breaking news
-
ప్రయాణికుల వాహన ఎగుమతులు అప్
ప్రయాణికుల వాహన ఎగుమతులు సెప్టెంబర్ త్రైమాసికంలో (2025–26 క్యూ2) జోరందుకున్నాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన గణాంకాలతో పోల్చి చూస్తే ఏకంగా 18 శాతం పెరిగి 4,45,884 యూనిట్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఎగుమతులు 3,76,679 యూనిట్లుగా ఉండడం గమనార్హం.ప్యాసింజర్ కార్ల జోరుప్యాసింజర్ కార్ల ఎగుమతులు 2,29,281 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఎగుమతులు 2,05,091 యూనిట్లతో పోల్చి చూస్తే 12 శాతం పెరిగాయి. యుటిలిటీ వాహన ఎగుమతులు ఏకంగా 26 శాతం వృద్ధి చెంది 2,11,373 యూనిట్లకు చేరాయి. వ్యాన్ల ఎగుమతులు 36.5 శాతం పెరిగి 5,230 యూనిట్లుగా ఉన్నాయి.మారుతి 40 శాతం వృద్ధిప్యాసింజర్ వాహన ఎగుమతుల్లో మారుతి సుజుకీ ఒక్కటే 2,05,763 యూనిట్లను ఎగుమతి చేసింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ ఎగుమతులు 1,47,063 యూనిట్లుగానే ఉన్నాయి. దీంతో పోల్చి చూస్తే 40 శాతం వృద్ధి నమోదైంది. హ్యాందాయ్ మోటార్ ఇండియా 99,540 యూనిట్లను ఎగుమతి చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 17 శాతం అధికంగా ఎగుమతి చేసింది. నిస్సాన్ మోటార్ ఇండియా 37,605 యూనిట్లను ఎగుమతి చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ ఎగుమతులు 33,059 యూనిట్లుగా ఉన్నాయి. ఫోక్స్‌వ్యాగన్ ఇండియా 28,011 యూనిట్లు, టయోటా కిర్లోస్కర్ మోటార్ 18,880 యూనిట్లు, కియా ఇండియా 13,666 యూనిట్లు, హోండా కార్స్ ఇండియా 13,243 యూనిట్లు చొప్పున సెప్టెంబర్ త్రైమాసికంలో ఎగుమతి చేశాయి. స్థిరమైన డిమాండ్అంతర్జాతీయంగా స్థిరమైన డిమాండ్ వల్లే ఎగుమతులు బలంగా నమోదైనట్టు ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) ప్రకటించింది. ముఖ్యంగా మధ్యప్రాచ్యం, ల్యాటిన్ అమెరికా ప్రాంతాల్లో బలమైన డిమాండ్ ఉన్నట్టు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో భారత ఆటోమొబైల్ సంస్థలు 24 దేశాలకు సంబంధించి ఎగుమతుల పరంగా సానుకూల వృద్ధిని నమోదు చేయడం దీన్ని సూచిస్తున్నట్టు పేర్కొంది.ఇదీ చదవండి: అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం.. క్లెయిమ్ ప్రాసెస్ ఎలా? -
అందులో అసభ్యత ఎక్కడుంది: లియో నటి
బహు భాషా కథానాయికల్లో ఒకరు నటి మడోనా సెబాస్టియన్(Madonna Sebastian). ఈ మాలీవుడ్ బ్యూటీ మాతృభాషతో పాటు కన్నడం, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ దక్షిణాది కథానాయకిగా గుర్తింపు పొందారు. తమిళంలో విజయ్ సేతుపతికి కాదలుమ్ కడందు పోగుమ్, కవన్, జూంగా చిత్రాల్లో నటించారు. అదేవిధంగా ఇటీవల ప్రభుదేవా సరసన జాలీ ఓ జింఖానా చిత్రంలో నటించారు. అయితే తన 13 ఏళ్ల కెరీర్లో చాలా తక్కువ చిత్రాల్లోనే నటించారు. ఏదేమైనా ఎందుకనో అనుకున్న