breaking news
-
సల్మాన్ ఖాన్‌ను 'ఉగ్రవాది'గా ప్రకటించిన పాకిస్తాన్.. కారణం ఇదే..
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్(Salman Khan) కొద్దిరోజుల క్రితం బలూచిస్తాన్ (Balochistan)ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. పాక్ మీడియాలో వస్తున్న నివేదికల ప్రకారం సల్మాన్‌ను ఒక ఉగ్రవాదిగా ముద్రవేసి.. పాకిస్తాన్ 1997 ఉగ్రవాద నిరోధక చట్టంలోని 4వ షెడ్యూల్ కింద ఆయన పేరును చేర్చారు. ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు అనుమానించబడిన వ్యక్తుల బ్లాక్‌లిస్ట్‌లో సల్మాన్ పేరును పొందుపరిచారు. పాక్ చట్టాల ప్రకారం ఈ లిస్ట్‌లో ఉన్న వారిపట్ల నిఘా, కదలికలపై ఆంక్షలతో పాటు చట్టపరమైన చర్యలకు అవకాశం కల్పిస్తుంది.పాక్ విషయంలో సల్మాన్ ఏమన్నారంటే..?కొద్దిరోజుల క్రితం సౌదీ అరేబియాలో ‘జాయ్ ఫోరమ్ 2025’ కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే.. ఇందులో కి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌తో పాటు షారుక్ ఖాన్, ఆమిర్‌ఖాన్ వంటి స్టార్స్ పాల్గొన్నారు. ఈ వేదికపై సల్మాన్ మాట్లాడుతూ.. భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతుంది. ఒక హిందీ సినిమాను సౌదీ అరేబియాలో విడుదల చేస్తే తప్పకుండా సూపర్‌హిట్ అవుతుంది. ఆపై తెలుగు, తమిళ్, మలయాళ సినిమాలు కూడా ఇక్కడ కోట్ల రూపాయలు రాబడుతున్నాయి. దీనంతటికీ కారణం పలు దేశాలకు చెందిన ప్రజలు సౌదీలో ఉండటమేనని చెప్పాలి. బలూచిస్తాన్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ (Pakistan) నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. అంటూ ఆయన మాట్లాడారు.సల్మాన్‌పై బలూచిస్తాన్ ప్రశంసలుసల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ ప్రభుత్వానికి కోపం తెప్పించింది. బలూచిస్తాన్, పాకిస్థాన్‌లను సల్మాన్‌ఖాన్ వేర్వేరుగా చెప్పడం ఏంటి అంటూ భగ్గుమంది. పాకిస్థాన్‌కు చెందిన బలోచిస్థాన్‌ను ఇలా వేరు చేసి మాట్లాడటం ఏంటి అంటూ అక్కడి మీడియా కూడా విమర్శలు చేసింది. అయితే, బలూచిస్తాన్ వేర్పాటువాద నాయకులు మాత్రం సల్మాన్ చేసిన ప్రకటనను స్వాగతించారు. బలూచ్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న ప్రముఖ న్యాయవాది మీర్ యార్ బలూచ్ ఒక ట్వీట్ కూడా చేశారు. సల్మాన్ చేసిన వ్యాఖ్యలు ఆరు కోట్ల బలూచిస్తాన్ ప్రజలకు ఆనందాన్ని కలిగించిందని కృతజ్ఞత తెలిపారు. ఇలా మాట్లాడేందుకు చాలా దేశాలు వెనకడుగు వేశాయని వారు గుర్తుచేశారు. బలూచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తించడాన్ని హైలైట్ చేసేలా సల్మాన్ వ్యాఖ్యలు చేరుతాయని అభిప్రాయపడ్డారు.ఖనిజ వనరులతో సమృద్ధిగా ఉన్న బలూచిస్తాన్ చాలా వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయింది. ఇక్కడ చమురు, బొగ్గు, బంగారం, రాగి తదితర వనరులు ఎక్కువగా ఉన్నాయి. వీటి ఆదాయం పాక్ ఖజానాను కాపాడుతుంది. కానీ, బలూచిస్తాన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో పాక్ నిర్లక్ష్యంగా ఉండటంతో అక్కడ వ్యతిరేకత మొదలైంది. ఫలితంగా రాజకీయ అనిశ్చితి ఏర్పడటం ఆపై వేర్పాటువాదులు శక్తిమంతమయ్యారు. ఇప్పుడు ఏకంగా ఆక ప్రత్యేక ఆర్మీని ఏర్పాటు చేసుకునే రేంజ్‌కు బలూచిస్తాన్ చేరుకుంది. పాక్‌కు పక్కలో బల్లెంలా బలూచిస్తాన్ తయారైంది. పాక్ నుంచి వేరు కావడంతో పాటు ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడాలని ఇక్కడి ప్రజలు కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నారు.Salman Khan has been placed on the Fourth Schedule by the Government of Balochistan.