breaking news
-
కిడ్నీ మార్పిడి సురక్షితమేనా? అందువల్లే నటుడు సతీష్ షా కూడా..
ప్రముఖ బాలీవుడ్ నటుడు, టీవీ కళాకారుడు సతీశ్ షా అనారోగ్యంతో చనిపోయిన సంగతి తెలిసిందే. 76 ఏళ్ల సతీశ్ అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న భార్యను చూసుకునేందుకు ఇటీవలే కిడ్నీ మార్పిడి సర్జరీ చేయించుకున్నారని ఆయన సన్నిహితుడొకరు మీడియాకి వెల్లడించారు. అంతేగాదు ఆయన చాలా రోజుల నుంచి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారని, డయాలసిస్ చేయించుకునేవారని, భార్య బాగోగులు నిమిత్తం మూడు నెలల క్రితం ఈ కిడ్నీ మార్పిడి సర్జరీ చేయించుకున్నట్లు తెలిపారు. ఆయన అనుకున్నట్లుగా ఆయన ఆరోగ్యం మెరగవ్వకపోక..త్వరితగతిన కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సపై పలు అనుమానాలు రేకెత్తించింది. అసలు మూత్రపిండాల వైఫల్యంతో బాధపడేవారికి ఈసర్జరీ? వరమా? లేక శాపమా అనే ఆందోళన కలిగించి. నిజానికి ఈ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ సురక్షితమైనదైనా..? దానికంటే డయాలసిస్ మంచిదా అంటే..నెఫ్రాలజిస్ట్‌లు ఏమంటున్నారంటే..డయాలసిస్ అనేది మూత్రపిండాలు పనిచేయలేనప్పుడూ..రక్తం నుంచి వ్యర్థాలను, అదనపు ద్రవాన్ని తొలగించే పనిని చేపడతాయట. ఈ డయాలసిస్ అనేది రెండు రకాలుగా ఉంటుందని వివరించారు. ఒకటి హిమోడయాలసిస్ ఈ పద్ధతిలో శరీరం వెలుప యంత్రం ఉంచి..రక్తం శుద్ధి చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఉదర లైనింగ్ ఫిల్టర్‌గా ద్రవ మార్పిడి మానవీయంగా లేదా యంత్ర ఆధారితంగా జరుగుతుందట. నిజానికి మూత్రపిండాల వైఫల్యంతో బాధపడే వారికి ఈ కిడ్నీ మార్పిడి చికిత్స వరమే. వారికి ఈ శస్త్ర చికిత్స మెరుగైన ఫలితాలను అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు. కిడ్నీ మార్పిడి వల్ల కలిగే లాభాలు..మెరుగైన జీవన నాణ్యత: తరుచుగా డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి నుంచి విముక్తిట్రాన్స్ప్టాంట్ చేయించుకున్న పేషెంట్లు డయాలసిస్ చేయించుకునే రోగులకంటే ఎక్కువ కాలం జీవిస్తారట.డయాలసిస్‌తో పోలిస్తే..తక్కువ ఆహార పరిమితులు ఉంటాయిమునపటి మీదు ఎక్కువ ఎనర్జిటిక్, తక్కువ సమస్యలు ఎదుర్కొంటారటనష్టాలు..అందరూ ఈ సర్జరీకీ అర్హులు కారట. ఎందుకంటే..కిడ్నీని తీసుకునే వ్యక్తి ఆరోగ్యం, ఇచ్చే దాత ఆరోగ్య అనుకూలత అత్యంత ప్రధానమట. అలాగే కిడ్నీ మార్పిడి సర్జరీ చేయించుకున్నాక..జీవితాంతం రోగనిరోధక శక్తిని తగ్గించే మందులు వాడాల్సిందేనట.కొందరిలో ఇన్ఫెక్షన్, రక్తస్రావం, కొత్త కిడ్నీని తిరస్కరించే అవకాశం వంటివి ఎక్కువగా ఉంటాయట. ఫలితంగా వారికి ఈ సర్జరీ ప్రాణాంతకంగా మారుతుందట. రెండిటిలో ఏది మంచిదంటే..