breaking news
-
గంజాయి ముఠా గుట్టురట్టు
● రూ. 10.2 లక్షల విలువైన 34 కేజీల గంజాయి స్వాధీనం ● 14 మంది నిందితుల అరెస్టు ● వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ దీరజ్ కునుబిల్లిరాయచోటి : మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠా గుట్టును అన్నమయ్య జిల్లా పోలీసులు రట్టు చేశారు. జిల్లాలో గుట్టుగా సాగుతున్న గంజాయి వ్యాపారంపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి సూత్రధారులు, విక్రయదారులను అరెస్టు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సోమవారం మీడియాకు వివరించారు. కలకడ పోలీసుల ఆధ్వర్యంలో సాగిన ఈ ఆపరేషన్ ద్వారా రూ. 10.2 లక్షలు విలువైన 34 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు షేక్ బాషాతో కలిపి 14 మంది ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, కలకడ సీఐ బి. లక్ష్మన్న పర్యవేక్షణలో కలకడ ఎస్ఐ బి.రామాంజనేయులు పక్కా సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించారన్నారు. సోమవారం ఉదయం కలకడ మండలం, బంగారువాండ్లపల్లి, నడిమిచెర్ల, కొత్తపల్లి రోడ్డులోని రాతి దిబ్బ సమీపంలో పోలీసులు దాడి చేశారన్నారు. ఇదే సమయంలో గంజాయితో సిద్ధంగా ఉన్న నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారన్నారు. వారిని పోలీసులు చుట్టుముట్టి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో పట్టుబడిన 13 మంది పురుషులు, ఒక మహిళ నిందితురాలితోపాటు 14 మందిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. సొత్తు కేసు వివరాలు.. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.10.2 లక్షలు విలువచేసే 34 కిలోల గంజాయిని రవాణాకు ఉపయోగించిన ఒక ఆటో, మూడు మోటార్ సైకిళ్లు, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు షేక్‌బాషా ఒడిశా నుంచి గంజాయిని కొనుగోలు చేసి స్థానికంగా ఉన్న చిన్నచిన్న విక్రయదారుల ద్వారా జిల్లాలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. అరెస్టు అయిన 14 మందిపైన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం వాయల్పాడు కోర్టుకు పంపుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలో అరెస్టు చేస్తామని వివరించారు. కఠిన చర్యలు తప్పవు.. జిల్లాలో గంజాయి విక్రయాలను, వినియోగాన్ని సహించేది లేదని ఎస్పీ గట్టిగా హెచ్చరించారు. గంజాయి సేవించే యువత వెంటనే వ్యసనాన్ని వదిలిపెట్టి చదువుపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో మాదక ద్రవ్యాల విక్రయాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. గంజాయి ముఠా అరెస్టు ఆపరేషన్ విజయవంతం చేసిన రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, కలకడ సీఐ బి.లక్ష్మన్న, ఎస్ఐ బి.రామాంజనేయులు, పీఎస్ఐ కుమారి హారిక, పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. మదనపల్లె రూరల్ : మదనపల్లె కేంద్రంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. సోమవారం స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. మదనపల్లె మండలం, వలసపల్లె మొలకలదిన్నెకి చెందిన గుర్రాల వాసు అలియాస్ ఎరుకుల శ్రీనివాసులు (35), కురబలకోట మండలం, తెట్టు ఆరోగ్యపురానికి చెందిన రత్నవేలు కుమారుడు గెంటిమ్ ఆనంద్ కుమార్(27) లు గంజాయి రవాణాదారులైన మదనపల్లె పట్టణానికి చెందిన సయ్యద్ ఖాసీంసాబ్ కుమారుడు జాఫర్ అలీ, గంగిశెట్టి చలపతి కుమారుడు శివకుమార్‌ల దగ్గర నుంచి గంజాయి కొనుగోలు చేసి, చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారు చేసి, మదనపల్లె, అంగళ్లు తదితర ప్రాంతాల్లో రహస్యంగా యువతకు, విద్యార్థులకు విక్రయించేవారన్నారు. ఈ క్రమంలో 26వ తేదీ ఆదివారం తట్టివారిపల్లె వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా శ్రీనివాసులు, ఆనంద్ కుమార్ అనుమానాస్పదంగా పట్టుబడ్డారన్నారు. వారిని విచారించి నిందితుల వద్ద నుంచి, రూ. 20వేల విలువ చేసే రెండు కిలోల గంజాయి, రవాణాకు ఉపయోగిస్తున్న ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఏ 1 నిందితుడు శ్రీనివాసులుపై ఇదివరకే మదనపల్లె తాలూకా, టూ టౌన్, స్టేషన్లతో పాటు శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ పోలీస్ స్టేషన్లో గంజాయి కేసులు నమోదై ఉన్నాయన్నారు. నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరు పరిచామన్నారు. ఇదే కేసులో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న జాఫర్ అలీ, గంగిశెట్టి శివకుమార్ పరారీలో ఉన్నారని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. ఇందులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించామని, నిందితులందరిని అరెస్టు చేస్తామన్నారు. కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన టు టౌన్ సీఐ రాజారెడ్డి, ఎస్ఐ రహీముల్లా, సిబ్బందిని అభినందించారు. -
రూ.16 కోట్ల ఇంజక్షన్ ఇస్తేనే బతికే అవకాశం