@BeingSalmanKhan #Balochistan pic.twitter.com/Pbg1uaKiJU— Nasir Azeem (@BeloetsjNasir) October 25, 2025I don’t know if it was slip of tongue, but this is amazing! Salman Khan separates “people of Balochistan” from “people of Pakistan” . pic.twitter.com/dFNKOBKoEz— Smita Prakash (@smitaprakash) October 19, 2025 -
ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ
కర్నూలు (హాస్పిటల్)/ రావులపాలెం/ఇంకొల్లు(చినగంజాం): ఒక్కగానొక్క కుమారుడిని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. వారి ఆశలను నెరవేర్చి ఆ యువకుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి కుటుంబానికి తోడుగా నిలబడ్డాడు. బస్సు ప్రమాదం ఆ యువకుడిని కబళించింది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన సీహెచ్.శ్రీనివాసరావు బ్యాంకులో అప్రెంటిస్‌గా పని చేస్తున్నారు. ఆయనకు భార్య విజయలక్ష్మి, కుమారుడు మేఘనాథ్‌తో పాటు ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఈ కుటుంబం హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. మేఘనాథ్ బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా ఉంటున్నాడు. దీపావళి పండుగకు హైదరాబాద్‌కు వచ్చిన మేఘనాథ్.. తిరిగి గురువారం రాత్రి బెంగళూరు బయలుదేరాడు. బస్సు ఎక్కానని రాత్రి 10.30 గంటలకు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. అవే అతని చివరి మాటలయ్యాయి. అదే అతనికి చివరి పుట్టినరోజు ఒడిశా రాష్ట్రం రాయగఢ్ జిల్లా అంబోదల ప్రాంతానికి చెందిన కె.దీపక్‌కుమార్ (24) బెంగళూరులోని కేపీఎంజీ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతని తండ్రి కె.శ్రీనివాసరావు, తల్లి కె.లీలారాణి ఉద్యోగ రీత్యా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. దీపక్‌కుమార్ తన పుట్టిన రోజు 16వ తేదీతో పాటు దీపావళి పండుగను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకునేందుకు ఇటీవల హైదరాబాద్ వచ్చాడు. పుట్టిన రోజుతో పాటు పండుగను ఎంతో సంతోషంగా జరుపుకున్నాడు. ఆ ఆనంద క్షణాలను మూట గట్టుకుని బెంగళూరుకు గురువారం రాత్రి పయనమయ్యాడు. తాను బస్సెక్కానని ఇంటికి మెసేజ్ కూడా పెట్టాడు. బస్సు ప్రమాదం అతనికి ఇదే చివరి పుట్టిన రోజుగా మారుస్తుందని ఊహించలేకపోయాడు. తల్లీ కూతురు మృతి హైదరాబాద్‌కు చెందిన చందన బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది. ఆమె ఇటీవల దీపావళి పండుగ కోసం హైదారాబాద్‌కు వచ్చింది. ఎంతో వైభవంగా ఆమె కుటుంబ సభ్యులతో దీపావళి పండుగను జరుపుకుంది. అయితే తిరిగి బెంగళూరుకు వెళ్లేందుకు తల్లి సంధ్యారాణిని కూడా తన వెంట తీసుకెళ్లింది. దీంతో రోడ్డు ప్రమాదంలో బస్సు దగ్ధం కావడంతో ఇద్దరూ విగత జీవులుగా మిగిలారు. మళ్లీ త్వరలో వస్తానంటూ.. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభికి చెందిన చిట్టోజు మేఘనాథ్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఆయన తండ్రి శ్రీనివాసాచారి గ్రామంలోని ఐఓబీలో బంగారం తూకం వేసే ఉద్యోగి. మేఘనాథ్ భార్య, ఇద్దరు పిల్లలు హైదరాబాద్‌లో ఉంటున్నారు. వీకెండ్లో మేఘనాథ్ నగరానికి వచ్చి వెళుతుంటాడు. ఇటీవల దీపావళి సెలవులకు వచ్చిన మేఘనాథ్.. బెంగళూరు వెళ్లేందుకు ట్రావెల్స్ బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కాక ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు. మళ్లీ త్వరలో వస్తానని పిల్లలకూ చెప్పాడు. ఇది జరిగిన కొన్ని గంటలకే మేఘనాథ్ మృత్యు ఒడికి చేరాడని తెలిసి ఆ కుటుంబం రోదన వర్ణనాతీతం. మేఘనాథ్ తల్లిదండ్రులు శ్రీనివాసాచారి, విజయలక్ష్మి, చెల్లి యశ్వని ఘటనా స్థలానికి వెళ్లి గుండెలవిసేలా రోదించారు. వల్లభిలో విషాదం అలుముకుంది. -
ప్రపంచ జ్ఞానామృతం భగవద్గీత
బీజింగ్: భగవద్గీత జ్ఞానామృతమంటూ ప్రశంసలు చైనా పండితులు కురిపించారు. ఆధునిక కాలంలో ప్రజలు ఎదుర్కొనే ఆధ్యాత్మిక, భౌతిక సమస్యలకు సమాధానాలు ఇందులో ఉన్నాయన్నారు. భగవద్గీత భారతీయ నాగరికత సూక్ష్మ చరిత్ర వంటిదంటూ శ్లాఘించారు. ఈ ప్రాచీన భారతీయ గ్రంథరాజంపై చైనీయులు ఇలా బహిరంగంగా గౌరవాన్ని ప్రకటించడం అరుదైన విషయంగా చెబుతున్నారు. శనివారం చైనా రాజధాని బీజింగ్‌లో భారత దౌత్యకార్యాలయం ‘సంగమమ్– భారతీయ తాత్విక సంప్రదాయాలు’అంశంపై నిర్వహించిన చర్చాగోష్టిలో పలువురు పండితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు గీతను భారతీయ తత్వశాస్త్ర విజ్ఞాన సర్వస్వంగా అభివరి్ణంచారు. ఆధ్యాత్మిక, భౌతిక అన్వేషణల మధ్య సామరస్యాన్ని సాధించేందుకు భగవద్గీత ఎంతో సాయంగా ఉంటుందన్నారు. భగవద్గీతను చైనీస్ భాషలోకి తర్జుమా చేసిన ప్రొఫెసర్ ఝాంగ్ బావోషేంగ్(88) ఈ కార్యక్రమంలో కీలక ప్రసంగం చేశారు. భగవద్గీతను భారతదేశ ఆధ్యాత్మిక ఇతిహాసం, తాత్విక విజ్ఞాన సర్వస్వంగా ఆయన పేర్కొన్నారు. ఇది నేటికీ భారతీయ జీవనాన్ని తీర్చిదిద్దుతోందని చెప్పారు. ప్రొఫెసర్ ఝాంగ్ భారత్‌లో 1984–86 సంవత్సరాల మధ్య గడిపిన తన అనుభవాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. దక్షిణాగ్రాన కన్యాకుమారి నుంచి ఉత్తరాన ఉన్న గోరఖ్‌పూర్ వరకు ప్రతిచోటా శ్రీకృష్ణుని ఉనికిని, ఒక సజీవ నైతిక, ఆధ్యాత్మిక ఆదర్శాన్ని ప్రత్యక్షంగా గమనించానన్నారు. జెజియాంగ్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ఓరియంటల్ ఫిలాసఫీ రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వాంగ్ ఝి–చెంగ్ మాట్లాడుతూ.. 