breaking news
-
రూ.16 కోట్ల ఇంజక్షన్ ఇస్తేనే బతికే అవకాశం
వికారాబాదు జిల్లా: సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం సాగించే నిరుపేద తల్లిదండ్రులకు కొండంత ఆపద వచ్చిపడింది. ఒక్కగానొక్క కొడుకు అరుదైన వ్యాధి (లక్షల మందిలో ఏ ఒక్కరికో సోకే) బారిన పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. రూ.కోట్ల విలువ చేసే ఇంజక్షన్ ఇస్తే కానీ చిన్నారి బతికే అవకాశం లేదని చెప్పడంతో గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. వివరాలు ఇలా.. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం, బొంరాస్‌పేట్ మండలం వడిచర్ల పరిధిలోని ఊరెనికి తండాకు చెందిన ముడావత్ శ్రీను, గోరీబాయి దంపతులకు ముడావత్ జగన్ అనే ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. బతుకుదెరువు నిమిత్తం మూడేళ్ల క్రితం తాండూరుకు వచి్చన వీరు సాయిపూర్లో నివసిస్తున్నారు. రెండేళ్లుగా జగన్ మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. ఎన్ని ఆస్పత్రులు తిప్పినా సరైన చికిత్స అందలేదు. దీంతో అప్పు చేసి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రెయిన్బో ఆస్పత్రికి తీసుకెళ్లగా బాలుడిని పరీక్షించిన వైద్యులు.. బాబుకు అరుదైన, ప్రాణాంతక స్పైనల్ మసు్కలర్ ఆట్రోపీ (ఎస్ఎంఏ) అనే వ్యాధి సోకిందని చెప్పారు. ఇలాంటి వ్యాధి రాష్ట్రంలో ఎవరికీ లేదని, ఇది కొత్త వైరస్ వల్ల సోకిందని తెలిపారు. ఈ వ్యాధి నయం కావాలంటే జోల్జెన్స్మా అనే ఇంజక్షన్ ఇవ్వాలన్నారు. దీన్ని అమెరికా నుంచి తెప్పించాలని, ఇందుకు రూ.16 కోట్లు ఖర్చవుతుందని చెప్పడంతో బాధిత తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. ప్రతీ 12 గంటలకు ఒకసారి సిరప్ వేస్తేనే మామూలు స్థితికి వస్తున్నాడని, కొంచెం ఆలస్యమైనా ఫిట్స్ వస్తోందని కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ ఎమ్మెల్యే, సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి తమ కొడుకును బతికించాలని వేడుకుంటున్నారు. దాతలు సైతం ఆరి్ధక సాయం (ఫోన్ పే, గూగుల్ పే నంబర్ 8639157327), (ఎస్బీఐ అకౌంట్ నంబర్ 43194942778) చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. -
కెనడాపై ఉరిమిన ట్రంప్.. సుంకాలు 10 శాతం పెంపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు తన ప్రతాపం చూపారు. తాజాగా కెనడియన్ వస్తువులపై సుంకాలను అదనంగా 10 శాతం మేరకు పెంచుతున్నట్లు వెల్లడించారు. దివంగత అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ నాడు సుంకాలపై చేసిన ప్రసంగానికి సంబంధించిన ఆడియో క్లిప్పులను కెనడా వినియోగించిన దరిమిలా ఆగ్రహంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పొరుగు దేశమైన కెనడా రూపొందించిన ఒక టీవీ వాణిజ్య ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి. అమెరికా ఇటీవలే కెనడాపై 35 శాతం నుంచి 50 శాతం వరకు సుంకాలు విధించింది. అయితే ఈ సుంకాల తగ్గింపుపై రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వీటిపై ఒక ఒప్పందం కుదురుతుందని కెనడా అధికారులు భావిస్తున్న