వికారాబాదు జిల్లా: సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం సాగించే నిరుపేద తల్లిదండ్రులకు కొండంత ఆపద వచ్చిపడింది. ఒక్కగానొక్క కొడుకు అరుదైన వ్యాధి (లక్షల మందిలో ఏ ఒక్కరికో సోకే) బారిన పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. రూ.కోట్ల విలువ చేసే ఇంజక్షన్ ఇస్తే కానీ చిన్నారి బతికే అవకాశం లేదని చెప్పడంతో గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. వివరాలు ఇలా.. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం, బొంరాస్‌పేట్ మండలం వడిచర్ల పరిధిలోని ఊరెనికి తండాకు చెందిన ముడావత్ శ్రీను, గోరీబాయి దంపతులకు ముడావత్ జగన్ అనే ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. బతుకుదెరువు నిమిత్తం మూడేళ్ల క్రితం తాండూరుకు వచి్చన వీరు సాయిపూర్లో నివసిస్తున్నారు. రెండేళ్లుగా జగన్ మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. ఎన్ని ఆస్పత్రులు తిప్పినా సరైన చికిత్స అందలేదు. దీంతో అప్పు చేసి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రెయిన్బో ఆస్పత్రికి తీసుకెళ్లగా బాలుడిని పరీక్షించిన వైద్యులు.. బాబుకు అరుదైన, ప్రాణాంతక స్పైనల్ మసు్కలర్ ఆట్రోపీ (ఎస్ఎంఏ) అనే వ్యాధి సోకిందని చెప్పారు. ఇలాంటి వ్యాధి రాష్ట్రంలో ఎవరికీ లేదని, ఇది కొత్త వైరస్ వల్ల సోకిందని తెలిపారు. ఈ వ్యాధి నయం కావాలంటే జోల్జెన్స్మా అనే ఇంజక్షన్ ఇవ్వాలన్నారు. దీన్ని అమెరికా నుంచి తెప్పించాలని, ఇందుకు రూ.16 కోట్లు ఖర్చవుతుందని చెప్పడంతో బాధిత తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. ప్రతీ 12 గంటలకు ఒకసారి సిరప్ వేస్తేనే మామూలు స్థితికి వస్తున్నాడని, కొంచెం ఆలస్యమైనా ఫిట్స్ వస్తోందని కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ ఎమ్మెల్యే, సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి తమ కొడుకును బతికించాలని వేడుకుంటున్నారు. దాతలు సైతం ఆరి్ధక సాయం (ఫోన్ పే, గూగుల్ పే నంబర్ 8639157327), (ఎస్బీఐ అకౌంట్ నంబర్ 43194942778) చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. -
కిడ్నీ మార్పిడి సురక్షితమేనా? అందువల్లే నటుడు సతీష్ షా కూడా..
ప్రముఖ బాలీవుడ్ నటుడు, టీవీ కళాకారుడు సతీశ్ షా అనారోగ్యంతో చనిపోయిన సంగతి తెలిసిందే. 76 ఏళ్ల సతీశ్ అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న భార్యను చూసుకునేందుకు ఇటీవలే కిడ్నీ మార్పిడి సర్జరీ చేయించుకున్నారని ఆయన సన్నిహితుడొకరు మీడియాకి వెల్లడించారు. అంతేగాదు ఆయన చాలా రోజుల నుంచి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారని, డయాలసిస్ చేయించుకునేవారని, భార్య బాగోగులు నిమిత్తం మూడు నెలల క్రితం ఈ కిడ్నీ మార్పిడి సర్జరీ చేయించుకున్నట్లు తెలిపారు. ఆయన అనుకున్నట్లుగా ఆయన ఆరోగ్యం మెరగవ్వకపోక..త్వరితగతిన కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సపై పలు అనుమానాలు రేకెత్తించింది. అసలు మూత్రపిండాల వైఫల్యంతో బాధపడేవారికి ఈసర్జరీ? వరమా? లేక శాపమా అనే ఆందోళన కలిగించి. నిజానికి ఈ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ సురక్షితమైనదైనా..? దానికంటే డయాలసిస్ మంచిదా అంటే..నెఫ్రాలజిస్ట్‌లు ఏమంటున్నారంటే..డయాలసిస్ అనేది మూత్రపిండాలు పనిచేయలేనప్పుడూ..రక్తం నుంచి వ్యర్థాలను, అదనపు ద్రవాన్ని తొలగించే పనిని చేపడతాయట. ఈ డయాలసిస్ అనేది రెండు రకాలుగా ఉంటుందని వివరించారు. ఒకటి హిమోడయాలసిస్ ఈ పద్ధతిలో శరీరం వెలుప యంత్రం ఉంచి..రక్తం శుద్ధి చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఉదర లైనింగ్ ఫిల్టర్‌గా ద్రవ మార్పిడి మానవీయంగా లేదా యంత్ర ఆధారితంగా జరుగుతుందట. నిజానికి మూత్రపిండాల వైఫల్యంతో బాధపడే వారికి ఈ కిడ్నీ మార్పిడి చికిత్స వరమే. వారికి ఈ శస్త్ర చికిత్స మెరుగైన ఫలితాలను అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు. కిడ్నీ మార్పిడి వల్ల కలిగే లాభాలు..మెరుగైన జీవన నాణ్యత: తరుచుగా డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి నుంచి విముక్తిట్రాన్స్ప్టాంట్ చేయించుకున్న పేషెంట్లు డయాలసిస్ చేయించుకునే రోగులకంటే ఎక్కువ కాలం జీవిస్తారట.డయాలసిస్‌తో పోలిస్తే..తక్కువ ఆహార పరిమితులు ఉంటాయిమునపటి మీదు ఎక్కువ ఎనర్జిటిక్, తక్కువ సమస్యలు ఎదుర్కొంటారటనష్టాలు..అందరూ ఈ సర్జరీకీ అర్హులు కారట. ఎందుకంటే..కిడ్నీని తీసుకునే వ్యక్తి ఆరోగ్యం, ఇచ్చే దాత ఆరోగ్య అనుకూలత అత్యంత ప్రధానమట. అలాగే కిడ్నీ మార్పిడి సర్జరీ చేయించుకున్నాక..జీవితాంతం రోగనిరోధక శక్తిని తగ్గించే మందులు వాడాల్సిందేనట.కొందరిలో ఇన్ఫెక్షన్, రక్తస్రావం, కొత్త కిడ్నీని తిరస్కరించే అవకాశం వంటివి ఎక్కువగా ఉంటాయట. ఫలితంగా వారికి ఈ సర్జరీ ప్రాణాంతకంగా మారుతుందట. రెండిటిలో ఏది మంచిదంటే..డయాలసిస్‌లో పెద్ద శస్త్ర చికిత్స అంటూ ఏం ఉండదు. స్వల్పకాలంలో సురక్షితమైనది అంతే. అర్హత కలిగిన రోగులకు మూత్రపిండ మార్పిడి చికిత్స అనేది సరైన ఎంపిక, పైగా వారి జీవన నాణ్యత, దీర్ఘకాలిక మనుగడను ప్రసాదిస్తుంది. ఇలా ట్రాన్స్‌ప్లాంట్ సరిపడని రోగులకు డయాలసిస్ ప్రభావవంతమైన ప్రత్యామ్నాయమని వైద్యలు చెబుతున్నారు. దీంతో పాటు ప్రధానమైన అంశం, దాత లభ్యత, ఆరోగ్య అనుకూలత అనేవాటిని బట్టి ఏది బెస్ట్ అనేది ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. సకాలంలో నెఫ్రాలజిస్ట్‌లను సంప్రదించి తగిన సలహాలు సూచనలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. (చదవండి: రూ 20 సమోసాతో రూ. 3 లక్షల యాంజియోప్లాస్టీ: వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్) -
‘స్టెమ్’లో జెమ్ అయ్యేలా...