డయాలసిస్‌లో పెద్ద శస్త్ర చికిత్స అంటూ ఏం ఉండదు. స్వల్పకాలంలో సురక్షితమైనది అంతే. అర్హత కలిగిన రోగులకు మూత్రపిండ మార్పిడి చికిత్స అనేది సరైన ఎంపిక, పైగా వారి జీవన నాణ్యత, దీర్ఘకాలిక మనుగడను ప్రసాదిస్తుంది. ఇలా ట్రాన్స్‌ప్లాంట్ సరిపడని రోగులకు డయాలసిస్ ప్రభావవంతమైన ప్రత్యామ్నాయమని వైద్యలు చెబుతున్నారు. దీంతో పాటు ప్రధానమైన అంశం, దాత లభ్యత, ఆరోగ్య అనుకూలత అనేవాటిని బట్టి ఏది బెస్ట్ అనేది ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. సకాలంలో నెఫ్రాలజిస్ట్‌లను సంప్రదించి తగిన సలహాలు సూచనలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. (చదవండి: రూ 20 సమోసాతో రూ. 3 లక్షల యాంజియోప్లాస్టీ: వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్) -
ఒక్కసారి కాదు.. పదిసార్లు అంటా
సాక్షి, హైదరాబాద్: రేవంత్‌రెడ్డి మంత్రివర్గం కచ్చితంగా దండుపాళ్యం ముఠాయేనని మాజీమంత్రి టి.హరీశ్‌రావు మరోమారు విమర్శించారు. ఇదే విషయాన్ని ఒక్కసారి కాదు..పదిసార్లు అయినా అంటానని, ఉన్న విషయం మాట్లాడితే కొందరు మంత్రులు ఉలిక్కి పడుతున్నారని మండిపడ్డారు. మంత్రుల మధ్య పంచాయితీల పరిష్కారం కోసమే కేబినెట్ సమావేశాలు పెట్టుకుంటున్నారా అని ప్రశ్నించారు. దక్కన్ సిమెంట్స్ కంపెనీ యాజమాన్యాన్ని తుపాకీతో బెదిరించిన వ్యవహారంలో నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని నిలదీశారు.నిర్మల్ నియోజకవర్గ బీజేపీ నేత సిందే దీక్షిత్ తన అనుచరులతో కలిసి సోమవారం తెలంగాణభవన్ వేదికగా బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. ‘అన్ని వర్గాల ప్రజలు రేవంత్ పాలనపై ఆగ్రహంతో ఉన్నారు. ప్రజల అభిప్రాయాలకు అనుగు ణంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజాక్షేత్రంలో పరుగులు పెట్టాలి’అని పిలుపునిచ్చారు. అనంతరం జరిగిన రజక సంఘం సమావేశంలోనూ హరీశ్‌రావు మాట్లాడారు. రేవంత్ రెండేళ్లలో విపక్షాలను దుర్భాషలాడటం మినహా రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. అడ్డమైన భాషతో అధికారంలోకి వచ్చాడని, ప్రస్తుతం ప్రజలు కూడా అదే భాషతో సీఎంపై తిరుగుబాటు చేస్తున్నారని చెప్పారు. ఓట్లు చీల్చేందుకు కాంగ్రెస్ కుట్రలు ‘జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో చపాతీ మేకర్, రోడ్ రోలర్ వంటి గుర్తులతో అభ్యర్థులను పెట్టి కాంగ్రెస్ ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తుంది. అయినా ఉప ఎన్నికలో కాంగ్రెస్ కుట్రలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రతీ మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.60 వేలు బాకీ పడింది. అధికారంలోకి వచ్చేందుకు అలవికాని హామీలు ఇచ్చిన రేవంత్ వాటిని నెరవేర్చకుండా అన్ని వర్గాలను మోసం చేశాడు. మద్యం ధరలను పెంచి ప్రజల నుంచి విచ్చలవిడిగా డబ్బు దండుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓటమితోనే తెలంగాణకు లాభం జరుగుతుంది’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. -
పిల్లలతో తీసిన హారర్ సినిమా.. వాళ్లు చూడకపోవడమే బెటర్!