తరుణంలో అందుకు భిన్నంగా జరిగింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ- డొనాల్డ్ ట్రంప్ మధ్య ఇటీవలే ఓవల్ ఆఫీస్‌లో స్నేహపూర్వక సమావేశం జరిగింది. అయితే ఇంతలోనే ఊహించని విధంగా ట్రంప్.. కెనడాతో చర్చల రద్దును ప్రకటించారు. దీనికి కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ ప్రభుత్వం ప్రసారం చేసిన ఒక టీవీ ప్రకటన అని సమాచారం. ఈ ప్రకటనలో అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ .. సుంకాలు, ఆంక్షలు దీర్ఘకాలంలో అమెరికన్లకు ముప్పు తీసుకొస్తాయని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన గత వారం రోజులుగా అమెరికా టీవీ ఛానెల్స్‌లో ప్రసారమవుతోంది.అమెరికా ప్రవేశపెడుతున్న సుంకాల విషయంలో అక్కడి సుప్రీంకోర్టు త్వరలోనే తీర్పు వెల్లడించనుంది. ఈ నేపధ్యంలో కోర్టు తీర్పును ప్రభావితం చేయాలనే ఉద్దేశంతోనే కెనడా ఈ ప్రకటనను ప్రచారంలోకి తీసుకొచ్చిందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. కాగా దీనిపై రొనాల్డ్ రీగన్ ఫౌండేషన్ కూడా స్పందించింది. సదరు ప్రకటనను ఖండించింది. ‘వారు ఈ ప్రకటనను వెంటనే తీసివేయాలి. అది మోసపూరితమైనదని తెలిసి కూడా వారు వరల్డ్ సిరీస్ సమయంలో దానిని ప్రసారం చేయడానికి అనుమతించారు’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో పేర్కొన్నారు. వాస్తవాలను తప్పుగా చూపించడంలాంటి శత్రు చర్యల కారణంగా కెనడాపై సుంకాన్ని.. వారు ఇప్పుడు చెల్లిస్తున్న దానికంటే 10 శాతం అదనంగా పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు.ఇది కూడా చదవండి: ‘మహారాష్ట్ర డాక్టర్’ కేసులో కీలక పరిణామం -
అర్హత లేకున్నా హెవీ డ్రైవింగ్ లైసెన్స్!
కారెంపూడి: కర్నూలు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 19 మంది సజీవ దహనానికి కారణమైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య అర్హత లేకున్నప్పటికీ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ప్రమాదం నేపథ్యంలో పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన లక్ష్మయ్య కుటుంబ నేపథ్యం, ప్రవర్తన, అలవాట్లపై అధికారులు ఆరా తీశారు. ఈయన 5వ తరగతి వరకే చదువుకున్నాడని, అయితే టెన్త్ ఫెయిల్ అయినట్లు సర్టిఫికెట్ ఇచ్చి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని గుర్తించారు.మొదట లారీ క్లీనర్‌గా, తర్వాత డ్రైవర్‌గా పని చేశాడు. 2004లో లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నప్పుడు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి చెట్టుకు ఢీకొనడంతో అప్పట్లో లారీ క్లీనర్ మృతి చెందాడు. ఆ తర్వాత లారీ డ్రైవర్‌గా మానేసి కొన్నాళ్లు ట్రాక్టర్ కొని స్వగ్రామంలో వ్యవసాయం చేశాడు. తర్వాత ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌గా ఏడెనిమిదేళ్ల నుంచి వెళ్తున్నాడని తెలిసింది. లక్ష్మయ్య తండ్రి రాములు రెండు నెలల కిందట మృతి చెందాడు. ఇతనికి భార్య, ఓ కుమారుడు, ఓ కుమార్తె, ఒక సోదరుడు, ఇద్దరు అక్కలు ఉన్నారు. లక్ష్మయ్యకు అప్పుడప్పుడు మద్యం సేవించే అలవాటు ఉందని సమాచారం. -
ప్రత్యక్ష నరకం!