స్థాయిలో క్రేజ్ తెచ్చుకోలేక పోయారు. ఇటీవల లియో చిత్రంలో విజయ్‌కు చెల్లెలిగా నటించారు. హీరోయిన్లకు అవకాశాలు రావాలంటే ఇప్పుడు ఏకైక మార్గం గ్లామర్‌గా మారింది. ఇందుకు నటి మడోనా సెబాస్టియన్ అతీతం కాదనిపించారు. ఇటీవల గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ వార్తలో నానుతున్నారు. ఇదే క్రమంలో నెటిజన్ల విమర్శలను ఎదుర్కొంటున్నారు. అయితే విమర్శలు హీరోయిన్లకు కొత్తవి కాదు కాబట్టి ఈ అమ్మడు కూడా వాటిని తిప్పి కొడుతున్నారు. పైగా అందాలు ఆరబోత తప్పేమీ కాదు అంటూ సమర్ధించుకుంటున్నారు. గ్లామర్‌కు అసభ్యతకు మధ్య వ్యత్యాసం తెలిస్తే చాలు అని అన్నారు. గ్లామర్‌ను విమర్శించడానికి ఏమీ లేదన్నారు. మొత్తం మీద తను గ్లామర్‌కు గేట్లు తెలిసినట్లు ఈ అమ్మడు చెప్పకనే చెప్పారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) -
హైదరాబాద్ నడిబొడ్డున కాల్పుల కలకలం
సాక్షి, హైదరాబాద్/సుల్తాన్ బజార్: హైదరాబాద్ నడిబొడ్డున శనివారం తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. నగరంలో కరడుగట్టిన దొంగ అన్సారీ ఈ కాల్పుల్లో గాయపడ్డాడు. సెల్ ఫోన్ చోరీచేసి అతడు పారి పోతుండగా సౌత్ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్యకుమార్ గమనించి తన గన్‌మ్యాన్‌తో కలిసి పట్టుకునేందుకు ప్రయత్నించగా అన్సారీ తిరగబడి కత్తితో దాడి చేశాడు. ఆత్మరక్షణ కోసం చైతన్యకుమార్ తన గన్ మ్యాన్ వద్ద ఉన్న తుపాకీని తీసుకొని కాల్పులు జరపడంతో అన్సారీ తీవ్రంగా గాయపడ్డాడు. డీసీపీ, గన్‌మ్యాన్‌లకు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ముగ్గురిని వేర్వేరు ఆస్పత్రుల్లో చేర్పించారు. ఘటనాస్థలిని హైదరాబాద్ పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనార్ సందర్శించారు. తన కంట పడిన నేరగాడిని పట్టుకోవడానికి ఓ ఐపీఎస్ అధికారి ఛేజింగ్ చేయడం, కాల్పులు జరపడం నగర పోలీసు చరిత్రలో ఇదే తొలిసారి.ఘరానా నేరగాడు మహ్మద్ ఒమర్ అన్సారీ...నగరంలోని కామాటిపుర ప్రాంతానికి చెందిన మహ్మద్ ఒమర్ అన్సారీపై టప్పాచబుత్ర, కామాటిపుర, మైలార్‌దేవ్‌పల్లి, శివరాంపల్లి, చార్మినార్, బహదూర్‌పుర, అఫ్జల్‌గంజ్, ఉప్పల్, హుస్సేనిఆలం, ఫలక్‌నుమా, కాలాపత్తర్ ఠాణాల్లో 20 కేసులు ఉన్నాయి. వీటిలో చైన్ స్నాచింగ్, చోరీ, బెదిరింపులు తదితర నేరాలపై నమోదైనవే అధికం. అతడిపై పోలీసులు గతంలో రెండుసార్లు పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఆయా సందర్భాల్లో ఏడాది చొప్పున జైలులో గడిపి వచ్చినా అన్సారీ తన పంథా మార్చుకోలేదు. ఇటీవల మరో నిందితుడితో కలిసి సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్నాడు. రద్దీ ప్రాంతాలతో పాటు నిర్మానుష్యంగా ఉన్న చోటు మాటు వేసి అటుగా వచ్చే వారి సెల్ఫోన్లు లాక్కుపోతున్నాడు. ఇతడితో కలిసి నేరాలు చేస్తున్నది కూడా పాతబస్తీకి చెందిన పాత నేరగాడిగా తెలుస్తోంది. వీళ్లిద్దరూ పోలీసులకు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్నారు. నేరం చేస్తుండగా గుర్తించి.. 