5 వేల ఏళ్ల క్రితం ప్రాచీన భారతీయ యుద్ధరంగంలో జరిగిన సంభాషణ అయిన భగవద్గీత, నేడు ప్రజలు ఎదుర్కొంటున్న ఆందోళనలు, అనేక గందరగోళాలకు సైతం సరైన సమాధానాలను ఇస్తూ కాలాతీతంగా మారిందన్నారు. కార్యక్రమానికి వచ్చిన పండితులకు భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్ ఘనస్వాగతం పలికారు. గతేడాది తమ దౌత్య కార్యాలయం రామాయణంపై ఏర్పాటు చేసిన సదస్సుకు కొనసాగింపుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన న్యూజిలాండ్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's WC 2025) ఇవాళ (అక్టోబర్ 26) ఉదయం మొదలైన నామమాత్రపు మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు (England vs New Zealand) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడంతో ఆ జట్టు 38.2 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది.ఇంగ్లండ్ బౌలర్లలో లిండ్సే స్మిత్ 3, కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్, అలైస్ క్యాప్సీ తలో 2, ఛార్లీ డీన్, సోఫీ ఎక్లెస్టోన్ చెరో వికెట్ పడగొట్టారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జార్జియా ప్లిమ్మర్ (43) టాప్ స్కోరర్‌గా నిలువగా.. అమేలియా కెర్ (35), కెప్టెన్ సోఫీ డివైన్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.సూజీ బేట్స్ 10, బ్రూక్ హ్యాలీడే 4, మ్యాడీ గ్రీన్, ఇసబెల్లా గేజ్, జెస్ కెర్ 10, రోస్‌మేరీ మైర్ డకౌట్, లియా తహుహు 2 పరుగులకు ఔటయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ త్వరగా మ్యాచ్ ముగించే దిశగా సాగుతోంది. 10 ఓవర్లలో ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. ఇంగ్లండ్ గెలుపుకు మరో 119 పరుగులు కావాలి. యామీ జోన్స్ (20), ట్యామీ బేమౌంట్ (26) క్రీజ్‌లో ఉన్నారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో సెమీస్ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. అక్టోబర్ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్‌లో భారత్, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి. ఈ మెగా టోర్నీ ఫైనల్ (నవీ ముంబై) నవంబర్ 2న జరుగుతుంది.చదవండి: హ్యారీ బ్రూక్ ఐకానిక్ శతకం వృధా -
ఇదేదో భలే ఉందే.. డ్యాన్స్ చూస్తూ ట్రంప్ మార్క్ స్టెప్పులు
కౌలాలంపూర్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా రోజులు తర్వాత మళ్లీ ఫుల్ జోష్‌లో కనిపించారు. ఆనందంలో డ్యాన్స్ చేస్తూ కేరింతలు కొట్టారు. మలేషియా పర్యటనలో భాగంగా ట్రంప్ ఇలా స్టెప్పులు వేయడం విశేషం. ట్రంప్ డ్యాన్స్(Trump Dance Video) వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఆసియాన్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)మలేసియా పర్యటనకు వెళ్లారు. అమెరికా నుంచి దాదాపు 23 గంటల పాటు విమాన ప్రయాణం చేసిన ట్రంప్.. ఆదివారం కౌలాలంపూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం (Malaysian Prime Minister Anwar Ibrahim) ఘన స్వాగతం పలికారు. అయితే, ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి కిందకు దిగగానే ట్రంప్ రెడ్ కార్పెట్‌పై నడుచుకుంటూ వస్తుండగా.. అక్కడ ఓ బృందం మలేషియా సంప్రదాయ నృత్యం చేస్తోంది.Such a beautiful arrival ceremony for President Trump in Malaysia 🇺🇸🇲🇾 - and he broke out the Trump Dance!