కర్నూలు (హాస్పిటల్): ‘ఎవరి శరీరానికైనా కొంచెం నిప్పు తగిలితే సుర్రుమంటుంది. కానీ అత్యధిక వేడితో శరీరం కాలిపోతున్నా వారికి తెలియలేదంటే పరిస్థితి ఎంతటి భయానకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బస్సు మంటల్లో కాలిపోతున్నప్పుడు వెలువడిన విష వాయువులు పీల్చడం వల్ల అందులో ప్రయాణిస్తున్న వారు స్పృహ కోల్పోయారు. ఇదే సమయంలో మంటలు వారిని దహించేసి ఉంటాయి’ అని కర్నూలు మెడికల్ కాలేజ్ ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ టి.సాయిసుదీర్ వెల్లడించారు. కర్నూలు శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మంటల్లో కాలిపోయి మరణించిన విషయం తెలిసిందే. కాళ్లు, చేతులు బూడిదైపోగా.. మిగిలిన మొండేల నుంచి డీఎన్ఏ పరీక్ష కోసం శాంపిల్స్ సేకరించారు. శనివారం వరకు 18 మంది మృతుల కుటుంబీకుల నుంచి రక్త నమూనాలు సేకరించారు. వీటిని మంగళగిరిలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీకి పంపించారు. రెండు రోజుల్లో నివేదికలు రానున్నాయి. మరో గుర్తు తెలియని వ్యక్తి కుటుంబీకుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగిన బస్సును సునిశితంగా పరిశీలించిన డాక్టర్ సాయిసు«దీర్ శనివారం ‘సాక్షి’తో పలు విషయాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘వరంగల్‌లో రైలు ప్రమాదం తర్వాత ఒకేసారి మంటల్లో కాలిపోయి కుప్పగా, ముద్దగా మారిన మృతదేహాలను ఇప్పుడే చూస్తున్నా. ఘటన స్థలాన్ని చూడగానే అయ్యో పాపం.. ఏమిటీ దారుణం అని బాధపడ్డాను. కాలిన బస్సు ఎక్కి మృతదేహాలను పరిశీలించాను. బస్సు తగలబడుతున్నప్పుడు ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయాణికులు ఎంతగా ప్రయత్నించారో ఆ దృశ్యాలను చూస్తే అర్థమవుతుంది. ముందున్న తలుపు తెరుచుకోకపోవడంతో వెనుక వైపునకు వెళ్లేందుకు అందరూ ప్రయత్నించినట్లున్నారు.ఇదే సమయంలో వారిని కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రో కార్బన్స్ వంటి విపరీతమైన విష వాయువులు కమ్మేసి ఉంటాయి. ఈ వాయువులు ఒకేసారి పీల్చడం వల్ల అందరూ ఎక్కడికక్కడ స్పృహ తప్పి పడిపోయి ఉంటారు. ఇలా బస్సు మధ్యలో కొందరు, చివరలో కొందరు కుప్పకూలిపోయినట్లు కనిపించారు. అదే సమయంలో వ్యాపించిన మంటలకు వారు ఆహుతై ఉంటారు. ఇలాంటి మంటలు నిమిషాల వ్యవధిలోనే మనిషిని ముద్దగా, బొగ్గుగా మార్చేస్తాయి. దాదాపుగా అన్ని మృతదేహాలకు శరీరంలో కేవలం తల, మొండెం మాత్రమే మిగిలాయి. పుర్రెలు కనిపిస్తున్నా వాటిని ముట్టుకుంటే రాలిపోతున్నాయి. బస్సులో ఇలాంటి దృశ్యాలను చూసి చలించిపోయాను. కొద్దిసేపటి తర్వాత తేరుకుని నా వృత్తి ధర్మాన్ని నెరవేర్చేందుకు ప్రణాళిక వేసుకున్నా. ఏయే ఏర్పాట్లు కావాలో.. అక్కడున్న అధికారులకు వివరించాను. ఇందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సహకరించారు. తాత్కాలిక మార్చురీలో పోస్టుమార్టం పోస్టుమార్టం నిర్వహించేందుకు నాతో పాటు ఫోరెన్సిక్ ప్రొఫెసర్ డాక్టర్ పి.బ్రహ్మాజీ మాస్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ కె.నాగార్జున, డాక్టర్ పి.హరీష్‌కుమార్, డాక్టర్ వి.సురేఖ, డాక్టర్ ఎండి. మహమ్మద్ సాహిల్‌తో పాటు 10 మంది పీజీలు కలిసి ఆరు బృందాలుగా ఏర్పడ్డాం. ఒక్కొక్కరు మూడు చొప్పున మృతదేహాల చొప్పున పోస్టుమార్టం చేశాం. ప్రమాదం జరిగిన స్థలంలోనే తాత్కాలిక మార్చురీ గదిని ఏర్పాటు చేయించాం. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్కడ పోస్టుమార్టం నిర్వహించాం. మరికొన్ని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ గదిలో పోస్టుమార్టం నిర్వహించడంతో పాటు డీఎన్ఏ పరీక్ష కోసం నమూనాలు తీశాం. మృతదేహాల్లో కండరాల టిష్యూ, దంతాలు, తొడ ఎముకలను నమూనాలుగా సేకరించాం. మిగిలిన మృతదేహాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి కాబట్టి ఏ మృతదేహం ఎవరిదో గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్ష అనివార్యమైంది. కుటుంబ సభ్యుల డీఎన్ఏతో పోలచ్చి చూసి పోలీసుల సమక్షంలో మృతదేహాలను వారి రక్త సంబం«దీకులకు అప్పగిస్తాం. చాలా మంది శరీరాలు బొగ్గుగా, ముద్దగా, బూడిదగా మారినా, వారి శరీరాలపై ఆభరణాలు మాత్రం అలాగే ఉన్నాయి. ముఖ్యంగా మహిళల మెడల్లో మంగళసూత్రాలు, చేతి గాజులు, చైన్లు వంటివి కాలకుండా కనిపించాయి. బంగారు ఆభరణాలు కరిగిపోవాలంటే ఇంకా ఎక్కువ వేడి అవసరం. -
ఎమ్మెల్యేలకూ డీసీసీ పదవులు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక ఈ నెలాఖరు నాటికి పూర్తికావచ్చని టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలకు కూడా డీసీసీ పదవులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఆదివారం ఢిల్లీలో ఆయన విలేకరులతో చిట్‌చాట్ చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ కొన్ని సందర్భాల్లో నిక్కచి్చగా ఉండదు. పార్టీలో రెండు పదవులు ఉండొద్దు అనే నిబంధన ఉంది. కానీ, కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా డీసీసీ అధ్యక్ష పదవులు ఇచ్చే అవకాశం ఉంది. డీసీసీ అధ్యక్ష పదవికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతి కూడా దరఖాస్తు చేసుకున్నారన్న విషయం నాకు తెలియదు. ఎమ్మెల్యేలకు డీసీసీ అనేది పదవి కిందకు రాదు కాబట్టి కొంతమంది ఎమ్మెల్యేలను, కార్పొరేషన్ల చైర్మన్లను ఈ పోస్టులకు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు డీసీసీ బరిలో ఉన్నారు. నామినేటెడ్ పదవుల్లో పాత వారికే అవకాశాలు ఇవ్వాలనేది అధిష్టానం ఆలోచన. నాలుగైదు జిల్లాలకు కొత్త డీసీసీలు వస్తారు. వారం పదిరోజుల్లో డీసీసీలను ప్రకటించే అవకాశం ఉంది’అని వివరించారు.మంత్రుల వివాదం ముగిసిన అధ్యాయం రాష్ట్రంలో మంత్రుల మధ్య చోటుచేసుకున్న వివాదం ముగిసిన అధ్యాయమని మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఈ అంశంపై అధిష్టానానికి వివరణ ఇచి్చనట్టు తెలిపారు. ఎంతటివారైనా పార్టీకి లోబడి ఉండాల్సిందేనని అన్నారు. గీత దాటితే తనతోసహా ఎవరైనా అధిష్టానం నిఘాలో ఉంటారని పేర్కొన్నారు. గోడలకు కూడా చెవులుంటాయనే విషయాన్ని గ్రహించి నేతలు జాగ్రత్తగా మాట్లాలని హితవు పలికారు. ‘మంత్రుల మధ్య విభేదాలపై అధిష్టానం సీఎం రేవంత్‌రెడ్డిని అడిగారో లేదో నాకు తెలియదు. నన్ను మాత్రం అడిగారు. ఆ పంచాయితీ ముగిసిన అధ్యాయం. కొండా సురేఖ కూతురు అలా మాట్లాడాల్సింది కాదు. ఆమె పార్టీ వ్యక్తి కాదు. ఈ అంశంపై కొండా సురేఖను పిలిచి మాట్టాడి మందలించాం. మంత్రులు పొన్నం ప్రభాకర్‌గౌడ్, అడ్లూరి లక్ష్మణ్‌గౌడ్‌లు స్నేహితులు. కానీ, వారి మధ్య తలెత్తిన వివాదంతో బయట రాంగ్ మెస్సేజ్ వెళ్లింది. నాతో సహా ఎవరికైనా పార్టీనే సుప్రీం. పార్టీ నియమావళికి లోబడి పనిచేయాల్సిందే’అని స్పష్టంచేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్‌దేనని ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు ఇద్దరు భార్యలున్నారనే విషయం మీడియా ద్వారానే తనకు తెలిసిందని చెప్పారు. అది వారి వ్యక్తిగతమని పేర్కొన్నారు. ఓట్‌చోరీకి హైదరాబాద్‌లోనే బీజం.. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో 40 నుంచి 50 లక్షల ఓట్లు తొలగించారని మహేశ్‌కుమార్ ఆరోపించారు. ఓట్ చోరీకి మొదట హైదరాబాద్‌లోనే బీజం పడిందని అన్నారు. కులం మతం పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని విమర్శించారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్‌ను తాను గౌరవిస్తానని చెప్పారు. ‘ఉద్యమంలో ఆయన ముందుండి పోరాటం చేశారు. కానీ, ఆయన పదేళ్ల పరిపాలన గాడి తప్పింది. కల్వకుంట్ల కవిత పాదయాత్రను స్వాగతిస్తున్నాం. ప్రజా క్షేత్రంలో పాదయాత్రలు మంచిదే. ఆమె మొత్తం వాస్తవాలు మాట్లాడినప్పుడు గౌరవిస్తాం’అని పేర్కొన్నారు. తెలంగాణకు కేంద్రం నుంచి సహకారం లేదని తెలిపారు. మెట్రో, మూసీ ప్రక్షాళన విషయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. -
ప్రైవేట్ బస్సుల్లో సరుకులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ఏపీలోని కాకినాడ, మచిలీపట్నం, ఏలూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, రాజమండ్రి, కడప, కర్నూలు వైజాగ్, నర్సీపట్నం, తదితర ప్రాంతాలకు బయలదేరే బస్సుల్లో టన్నుల కొద్దీ సరుకును చేరవేస్తున్నారు. ఈ బస్సులు యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘించి తిరుగుతున్నాయి. ఇటీవల కర్నూలు బస్సు ప్రమాద ఘటనలోనూ 400 మొబైల్ ఫోన్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ప్రమాదం జరగడంతో సెల్ఫోన్ల అంశం వెలుగులోకి వచ్చింది. ఒకవేళ ఈ ప్రమాదం జరగకుండా ఉంటే ఆ బస్సులో మొబైల్ ఫోన్ల రవాణా కొనసాగేదే.కేవలం ఆ ఒక్క బస్సులోనే కాదు..హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు నడిచే చాలా బస్సుల్లో చాలావరకు ఎలక్ట్రిక్ వస్తువులు, వివిధ రకాల ఉపకరణాలు, వస్త్రాలు, ఎరువులు, ఐరన్ వంటివి పెద్ద ఎత్తున రవాణా అవుతున్నాయి. దీంతో ప్ర యాణికులు ఉన్నా, లేకున్నా నిర్ణీత సమయం ప్రకారం ఈ బస్సు లు రాకపోకలు సాగిస్తున్నాయి. దసరా, దీపావళి తర్వాత ప్రయా ణికుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. కానీ బస్సులు మాత్రం నిలిచిపోలేదు. కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతోనే ఇవి రాకపోకలు సాగించడానికి సరుకు రవాణాయే ప్రధాన కారణం. పరిమితికి మించిన బరువుతో పరుగులు మోటారు వాహన నిబంధనల ప్రకారం.. ప్రైవేట్ బస్సులు హైవేలో గంటకు 80 కి.మీ.వేగంతోనే రాకపోకలు సాగించాలి. కానీ ఒకవైపు ప్రయాణికులు, మరోవైపు లగేజీ బాక్సులతో పరిమితికి మించిన బరువును మోసుకుంటూ వెళ్లే ఈ బస్సులు త్వరగా గమ్యాన్ని చేరేందుకు గంటకు 120 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో నడుస్తున్నాయి. దీంతో అనూహ్యమైన పరిస్థితుల్లో డ్రైవర్లు వేగాన్ని తగ్గించి బస్సులను అదుపు చేయలేకపోతున్నట్టు రవాణా రంగానికి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతి బస్సులో తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు విధులు నిర్వర్తించాల్సి ఉండగా, కొన్నింటిలో కేవలం ఒక్కరే బస్సు నడుపుతున్నారు. దీంతో డ్రైవర్లపైన పనిభారం పెరిగి తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. బస్సు ప్రమాదాలకు అతివేగమే కారణమని అధికారులు పేర్కొంటున్నారు. కొనసాగుతున్న దాడులు కర్నూలు బస్సు దుర్ఘటన నేపథ్యంలో ప్రైవేట్ బస్సులపై రవాణాశాఖ దాడులను ఉధృతం చేసింది. రెండోరోజు ఆదివారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరిగే ప్రైవేట్ బస్సులపై 21 కేసులను నమోదు చేశారు. వివిధ రకాల ఉల్లంఘనలపైన రూ.69,000లకు పైగా జరిమానా విధించారు. ప్రైవేట్ బస్సుల అక్రమ రవాణాను అరికట్టేందుకు హైదరాబాద్, రంగారెడ్డి. మేడ్చల్ జిల్లాల పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ జేటీసీ సి.రమేశ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాలతోపాటు బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు ప్రతిరోజు సుమారు 1,000 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి.వివిధ రాష్ట్రాల్లో నేషనల్ పర్మిట్లులు తీసుకొని తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణికుల కోసం నడుపుతున్న బస్సుల్లో చాలావరకు అక్రమ రవాణా కొనసాగిస్తున్నాయి. టూరిస్టులు, యాత్రికులు, తదితర కేటగిరీకి చెందిన ప్రయాణికుల కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం వరకు నాన్‌స్టాప్‌గా తిరగాల్సిన వాటిలో, చాలావరకు ఆర్టీసీ తరహాలో స్టేజీ క్యారేజీలుగా నడుస్తున్నాయి. ప్రయాణికుల భద్రతకు ప్రమాదకరమైన అపరిమితమైన ఎలక్ట్రిక్ పరికరాల వినియోగం, హై ఓల్టేజీ విద్యుత్ వినియోగం అగ్ని ప్రమాదాలకు దారితీస్తుంది. రవాణా అధికారులు రెండురోజులుగా నిర్వహిస్తున్న తనిఖీల్లో ప్రయాణికుల భద్రతపైన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి దాడులను కొనసాగిస్తున్నట్టు జేటీసీ తెలిపారు. -
ఆ రెండు చోట్లా ఉప ఎన్నికలు ఖాయం
సాక్షి, హైదరాబాద్/శ్రీనగర్‌కాలనీ: బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలపై రాబోయే రోజుల్లో అనర్హత వేటు పడటం ఖాయమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు తప్పవని, అలాగే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై కేటీఆర్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికలో పార్టీ గెలుపు ఖాయమని అన్నారు.భారీ మెజారిటీకోసం కష్టపడాలని నేతలకు సూచించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నాయకులందరూ కలసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్కు ఉన్న బలాన్ని ఈ ఉప ఎన్నికలో చాటాల్సిన అవసరం ఉందన్నారు. ‘బీఆర్ఎస్ నాయకులు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు హైదరాబాద్ సమస్యలపై అవగాహన ఉంది.హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అమలు చేసిన పథకాలను ప్రజలకు మరోసారి గుర్తు చేయాలి’అని కేటీఆర్ సూచించారు. ప్రచారంలో కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు గుర్తు చేయడంతో పాటు నగరంలో రోజురోజుకూ దిగజారుతున్న పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మురికినీటి కాలువల నిర్వహణ వంటి సమస్యలను ఎత్తి చూపాలన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని పక్కన పెట్టి, కాంగ్రెస్ కేవలం రాజకీయాలకే పాల్పడుతోందన్నారు. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్రజూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని, ఈ నియో జకవర్గంలో తిరిగి గులాబీ జెండాను ఎగురవేస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణభవన్‌లో షేక్‌పేట డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు తోట మహేశ్‌తో పాటు పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు. వారికి కేటీఆర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. -
Bihar Elections: ‘20 నెలల్లో నం. వన్’: తేజస్వి యాదవ్
పట్నా: నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింతగా రాజుకుంటోంది. అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)ప్రతిపక్ష మహాఘట్ బంధన్.. రెండూ కూడా పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. అదే సమయంలో ప్రజలకు హామీలను కూడా గుప్పిస్తున్నాయి. తాజాగా పట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే కేవలం 20 నెలల్లో బీహార్‌ను నంబర్ వన్ చేస్తామని పేర్కొన్నారు.