హారర్ సినిమా అంటే ఓ రేంజులో భయపెట్టాలి. మొదటి సీన్ నుంచే మనల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లిపోవాలి. కానీ మన దగ్గర రీసెంట్ టైంలో తీసే మూవీస్‌లో చాలావరకు అలాంటి మ్యాజిక్ చేయలేకపోతున్నాయి! అందుకే మూవీ లవర్స్.. కొరియన్, హాలీవుడ్ హారర్ చిత్రాల వెంటపడుతున్నరు. ఇప్పుడు అలాంటి వాళ్లని ఓ గుజరాతీ సినిమా తెగ భయపెట్టేస్తోంది. అదే 'వష్ 2'. ఇది ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఈ మూవీ సంగతేంటి? ఎలాంటి థ్రిల్ ఇచ్చిందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: 'కురుక్షేత్ర' రివ్యూ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వొద్దు)2023లో గుజరాతీలో 'వష్' అనే సినిమా రిలీజైంది. వశీకరణం స్టోరీతో వచ్చిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఇది. దీన్ని హిందీలో అజయ్ దేవగణ్ 'సైతాన్' పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. దీంతో 'వష్' గురించి అందరికీ తెలిసింది. ఇప్పుడు ఆ దర్శకనిర్మాతల నుంచి సీక్వెల్ వచ్చింది. 'వష్ లెవల్ 2' పేరుతో తీశారు. ఇది ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. గుజరాతీతో పాటు హిందీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.కథేంటి?తొలి భాగానికి కొనసాగింపుగా 'వష్ 2' మొదలవుతుంది. మొదటి భాగంలో మాంత్రికుడికి ఉన్న శిష్యుడు.. ఓ స్కూల్లో చదివే 50 మందికి పైగా అమ్మాయిలని వశీకరణం ద్వారా తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. ఇతడి వశంలో ఉన్న కొందరు అమ్మాయిలు.. స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటారు. మరికొందరైతే ఊరిమీద పడి జనాలని దారుణంగా చంపేస్తుంటారు. అసలు దీనంతటికీ మూలకారణం ఏంటి? ఆ మాంత్రికుడి శిష్యుడిని ఎవరు ఎదుర్కొన్నారు? చివరకు అమ్మాయిలు బతికి బయటపడ్డారా లేదా అనేది మిగతా స్టోరీ.స్కూల్ పిల్లలు, ఓ మాంత్రికుడు, దుష్టశక్తులు.. ఇదే 'వష్ 2' సినిమా మెయిన్ ప్లాట్. వింటుంటేనే వామ్మో అనిపిస్తుంది కదా! అయినా పిల్లలతో హారర్ మూవీ ఎవరైనా తీస్తారా అని మీరు అనుకోవచ్చు. కానీ చూస్తున్నంతసేపు ఓవైపు భయమేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందా అనే ఆత్రుత మరోవైపు కలుగుతూ ఉంటుంది. చెప్పాలంటే లోకల్‌గా తీసినప్పటికీ హాలీవుడ్ రేంజ్ కంటెంట్ డెలివరీ చేశారని చెప్పొచ్చు.ఆగస్టులో ఈ సినిమా థియేటర్లలో రిలీజైతే.. అదే నెలలో 'వెపన్స్' అనే హాలీవుడ్ మూవీ కూడా విడుదలైంది. విచిత్రం ఏంటంటే ఈ రెండింటి కాన్సెప్ట్ దాదాపు ఒక్కటే. కొన్ని షాట్స్ అయితే అరే ఒకేలా ఉన్నాయేంటి అని కచ్చితంగా అనిపిస్తుంది. ఒకే నెలలో రిలీజ్ కావడం వల్ల కాపీ అనే ప్రసక్తి రాదు. సరే 'వష్ 2' విషయానికొస్తే ఓ స్కూల్, ఉదయం కాగానే వచ్చే పిల్లల సందడితో సినిమా మొదలవుతుంది. సరిగ్గా 13 నిమిషాల తర్వాత నుంచి అసలు కథ మొదలవుతుంది. పదిమంది ఆడపిల్లలు.. బిల్డింగ్ పైకెక్కి అక్కడినుంచి దూకి చనిపోతారు. అలా మొదలయ్యే టెన్షన్, థ్రిల్.. ఎండ్ కార్డ్ పడేవరకు ఆపకుండా ఉంటుంది.