TG: నవంబర్ 3 నుంచి ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్ | Private colleges in Telangana bandh from November 3 | Sakshi
Sakshi News home page

TG: నవంబర్ 3 నుంచి ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్

Oct 26 2025 9:37 PM | Updated on Oct 26 2025 9:55 PM

Private colleges in Telangana bandh from November 3

హైదరాబాద్‌: వచ్చే నెల 1వ తేదీ నాటికి ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ. 900 కోట్లు విడుదల చేయకపోతే తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు కాలేజీలను నిరవధికంగా బంద్‌ చేస్తామని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య  హెచ్చరించింది. ఒకవేళ బకాయిలను విడుదల చేయకపోతే నవంబర్ 3 నుంచి ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్ చేస్తామని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు స్పష్టం చేశారు.  ఈ మేరకు జనరల్‌ బాడీ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు.

  • నవంబర్ 1 లోపు రూ. 900 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి

  • లేదంటే నవంబర్ 3 నుంచి ఉన్నత విద్యా సంస్థల నిరవధిక బంద్

  • అన్ని వృత్తి విద్యా కళాశాలలు, డిగ్రీ ,పీజీ కాలేజీలు నిరవదిక బంద్ చేస్తాం..

  • హామీ ఇచ్చి మళ్ళీ నెరవేర్చక పోతే మార్చి , ఏప్రిల్ లో జరిగే ఫైనల్ పరీక్షలు కూడా బాయ్‌ కాట్‌ చేస్తాం.

  • 2024-25 విద్యా సంవత్సరం వరకు పెండింగ్‌లో ఉన్న  బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం ఒక కాలపరిమితి గల రోడ్‌మ్యాప్‌ను ప్రకటించాలి

  • 2026 జూన్ నాటికి పూర్తి చెల్లింపు జరిగేలా చేయాలి

  • ప్రస్తుత సంవత్సరం 2025-26 బకాయిలు సకాలంలో విడుదల చేయాలి

  • ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే బంద్ లో రోజుకో నిరసన

  • హైదరాబాద్ లో అధ్యాపకులతో కలిసి భారీ బహిరంగ సభ

  • 10 లక్షల మంది విద్యార్థులను హైదరాబాద్ తీసుకొచ్చి నిరసన

  • నవంబర్ 1 నాటికి పెండింగ్ బకాయిలు చెల్లిస్తారని ఆశిస్తున్నాం

  • బెదిరింపులకు భయపడి ఈసారి వెనక్కి తగ్గేది లేదు

  • బకాయిలు అడిగితేనే విజిలెన్స్ తనిఖీలు గుర్తుకు వస్తున్నాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement