరేషన్లో నీటి సరఫరా పరిస్థితి... తలాపున మానేరు డ్యాం ఉన్నా తాగునీటి కోసం తండ్లాడ తప్పడం లేదు. హైలెవల్ పరిధిలోని 8 డివిజన్ల ప్రజలు తాగునీటి ఇబ్బందులు తప్పడంలేదు. నగరంలోని భగత్‌నగర్, అంబేద్కర్‌నగర్ ట్యాంకు ద్వారా నీటి సరఫరా జరిగే 30, 32, 33, 35, 43, 1, 3, 6 డివిజన్ల ప్రజల తాగునీటి తంటాలు వర్ణనాతీతంగా మారారుు. భగత్‌నగర్ ట్యాంకును నింపకుండా నేరుగా బైపాస్ ద్వారానే నీటి సరఫరా జరుగుతుండడంతో పైపులైన్ చివరన ఉండే నల్లాలకు చుక్క నీరు రావడం లేదు. దశాబ్దకాలంగా శాశ్వత పరిష్కారం కనుక్కోలేక చతికిలపడుతున్నారు. అలంకారప్రాయంగానే 30, 32, 33, 35 డివిజన్ల నీటి కష్టాలు తీర్చేందకు మానేరు డ్యాం ఒడ్డున గౌతమినగర్‌లో 12 లక్షల లీటర్ల సామర్థ్యం గల ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణాన్ని 2013లో పూర్తిచేశారు. దీపావళికి నీటి సరఫరా చేస్తామని అధికారుల ప్రకటన ఆచరణకు నోచుకోలేదు. పైపులైన్ పూర్తరుు రెండేళ్లు... నగరపాలక సంస్థలో రెండు రిజర్వాయర్లు ఉన్నారుు. ఒకటి మార్కెట్ రిజర్వాయర్ (లోలెవల్) కాగా, రెండోది కోర్టు రిజర్వాయర్ (హైలెవల్). మార్కెట్ రిజర్వాయర్ కింద 15 డివిజన్లు, కోర్టు రిజర్వాయర్ కింద 35 డివిజన్లకు నీటి సరఫరా జరుగుతోంది. రెండు రిజర్వాయర్లకు ఫిల్టర్‌బెడ్ నుంచి ఒకే పైపులైన్ ద్వారా రోజు విడిచి రోజు నీటి సరఫరా జరుగుతోంది. అరుుతే ప్రతి రోజు నీటి సరఫరా జరగాలంటే ఫిల్టర్‌బెడ్ నుంచి సెపరేట్ పైపులైన వేయాల్సి ఉండడంతో రెండేళ్ల క్రితం రూ.7.2 కోట్లు వెచ్చించి ఫిల్టర్‌బెడ్ నుంచి మార్కెట్ రిజర్వాయర్ వరకు ప్రత్యేక పైపులైన్‌ను నిర్మాణం చేశారు. పైపులైన్ పనులు పూర్తరుున వెంటనే ప్రతి రోజు నీటి సరఫరా చేస్తామని హడావిడి చేసి అటకెక్కించారు. బయటపడ్డ లోపాలు... కొత్త పైపులైన్ ద్వారా నీటి సరఫరా చేసేందుకు యేడాది క్రితం ట్రయల్ రన్ ప్రారంభించారు. అడుగడుగునా లీకేజీలు ఉండడంతో వాటిని వెంటనే పూడ్చాలని సదరు కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కాంట్రాక్టర్ లీకేజీలు పూర్తిచేసినట్లు వెల్లడించడంతో ఆరునెలల తర్వాత మరో మారు పరీక్షించారు. మళ్లీ 17 లీకేజీలు బయటపడ్డారుు. హడావిడిగా నిర్మాణం చేయడం, అధికారుల పర్యవేక్షణ లోపించడంతో పైపులైన్ పనుల్లో నాణ్యత కరువైనట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. -
అందుబాటులోకి మరో రెండు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు
న్యూఢిల్లీ: నగరంలో మరో రెండు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటుచేయనున్నట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. ఈ ఏడాది నవంబర్ చివరికల్లా ఉత్తర ఢిల్లీలోని బురారీ, దక్షిణఢిల్లీలోని అంబేద్కర్‌నగర్‌లో నిర్మించిన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు అందుబాటులోకి రానున్నాయని ఆ శాఖ అధికారులు తెలిపారు. రెండు ఆస్పత్రులూ 200 పడకల సామర్థ్యం కలిగి ఉన్నవేనని వారు చెప్పారు. వీటిలో న్యూరాలజీ, గైనకాలజీ, చిన్నారులకు సంబంధించి ప్రత్యేక విభాగాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. కొన్ని కారణాల ఈ ఆస్పత్రుల నిర్మాణంలో జాప్యం జరిగినా, ప్రస్తుతం పనులను వేగిరవంతం చేశామన్నారు. మరో మూడు నెలల్లో నిర్మాణ పనులుపూర్తయిపోతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్), సబ్దర్‌జంగ్ ఆస్పత్రులకు పెరిగిన రోగుల తాకిడిని తగ్గించేందుకు పశ్చిమ ఢిల్లీలోని ద్వారకాలో రూ. 570 కోట్ల అంచనా వ్యయంతో 700 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ ఆస్పత్రి కూడా మరో ఏడాదిలో రోగులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. దీనికి భారతరత్న ఇందిరాగాంధీ ఆస్పత్రిగా వ్యవహరించనున్నట్లు చెప్పారు. దీనికి అనుబంధంగా మెడికల్ కళాశాలను కూడా ఏర్పాటుచేయనున్నామన్నారు. ఇదిలా ఉండగా, ఢిల్లీ ప్రభుత్వ ం కింద పనిచేస్తున్న ఆస్పత్రుల్లో ఉన్న సదుపాయాలను మెరుగుపరచడంలో భాగంగా లాల్‌బహదూర్ శాస్త్రి ఆస్పత్రి, లోక్‌నాయక్ ఆస్పత్రులకు చెరో 45 డయాలసిస్ యంత్రాలు మంజూరయ్యాయని ఆయన వివరించారు.