కేవలం 100 నిమిషాలు మాత్రమే ఉండే ఈ సినిమా.. చూస్తున్నంతసేపు మనల్ని సీటు అంచున కూర్చోబెడుతుంది. సినిమా అంతా భయంకరమైన, షాకింగ్ విజువల్స్ ఉంటాయి. మోనాల్ గజ్జర్ తప్పితే తెలుగు ప్రేక్షకులకు తెలిసిన మరో ముఖం లేదు. అయినా సరే ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. పిల్లలందరూ యాక్టింగ్ అదరగొట్టేశారు. వీళ్లకు తోడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత భయపెడుతుంది. చిన్న చిన్న సౌండ్స్ కూడా సినిమాని మరింత ఎలివేట్ చేశాయి.అన్ని ప్లస్సులేనా మైనస్సులు ఏం లేవా అంటే ఉన్నాయి. చాలా హింసాత్మక సన్నివేశాలున్నాయి. వాటిలో టీనేజీ పిల్లలు ఉండటం కొందరికి ఇబ్బందిగా అనిపించొచ్చు. సెన్సిటివ్‌గా ఉండేవారు ఈ మూవీ చూడకపోవడమే మంచిది. మొదటి పార్ట్‌లో ఏదైతే స్టోరీ ఉందో దాన్ని అటుతిప్పి ఇటుతిప్పి చూపించినట్లు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు కూడా అంతంత మాత్రంగానే అనిపిస్తాయి. కానీ ఓవరాల్‌గా మాత్రం మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. మంచి హారర్ సినిమా చూద్దామనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ కావొద్దు.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ సర్వైవల్ థ్రిల్లర్.. డోంట్ మిస్) -
వందల కోట్లు పోగొట్టుకుంటోన్న ప్రభాస్.. కారణం ఇదేనట!
టాలీవుడ్ ‘డార్లింగ్’ ప్రభాస్(Prabhas) దక్షిణాది నుంచి తొలి గ్లోబల్ స్టార్ హీరో అనేది అందరికీ తెలిసిందే. దేశ విదేశాల్లో ప్రభాస్‌కి ఉన్న క్రేజ్ సామాన్యమైనది కాదు. బాహుబలి సిరీస్‌తో పాటు సలార్, కల్కి వంటి సినిమాలు ప్రభాస్‌ను సమకాలీన హీరోలకు అందనంత ఎత్తులో నిలబెట్టాయి. అయితే తన క్రేజ్‌ను ఆదరాబాదరా క్యాష్ చేసుకునే రెగ్యులర్ స్టార్స్‌కు భిన్నంగా అందివచ్చిన రూ.వందల కోట్లను మన రెబల్ స్టార్ పోగొట్టుకుంటున్నాడు. దీనికి తొలి బీజం బాహుబలి సినిమా సమయంలోనే పడిందని సమాచారం.’బాహుబలి 2: ది కన్ క్లూజన్’ బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టినప్పటి నుంచీ, అనేక టాప్ బ్రాండ్లు ప్రభాస్‌ను వాణిజ్య ప్రకటనల కోసం ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆయనకి పెద్ద మొత్తంలోనే డబ్బు ఆఫర్ చేస్తున్నాయి. దుస్తులు, ఫుట్‌వేర్, ఎలక్ట్రానిక్ ఫిట్నెస్ రంగాలకు చెందిన బ్రాండ్ల నుంచి అతనికి అంబాసిడర్‌గా ఉండేందుకు వచ్చిన ఆఫర్లను కాదని, ఒక్క సంవత్సరంలోనే రూ.150 కోట్లకు పైగా విలువైన బ్రాండ్ ఎండార్స్మెంట్ ఆఫర్లను తిరస్కరించడం ద్వారా ప్రభాస్ సినీ పరిశ్రమతో పాటు వ్యాపార రంగాల వారినీ ఆశ్చర్యపరచాడు. గతంలో బాహుబలి 2 కోసం రూ. 10 కోట్ల విలువైన బ్రాండ్ ఎండార్స్మెంట్లను వదులుకున్నాడని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి వెల్లడించాడు. అయితే అనధికారికంగా ఆ సినిమా టైమ్‌లో ప్రభాస్ వదులకున్న ప్రకటనల విలువ రూ.80కోట్ల వరకూ ఉంటుందని అంచనా. తన లుక్‌లో మార్పు చేర్పులు చేసుకుంటే అది సినిమాకు నష్టం చేస్తుందనే ఆలోచనతోనే ఆయన అప్పట్లో వద్దనుకున్నాడట. ఆ తర్వాత కూడా అదే పంథా కొనసాగించాడు.