చాలామంది పిల్లలు ‘అనగనగా ఒక రాజు’ లాంటి కథలు చెబితే ఆసక్తిగా వింటారు. సైన్స్, మ్యాథ్స్ విషయాలు చెప్పబోతే మాత్రం ముఖం అటువైపు తిప్పుకుంటారు.అలాంటి వారి కోసం ‘స్టెమ్ మాన్స్టర్’ను ప్రారంభించింది డా. సోనాలి దాస్ గుప్తా. కథలు ఎలాగైతే ఆసక్తిగా వింటారో అంతే ఆసక్తితో సైన్స్ పాఠాలు వినేలా ‘స్టెమ్ మాన్స్టర్’ను డిజైన్ చేసింది సోనాలి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దిల్లీలో భౌతిక శాస్త్రంలో పీహెచ్డీ చేసిన సోనాలి స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం)కు సంబంధించిన సంక్లిష్టమైన అంశాలు పిల్లలకు సులభంగా అర్థం చేయించడానికి ‘స్టెమ్ మాన్స్టర్’ మొదలుపెట్టింది. సైన్స్ సిద్ధాంతాలను వివరించడానికి ఎన్నో పరికరాలు, బొమ్మలు తయారు చేసింది. జటిలమైన సైన్స్ విషయాలను అర్థం చేసుకోవడంలో ఇవి విద్యార్థులకు బాగా ఉపయోగపడుతున్నాయి.‘మన పాఠశాలలు సైన్స్‌కు సంబంధించి నిర్వచనాలకే పరిమితం అవుతున్నాయి. నేను ప్రపంచంలోని కొన్ని అత్యున్నత ప్రయోగశాలలలో పనిచేశాను. సైన్స్‌కు సంబంధించి జటిలమైన విషయాలను పిల్లలకు సులభంగా ఎలా వివరిస్తారో చూశాను. మన పాఠ్యాంశాలు అత్యున్నతమైనవిగా నేను భావిస్తున్నాను. కాని వాటిని మనం పిల్లలకు పరిచయం చేసే విధానంలో సమగ్ర మార్పు అవసరం. ఆ మార్పు కోసమే...స్టెమ్ మాన్స్టర్’ అంటుంది సోనాలిదాస్ గుప్తా. ‘స్టెమ్మాన్స్టర్’ కోర్సులను జూమ్, ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. -
పొలాల్లోకి దూసుకెళ్లిన ప్రైవేటు బస్సు
మార్కాపురం: ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లిన సంఘటన ఆదివారం రాత్రి ప్రకాశం జిల్లా మార్కాపురం–కుంట మధ్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కొట్టాలపల్లి గ్రామ మూల మలుపు తిరగగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పొలాల్లోకి వెళ్లిపోయింది.ఆ సమయంలో బస్సులో ఉన్న ఎనిమిది మంది ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే, డ్రైవర్ వెంటనే బ్రేక్ వేయడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. సంఘటనాస్థలాన్ని మార్కాపురం రూరల్ ఎస్ఐ అంకమ్మరావు తన సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. -
తుఫాన్ పునరావాస కేంద్రం పరిశీలన
పోలాకి: తుఫాన్ నేపథ్యంలో క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నతాధికారులతో కో ఆర్డినేట్ చేసుకుని అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక అధికారి కేవీఎస్ చక్రధరబాబు సూచించారు. సోమవారం పోలాకి మండలంలోని డీఎల్‌పురం తుఫాన్ షెల్టర్‌ను పరిశీలించారు. ముఖ్యంగా తీరప్రాంత గ్రామాలు, లోతట్టు గ్రామాల్లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు పరిశీలించాలని చెప్పారు. అత్యవసర పరిస్థితిలో సేవలందించేలా అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నా రు. మండలంలో నాలుగుచోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ శ్రీనివాసరావు వివరించారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్తోపాటు వివిధ శాఖల అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది ఉన్నారు. -
క్రెడిట్ చోరీ... డెబిట్ బదిలీ!