500 మీటర్లు వెంబడించి...నగరంలోని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా పని చేస్తున్న ఎస్.చైతన్య కుమార్ శనివారం మధ్యాహ్నం వ్యక్తిగత పనిపై సైదాబాద్‌లోని కార్యాలయం నుంచి బయటకు వెళ్లారు. సాయంత్రం సుల్తాన్‌బజార్ మీదుగా చాదర్‌ఘాట్ చౌరస్తా వైపు వస్తున్నారు. ఈయన వాహనం కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళ యూనివర్సిటీ వద్దకు చేరుకునే సమయానికి అన్సారీ, మరో నేరగాడితో కలిసి ఆటోలో వెళ్తున్న వ్యక్తి వద్ద సెల్‌ఫోన్ దొంగిలించి పారిపోతున్నారు. వారిని గమనించిన చైతన్యకుమార్ తన వాహనం నుంచి కిందకు దిగి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆయన వెంటే గన్‌మ్యాన్ సైతం వాహనం నుంచి బయటకు వచ్చారు. వారిని తోసేసిన అన్సారీ, మరో నిందితుడు తలోదిక్కు పారిపోయారు. అన్సారీ ఇసామియా బజార్ మీదుగా పారిపోతుండగా డీసీపీ అతడిని ఛేజ్ చేసుకుంటూ విక్టోరియా ప్లే గ్రౌండ్ వరకు దాదాపు 500 మీటర్లు పరిగెత్తారు. ఆయన వెంటనే గన్‌మ్యాన్ కూడా వచ్చారు. అక్కడ ఓ భవనం ఎక్కిన అన్సారీ తప్పించుకునే అవకాశం లేకపోవడంతో ప్లేగ్రౌండ్స్లోకి దూకేశాడు. అతడి వెంటే డీసీపీ, గన్‌మ్యాన్ కూడా గ్రౌండ్లోకి దూకారు. అక్కడ తన వద్ద ఉన్న కత్తితో గన్‌మ్యాన్, డీసీపీపై అన్సారీ దాడికి ప్రయత్నించాడు. పెనుగులాట జరిగి ముగ్గురూ కిందపడిపోయారు. అదే సమయంతో కత్తితో రెచ్చిపోవడానికి ప్రయత్నించిన అన్సారీపై గన్‌మ్యాన్ తుపాకీతో డీసీపీ రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ తూటాలు అన్సారీ చేయి, కడుపులోకి దూసుకుపోయాయి. తీవ్రగాయాలైన అన్సారీ కుప్పకూలిపోయాడు.ఆస్పత్రుల్లో చికిత్స...డీసీపీ చైతన్యకుమార్‌తో పాటు ఆయన గన్‌మ్యాన్‌కు స్వల్ప గాయాలు కావడంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. తీవ్రంగా గాయపడిన అన్సారీని బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అన్సారీ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సుల్తాన్‌బజార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్సారీతో వచ్చి పరారైన మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ ఉదంతం తర్వాత నగర పోలీసు విభాగంలోని అధికారులు, సిబ్బందిలో అవసరమైన వారికి తుపాకులు జారీ చేయాలని కొత్వాల్ సజ్జనర్ నిర్ణయించారు. కేవలం మహిళలపై జరిగే నేరాల విషయంలోనే కాకుండా ప్రతి నేరగాడి విషయంలోనూ కఠినంగానే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. నగరాన్ని నేర రహితంగా మార్చడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. -
మత్తులో కారు నడిపి ఐదుగురిని చంపేశాడు!