మరోవైపు టాలీవుడ్లో ప్రభాస్ తో పాటు టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్న మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వారు పెద్ద సంఖ్యలో ప్రకటనల్లో నటించడం గమనార్హం. ప్రభాస్ మాత్రం సమకాలీనుల మాదిరిగా కాకుండా వరుసగా అనేక ఆఫర్లను తిరస్కరిస్తూనే ఉన్నాడు. ఒక ప్రధాన కోలా కంపెనీ వివిధ ఆటోమొబైల్ ఎండార్స్మెంట్లతో సహా అగ్ర బ్రాండ్ల ఒప్పందాలను ఇటీవల ఆయన తిరస్కరించినట్లు సమాచారం. ‘ కేవలం మూడు రోజుల పనికి ప్రభాస్ రూ.25 కోట్లకు పైగా సంపాదించవచ్చు. ఒక రోజు ఫోటోషూట్ కోసం, మరొక రోజు వాణిజ్య ప్రకటన చిత్రీకరణ కోసం చివరి రోజు ప్రమోషన్స్ కోసం వెచ్చిస్తే సరిపోతుంది.‘ అని ఒక సెలబ్రిటీ మేనేజర్ వెల్లడించాడు. అయితే ‘ఈ బ్రాండ్ ఎండార్స్మెంట్లను తరచుగా అతను తిరస్కరించడానికి కారణం ఎండార్స్మెంట్లకు వ్యతిరేకమని కాదు. గతంలో బ్రాండ్లను ప్రమోట్ చేశాడు భవిష్యత్తులో కూడా చేస్తాడని, అయితే ఒక బ్రాండ్‌ను ఎండార్స్మెంట్ చేస్తున్నప్పుడు ఆచి తూచి వ్యవహరిస్తాడని సదరు మేనేజర్ తెలిపాడు. తన విలువలకు అనుగుణంగా తన ప్రేక్షకులతో అనుబంధాన్ని చెడగొట్టని బ్రాండ్లను మాత్రమే అత్యంత జాగ్రత్తగా ఎంచుకుంటాడని వివరించాడు. ఇంత వరకూ ఈ స్థాయిలో బ్రాండ్లను స్క్రూటినీ చేసే మరో స్టార్‌ను చూడలేదంటున్నాడు. ప్రస్తుతం ఒక అగ్రగామి వాహన కంపెనీకి, మరో మొబైల్‌కి మాత్రమే ప్రభాస్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.రూ.వందల కోట్ల సంపద ఉన్నా మద్యం ప్రకటనల నుంచి పాన్ మసాలా ప్రకటనల దాకా ఏదైనా సరే సై అనే నటీనటులున్న ఈ రోజుల్లో... తద్భిన్నంగా పైసా వెనుక పరుగులు తీయకుండా రూ.వందల కోట్లను వద్దు అనుకుంటున్న ఏకైక స్టార్‌గా ప్రభాస్ తన వ్యక్తిత్వంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడని చెప్పొచ్చు. -
TG: నవంబర్ 3 నుంచి ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్
హైదరాబాద్: వచ్చే నెల 1వ తేదీ నాటికి ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 900 కోట్లు విడుదల చేయకపోతే తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు కాలేజీలను నిరవధికంగా బంద్ చేస్తామని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య హెచ్చరించింది. ఒకవేళ బకాయిలను విడుదల చేయకపోతే నవంబర్ 3 నుంచి ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్ చేస్తామని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు స్పష్టం చేశారు. ఈ మేరకు జనరల్ బాడీ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు.నవంబర్ 1 లోపు రూ. 900 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలిలేదంటే నవంబర్ 3 నుంచి ఉన్నత విద్యా సంస్థల నిరవధిక బంద్అన్ని వృత్తి విద్యా కళాశాలలు, డిగ్రీ ,పీజీ కాలేజీలు నిరవదిక బంద్ చేస్తాం..