నిజాలపై నివురు కప్పడం, అసత్యాలకు అలంకారం చేయడం ఇప్పుడొక రాజకీయ క్రీడ. ఇందులో చంద్రబాబు, ఆయన బృందం ఆరితేరిన ఆటగాళ్లని ప్రశస్తి. ఈ ఖ్యాతిలో సింహభాగం యెల్లో మీడియాకు దక్కుతుంది. ఈ మీడియా గత మూడు దశాబ్దాలుగా ఊదరగొట్టిన ఫలితంగా, తెలుగునాట ప్రత్యామ్నాయ మీడియా నిలబడకుండా చేసిన కుట్రల కారణంగా నిజంగానే చంద్రబాబును ఒక ఐటీ నిపుణుడిగా, దూరదృష్టి గల విజనరీగా నమ్మేవారి సంఖ్య గణనీయంగానే ఉన్నది. సాంఘిక శాస్త్రాల అధ్యయనానికి దూరమై ప్రాపగాండా ప్రవాహంలో కొట్టుకుపోయే నవతరంలో కూడా ఇటువంటి అభిప్రాయాలున్నాయి.ఈ వ్యవహారంలో అసలు వాస్తవాలేమిటో తెలిసిన వారు లేకపోలేదు. అప్పుడూ ఉన్నారు. ఇప్పుడూ ఉన్నారు. కానీ నిజం నిద్ర లేచే సరికే అబద్ధం ఊరేగివస్తుందంటారు కదా! అదే జరుగుతున్నది. చంద్రబాబుకు విజనరీ వేషం వేయడానికి యెల్లో మీడియా పౌండ్రక వాసుదేవ పాత్రను కాపీకొట్టినట్టుంది. వసుదేవుని కుమారుడు గనుక శ్రీకృష్ణ పరమాత్మను వాసుదేవుడంటారు. ఆ వసుదేవునికి ఇంకో కొడుకుండేవాడట! ఆయనకు కొందరు ‘వాలతుల్యుల’తో కూడిన ఒక కోటరీ ఉండే దట! అసలైన వాసుదేవుడివి నువ్వేనంటూ ఈ కోటరీ ఉబ్బేయ డంతో ఆయన కూడా నెమలి పింఛం ధరించడం, పిల్లనగ్రోవి పట్టుకోవడం సహా కృష్ణ వేషధారణ వేయడం మొదలు పెట్టాడట! అంతటితో ఆగలేదు – తన వేషాన్ని వేసుకోవద్దని శ్రీకృష్ణుడినే బెదిరించేదాకా వెళ్లాడు.ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మొన్నటి మీడియా సమావేశంలో ఇటువంటి పౌండ్రక వాసు దేవ ఇమేజ్‌నే చీల్చి చెండాడారు. నేటి తరం రాజకీయ నేతల్లో అత్యంత జనాకర్షణ కలిగిన నాయకుడు జగన్మోహన్రెడ్డి. ఆయన ప్రెస్మీట్లను గానీ, ఇతర కార్యక్రమాలను గానీ ఒక్క ‘సాక్షి’ యూ–ట్యూబ్ ప్లాట్‌ఫామ్ వీడియోల్లోనే 50 లక్షల మందికి పైగా వీక్షిస్తారు. ‘సాక్షి’ టీవీ, దాని డిజిటల్ ప్లాట్ ఫామ్లతోపాటు ఇతర దృశ్య మాధ్యమాలతో కలిపితే ఈ సంఖ్య ఒక్కరోజులోనే కోట్లలో ఉంటున్నది. దీనికి పత్రికా పాఠకులు, డిజిటల్ ఎడిషన్లలో చదివే వారి సంఖ్య తోడవుతుంది. ఆయన మెసేజ్‌లు ఈ స్థాయి విస్తృతికి చేరడమే కాదు, వాటికి విశ్వస నీయత కూడా ఎక్కువ. జగన్మోహన్రెడ్డి ప్రసంగాల్లో ఊకదంపుడు తక్కువ. సూటిగా తాను చెప్పదల్చుకున్న పాయింట్‌ను ప్రస్తావించడం, అందుకు సాక్ష్యంగా సాధికారికమైన లెక్కల్ని ఉటంకించడం, డాక్యుమెంట్లను ప్రదర్శించడం ఆయన అనుస రించే పద్ధతి. ఈ వైఖరి కారణంగా కూటమి సర్కార్ బండారాన్ని ఏడాదికాలంలోనే బట్టబయలు చేయగలిగారు.గురువారం జరిగిన మీడియా సమావేశంలో నాలుగు అంశాలపై జగన్ మాట్లాడారు. ముఖ్యంగా సర్కార్ ఆడుతున్న కల్తీ లిక్కర్ నాటకంపైనా, డేటా సెంటర్‌కు సంబంధించి చేస్తున్న క్రెడిట్ చౌర్యంపైనా సుదీర్ఘంగా మాట్లాడారు. ‘క్రెడిట్ చోరీ’ అనే మాటను కాయిన్ చేస్తూ, సైబర్ టవర్స్, ఔటర్ రింగ్‌రోడ్డు, ఎయిర్‌పోర్టు దాకా హైదరాబాద్ నిర్మాతగా బాబు తగిలించుకున్న నకిలీ మెడల్స్‌ను పీకిపారేశారు. ఆరెకరాల స్థలంలో లక్షా నలభైవేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టిన ‘సైబర్ టవర్స్’కు ‘హైటెక్ సిటీ’ అని నామకరణం చేసి ప్రచారం చేసుకున్న వైనాన్ని ఆయన ఎండగట్టారు. ఆ భవనానికి కూడా అంతకుముందే కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేసిన విషయాన్ని కూడా గుర్తుచేశారు. వైఎస్సార్ హయాంలో ప్రారంభించి, భూసేకరణతోపాటు తొలి దశ నిర్మాణం కూడా పూర్తిచేసుకున్న ఔటర్ రింగ్ రోడ్డు, ఆయన హయాంలోనే ప్రారంభమై పూర్తిచేసుకొని వినియోగంలోకి వచ్చిన ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, 12 కిలోమీటర్ల ‘పీవీ ఎక్స్ ప్రెస్ వే’లు హైదరాబాద్ నగరాభివృద్ధికి వన్నెలద్దిన విషయాన్ని జగన్ గుర్తుచేశారు.ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గద్దెదిగే నాటికి రాష్ట్ర ఐటీ ఎగుమతుల విలువ రూ.5,660 కోట్లు మాత్రమే. దేశంలో నాలుగో స్థానం. వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల లోనే రాష్ట్రం రెండో స్థానానికి ఎగబాకింది. ఎగుమతుల విలువ రూ.32,500 కోట్లకు చేరింది. కేసీఆర్ పదేళ్ళ పాలన తర్వాత ఆ ఎగుమతులు రెండు లక్షల కోట్లకు చేరుకున్నాయి. తాను న్యూయార్క్‌లో ఉన్నానా, హైదరాబాద్‌లో ఉన్నానా అని హీరో రజనీకాంత్‌కు ఆశ్చర్యం కలిగించిన దృశ్యాలన్నీ కేసీఆర్ కాలంలోనే ఆవిష్కృతమయ్యాయి. ఇలాంటి వాస్తవాలతో పొంతన లేకుండా వందిమాగధ మీడియా బృందంచే బాబు వేయించు కున్న వీరతాళ్ల బాగోతాన్ని జగన్ విప్పిచెప్పారు. అన్నిటికంటే ముఖ్యం – తాజా డోల్బాజా విశాఖ డేటా సెంటర్.