ఆగ్రా: సెలవులకని సొంతూరుకు వస్తున్న వ్యక్తి మద్యం మత్తులో కారు నడిపి ఐదుగురిని బలి తీసుకున్నాడు. ఈ ఘటన యూపీలోని ఆగ్రాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఆగ్రాకు చెందిన అన్షు గుప్తా(40) నోయిడాలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. సెలవుల్లో గడిపేందుకని సొంతూరుకు బయలు దేరిన అతడు మత్తులో కారు ఉన్నాడు. న్యూ ఆగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని నగ్లా బుద్ధి సమీపంలో వేగంగా నడుపుతున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన నిల్చుకున్న ఏడుగురిపైకి దూసుకెళ్లింది. వారంతా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే క్షతగాత్రుల్లో ఐదుగురు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. బాధితులంతా 20–33 ఏళ్ల వారే కావడం గమనార్హం. పోలీసులు గుప్తాను అరెస్ట్ చేసి, వాహనాన్ని సీజ్ చేశారు. -
కెనడాపై ఉరిమిన ట్రంప్.. సుంకాలు 10 శాతం పెంపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు తన ప్రతాపం చూపారు. తాజాగా కెనడియన్ వస్తువులపై సుంకాలను అదనంగా 10 శాతం మేరకు పెంచుతున్నట్లు వెల్లడించారు. దివంగత అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ నాడు సుంకాలపై చేసిన ప్రసంగానికి సంబంధించిన ఆడియో క్లిప్పులను కెనడా వినియోగించిన దరిమిలా ఆగ్రహంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పొరుగు దేశమైన కెనడా రూపొందించిన ఒక టీవీ వాణిజ్య ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి. అమెరికా ఇటీవలే కెనడాపై 35 శాతం నుంచి 50 శాతం వరకు సుంకాలు విధించింది. అయితే ఈ సుంకాల తగ్గింపుపై రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వీటిపై ఒక ఒప్పందం కుదురుతుందని కెనడా అధికారులు భావిస్తున్న తరుణంలో అందుకు భిన్నంగా జరిగింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ- డొనాల్డ్ ట్రంప్ మధ్య ఇటీవలే ఓవల్ ఆఫీస్‌లో స్నేహపూర్వక సమావేశం జరిగింది. అయితే ఇంతలోనే ఊహించని విధంగా ట్రంప్.. కెనడాతో చర్చల రద్దును ప్రకటించారు. దీనికి కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ ప్రభుత్వం ప్రసారం చేసిన ఒక టీవీ ప్రకటన అని సమాచారం. ఈ ప్రకటనలో అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ .. సుంకాలు, ఆంక్షలు దీర్ఘకాలంలో అమెరికన్లకు ముప్పు తీసుకొస్తాయని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన గత వారం రోజులుగా అమెరికా టీవీ ఛానెల్స్‌లో ప్రసారమవుతోంది.అమెరికా ప్రవేశపెడుతున్న సుంకాల విషయంలో అక్కడి సుప్రీంకోర్టు త్వరలోనే తీర్పు వెల్లడించనుంది. ఈ నేపధ్యంలో కోర్టు తీర్పును ప్రభావితం చేయాలనే ఉద్దేశంతోనే కెనడా ఈ ప్రకటనను ప్రచారంలోకి తీసుకొచ్చిందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. కాగా దీనిపై రొనాల్డ్ రీగన్ ఫౌండేషన్ కూడా స్పందించింది. సదరు ప్రకటనను ఖండించింది. ‘వారు ఈ ప్రకటనను వెంటనే తీసివేయాలి. అది మోసపూరితమైనదని తెలిసి కూడా వారు వరల్డ్ సిరీస్ సమయంలో దానిని ప్రసారం చేయడానికి అనుమతించారు’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో పేర్కొన్నారు. వాస్తవాలను తప్పుగా చూపించడంలాంటి శత్రు చర్యల కారణంగా కెనడాపై సుంకాన్ని.. వారు ఇప్పుడు చెల్లిస్తున్న దానికంటే 10 శాతం అదనంగా పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు.ఇది కూడా చదవండి: ‘మహారాష్ట్ర డాక్టర్’ కేసులో కీలక పరిణామం -
ప్రత్యక్ష నరకం!