🎥: @MargoMartin47 pic.twitter.com/igTo36ofBs— Monica Crowley (@MonicaCrowley) October 26, 2025దీంతో, వారి సంగీతం, నృత్యం ట్రంప్‌కు నచ్చడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టులో డ్యాన్స్ చేస్తున్న వారిపైపు నడిచి ట్రంప్ తన మార్క్ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. ఇక అతిథి ట్రంప్‌తో పాటు.. మలేషియా ప్రధాని అన్వర్ కూడా సంగీతానికి అనుగుణంగా స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా.. ఆసియాన్ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు ట్రంప్.. మలేషియా పర్యటనకు వచ్చారు. ఈ సమావేశంలో భారత ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రసంగించనున్నారు. ఆసియాన్ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, జపాన్ కొత్త ప్రధాని తకాయిచి, దక్షిణ కొరియా నేతలు కూడా పాల్గొననున్నారు. -
సౌత్ సినిమాలు ఇప్పటికైనా చూస్తున్నారు: ప్రియమణి
ఇప్పుడంటే దక్షిణాది సినిమాలను దేశమంతా ఎగబడి చూస్తున్నారు కానీ, ఒకప్పుడు ఇక్కడి సినిమాలను పెద్దగా పట్టించుకునేవారు కాదు! ఈ పరిస్థితి మారినందుకు ఆనందంగా ఉందని చెప్తోంది హీరోయిన్ ప్రియమణి (Priyamani). దశాబ్ద కాలంగా పాన్ ఇండియా స్థాయిలో దక్షిణాది సినిమాలు ఆడుతున్నందుకు సంతోషం వ్యక్తం చేసింది. అందుకు హ్యాపీఇండియా టుడేతో ప్రియమణి మాట్లాడుతూ.. జనాలు ఇప్పటికైనా దక్షిణాది సినిమా (South Indian Movies)లను చూస్తున్నందుకు హ్యాపీ. ప్రాంతీయ భాషా చిత్రాలను ఎంతో బాగా ఆదరిస్తున్నారు. అక్కడ ఎప్పటినుంచో మంచి సినిమాలున్నాయి. కానీ, గతంలో వాటికంత ప్రాధాన్యత దక్కకుండా పోయింది. ప్రతి భాషలోనూ అద్భుతమైన సినిమాలు వస్తూనే ఉంటాయి. కాకపోతే వాటి గురించి ఎవరూ మాట్లాడేవారు కాదు. ఇప్పుడలాంటి చిత్రాలు భారీ విజయాలు అందుకోవడం నిజంగా గొప్ప విషయం. గీత చెరిగిపోవాలని కోరుకుంటున్నాసినిమాలే కాదు, దానికోసం పని చేసిన నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్ల గురించి కూడా చర్చించుకుంటున్నారు. ఇది మంచి పరిణామం. ప్రాంతీయ సినిమాకు, హిందీ సినిమాకు మధ్య ఉన్న అడ్డుగోడలు నెమ్మదిగా తొలగిపోతున్నాయి. ఏదో ఒకరోజు ఆ సరిహద్దులు పూర్తిగా చెరిగిపోవాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియమణి ద ఫ్యామిలీ మ్యాన్ 3 వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.చదవండి: ఆయేషాకు టైఫాయిడ్, డెంగ్యూ.. తనూజ కోసం వెక్కెక్కి ఏడ్చిన కల్యాణ్ -
పిల్లలతో తీసిన హారర్ సినిమా.. వాళ్లు చూడకపోవడమే బెటర్!
హారర్ సినిమా అంటే ఓ రేంజులో భయపెట్టాలి. మొదటి సీన్ నుంచే మనల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లిపోవాలి. కానీ మన దగ్గర రీసెంట్ టైంలో తీసే మూవీస్‌లో చాలావరకు అలాంటి మ్యాజిక్ చేయలేకపోతున్నాయి! అందుకే మూవీ లవర్స్.. కొరియన్, హాలీవుడ్ హారర్ చిత్రాల వెంటపడుతున్నరు. ఇప్పుడు అలాంటి వాళ్లని ఓ గుజరాతీ సినిమా తెగ భయపెట్టేస్తోంది. అదే 'వష్ 2'. ఇది ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఈ మూవీ సంగతేంటి? ఎలాంటి థ్రిల్ ఇచ్చిందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: 'కురుక్షేత్ర' రివ్యూ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వొద్దు)2023లో గుజరాతీలో 'వష్' అనే సినిమా రిలీజైంది. వశీకరణం స్టోరీతో వచ్చిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఇది. దీన్ని హిందీలో అజయ్ దేవగణ్ 'సైతాన్' పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. దీంతో 'వష్' గురించి అందరికీ తెలిసింది. ఇప్పుడు ఆ దర్శకనిర్మాతల నుంచి సీక్వెల్ వచ్చింది. 'వష్ లెవల్ 2' పేరుతో తీశారు. ఇది ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. గుజరాతీతో పాటు హిందీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.కథేంటి?తొలి భాగానికి కొనసాగింపుగా 'వష్ 2' మొదలవుతుంది. మొదటి భాగంలో మాంత్రికుడికి ఉన్న శిష్యుడు.. ఓ స్కూల్లో చదివే 50 మందికి పైగా అమ్మాయిలని వశీకరణం ద్వారా తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. ఇతడి వశంలో ఉన్న కొందరు అమ్మాయిలు.. స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటారు. మరికొందరైతే ఊరిమీద పడి జనాలని దారుణంగా చంపేస్తుంటారు. అసలు దీనంతటికీ మూలకారణం ఏంటి? ఆ మాంత్రికుడి శిష్యుడిని ఎవరు ఎదుర్కొన్నారు? చివరకు అమ్మాయిలు బతికి బయటపడ్డారా లేదా అనేది మిగతా స్టోరీ.స్కూల్ పిల్లలు, ఓ మాంత్రికుడు, దుష్టశక్తులు.. ఇదే 'వష్ 2' సినిమా మెయిన్ ప్లాట్. వింటుంటేనే వామ్మో అనిపిస్తుంది కదా! అయినా పిల్లలతో హారర్ మూవీ ఎవరైనా తీస్తారా అని మీరు అనుకోవచ్చు. కానీ చూస్తున్నంతసేపు ఓవైపు భయమేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందా అనే ఆత్రుత మరోవైపు కలుగుతూ ఉంటుంది. చెప్పాలంటే లోకల్‌గా తీసినప్పటికీ హాలీవుడ్ రేంజ్ కంటెంట్ డెలివరీ చేశారని చెప్పొచ్చు.ఆగస్టులో ఈ సినిమా థియేటర్లలో రిలీజైతే.. అదే నెలలో 'వెపన్స్' అనే హాలీవుడ్ మూవీ కూడా విడుదలైంది. విచిత్రం ఏంటంటే ఈ రెండింటి కాన్సెప్ట్ దాదాపు ఒక్కటే. కొన్ని షాట్స్ అయితే అరే ఒకేలా ఉన్నాయేంటి అని కచ్చితంగా అనిపిస్తుంది. ఒకే నెలలో రిలీజ్ కావడం వల్ల కాపీ అనే ప్రసక్తి రాదు. సరే 'వష్ 2' విషయానికొస్తే ఓ స్కూల్, ఉదయం కాగానే వచ్చే పిల్లల సందడితో సినిమా మొదలవుతుంది. సరిగ్గా 13 నిమిషాల తర్వాత నుంచి అసలు కథ మొదలవుతుంది. పదిమంది ఆడపిల్లలు.. బిల్డింగ్ పైకెక్కి అక్కడినుంచి దూకి చనిపోతారు. అలా మొదలయ్యే టెన్షన్, థ్రిల్.. ఎండ్ కార్డ్ పడేవరకు ఆపకుండా ఉంటుంది.కేవలం 100 నిమిషాలు మాత్రమే ఉండే ఈ సినిమా.. చూస్తున్నంతసేపు మనల్ని సీటు అంచున కూర్చోబెడుతుంది. సినిమా అంతా భయంకరమైన, షాకింగ్ విజువల్స్ ఉంటాయి. మోనాల్ గజ్జర్ తప్పితే తెలుగు ప్రేక్షకులకు తెలిసిన మరో ముఖం లేదు. అయినా సరే ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. పిల్లలందరూ యాక్టింగ్ అదరగొట్టేశారు. వీళ్లకు తోడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత భయపెడుతుంది. చిన్న చిన్న సౌండ్స్ కూడా సినిమాని మరింత ఎలివేట్ చేశాయి.అన్ని ప్లస్సులేనా మైనస్సులు ఏం లేవా అంటే ఉన్నాయి. చాలా హింసాత్మక సన్నివేశాలున్నాయి. వాటిలో టీనేజీ పిల్లలు ఉండటం కొందరికి ఇబ్బందిగా అనిపించొచ్చు. సెన్సిటివ్‌గా ఉండేవారు ఈ మూవీ చూడకపోవడమే మంచిది. మొదటి పార్ట్‌లో ఏదైతే స్టోరీ ఉందో దాన్ని అటుతిప్పి ఇటుతిప్పి చూపించినట్లు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు కూడా అంతంత మాత్రంగానే అనిపిస్తాయి. కానీ ఓవరాల్‌గా మాత్రం మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. మంచి హారర్ సినిమా చూద్దామనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ కావొద్దు.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ సర్వైవల్ థ్రిల్లర్.. డోంట్ మిస్) -
