breaking news
air craft carriers
-
179 మంది మృతి..‘నాదే పూర్తి బాధ్యత’
దక్షిణ కొరియాలోని ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయం(Muan International Airport)లో జరిగిన జెజు ఎయిర్ విమాన ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి బాధ్యత తీసుకుంటానని సంస్థ సీఈఓ కిమ్ ఇబే తెలిపారు. దక్షిణ కొరియాలో ఆదివారం జరిగిన విమాన ప్రమాదంలో 179 మంది మృతి చెందారు. ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. విమానం ల్యాండింగ్ గేర్ వైఫల్యం అవ్వడంతో రన్‌వేపై జారుతూ ఎయిర్పోర్ట్ రక్షణ గోడను ఢీకొట్టి ఈ ప్రమాదం జరినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై జెజు ఎయిర్(Jeju Air) సీఈఓ స్పందిస్తూ కారణంతో సంబంధం లేకుండా పూర్తి బాధ్యత వహిస్తారని తెలిపారు.థాయ్‌లాండ్ నుంచి 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో దక్షిణ కొరియాలోని సియోల్‌కు 290 కిలోమీటర్ల దూరంలోని ముయాన్కు జెజు ఎయిర్‌కు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్(Aircraft) ఆదివారం బయలుదేరింది. ఉదయం 9 గంటల సమయంలో ముయాన్ ఎయిర్‌పోర్ట్‌లో దిగుతుండగా విమానం ముందు భాగంలోని ల్యాండింగ్ గేర్ తెరుచుకోలేదు. అప్పటికే ల్యాండింగ్‌కు ముందు ఏటీసీ నుంచి పైలట్లకు ‘బర్డ్స్ట్రైక్’ వార్నింగ్ ఇచ్చారు. కానీ అప్పిటికే పరిస్థితి చేదాటిపోయిందని పైలట్ సిగ్నల్ పంపించారు. విమానం ముందు భాగంలోని ల్యాండింగ్ గేర్ వైఫల్యంతో రన్‌వేపై జారుతూ వెళ్లిన విమానం ఎయిర్పోర్ట్ రక్షణ గోడను ఢీకొని క్షణాల్లో మంటలు అంటుకుని పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు.ఇదీ చదవండి: యాపిల్ ఐఫోన్ 14, ఎస్ఈ నిలిపివేత..కారణం..ఘటనపై జెజు ఎయిర్ సీఈఓ కిమ్ ఇబే స్పందిస్తూ..‘ఈ విషాదకరమైన సంఘటన తీవ్రంగా కలచివేసింది. కారణంతో సంబంధం లేకుండా, ఘటనకు నేను పూర్తి బాధ్యత తీసుకుంటాను. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రమాదంపై చేపడుతున్న విచారణకు అన్నివిధాలా సహకారం అందిస్తాం’ అని చెప్పారు. ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి దర్యాప్తు కొనసాగుతోంది. -
50వేల కోట్ల యుద్ధ నౌకలు పనిచేయవా?
రక్షణ శాఖ కొత్తగా నిర్మించిన రెండు యుద్ధ నౌకల సేవలను యూకే వినియోగించుకోలేకపోవచ్చా?. తాజాగా యూకే నేషనల్ ఆడిట్ లో వెల్లడైన లెక్కలు ఈ విషయాన్ని ధ్రవీకరిస్తున్నాయి. నౌకలకు విద్యుత్తు సరఫరా చేసే కేబుల్స్ కొనుగోలుకు రక్షణ శాఖ దగ్గర డబ్బు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ రెండు యుద్ధ నౌకల నిర్మాణానికి యూకే రక్షణ శాఖ ఇప్పటికే 50,504 కోట్లకు పైచిలుకు ఖర్చు చేసింది. యూకే మిలటరీ బేస్ ల ఖర్చును పర్యవేక్షించిన నేషనల్ ఆడిట్ ఆఫీసు కొత్త యుద్ధ నౌకలు విద్యుత్తు సరఫరా కొరతతో నిలిచిపోతాయని తీవ్రంగా స్పందించింది. ఇప్పటికే రక్షణ శాఖ వద్ద తీవ్రంగా నిధుల కొరత ఏర్పడినట్లు చెప్పింది. వచ్చే 30 ఏళ్లలో అవసరమయ్యే 8.5 బిలియన్ల పౌండ్లను రక్షణ శాఖ ఖర్చు చేయలేదని తేల్చిచెప్పింది. దీనిపై స్పందించిన రాయల్ నేవీ పవర్ కేబుల్స్ ను అవసరమైన చోట అమర్చుతామని పేర్కొంది. 2017 ప్రారంభంలో అందుబాటులోకి వచ్చే హెచ్ఎమ్ఎస్ క్వీన్ ఎలిజిబెత్ యుద్ధ నౌక కోసం పోర్ట్స్ మౌత్ నావల్ బేస్ ను కూడా సిద్ధం చేస్తామని రాయల్ నేవీ ప్రతినిథి ఒకరు తెలిపారు.