కర్నూలు (హాస్పిటల్): ‘ఎవరి శరీరానికైనా కొంచెం నిప్పు తగిలితే సుర్రుమంటుంది. కానీ అత్యధిక వేడితో శరీరం కాలిపోతున్నా వారికి తెలియలేదంటే పరిస్థితి ఎంతటి భయానకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బస్సు మంటల్లో కాలిపోతున్నప్పుడు వెలువడిన విష వాయువులు పీల్చడం వల్ల అందులో ప్రయాణిస్తున్న వారు స్పృహ కోల్పోయారు. ఇదే సమయంలో మంటలు వారిని దహించేసి ఉంటాయి’ అని కర్నూలు మెడికల్ కాలేజ్ ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ టి.సాయిసుదీర్ వెల్లడించారు. కర్నూలు శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మంటల్లో కాలిపోయి మరణించిన విషయం తెలిసిందే. కాళ్లు, చేతులు బూడిదైపోగా.. మిగిలిన మొండేల నుంచి డీఎన్ఏ పరీక్ష కోసం శాంపిల్స్ సేకరించారు. శనివారం వరకు 18 మంది మృతుల కుటుంబీకుల నుంచి రక్త నమూనాలు సేకరించారు. వీటిని మంగళగిరిలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీకి పంపించారు. రెండు రోజుల్లో నివేదికలు రానున్నాయి. మరో గుర్తు తెలియని వ్యక్తి కుటుంబీకుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగిన బస్సును సునిశితంగా పరిశీలించిన డాక్టర్ సాయిసు«దీర్ శనివారం ‘సాక్షి’తో పలు విషయాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘వరంగల్‌లో రైలు ప్రమాదం తర్వాత ఒకేసారి మంటల్లో కాలిపోయి కుప్పగా, ముద్దగా మారిన మృతదేహాలను ఇప్పుడే చూస్తున్నా. ఘటన స్థలాన్ని చూడగానే అయ్యో పాపం.. ఏమిటీ దారుణం అని బాధపడ్డాను. కాలిన బస్సు ఎక్కి మృతదేహాలను పరిశీలించాను. బస్సు తగలబడుతున్నప్పుడు ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయాణికులు ఎంతగా ప్రయత్నించారో ఆ దృశ్యాలను చూస్తే అర్థమవుతుంది. ముందున్న తలుపు తెరుచుకోకపోవడంతో వెనుక వైపునకు వెళ్లేందుకు అందరూ ప్రయత్నించినట్లున్నారు.ఇదే సమయంలో వారిని కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రో కార్బన్స్ వంటి విపరీతమైన విష వాయువులు కమ్మేసి ఉంటాయి. ఈ వాయువులు ఒకేసారి పీల్చడం వల్ల అందరూ ఎక్కడికక్కడ స్పృహ తప్పి పడిపోయి ఉంటారు. ఇలా బస్సు మధ్యలో కొందరు, చివరలో కొందరు కుప్పకూలిపోయినట్లు కనిపించారు. అదే సమయంలో వ్యాపించిన మంటలకు వారు ఆహుతై ఉంటారు. ఇలాంటి మంటలు నిమిషాల వ్యవధిలోనే మనిషిని ముద్దగా, బొగ్గుగా మార్చేస్తాయి. దాదాపుగా అన్ని మృతదేహాలకు శరీరంలో కేవలం తల, మొండెం మాత్రమే మిగిలాయి. పుర్రెలు కనిపిస్తున్నా వాటిని ముట్టుకుంటే రాలిపోతున్నాయి. బస్సులో ఇలాంటి దృశ్యాలను చూసి చలించిపోయాను. కొద్దిసేపటి తర్వాత తేరుకుని నా వృత్తి ధర్మాన్ని నెరవేర్చేందుకు ప్రణాళిక వేసుకున్నా. ఏయే ఏర్పాట్లు కావాలో.. అక్కడున్న అధికారులకు వివరించాను. ఇందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సహకరించారు. తాత్కాలిక మార్చురీలో పోస్టుమార్టం పోస్టుమార్టం నిర్వహించేందుకు నాతో పాటు ఫోరెన్సిక్ ప్రొఫెసర్ డాక్టర్ పి.బ్రహ్మాజీ మాస్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ కె.నాగార్జున, డాక్టర్ పి.హరీష్‌కుమార్, డాక్టర్ వి.సురేఖ, డాక్టర్ ఎండి. మహమ్మద్ సాహిల్‌తో పాటు 10 మంది పీజీలు కలిసి ఆరు బృందాలుగా ఏర్పడ్డాం. ఒక్కొక్కరు మూడు చొప్పున మృతదేహాల చొప్పున పోస్టుమార్టం చేశాం. ప్రమాదం జరిగిన స్థలంలోనే తాత్కాలిక మార్చురీ గదిని ఏర్పాటు చేయించాం. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్కడ పోస్టుమార్టం నిర్వహించాం. మరికొన్ని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ గదిలో పోస్టుమార్టం నిర్వహించడంతో పాటు డీఎన్ఏ పరీక్ష కోసం నమూనాలు తీశాం. మృతదేహాల్లో కండరాల టిష్యూ, దంతాలు, తొడ ఎముకలను నమూనాలుగా సేకరించాం. మిగిలిన మృతదేహాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి కాబట్టి ఏ మృతదేహం ఎవరిదో గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్ష అనివార్యమైంది. కుటుంబ సభ్యుల డీఎన్ఏతో పోలచ్చి చూసి పోలీసుల సమక్షంలో మృతదేహాలను వారి రక్త సంబం«దీకులకు అప్పగిస్తాం. చాలా మంది శరీరాలు బొగ్గుగా, ముద్దగా, బూడిదగా మారినా, వారి శరీరాలపై ఆభరణాలు మాత్రం అలాగే ఉన్నాయి. ముఖ్యంగా మహిళల మెడల్లో మంగళసూత్రాలు, చేతి గాజులు, చైన్లు వంటివి కాలకుండా కనిపించాయి. బంగారు ఆభరణాలు కరిగిపోవాలంటే ఇంకా ఎక్కువ వేడి అవసరం. -
రూ.16 కోట్ల ఇంజక్షన్ ఇస్తేనే బతికే అవకాశం
వికారాబాదు జిల్లా: సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం సాగించే నిరుపేద తల్లిదండ్రులకు కొండంత ఆపద వచ్చిపడింది. ఒక్కగానొక్క కొడుకు అరుదైన వ్యాధి (లక్షల మందిలో ఏ ఒక్కరికో సోకే) బారిన పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. రూ.కోట్ల విలువ చేసే ఇంజక్షన్ ఇస్తే కానీ చిన్నారి బతికే అవకాశం లేదని చెప్పడంతో గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. వివరాలు ఇలా.. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం, బొంరాస్‌పేట్ మండలం వడిచర్ల పరిధిలోని ఊరెనికి తండాకు చెందిన ముడావత్ శ్రీను, గోరీబాయి దంపతులకు ముడావత్ జగన్ అనే ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. బతుకుదెరువు నిమిత్తం మూడేళ్ల క్రితం తాండూరుకు వచి్చన వీరు సాయిపూర్లో నివసిస్తున్నారు. రెండేళ్లుగా జగన్ మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. ఎన్ని ఆస్పత్రులు తిప్పినా సరైన చికిత్స అందలేదు. దీంతో అప్పు చేసి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రెయిన్బో ఆస్పత్రికి తీసుకెళ్లగా బాలుడిని పరీక్షించిన వైద్యులు.. బాబుకు అరుదైన, ప్రాణాంతక స్పైనల్ మసు్కలర్ ఆట్రోపీ (ఎస్ఎంఏ) అనే వ్యాధి సోకిందని చెప్పారు. ఇలాంటి వ్యాధి రాష్ట్రంలో ఎవరికీ లేదని, ఇది కొత్త వైరస్ వల్ల సోకిందని తెలిపారు. ఈ వ్యాధి నయం కావాలంటే జోల్జెన్స్మా అనే ఇంజక్షన్ ఇవ్వాలన్నారు. దీన్ని అమెరికా నుంచి తెప్పించాలని, ఇందుకు రూ.16 కోట్లు ఖర్చవుతుందని చెప్పడంతో బాధిత తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. ప్రతీ 12 గంటలకు ఒకసారి సిరప్ వేస్తేనే మామూలు స్థితికి వస్తున్నాడని, కొంచెం ఆలస్యమైనా ఫిట్స్ వస్తోందని కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ ఎమ్మెల్యే, సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి తమ కొడుకును బతికించాలని వేడుకుంటున్నారు. దాతలు సైతం ఆరి్ధక సాయం (ఫోన్ పే, గూగుల్ పే నంబర్ 8639157327), (ఎస్బీఐ అకౌంట్ నంబర్ 43194942778) చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. -