‘కీలక ఖనిజాల’పై పరిశోధనలకు మరింత ఊపు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ భవిష్యత్ అవసరాలకు అత్యంత ముఖ్యమైన ‘కీలక ఖనిజాల’రంగంలో పరిశోధన, అభివృద్ధిని బలోపేతం చేసేందుకు కేంద్ర గనుల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (ఎన్సీఎంఎం) కింద మరో రెండు ప్రతిష్టాత్మక సంస్థలకు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’(సీఓఈ) హోదాను కల్పించింది. ఈ జాబితాలో హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (సీ–మెట్), బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) చేరాయి. దీంతో ఈ హోదా పొందిన మొత్తం సంస్థల సంఖ్య 9కి పెరిగింది. ఇటీవల కేంద్ర గనుల శాఖ కార్యదర్శి పియూష్ గోయల్, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరందీకర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఈ మేరకు ఆమోదముద్ర వేశారు. గుర్తింపు పొందిన ఈ సంస్థలు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారిస్తాయి. ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక కన్సార్టియంగా పనిచేస్తుంది. ఇందులో కనీసం ఇద్దరు పరిశ్రమ భాగస్వాములను, ఇద్దరు ఆర్అండ్డీ/విద్యాసంస్థల భాగస్వాములు ఉంటారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల్లో జరిగే పరిశోధనల్లో కనీసం 90 పరిశ్రమలు, విద్యా/పరిశోధన సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయని గనుల శాఖ తెలిపింది. -
భారత్ పక్కలో చైనా మిసైల్ బల్లెం
న్యూఢిల్లీ: కయ్యాలమారి చైనా ఒకవైపు భారత్‌కు స్నేహ హస్తం అందిస్తున్నట్టు నటిస్తూనే మరోవైపు సరిహద్దుల్లో భారీగా ఆయుధ వ్యవస్థలను మోహరిస్తోంది. టిబెట్‌లోని పాంగాంగ్ సరస్సు తూర్పు ఒడ్డున, వాస్తవాధీన రేఖకు కేవలం 65 కిలోమీటర్ల దూరంలోనే అత్యాధునిక గగన రక్షణ వ్యవస్థ బేస్‌ను నిర్మిస్తోంది. సకల వసతులతోపాటు భారీ ఆయుధాలు, క్షిపణులు మోహరించేలా దీని నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేస్తోంది. ఈ బేస్‌ను మొదట అమెరికాకు చెందిన ఆల్సోర్స్ అనాలిసిస్ అనే సంస్థ గుర్తించింది. శాటిలైట్ చిత్రాల ద్వారా బేస్‌ను కనిపెట్టింది. 2020లో భారత్–చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన గస్తీ పాయింట్‌కు ఈ ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ 110 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. గార్ కౌంటీలో ఉన్న ఈ కేంద్రం భారత్‌లో ఇటీవల ఆధునీకరించిన న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌కు సరిగ్గా ఎదురుగా ఉంటుంది. భారీ క్షిపణులకు కేంద్రంగా.. ఉపగ్రహ చిత్రాలను బట్టి చూస్తే ఈ కాంప్లెక్స్‌లో భారీ కమాండ్ అండ్ కంట్రోల్ భవనాలు, బ్యార్లు, వాహనాలు నిలిపి ఉంచే షెడ్లు, ఆయుధ నిల్వ గోదాములు, రాడార్ సిస్టంలు ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా క్షిపణి లాంచింగ్ వాహనాలను రహస్యంగా దాచి ఉంచేందుకు భారీ బంకర్ వంటి భవనాలను నిర్మిస్తున్నారు. ఈ భవనాలకు ముందుకు వెనుకకు జరుపగల పైకప్పును అమర్చినట్లు నిపుణులు గుర్తించారు. అంటే ఆ భవనంలో దాగి ఉన్న వాహనం నుంచి క్షిపణిని ప్రయోగించాలనుకుంటే వెంటనే భవనం పైకప్పు పక్కకు జరుగుతుంది. క్షిపణి ప్రయోగం పూర్తికాగానే మళ్లీ యథాస్థానానికి చేరుకుంటుంది. శత్రువు నిఘాకు దొరక్కుండా తమ క్షిపణి వ్యవస్థలను దాచేందుకు ఈ భవనాలను నిర్మిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఒక్కో బంకర్ రెండు వాహనాలను నిలిపి ఉంచగల భారీ విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ బంకర్ భవనాల్లో చైనా దీర్ఘశ్రేణి సర్ఫేస్ టు ఎయిర్ (భూ ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల క్షిపణి) హెచ్‌క్యూ–9 క్షిపణి వ్యవస్థలను మోహరించనున్నట్లు ఇంటెలిజెన్స్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆల్సోర్స్ అనాలిసిస్ సంస్థ ఈ కాంప్లెక్స్‌ను బహిర్గతం చేసిన తర్వాత అమెరికాకే చెందిన గగనగల ఇంటెలిజెన్స్ కంపెనీ వంటార్కు చెందిన ఓపెన్‌సోర్స్ ఇంటెలిజెన్స్ టీం (ఓఎస్ఐఎన్టీ) మరింత కచ్చితమైన చిత్రాలను సేకరించింది. సెపె్టంబర్ 29న తీసిన శాటిలైట్ చిత్రాల్లో కొన్ని బంకర్ భవనాల పైకప్పులు క్షిపణి ప్రయోగానికి అనువుగా తెరిచి ఉండగా, కొన్నింటికి మూసి ఉండటం కనిపించింది. ‘ఈ రకమైన భవనాలు చైనా క్షిపణి వ్యవస్థలకు అన్ని రకాలుగా రక్షణ ఇస్తాయి. అంతేకాకుండా శత్రువుల ఎదురుదాడి నుంచి తన క్షిపణి వ్యవస్థలను రక్షిస్తాయి. మామూలు సమయంలో అక్కడ మిసైల్ లాంచర్స్ ఉన్నట్లు గుర్తించటం కూడా కష్టమే’అని ఆల్సోర్స్ అనాలిసిస్ సంస్థ పేర్కొంది. చైనా గతంలో ఇలాంటి భవనాలనే దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ద్వీపాల్లో నిర్మించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, పాంగాంగ్ సరస్సు వద్ద చైనా చేపట్టిన ఈ నిర్మాణాలను గత జూలైలోనే డామియెన్ సైమన్ అనే జియోస్పేషియల్ పరిశోధకుడు గుర్తించాడు. కానీ, అప్పుడు అక్కడ ఏం నిర్మిస్తున్నారన్నది తెలియలేదు. -
Delhi: సీఎం రేవంత్ నివాసంలోకి అధికారిణికి అనుమతి నిరాకరణ
ఢిల్లీ: హర్ష భార్గవి.. తెలంగాణ ప్రభుత్వ సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ(I&PR)లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఇటీవల న్యూఢిల్లీకి బదిలీ అయి, రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO)గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆమెకు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ఈరోజు(శనివారం, అక్టోబర్ 25వ తేదీ) ఢిల్లీలోని సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్లారు. అయితే అక్కడ పోలీస్ సిబ్బంది ఆమెను గేట్ వద్దే నిలిపేశారు. ఆమెను సీఎం నివాసం లోపలికి వెళ్లేందుకు అనుమంతిచలేదు. ఆమె ప్రభుత్వ ఉద్యోగిగా తనను పరిచయం చేసినప్పటికీ, పర్మిషన్ ఇవ్వలేదు. ఆమె ప్రశ్నించగా, అరెస్ట్ చేస్తామని బెదిరింపులకు దిగారు. దాంతో ఆమె కంటతడి పెట్టుకున్నారు. ఇదీ చదవండి:ఓటర్ల జాబితాపై సమీక్ష.. తెలంగాణలో SIR