ఈ డేటా సెంటర్ మీద టీడీపీ యెల్లో మీడియా సృష్టించిన సంరంభాన్ని, జగన్ మీడియా సమావేశానికి ముందూ, వెనకగా విభజించాలి. గురువారానికి ముందు ఆ సందడే వేరు! సాక్షాత్తూ గూగుల్ సంస్థే ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ చంద్రబాబు అడ్రస్ వెతుక్కుంటూ వచ్చి దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి సిద్ధమైందని ప్రచారం చేశారు. జరిగిన నేపథ్యాన్ని, అంతకుముందే పడిన పునాదిని మరుగునపెట్టారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒకటే హోరు. చంద్రబాబంటే డేటా సెంటర్లు, అమరా వతి నిర్మాణాలు – జగనంటే మటన్ షాపులు, చికెన్ సెంటర్లని ప్రచారం చేశారు. జగనంటే పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, పిల్లలందరికీ నాణ్యమైన ఉచిత విద్య, అందరికీ ఆరోగ్యశ్రీ, ఇంటింటికీ ఫ్యామిలీ డాక్టర్, 30 లక్షలమంది ఇళ్లు – ఇళ్ల స్థలాలు, అధికార వికేంద్రీకరణ, రైతు భరోసా కేంద్రాలు అనే విషయాన్ని జనం మరిచిపోయి ఉంటారని వారి నమ్మకం కావచ్చు. గురువారం నాటి జగన్ సమావేశం తర్వాత టీడీపీ నేతలు, యెల్లో మీడియాల సందడి తేలు కుట్టిన దొంగల చందంగా మారింది.ప్రతిపక్ష నేత వెల్లడించిన వివరాల ప్రకారం 2020 నవంబర్లోనే విశాఖలో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం కుదిరింది. డేటా సెంటర్‌కు డేటా తీసుకురావడానికి వీలుగా సింగపూర్ నుంచి 3,900 కిలోమీటర్ల పొడవునా సబ్‌సీ (సముద్ర మార్గం) కేబుల్ వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సింగపూర్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం 2021 మార్చి 9నే లేఖ రాసింది. ఈ లేఖ కాపీని కూడా ఆయన విడుదల చేశారు. ఢిల్లీ సమీపంలోని నోయిడాలో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్ ఇన్ఫోటెక్‌తో అదానీ సంస్థకు ఒప్పందం కుదిరింది. ఈమేరకు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో అప్పుడే ప్రచురితమైన వార్తా కథనం కటింగ్‌ను జగన్ విడుదల చేశారు. అంటే మూడేళ్ళుగా ఈ రంగంలో అదానీ గ్రూప్, గూగుల్ కలిసి పనిచేస్తున్నాయి. 2023 మే నెలలో విశాఖలో డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరిగింది. అంతకుముందటి రెండేళ్ళలో ఎక్కువకాలం కోవిడ్ పరిస్థితులు న్నాయని గమనంలో ఉంచుకోవాలి.ఇప్పుడు కూటమి సర్కార్ ఆర్భాటంగా ప్రకటించుకున్న వెయ్యి మెగావాట్ల గూగుల్ సెంటర్, 2023లో జగన్ శంకు స్థాపన చేసిన 300 మెగావాట్ల అదానీ డేటా సెంటర్ విస్తరణ మాత్రమే! ఈ డేటా సెంటర్‌కు అవసరమైన సబ్ సీ కేబుల్, డేటా ల్యాండింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన పూర్వరంగం జగన్ హయాంలోనే సిద్ధమైంది. కేవలం డేటా సెంటర్ మాత్రమే అయితే ఉద్యోగాల కల్పన పెద్దగా ఉండదు కాబట్టి దానికి అనుబంధంగా ఐటీ పార్క్, స్కిల్ సెంటర్, రిక్రియేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి, పాతిక వేలమందికి ఉపాధి కల్పించాలని జగన్ సర్కార్ షరతు పెట్టింది. ఇప్పుడు ముందుకొచ్చిన విస్తరణలో అటువంటిదేమీ కనిపించలేదు. కేవలం డేటా సెంటర్ మాత్రమే. దాని ఏర్పాటుకు దోహదం చేసిన పూర్వరంగంలోని అదానీ– గూగుల్ గ్రూప్‌తో పాటు అప్పటి జగన్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం పాత్రధారులే! పాత్రధారులందరినీ మరుగునపెట్టి, కేవలం గూగుల్కూ, చంద్రబాబుకూ మధ్య జరిగిన ఒప్పందం ఫలితంగా వచ్చిన కొత్త ప్రాజెక్టుగా కూటమి సర్కార్ ప్రచారం చేసుకున్న తీరును జగన్ ప్రశ్నించారు.‘క్రెడిట్ చోరీ’ అనే పదబంధం కొత్తది కావచ్చు కానీ, ఇతరుల క్రెడిట్‌ను చంద్రబాబు కోసం యెల్లో మీడియా కొట్టేస్తుందనే విషయం చాలాకాలంగా తెలిసిందే. ఈ విధానా నికి ఇంకో పార్శ్వం కూడా ఉన్నది. అదే డెబిట్ బదిలీ. తాము తప్పు చేస్తూ, ఆ తప్పును ప్రత్యర్థుల ఖాతాలో వేయడం! మీడియా సమావేశంలో జగన్ ప్రస్తావించిన నకిలీ లిక్కర్ తయారీ అంశం ఈ కోవలోనిదే. రాష్ట్రవ్యాప్తంగా ఒక పరిశ్రమ మాదిరిగా విరాజిల్లుతున్న నకిలీ మద్యం తయారీ, సరఫరా వ్యవహారాన్ని ఫోటోలతో సహా ఆయన మీడియా ముందు బహిరంగపరిచారు. ముల్కల చెరువు, ఇబ్రహీంపట్నం, పర వాడ, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, రేపల్లె, నెల్లూరుల గురించే ఆయన ప్రస్తావించినప్పటికీ ఇటువంటి కార్ఖానాలు ఇంకా డజన్లకొద్దీ ఉన్నట్టు సమాచారం.