మహా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘మా ప్రచారం ప్రారంభమైంది. బీహార్ మార్పు కోసం ఆసక్తిగా వేచి చూస్తోంది. మేము ఎక్కడికి వెళ్లినా, అన్ని కులాలు, మతాల ప్రజలు మాకు మద్దతు పలికేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు. దానిని మార్చాలనుకుంటున్నారు. ఈ ప్రభుత్వంలో అవినీతి, నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. బీహార్ ప్రజల నుండి మేము 20 నెలలు కోరుకుంటున్నాం. ఈ కాలంలో బీహార్‌ను నంబర్ వన్‌గా మార్చడానికి మేము కృషి చేస్తాం’ అని అన్నారు.ఈ సమావేశంలో తేజస్వి యాదవ్ పలు ప్రధాన ప్రకటనలు కూడా చేశారు. మూడు అంచెలుగా పంచాయతీ ప్రతినిధులు, గ్రామ ప్రతినిధుల గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తామని హామీనిచ్చారు. వారికి పెన్షన్లు అందించాలని కూడా నిర్ణయించామన్నారు. వారికి రూ. 50 లక్షల బీమా అందజేయనున్నామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పంపిణీదారుల గౌరవ వేతనాన్ని నిర్ధారించడానికి కృషి చేస్తామని, క్వింటాలుకు మార్జిన్ మనీ పెంచుతామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఉన్నవారికి కారుణ్య ఉపాధికి వర్తించే వయోపరిమితి కూడా పెంచుతామన్నారు. కుమ్మరి, కమ్మరి వడ్రంగి తదితర స్వయం ఉపాధి పనుల కోసం ఐదేళ్ల వ్యవధితో వడ్డీ లేని విధంగా రూ. 5 లక్షల రుణం అందిస్తామని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న నిర్వహించనున్నారు. ఇది కూడా చదవండి: అమ్మని విడిచి ఉండలేక.. 15వ అంతస్తు నుంచి దూకి.. -
నారా రోహిత్-శిరీష పెళ్లి సందడి: హల్దీ వీడియో చూశారా?
తెలుగు హీరో నారా రోహిత్ (Nara Rohit) పెండ్లిపనులు షురూ అయ్యాయి. పెళ్లికూతురు శిరీష (Siree Lella) ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం ఇటీవలే జరిగింది. తాజాగా రోహిత్- శిరీషలు జంటగా హల్దీ ఫంక్షన్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫామ్‌హౌస్‌లో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. ఆటలు, పాటలతో ఈ సెలబ్రేషన్స్ రెట్టింపు ఉత్సాహంతో సాగాయి. రోహిత్- శిరీష అక్టోబర్ 30న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు.అలా మొదలైందినారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి 2 సినిమాలో శిరీష హీరోయిన్గా నటించింది. రోహిత్ ప్రియురాలిగా మెప్పించింది. సినిమాలోనే కాకుండా నిజ జీవితంలోనూ అతడితో ప్రేమలో పడింది. అదే విషయాన్ని ఇంట్లో చెప్పగా.. ఇరు కుటుంబాలు పెళ్లికి పచ్చజెండా ఊపాయి. ఈ క్రమంలోనే గతేడాది అక్టోబర్‌లో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఏడాది తర్వాత ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు.సినీ జర్నీనారా రోహిత్ విషయానికి వస్తే.. బాణం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సోలో సినిమాతో విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక్కడినే, ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అసుర, జ్యో అచ్యుతానంద, శమంతకమణి.. ఇలా పలు సినిమాలు చేసుకుంటూ పోయాడు. 2018లో వచ్చిన వీర భోగ వసంత రాయలు సినిమా తర్వాత దాదాపు ఆరేళ్లు బ్రేక్ తీసుకుని ప్రతినిధి 2తో రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. ఈ ఏడాది భైరవం, సుందరకాండ సినిమాలతో అలరించాడు. Glimpses from the vibrant #Haldi ceremony of #NaraRohith & #SireeLella 💛A celebration filled with joy, love, and laughter!@IamRohithNara pic.twitter.com/Dm9Hxh62WG— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) October 26, 2025చదవండి: అల్లు అరవింద్ తిట్టినన్ని తిట్లు మా నాన్న కూడా తిట్టలేదు! -
చేపా చేపా ఇక్కడున్నావా!