ఎమ్మెల్యేలకూ డీసీసీ పదవులు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక ఈ నెలాఖరు నాటికి పూర్తికావచ్చని టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలకు కూడా డీసీసీ పదవులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఆదివారం ఢిల్లీలో ఆయన విలేకరులతో చిట్‌చాట్ చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ కొన్ని సందర్భాల్లో నిక్కచి్చగా ఉండదు. పార్టీలో రెండు పదవులు ఉండొద్దు అనే నిబంధన ఉంది. కానీ, కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా డీసీసీ అధ్యక్ష పదవులు ఇచ్చే అవకాశం ఉంది. డీసీసీ అధ్యక్ష పదవికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతి కూడా దరఖాస్తు చేసుకున్నారన్న విషయం నాకు తెలియదు. ఎమ్మెల్యేలకు డీసీసీ అనేది పదవి కిందకు రాదు కాబట్టి కొంతమంది ఎమ్మెల్యేలను, కార్పొరేషన్ల చైర్మన్లను ఈ పోస్టులకు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు డీసీసీ బరిలో ఉన్నారు. నామినేటెడ్ పదవుల్లో పాత వారికే అవకాశాలు ఇవ్వాలనేది అధిష్టానం ఆలోచన. నాలుగైదు జిల్లాలకు కొత్త డీసీసీలు వస్తారు. వారం పదిరోజుల్లో డీసీసీలను ప్రకటించే అవకాశం ఉంది’అని వివరించారు.మంత్రుల వివాదం ముగిసిన అధ్యాయం రాష్ట్రంలో మంత్రుల మధ్య చోటుచేసుకున్న వివాదం ముగిసిన అధ్యాయమని మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఈ అంశంపై అధిష్టానానికి వివరణ ఇచి్చనట్టు తెలిపారు. ఎంతటివారైనా పార్టీకి లోబడి ఉండాల్సిందేనని అన్నారు. గీత దాటితే తనతోసహా ఎవరైనా అధిష్టానం నిఘాలో ఉంటారని పేర్కొన్నారు. గోడలకు కూడా చెవులుంటాయనే విషయాన్ని గ్రహించి నేతలు జాగ్రత్తగా మాట్లాలని హితవు పలికారు. ‘మంత్రుల మధ్య విభేదాలపై అధిష్టానం సీఎం రేవంత్‌రెడ్డిని అడిగారో లేదో నాకు తెలియదు. నన్ను మాత్రం అడిగారు. ఆ పంచాయితీ ముగిసిన అధ్యాయం. కొండా సురేఖ కూతురు అలా మాట్లాడాల్సింది కాదు. ఆమె పార్టీ వ్యక్తి కాదు. ఈ అంశంపై కొండా సురేఖను పిలిచి మాట్టాడి మందలించాం. మంత్రులు పొన్నం ప్రభాకర్‌గౌడ్, అడ్లూరి లక్ష్మణ్‌గౌడ్‌లు స్నేహితులు. కానీ, వారి మధ్య తలెత్తిన వివాదంతో బయట రాంగ్ మెస్సేజ్ వెళ్లింది. నాతో సహా ఎవరికైనా పార్టీనే సుప్రీం. పార్టీ నియమావళికి లోబడి పనిచేయాల్సిందే’అని స్పష్టంచేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్‌దేనని ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు ఇద్దరు భార్యలున్నారనే విషయం మీడియా ద్వారానే తనకు తెలిసిందని చెప్పారు. అది వారి వ్యక్తిగతమని పేర్కొన్నారు. ఓట్‌చోరీకి హైదరాబాద్‌లోనే బీజం.. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో 40 నుంచి 50 లక్షల ఓట్లు తొలగించారని మహేశ్‌కుమార్ ఆరోపించారు. ఓట్ చోరీకి మొదట హైదరాబాద్‌లోనే బీజం పడిందని అన్నారు. కులం మతం పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని విమర్శించారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్‌ను తాను గౌరవిస్తానని చెప్పారు. ‘ఉద్యమంలో ఆయన ముందుండి పోరాటం చేశారు. కానీ, ఆయన పదేళ్ల పరిపాలన గాడి తప్పింది. కల్వకుంట్ల కవిత పాదయాత్రను స్వాగతిస్తున్నాం. ప్రజా క్షేత్రంలో పాదయాత్రలు మంచిదే. ఆమె మొత్తం వాస్తవాలు మాట్లాడినప్పుడు గౌరవిస్తాం’అని పేర్కొన్నారు. తెలంగాణకు కేంద్రం నుంచి సహకారం లేదని తెలిపారు. మెట్రో, మూసీ ప్రక్షాళన విషయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. -
అర్హత లేకున్నా హెవీ డ్రైవింగ్ లైసెన్స్!