హామీ ఇచ్చి మళ్ళీ నెరవేర్చక పోతే మార్చి , ఏప్రిల్ లో జరిగే ఫైనల్ పరీక్షలు కూడా బాయ్ కాట్ చేస్తాం.2024-25 విద్యా సంవత్సరం వరకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం ఒక కాలపరిమితి గల రోడ్‌మ్యాప్‌ను ప్రకటించాలి2026 జూన్ నాటికి పూర్తి చెల్లింపు జరిగేలా చేయాలిప్రస్తుత సంవత్సరం 2025-26 బకాయిలు సకాలంలో విడుదల చేయాలిప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే బంద్ లో రోజుకో నిరసనహైదరాబాద్ లో అధ్యాపకులతో కలిసి భారీ బహిరంగ సభ10 లక్షల మంది విద్యార్థులను హైదరాబాద్ తీసుకొచ్చి నిరసననవంబర్ 1 నాటికి పెండింగ్ బకాయిలు చెల్లిస్తారని ఆశిస్తున్నాంబెదిరింపులకు భయపడి ఈసారి వెనక్కి తగ్గేది లేదుబకాయిలు అడిగితేనే విజిలెన్స్ తనిఖీలు గుర్తుకు వస్తున్నాయి -
12 రాష్ట్రాలలో ఎస్ఐఆర్ రెండో దశను ప్రారంభిస్తాం: జ్ఞానేశ్ కుమార్
సాక్షి,న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటిగ్రేటెడ్ రివిజన్ - ఎస్ఐఆర్) ఫేజ్వన్ విజయవంతంగా ముగిసిందని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. సోమవారం(సెప్టెంబర్ 27) కేంద్రం ఎన్నికల సంఘం మీడియా సమావేశంలో ఎస్ఐఆర్ మాట్లాడారు. 1951నుంచి 2004 వరకు ఎనిమిది సార్లు ఎస్ఐఆర్ నిర్వహించారు. 21ఏళ్ల తర్వాత మళ్లీ ఎస్ఐఆర్ విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. బిహార్‌లో 7.5కోట్ల మంది ఎస్ఐఆర్ విజయవంతంగా పూర్తయ్యింది. బిహార్‌లో ఎస్ఐఆర్పై ఎవరు అభ్యంతరాలు చెప్పలేదు. త్వరలో రెండో దశలో 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ నిర్వహిస్తాం. ఈరోజు అర్ధరాత్రి తర్వాత ఓటర్ల జాబితా లాక్ చేస్తాం. ప్రతి ఇంటికి మూడుసార్లు బిఎల్ఓ విజిట్ చేస్తారు. బీఎల్ఓ ఇచ్చే ఎన్యుమరేషన్ ఫాంలో వివరాలు నమోదు చేసి సంతకం చేయాలి. 2003లో ఎవరితో ఉన్నామని లింక్ వివరాలు నమోదు చేయాలి. ఎన్యుమరేషన్ ఫామ్‌లో మ్యాచింగ్ , లింకింగ్ ప్రధానం.ఎన్యుమరేషన్ ఫాం రిటర్న్ చేసిన వారినే ఓటర్ జాబితాలో నమోదు చేస్తారు. బూత్ లెవెల్ ఏజెంట్లు 50 ఫారంలు ఎన్నికల సంఘానికి అందజేయవచ్చు. అన్ని ఎన్యుమరేషన్ ఫారంలు వచ్చిన తర్వాత ముసాయిదా ఓటర్ జాబితా విడుదల చేస్తాం’అని తెలిపారు. ఇందులో భాగంగా నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 వరకు ఎస్ఐఆర్. డిసెంబర్ 9న ముసాయిదా జాబితా విడుదల. డిసెంబర్ 9 నుంచి 8 జనవరి వరకు అభ్యంతరాల స్వీకరణ. డిసెంబర్ 9 నుంచి జనవరి 31 వరకు హియరింగ్ ,వెరిఫికేషన్ ఫిబ్రవరి 7న ఓటర్ల తుది జాబితా విడుదల ఉంటుందని వెల్లడించారు. #SIR 12 States & UTs#ECI #SIRPhase2 pic.twitter.com/JA2CnyWulz— Election Commission of India (@ECISVEEP) October 27, 2025 🚨 BREAKING | DelhiChief Election Commissioner Gyanesh Kumar says:“There has been considerable discussion about the necessity of SIR. But the Election Commission reiterates that under electoral law, revision of electoral rolls is mandatory before every election and can be… pic.twitter.com/GVjRZJkPxY— Jan Ki Baat (@jankibaat1) October 27, 2025 -
ప్రపంచ జ్ఞానామృతం భగవద్గీత