సాక్షి, విశాఖపట్నం: సముద్ర గర్భంలో చేపలు దాగుడుమూతలాడినా చేపా... చేపా... ఇక్కడున్నావా? అని ఇట్టే పసిగట్టే అత్యాధునిక సాంకేతికతను భారతీయ మత్స్య పరిశోధన సంస్థ (ఎఫ్ఎస్ఐ) అభివృద్ధి చేస్తోంది. లాంగ్ లైన్ నౌకల కోసం చేపల వేట, మత్స్య సంపద గుర్తించేందుకు ఆన్‌బోర్డ్ ఎల్రక్టానిక్ అబ్జర్వర్ (ఈ–అబ్జర్వర్) వ్యవస్థ సిద్ధమవుతోంది. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా చేపల పట్టుపై కచ్చితమైన, శాస్త్రీయ ఆధారిత డేటా సేకరించేలా ఈ విధానం రూపొందిస్తున్నారు. సముద్రంలో ఎక్కడ ఎంత మత్స్య సంపద ఉంది? ఏఏ జాతులు ఎక్కడ ఉన్నాయో దీని ద్వారా వివరాలు సేకరించవచ్చు.సముద్రంలో చేపల వేటను క్షుణ్నంగా పర్యవేక్షించడం, రికార్డ్ చేయడానికి ఈ అబ్జర్వర్‌ను ప్రవేశపెట్టే పనిలో ఎఫ్ఎస్ఐ నిమగ్నమైంది. తొలి విడతలో లాంగ్‌లైన్ ఫిషింగ్ షిప్‌లలో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. తర్వాత ఇతర అన్ని రకాల చేపల వేటకు వెళ్లే ఓడలపై ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేంద్ర మత్స్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ అధునాతన సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. సముద్రంలో చేపల అంచనా, మత్స్య సంపద నిర్వహణను పర్యవేక్షించేలా కచ్చి తమైన శాస్త్రీయ డేటాను ఈ–అబ్జర్వర్ ద్వారా రూపొందించనున్నారు. దీని తయారీలో హిందూ మహా సముద్ర ట్యూనా కమిషన్ (ఐవోటీసీ) సహకారం అందిస్తోంది. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా చేపల వేట, మత్స్య సంపద వృద్ధి ఉంచేందుకు ఈ–అబ్జర్వర్ దోహదపడుతుంది. స్థిరమైన ఫిషింగ్ పద్ధతులకు మరింత సానబెట్టి దేశ సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతి పోటీలో భారత్‌ను మరింత ముందుకు నడిపించే వ్యవస్థగా మారనుంది.ఈ అబ్జర్వర్ వ్యవస్థ ముఖ్యాంశాలు» ఎలక్ట్రానిక్ పర్యవేక్షణ వ్యవస్థ లాంగ్‌లైన్ ఫిషింగ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది.సముద్రంలో చేపల వేట, ఫిషింగ్ కార్యకలాపాలపై కచ్చితమైన, శాస్త్రీయంగా ధ్రువీకరించిన డేటాను సేకరిస్తుంది.» దక్షిణాది రాష్ట్రాల నుంచి వివిధ దేశాలకు రికార్డు స్థాయిలో ఎగుమతి అవుతున్న ట్యూనా చేపల వేటను మరింత మెరుగుపరిచి మత్స్యకారులకు లాభాలు వచ్చేలా చేస్తుంది. స్టాక్ అసెస్మెంట్లను మెరుగుపరచడం, సుస్థిర మత్స్య సంపద నిర్వహణకు మద్దతు ఇచ్చేందుకు డేటా ఉపయోగపడుతుంది. » ఈృఅబ్జర్వర్ ఇచ్చే డేటా అంతర్జాతీయ మార్కెట్లలో భారత దేశ స్థానాన్ని మరింత బలోపేతం చేయడమే కాక వాణిజ్య విస్తరణకు దోహదపడుతుంది.» దేశవ్యాప్తంగా ఇప్పటికే 36 వేల ఫిషింగ్ బోట్లపై ట్రాన్స్‌పాండర్స్‌ను ఎఫ్ఎస్ఐ అమర్చింది. వీటి ఆధారంగా ఈృఅబ్జర్వర్ ఫ్రేమ్ వర్క్‌ను అభివృద్ధి చేస్తున్నారు.» త్వరలోనే కొచ్చిలో ప్రారంభించి.. తర్వాత విశాఖపట్నం, చెన్నై హార్బర్లలో ప్రవేశపెట్టనున్నారు.