నకిలీ మద్యం తయారీ – అమ్మకాలపై కూటమి ప్రభుత్వం ప్రారంభం నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు కనిపి స్తున్నది. ఈ రంగంలో అనుభవం ఉన్న జయచంద్రారెడ్డి అనే వ్యక్తికి పార్టీ తరఫున ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి పోటీకి నిలిపారు. ఈ కార్యక్రమంలో మరో ‘నిపుణుడు’ జనార్దన్‌రావు కూడా పాల్గొన్నట్టు వార్తలు, ఫోటోలు బయటకు వచ్చాయి. జగన్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన మద్యం షాపుల వ్యవస్థ ఈ నకిలీ మద్యం ప్రవాహానికి అనుకూలించదు. అందువల్ల దాన్ని రద్దు చేయాలి. మద్యం అలవాటును నియంత్రించే ఉద్దేశంతో జగన్ ప్రైవేట్ వ్యాపారుల వ్యవస్థను తొలగించారు. బెల్ట్‌షాపులను, పర్మిట్ రూములను పూర్తిగా తొలగించారు. లైసెన్స్డ్ మద్యం షాపులను కూడా కుదించి, ప్రభుత్వ రంగంలోనే నిర్ణీత వేళల్లో మాత్రమే అమ్మకాలు సాగించారు.సామాజిక ప్రయోజనాల రీత్యా, ఆరోగ్యాల రీత్యా కూడా అది మంచి వ్యవస్థ. దాన్ని తొలగించి ప్రైవేట్ వ్యాపారాన్ని ప్రవేశపెట్టాలంటే ఉన్న వ్యవస్థ మంచిది కాదని ప్రచారం చేయాలి. కూటమి సర్కార్ అదే పని చేసింది. వ్యాపారాన్ని ప్రైవేట్ వాళ్లకు అప్పగించి అమ్మకాలను ప్రోత్సహించినట్లయితే, బెల్ట్ షాపులకు ఇబ్బడిముబ్బడిగా అనుమతులిచ్చినట్లయితే, మద్యం తయారు చేసే డిస్టిలరీలకు కొత్తగా అనుమతులిచ్చి నట్లయితే అందులో స్కామ్ ఉండేందుకు అవకాశం ఉంటుంద నేది కామన్సెన్స్. ఇవేమీ లేని వ్యవస్థలో స్కామ్ జరిగిందనేది ఏడాది కాలంగా సర్కార్ చేస్తున్న న్యూసెన్స్. దీనికోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి డైలీ సీరియల్ మాదిరిగా ఈ కేసును నడుపుతున్నారు. జగన్ హయాంలో స్కామ్ జరిగిందని నమ్మించడానికి అనేకమంది ముఖ్యనాయకులను, ప్రముఖ వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. ఎటువంటి ఆధారాలు లేకున్నా సరే, ఒకరిద్దరిని బెదిరించి తీసుకున్న వాఙ్మూలాల ఆధారంగా ఈ కేసు నడుస్తున్నది. ఈ దర్యాప్తు నిర్వా కాన్ని చూసి పలుమార్లు న్యాయస్థానం కూడా అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.అయితే అసలు ఉద్దేశం వేరు. ఈ కేసు పేరుతో రచించే బేతాళ కథలతో మీడియాను ముంచెత్తుతూ, నిశ్శబ్దంగా నకిలీ మద్యం వ్యాపారం – తయారీ రాష్ట్రమంతటా విస్తరించింది. కేవలం మూడువేల పైచిలుకు మద్యంషాపులు, అవి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో అమ్మకాలు జరిగే వ్యవస్థ పాతది. ఇప్పుడు ప్రతి షాపుకూ ఓ బార్ లాంటి భారీ పర్మిట్ రూమ్ నడుస్తూ, అరవైవేల పైచిలుకు బెల్టు షాపుల్లో తాగిస్తున్నప్పుడు గతంతో పోలిస్తే అమ్మకాలు ఎన్ని రెట్లు పెరగాలి? కానీ, ఎక్సైజ్ ఆదా యాన్ని చూస్తే ఏటికేడు సహజంగా పెరగాల్సినంత కూడా పెరగడం లేదు. మరి ఇన్ని పర్మిట్ రూమ్లూ, బెల్ట్ షాపుల ద్వారా వస్తున్న రెండు మూడు రెట్ల ఆదాయం ఎక్కడికి పోతు న్నట్టు? ... నకిలీ మద్యం పాలవుతున్నట్టు లెక్క.ముల్కల చెరువు, ఇబ్రహీంపట్నం కార్ఖానాలు బయట పడకముందే తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఏపీ సరిహద్దున ఉన్న మేళ్ళచెరువులో ఇటువంటి కార్ఖానా బయట పడింది. దర్యాప్తులో ఈ కార్ఖానాకు జనార్దన్‌రావుకు సంబంధా లున్నాయని వెల్లడైనట్టు విశ్వసనీయ సమాచారం. దుకాణా న్నయితే మూసేశారు కానీ, తెలంగాణ ఎక్సైజ్ సిబ్బంది ఇంకా ముందుకెళ్లి దర్యాప్తు చేయలేదు. జనార్దన్‌రావు పేరు బయటకు రాకుండా తెలంగాణ అధికార యంత్రాంగాన్ని ప్రభావితం చేయగల స్థితిలో ఉన్న ఆంధ్ర నేతలెవరు?... కనిపెట్టడం ఓ బ్రహ్మవిద్యేం కాదు గదా! రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ బంధువైన చంద్రశేఖరనాయుడు ఎక్సైజ్ శాఖలో మాజీ అధికారి. జాయింట్ కమిషనర్‌గా పనిచేసి ఐదేళ్ల కిందనే రిటైరయ్యారు. అధికారికంగా ఆయన్ను ఈ ఫిబ్రవరి నెల నుంచి ఎక్సైజ్ శాఖలో ఓఎస్డీగా నియమించారు. రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీలు, బ్రూవరీ లన్నింటినీ ఆయన అజమాయిషీలోకి తెచ్చారని సమాచారం. అనధికారికంగా అంతకుముందు నుంచే ఆయన ఈ పనుల్ని చక్కబెడుతున్నారని ఆ శాఖలో ఉన్న టాక్. నకిలీ మద్యం తయారీదారులు మందుబాబుల్ని బురిడీ కొట్టించడం కోసం అసలు బ్రాండ్లకు సంబంధించిన ఫ్లేవర్ వచ్చేలా ఎసెన్స్‌ను కొంత కలుపుతున్నారని తెలుస్తున్నది. ఈ ఎస్సెన్స్ ఆ బ్రాండ్ కంపెనీల వద్ద గానీ, దాన్ని లీజుకు తీసుకున్న డిస్టలరీల వద్దగానీ ఉంటుంది. మరి నకిలీ కార్ఖానాలకు ఎలా చేరుతున్నాయనేది రాజకోట రహస్యమే! ఇప్పుడు జరుగుతున్న కల్తీ మద్యం వ్యాపారంలో కూడా వైసీపీ వాళ్లను ఇరికించడమెలా అనే అంశంపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. కొంతమందిని కొంతకాలం మోసం చేయవచ్చు. కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరనే నానుడి ఏమవుతుందో చూద్దాం.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
నేడు భారీ వర్షాలకు అవకాశం