బీజింగ్: భగవద్గీత జ్ఞానామృతమంటూ ప్రశంసలు చైనా పండితులు కురిపించారు. ఆధునిక కాలంలో ప్రజలు ఎదుర్కొనే ఆధ్యాత్మిక, భౌతిక సమస్యలకు సమాధానాలు ఇందులో ఉన్నాయన్నారు. భగవద్గీత భారతీయ నాగరికత సూక్ష్మ చరిత్ర వంటిదంటూ శ్లాఘించారు. ఈ ప్రాచీన భారతీయ గ్రంథరాజంపై చైనీయులు ఇలా బహిరంగంగా గౌరవాన్ని ప్రకటించడం అరుదైన విషయంగా చెబుతున్నారు. శనివారం చైనా రాజధాని బీజింగ్‌లో భారత దౌత్యకార్యాలయం ‘సంగమమ్– భారతీయ తాత్విక సంప్రదాయాలు’అంశంపై నిర్వహించిన చర్చాగోష్టిలో పలువురు పండితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు గీతను భారతీయ తత్వశాస్త్ర విజ్ఞాన సర్వస్వంగా అభివరి్ణంచారు. ఆధ్యాత్మిక, భౌతిక అన్వేషణల మధ్య సామరస్యాన్ని సాధించేందుకు భగవద్గీత ఎంతో సాయంగా ఉంటుందన్నారు. భగవద్గీతను చైనీస్ భాషలోకి తర్జుమా చేసిన ప్రొఫెసర్ ఝాంగ్ బావోషేంగ్(88) ఈ కార్యక్రమంలో కీలక ప్రసంగం చేశారు. భగవద్గీతను భారతదేశ ఆధ్యాత్మిక ఇతిహాసం, తాత్విక విజ్ఞాన సర్వస్వంగా ఆయన పేర్కొన్నారు. ఇది నేటికీ భారతీయ జీవనాన్ని తీర్చిదిద్దుతోందని చెప్పారు. ప్రొఫెసర్ ఝాంగ్ భారత్‌లో 1984–86 సంవత్సరాల మధ్య గడిపిన తన అనుభవాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. దక్షిణాగ్రాన కన్యాకుమారి నుంచి ఉత్తరాన ఉన్న గోరఖ్‌పూర్ వరకు ప్రతిచోటా శ్రీకృష్ణుని ఉనికిని, ఒక సజీవ నైతిక, ఆధ్యాత్మిక ఆదర్శాన్ని ప్రత్యక్షంగా గమనించానన్నారు. జెజియాంగ్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ఓరియంటల్ ఫిలాసఫీ రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వాంగ్ ఝి–చెంగ్ మాట్లాడుతూ.. 5 వేల ఏళ్ల క్రితం ప్రాచీన భారతీయ యుద్ధరంగంలో జరిగిన సంభాషణ అయిన భగవద్గీత, నేడు ప్రజలు ఎదుర్కొంటున్న ఆందోళనలు, అనేక గందరగోళాలకు సైతం సరైన సమాధానాలను ఇస్తూ కాలాతీతంగా మారిందన్నారు. కార్యక్రమానికి వచ్చిన పండితులకు భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్ ఘనస్వాగతం పలికారు. గతేడాది తమ దౌత్య కార్యాలయం రామాయణంపై ఏర్పాటు చేసిన సదస్సుకు కొనసాగింపుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
ట్రాక్ రికార్డును చూశాకే ‘రెరా’ అనుమతి
న్యూఢిల్లీ: బిల్డర్ల (ఇళ్ల ప్రాజెక్టులు నిర్మించే వారు) ట్రాక్ రికార్డును (గత చరిత్ర) పరిశీలించిన తర్వాతే కొత్త ప్రాజెక్టులకు అనుమతులను మంజూరు చేసేందుకు వీలుగా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తూ రెరా చట్టంలో సవరణలు తీసుకురావాలని గృహ కొనుగోలుదారుల సంఘం (ఎఫ్‌పీసీఈ) డిమాండ్ చేసింది.ప్రాపర్టీ కొనుగోలుదారులు యూనిట్ కొనుగోలును రద్దు చేసుకుంటే తిరిగి చెల్లించేందుకు ఏకీకృత నిబంధనను తీసుకురావాలని కోరుతూ ఎఫ్‌పీసీఈ ప్రెసిడెంట్ అభయ్ ఉపాధ్యాయ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు లేఖ రాశారు. హామీ మేరకు సదుపాయాలు కలి్పంచడంలో బిల్డర్లు విఫలమైతే తగిన పరిష్కారం ఉండాలని కోరారు.ఇదీ చదవండి: రాజీపడితేనే సొంతిల్లు.. లేదంటే సవాలే! -
సల్మాన్‌పై పాక్ ఉగ్ర ముద్ర
