breaking news
Aavesham Movie
-
Mollywood: హిట్టయిన సినిమాలు ఇంతేనా? రూ.700 కోట్ల లాస్!
కథలో కొత్తదనం, సహజత్వం అనగానే చాలామందికి మలయాళ సినిమాలు గుర్తొస్తుంటాయి. అది నిజమేనని ఏయేటికాయేడు మాలీవుడ్ (Mollywood) నిరూపించుకుంటూనే ఉంది. ఈ ఏడాదైతే మంజుమ్మెల్ బాయ్స్, ఆడుజీవితం, ఆవేశం వంటి ఎన్నో సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. అయితే 2024లో మాలీవుడ్‌లో సినిమాల సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉందంటోంది కేరళ చిత్ర నిర్మాతల సంఘం.199 చిత్రాలు రిలీజ్వారి నివేది ప్రకారం.. 2024లో 199 మలయాళ సినిమాలు వెండితెరపైకి వచ్చాయి. ఇందులో కేవలం 26 చిత్రాలు మాత్రమే సక్సెసయ్యాయి. అయితే మొత్తం అన్ని సినిమాలకు కలుపుకుని రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే రూ.300 కోట్లు మాత్రమే తిరిగొచ్చింది. అంటే రూ.700 కోట్లు నష్టపోయారు! బడ్జెట్ పెరగడం, నటీనటుల పారితోషికం పెంపు వంటివి ఈ నష్టానికి ప్రధాన కారణమని తేల్చాయి.రూ.100 కోట్ల క్లబ్లో ఐదు సినిమాలుమంజుమ్మెల్ బాయ్స్ (Manjummel Boys), ఆవేశం (Aavesham), ప్రేమలు (Premalu), ఆడుజీవితం (Aadujeevitham: The Goat Life), ARM చిత్రాలు మాత్రమే రూ.100 కోట్ల క్లబ్లో చేరాయి. ఈ ఐదింటిలో అత్యధికంగా మంజుమ్మెల్ బాయ్స్ రూ.242 కోట్లు సాధించింది. కిష్కింద కాండం, గురువాయూర్ అంబలనడయిల్, వర్షంగళక్కు శేషం సినిమాలు రూ.50 కోట్లు వసూలు చేశాయి.రీరిలీజ్ మూవీస్ హిట్మోహన్లాల్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన బరోజ్ పెద్దగా ఆక్టటుకోలేకపోయింది. కానీ అతడు నటించిన దేవదూతన్, మణిచిత్రతళు సినిమాలను రీరిలీజ్ చేయగా మరోసారి హిట్టందుకున్నాయి. జనాలు భారీ తారాగణాన్ని చూసి కాకుండా కంటెంట్‌ను చూసి థియేటర్లకు వస్తున్నారని ఈ ఏడాదితో స్పష్టమైంది. దీన్ని బట్టి ఎడాపెడా ఖర్చుపెట్టకుండా నిర్మాణ వ్యయాలను అదుపులో పెట్టుకుంటే ఇండస్ట్రీకి మంచిది!చదవండి: Tollywood: ‘డిసెంబర్’ రివ్యూ.. హిట్ రాలేదు ‘పుష్పా’ ! -
ఓటీటీలో ఆవేశం.. ఆ సీన్‌పై చర్చ!
ఫహద్ ఫాజిల్.. అప్పుడే హీరోగా చేస్తాడు.. అంతలోనే విలన్‌గా నటిస్తాడు. ప్రాధాన్యతను బట్టి ఏ పాత్రలో అయినా దూరేస్తాడు. ఇటీవల అతడు హీరోగా నటించిన మలయాళ మూవీ ఆవేశం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.ఓటీటీలో ఆవేశంబాక్సాఫీస్ దగ్గర హిట్టందుకున్న మూవీ ఓటీటీలోకి రావడంతో సినీప్రియులు ఆత్రుతగా ఆవేశం సినిమా చూసేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు సినిమాలోని ఓ సీన్‌ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. హిందీ భాషను కావాలని పక్కన పడేశారని కామెంట్లు చేస్తున్నారు.ఫైట్ సీన్లో వార్నింగ్ఇంతకీ ఏమైందంటే.. ఓ ఫైట్ సీన్లో రంగ(ఫహద్ ఫాజిల్) తన కాలేజీలోని సీనియర్లు అజు, బిబి, షాంతన్కు వార్నింగ్ ఇస్తుంటాడు. మలయాళం, కన్నడ భాషల్లో వార్నింగ్ ఇస్తాడు. హిందీలో కూడా ఇద్దామనుకునేసరికి హిందీలో అవసరం లేదులే అంటూ రంగ రైట్ హ్యాండ్ అంబాన్ (సాజిన్ గోపు) అతడిని వారిస్తాడు. హిందీ అక్కర్లేదా?అందరికీ చెప్పింది అర్థమైందిగా.. ఇక వెళ్లిపోండి అని ఆదేశిస్తాడు. హిందీలో అవసరం లేదా? అని హీరో అడిగితే అంబాన్ వద్దని బదులిస్తాడు. ఇది చూసిన కొందరు అధికార భాష హిందీని గౌరవించాలి కదా అని అభిప్రాయపడగా.. అయినా ప్రాంతీయ భాషా చిత్రంలో హిందీ అవసరం ఏముందిలే అని మరికొందరు లైట్ తీసుకుంటున్నారు.చదవండి: ఓ మంచి దెయ్యం టీజర్ చూశారా?