breaking news
akula srinivas
-
కాపులంతా కొలికపూడిని వ్యతిరేకించాలి: ఆకుల శ్రీనివాస్
సాక్షి, ఎన్టీఆర్: కాపులను తాకట్టు పెట్టే వ్యక్తి పవన్ కల్యాణ్ అని అన్నారు ఏపీ కాపు నాయకులు ఆకుల శ్రీనివాస్. వంగవీటి రంగా అనే వ్యక్తి కొలికపూడి శ్రీనివాస్‌కు తెలుసా అని ప్రశ్నించారు. కాపులంతా కొలికపూడిని వ్యతిరేకించాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాగా, తిరువూరులో వైస్సార్సీపీ కాపుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, వైఎస్సార్సీపీ కాపు నేత ఆకుల శ్రీనివాస్, తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్ధి నల్లగట్ల స్వామిదాస్, తిరువూరు వైఎస్సార్సీపీ కాపు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ..‘వంగవీటి రంగా చనిపోయిన తర్వాత కాపులకు దివంగత మహానేత వైఎస్సార్ అండగా నిలిచారు. వైఎస్సార్‌పై టీడీపీ అభ్యర్థి కొలికపూడి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. వంగవీటి రంగా అనే వ్యక్తి కొలికపూడికి తెలుసా?. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రంగా శిష్యుడిని అని చెప్పుకుంటున్నాడు. కొలికపూడిని కాపులంతా వ్యతిరేకించాలి. తిరువూరులో స్థానికుడైన నల్లగుట్ల స్వామిదాస్‌కు కాపులంతా అండగా ఉండాలి. కూటమిలో భాగంగా 24 సీట్ల నుంచి 21 సీట్లకు పోటీకి అభ్యర్థులను తగ్గించుకుని పవన్ దిగజారిపోయాడు. కాపులను తాకట్టు పెట్టే వ్యక్తి పవన్. కాపులకు కాపు కాసే వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్’ అని చెప్పుకొచ్చారు. -
ట్రాక్టర్ ట్రాలీ మీద పడి బాలుడు దుర్మరణం
మంథని: కరీంనగర్ జిల్లా మంథని పట్టణంలోని ఎరుకలగూడెంలో మంగళవారం రాత్రి విషాదకర ఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్ ట్రాలీ డోర్ మీద పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఆకుల శ్రీనివాస్, శిరీష దంపతుల కుమారుడు ఆకెళ్ల రాజ్ కుమార్ (6) యూకేజీ చదువుతున్నాడు. మంగళవారం రాత్రి ఇంటి ముందు ఓ ట్రాక్టర్ ఆగి ఉండడంతో రాజ్ కుమార్ ఆడుకుంటున్నాడు. ట్రాక్టర్ ట్రాలీ వెనుక డోర్ పట్టుకుని వేలాడుతుండగా ఒక్కసారిగా ఆ డోర్ వచ్చి అతడి చాతీ భాగానికి తగిలింది. దాంతో రాజ్‌కుమార్ సొమ్మసిల్లి కిందపడిపోయాడు. సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. శ్రీనివాస్ దంపతులకు రాజ్‌కుమార్‌తోపాటు ఓ బేబీ కూడా ఉంది,