శ్రీకాకుళం పాతబస్టాండ్: మోంథా మోత మొదలైంది. తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాన్ మంగళవారం సా యంత్రం, లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా వర్షా లు కురిశాయి. జిల్లాలోని ప్రధాన నదులు వంశధార, నాగావళి ప్రస్తుతం నిలకడగా ఉన్నాయి. వర్షాలు అధికమైతే వరద వచ్చే అవకాశం ఉంది. తుఫాన్ నేపథ్యంలో జిల్లా ప్రత్యేకాధికారి కేవీఎన్ చక్రధరబాబు సోమవారం పోలాకి తదితర మండలాల్లో పర్యటించారు. ఈ విపత్తును సమర్థంగా ఎదుర్కొనేందుకు 11 మంది సభ్యులు గల ఒక ఎన్డీఆర్ఎఫ్ టీమ్ జిల్లాలోనే సామగ్రితో సిద్ధంగా ఉంది. కొనసాగుతున్న కంట్రోల్ రూమ్‌లు.. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సహాయాన్ని పొందేందుకు అందుబాటులో కంట్రోల్ రూమ్‌లు ఉంచారు. రెండు రోజుల నుంచి కలెక్టర్, డివిజన్ కేంద్రాలు, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు కొనసాగుతున్నాయి. ప్రజలు బయటకు రాకూడదు తుఫాన్ ప్రభావంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని ప్రజలు ఎవరూ బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. కాలువలు, చెరువులు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు తుఫాన్ ప్రభావం ఎక్కువగా తీర ప్రాంతాల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. మన తీరంలో 11 మండలాలు, 236 గ్రామాలు, సుమారుగా 1.90 లక్షల జనాభా ఉన్నారు. తీర ప్రాంతంలో 41 తు ఫాన్ షెల్టర్లు ఉన్నాయి. వీటిలో అవసరం మేరకు అన్నీ సిద్ధం చేశారు. ఇతర ప్రాంతాల్లో మరో 80 తాత్కాలిక పునరావాస కేంద్రాలు గుర్తించి సిద్ధం చేశారు. 41 తాగునీటి ట్యాంకర్లు ఉంచారు. 185.4 మిల్లీమీటర్ల వర్షం జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 185.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సా యంత్రం వరకు 592.8 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఇంకా వర్షాలు పడుతున్నాయి. మంగళవారం ఈ వానలు మరింత ఎక్కువగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వర్షం (మిల్లీమీటర్లలో) ఎక్కడెక్కడ.. ఎంతెంత.. -
బతుకుల్లో అలజడి
● సముద్రంలో ఎగసి పడుతున్న అలలు ● 250 మీటర్లు ముందుకు వచ్చిన సముద్రం ● మంచినీళ్లపేటలో కిలో మీటరు మేర కోతకు గురైన తీరం ● నెల రోజులుగా మత్స్యకారులకు సాగని వేట వజ్రపుకొత్తూరు: సముద్రం కల్లోలంగా మారింది. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అలల ఉద్ధృతి తీరాన్ని కుదిపేస్తోంది. మంచినీళ్లపేట, దేవునల్తాడ, డోకులపాడు, అక్కుపల్లి, గుణుపల్లి తీరాల్లో అలజడి ఎక్కువైంది. సముద్రం దాదాపు 250 మీటర్లు ముందుకు రావడంతో మంచినీళ్లపేటలో తీరం కిలోమీటరు మేర కోతకు గురైంది. మత్స్యకారులు తమ 30 బోట్లను నువ్వలరేవు, పూడిలంక ఉప్పుటేరులో లంగరు వేయగా, మరో 40వరకు తెప్పలను తీరంలోని ఇసుక దిబ్బలపై ఉంచారు. వల లు, ఇతర సామగ్రిని తాత్కాలిక షెడ్డుల్లో భద్ర పరిచారు. కోనేం సీజన్ కొల్లేరే.. వరుస తుఫాన్ల నేపథ్యంలో మత్స్యకారులకు నెల రోజులుగా వేట సాగడం లేదు. ట్యూనా ఫిష్, కోనేం, రొయ్యిలు సీజన్ అయినా తుఫాన్ వల్ల మత్స్యకారులు సముద్రంలోపలకు వెళ్లలేకపోతున్నారు. గత ఏడాది ఈ సీజన్లో భావనపాడు, మంచినీళ్లపేట, గుణుపల్లి, అక్కుపల్లి, డోకులపా డు, నువ్వలరేవు, దేవునల్తాడ, కేఆర్ పేట తదితర తీరాల్లో దాదాపు 150 టన్నుల వరకు కోనేం, మరో 50 టన్నుల వరకు ట్యూనా (సూరలు), మరో 6 టన్నుల వరకు రొయ్యిలు మత్స్యకారుల వలకు చిక్కాయి. కానీ ఈ ఏడాది కోనేం ధర రూ.1000 వరకు ఉన్నప్పటికీ వలకు చిక్కడం లేదని గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో 15 రోజుల వరకే సీజన్ అనుకూలిస్తుందని, ఆ తర్వాత ఈ చేపలకు వేట చేసే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి రింగ్ వలలు, అలి వలలు ఇతర ఖరీదైన బోట్లు కొనుగోలు చేశామని, ఆ అప్పులు ఇంకా తీరలేదని చెబుతున్నారు. ఇంటి వద్దే ఉండిపోవాల్సి వస్తోందని, తుఫాన్ సమయంలో వేట సాగ ని పరిస్థితి ఉన్నందున ప్రభుత్వం కనీసం బస్తా బియ్యం కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఇచ్ఛాపురం రూరల్: వలలు అల్లుకుంటున్న మత్స్యకారులు బియ్యం అందించాలి నెల రోజులుగా వేట సాగక ఇంటి వద్దే ఉంటున్నాం. పైసా ఆదాయం లేదు. వలలు షెడ్డుల్లోనే ఉన్నాయి. అప్పులు చేసి ఎన్నాళ్లు తినగలం. ప్రభుత్వం కనికరించి కనీసం ఒక బస్తా బియ్యం అయినా ఇస్తే బాగుటుంది. – ఎస్. మోహనరావు, మత్స్యకారుడు, మంచినీళ్లపేట పస్తులుంటున్నాం నెల రోజులుగా వేట సాగక పస్తులు ఉంటున్నాం. మూడు పూటలు తినాల్సిన పరిస్థితి నుంచి ఒక పూట తినే పరిస్థితి ఎదురైంది. సంద్రంలో మర బోట్ల విహారం తగ్గించాలి. దాని వల్ల మత్స్య సంపద దొరకడం లేదు. – సీహెచ్ నీలయ్య, మత్స్యకారుడు, మంచినీళ్లపేట -
బాలికా విద్యపై శీతకన్ను..?