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను పాకిస్తాన్ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇటీవల సౌదీ అరేబి యాలోని రియాద్‌లో జరిగిన కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ బలూచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా ప్రస్తావించిన దగ్గర్నుంచి ఆ దేశం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన్ను ఉగ్రవాదిగా పేర్కొంటూ ఆదివారం ఒక ఉత్తర్వు విడుదల చేసింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం–1997లోని నాలుగో షెడ్యూల్ ప్రకారం ఉగ్రవాదంతో సంబంధాలున్నట్లుగా అనుమానం ఉన్న వ్యక్తులను ఉగ్రవాదులుగా పేర్కొనవచ్చు. ఈ చట్టం ప్రకారం సల్మాన్‌ను పాక్ ఉగ్రవాదిగా పేర్కొంది. ఈ మేరకు అక్టోబర్ 16వ తేదీన బలూచిస్తాన్ ప్రభుత్వ హోం శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌ను తాజాగా పాక్ ప్రభుత్వం ధ్రువీకరించింది. ఆయన్ను స్వతంత్ర బలూచిస్తాన్ దోహదకారి (ఆజాద్ బలూస్తాన్ ఫెసిలిటేటర్)గా అందులో పేర్కొంది. దీని ప్రకారం ఆయనపై నిఘా, కదలికలపై నియంత్రణ. చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు అవకాశముంటుందని చెబుతున్నారు. మధ్యప్రాచ్యం భారతీయ సినిమాకు పెరుగుతున్న ఆదరణపై చర్చించేందుకు జోయ్ ఫోరం–2025 అక్టోబర్ 17న రియాద్‌లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. బాలీవుడ్ ఖాన్ త్రయం సల్మాన్, షారూక్, ఆమిర్ ఖాన్ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడారు. ‘హిందీ సినిమాను సౌదీ అరేబియాలో విడుదల చేస్తే సూపర్ హిట్టవడం ఖాయం. తమిళం, తెలుగు, మలయాళ సినిమాలతో ఇక్కడ కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది. బలూచిస్తాన్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్.. ఇంకా ఈ ప్రాంతంలోని చాలా దేశాల వారు ఇక్కడ పని చేస్తున్నారు’అంటూ చేసిన ప్రసంగం సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్‌గా మారింది. -
పాముకాటుకు చిన్నారి బలి
చందుర్తి(వేములవాడ): ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి పాముకాటుతో మృత్యువాత పడింది. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లిలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన చేకుట లత, రమేశ్ దంపతుల ఏడాదిన్నర వయసు ఉన్న కూతురు వేదాన్షి శనివారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా హఠాత్తుగా ఇంట్లో వారికి ఏడుపు వినిపించింది. కుటుంబ సభ్యులు వెంటనే వెళ్లి పరిశీలించగా చిన్నారి కాళ్ల వేలి మధ్యలో నుంచి రక్తం కారుతుండటంతో వెంటనే వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి, పాము కాటు తో పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అక్కడి నుంచి అర్ధరాత్రి ఎల్లారెడ్డిపేటలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే పాప ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి తండ్రి రమేశ్ ఆరు నెలల క్రితం దుబాయ్ వెళ్లాడు. పాముకాటుకు కూతురు మృతిచెంది న విషయం తెలుసుకున్న తండ్రి రమేశ్ స్వగ్రా మానికి బయలుదేరినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం పాప మృతదేహాన్ని బాడీఫ్రీజర్లో భద్రపరిచారు. చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.