కారెంపూడి: కర్నూలు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 19 మంది సజీవ దహనానికి కారణమైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య అర్హత లేకున్నప్పటికీ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ప్రమాదం నేపథ్యంలో పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన లక్ష్మయ్య కుటుంబ నేపథ్యం, ప్రవర్తన, అలవాట్లపై అధికారులు ఆరా తీశారు. ఈయన 5వ తరగతి వరకే చదువుకున్నాడని, అయితే టెన్త్ ఫెయిల్ అయినట్లు సర్టిఫికెట్ ఇచ్చి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని గుర్తించారు.మొదట లారీ క్లీనర్‌గా, తర్వాత డ్రైవర్‌గా పని చేశాడు. 2004లో లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నప్పుడు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి చెట్టుకు ఢీకొనడంతో అప్పట్లో లారీ క్లీనర్ మృతి చెందాడు. ఆ తర్వాత లారీ డ్రైవర్‌గా మానేసి కొన్నాళ్లు ట్రాక్టర్ కొని స్వగ్రామంలో వ్యవసాయం చేశాడు. తర్వాత ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌గా ఏడెనిమిదేళ్ల నుంచి వెళ్తున్నాడని తెలిసింది. లక్ష్మయ్య తండ్రి రాములు రెండు నెలల కిందట మృతి చెందాడు. ఇతనికి భార్య, ఓ కుమారుడు, ఓ కుమార్తె, ఒక సోదరుడు, ఇద్దరు అక్కలు ఉన్నారు. లక్ష్మయ్యకు అప్పుడప్పుడు మద్యం సేవించే అలవాటు ఉందని సమాచారం. -
Bihar Elections: ‘20 నెలల్లో నం. వన్’: తేజస్వి యాదవ్
పట్నా: నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింతగా రాజుకుంటోంది. అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)ప్రతిపక్ష మహాఘట్ బంధన్.. రెండూ కూడా పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. అదే సమయంలో ప్రజలకు హామీలను కూడా గుప్పిస్తున్నాయి. తాజాగా పట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే కేవలం 20 నెలల్లో బీహార్‌ను నంబర్ వన్ చేస్తామని పేర్కొన్నారు.మహా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘మా ప్రచారం ప్రారంభమైంది. బీహార్ మార్పు కోసం ఆసక్తిగా వేచి చూస్తోంది. మేము ఎక్కడికి వెళ్లినా, అన్ని కులాలు, మతాల ప్రజలు మాకు మద్దతు పలికేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు. దానిని మార్చాలనుకుంటున్నారు. ఈ ప్రభుత్వంలో అవినీతి, నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. బీహార్ ప్రజల నుండి మేము 20 నెలలు కోరుకుంటున్నాం. ఈ కాలంలో బీహార్‌ను నంబర్ వన్‌గా మార్చడానికి మేము కృషి చేస్తాం’ అని అన్నారు.ఈ సమావేశంలో తేజస్వి యాదవ్ పలు ప్రధాన ప్రకటనలు కూడా చేశారు. మూడు అంచెలుగా పంచాయతీ ప్రతినిధులు, గ్రామ ప్రతినిధుల గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తామని హామీనిచ్చారు. వారికి పెన్షన్లు అందించాలని కూడా నిర్ణయించామన్నారు. వారికి రూ. 50 లక్షల బీమా అందజేయనున్నామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పంపిణీదారుల గౌరవ వేతనాన్ని నిర్ధారించడానికి కృషి చేస్తామని, క్వింటాలుకు మార్జిన్ మనీ పెంచుతామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఉన్నవారికి కారుణ్య ఉపాధికి వర్తించే వయోపరిమితి కూడా పెంచుతామన్నారు. కుమ్మరి, కమ్మరి వడ్రంగి తదితర స్వయం ఉపాధి పనుల కోసం ఐదేళ్ల వ్యవధితో వడ్డీ లేని విధంగా రూ. 5 లక్షల రుణం అందిస్తామని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న నిర్వహించనున్నారు. ఇది కూడా చదవండి: అమ్మని విడిచి ఉండలేక.. 15వ అంతస్తు నుంచి దూకి..