శ్రీకాకుళం: ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్క్‌ను తొలగించాలని అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే ఇంటి వద్దకే రేషన్ బియ్యం, వలంటీర్ వ్యవస్థ రద్దు, వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వంటి చర్యలకు పాల్పడింది. కాగా ఇప్పుడు ప్లస్ టూ హైస్కూళ్లపై కూడా శీతకన్ను వేస్తున్నట్లు తెలుస్తోంది. 2009 విద్యాహక్కు చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు వయస్సు కలిగిన బాలికలకు ఉచిత నిర్బంధ విద్యనందించాలి. అయితే బాలికలకు గ్రామస్థాయిలో ఇంటర్మీడియట్ విద్య అందుబాటులో లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు పంపించేందుకు ఇష్టంలేని తల్లి దండ్రులు పదో తరగతి తర్వాత చదువు మాన్పించేస్తున్నారు. దీనిని గుర్తించిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్లస్ టూ హైస్కూళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కూళ్లలో బాలికలకు ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టింది. ఎంపీసీ, బైపీసీ గ్రూపులతో ఈ విద్యను ప్రారంభించారు. జిల్లాలో 6 ప్లస్ టూ పాఠశాలలు శ్రీకాకుళం జిల్లాలో 6 ప్లస్ టూ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వజ్రపుకొత్తూరు, టెక్కలి, నరసన్నపేట మండలంలోని ఉర్లాం, పలాస మండలంలోని బ్రాహ్మణతర్ల, సరుబుజ్జిలి మండలంలోని రొట్టవలసల్లో బాలికల కోసం ప్రత్యేకించి ప్లస్ టూ హై స్కూళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కోగ్రూపులో 40 నుంచి 50 మంది వరకు చేరే అవకాశం కల్పించారు. అయితే ప్రస్తుతం ఈ 6 పాఠశాలల్లో మొత్తం 12 సబ్జెక్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఎన్నికల సందర్భంలో ఇప్పటి విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ యువగళం పేరిట నిర్వహించిన పాదయాత్రలో ప్లస్ టూ ఉన్నత పాఠశాలల సమస్యలను పరిష్కరిస్తామని, ఉపాధ్యాయులకు ఆయా పాఠశాలల్లో టీజీటీ, పీజీటీలుగా పదోన్నతులు కల్పిస్తామని హామీని ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఆయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఉన్న సమస్యలను పరిష్కరించకపోగా, మరిన్ని సమస్యలు పెరిగాయని పలువురు వాపోతున్నారు. ప్రారంభమవ్వని సిలబస్ ప్లస్ టూ పాఠశాలల్లో సబ్జెక్టు పోస్టులను ఖాళీగా ఉంచితే వచ్చే ఏడాది ఇంటర్మీడియట్లో కొత్తగా విద్యార్థులు చేరే అవకాశాలు ఉండవు. ఇదే జరిగితే వీటిని ఎత్తివేయొచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు ఉపాధ్యాయ వర్గాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం వీటిలోని సమస్యలను పరిష్కరించకపోవడంతో ఈ విమర్శలకు బలం చేకూరుస్తోంది. అందువలన ఇప్పటికై నా సబ్జెక్ట్ ఉపాధ్యాయులను నియమించకుంటే మరో ఐదు నెలల్లో జరగనున్న పరీక్షలకు విద్యార్థినులు సన్నద్ధమయ్యే అవకాశాలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్య క్యాలెండర్ ప్రకారం నవంబర్ నాటికి సిలబస్ పూర్తిచేసి అటు తర్వాత రివిజన్ చేయించాల్సి ఉంటుంది. అయితే కొన్ని ప్లస్ టూ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత వలన ఇప్పటికీ పలు సబ్జెక్టుల్లో పాఠాలు ప్రారంభమవ్వకపోవడం విచారించదగ్గ విషయం. అందువలన ఇప్పటికై నా జిల్లా అధికారులు దృష్టి సారించి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. జిల్లాలోని ప్లస్ టూ హైస్కూళ్లలో 12 పోస్టులు ఖాళీ మరో ఐదు నెలల్లో పరీక్షలు సిలబస్ పూర్తవ్వకపోవడంతో ఆందోళన బాల్య వివాహాల నిర్మూలన చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా పాలసీ అండ్ రీసెర్చ్ అనే సంస్థ ప్లస్ టూ విద్య వలన బాల్య వివాహాల నిర్మూలన సాధ్యపడుతుందని స్పష్టంగా పేర్కొంది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ప్లస్ టూ పాఠశాలలను నిర్వీర్యం చేస్తోంది. ఇది 2009 విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించడమే. తక్షణమే ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. – పేడాడ ప్రభాకరరావు, ఎస్టీయూ జిల్లా నాయకుడు
