breaking news
-
గెలుపు జోష్‌లో ఉన్న టీమిండియాకు భారీ షాక్..
ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో గెలిచి మంచి జోష్‌లో ఉన్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా దాదాపు నెల రోజుల పాటు జట్టుకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో క్యాచ్‌ను అందుకునే క్రమంలో అయ్యర్ పక్కటెముకులకు గాయమైంది.వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి స్కాన్లు చేయించగా.. గాయం కాస్త తీవ్రమైనదిగా తేలినట్లు సమాచారం. దీంతో వచ్చే నెల ఆఖరిలో సౌతాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు అయ్యర్ అందుబాటుపై అనుమానాలు నెలకొన్నాయి. భారత్‌కు బిగ్ షాక్.."మ్యాచ్ జరుగుతుండగానే శ్రేయస్ అయ్యర్‌ను స్కాన్ల కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక నిర్ధారణ ప్రకారం.. ఎడమ ప్రక్కటెముకలలో చిన్న ఫ్రాక్చర్ ఉంది.అతడు కనీసం మూడు వారాల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అయ్యర్ కోలుకోవడానికి ఎక్కువ సమయం అవసరమా లేదా అని నిర్ధారించడానికి మరిన్ని రిపోర్ట్లు స్కాన్లు చేయాల్సి ఉంది.ఇది హెయిర్‌లైన్ ఫ్రాక్చర్ అయితే ఎక్కువ సమయం పట్టవచ్చు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు అయ్యర్ అందుబాటులో ఉంటాడో లేదో ఇప్పుడే చెప్పలేము. మూడు వారాలలో అతడు కోలుకుంటే సౌతాఫ్రికా సిరీస్‌లో ఆడే అవకాశం ఉందని" బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పీటీఐతో పేర్కొన్నారు.ఒకవేళ అయ్యర్ ప్రోటీస్‌తో సిరీస్‌కు దూరమైతే భారత్ గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. అయ్యర్ భారత వన్డే సెటాప్‌లో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. అయితే గతంలో కూడా శ్రేయస్ వెన్ను గాయంతో బాధపడ్డాడు. కోలుకుని తిరిగొచ్చాక ఇప్పుడు పక్కటెముల గాయం బారిన పడ్డాడు. కాగా సౌతాఫ్రికా-భారత్ మధ్య వన్డే సిరీస్ నవంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: రోహిత్ శర్మ రిటైర్మెంట్ అప్పుడే.. కన్ఫర్మ్ చేసిన కోచ్ -
దాద్రా, నగర్ హవేలీ స్థానికంలో బీజేపీ రిగ్గింగ్
న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం దాద్రా, నగర్ హవేలీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అక్రమాలకు పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడిందని దాద్రా, నగర్ హవేలీ పార్టీ ఇన్‌ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే ఆరోపించారు. స్థానిక అధికారులతో కలిసి కుమ్మక్కై 80 శాతం వరకు అభ్యర్థుల నామినేషన్ పత్రాలను తిరస్కరించేలా బీజేపీ చేసిందని విమర్శించారు. బీజేపీ అభ్యర్థులకు పోటీకి ఎవరూ లేకుండా చేసిందని, ఇది ఓటు చోరీకి మించిన కుంభకోణమని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ బలపర్చిన అభ్యర్థులకు తప్ప వేరెవరి నామినేషన్ పేపర్లు కూడా ఆన్లైన్లో కనిపించడం లేదన్నారు. నామినేషన్ పత్రాల కోసం వెళితే సంబంధిత అధికారులు శిక్షణకు వెళ్లినట్లు కార్యాలయం సిబ్బంది తెలిపారని, ఎలాగోలా పత్రాలను పూర్తి చేసి చేతికందిస్తే పరిశీలనలో తిరస్కరించారని ఠాక్రే పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థుల నామినేషన్ ఒక్కటీ తిరస్కరణకు గురి కాలేదన్నారు. ఈ విషయాన్ని సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, బాంబే హైకోర్టును సైతం ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. డామన్, డయ్యూలో జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారని ఠాక్రే ఆరోపించారు. దీనిపై స్థానిక ఎన్నికల అధికారులు, బీజేపీ స్పందించాల్సి ఉంది. -
ఎంత పనిచేశావు గిల్!.. టైమ్ ఉంది కదా.. రవిశాస్త్రి ఫైర్
ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) ఓ పొరపాటు చేశాడు. అతడి ఫీల్డింగ్ వైఫల్యం కారణంగా ఆసీస్ వన్‌డౌన్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ (Matthew Short)ను త్వరగా పెవిలియన్‌కు పంపే అవకాశాన్ని భారత్ కోల్పోయింది. అసలేం జరిగిందంటే..ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్ (IND vs AUS)కు కోల్పోయిన టీమిండియా సిడ్నీ వేదికగా నామమాత్రపు ఆఖరి వన్డేలో.. టాస్ ఓడి తొలుత బౌలింగ్‌కు దిగింది. ఈ క్రమంలో ఆసీస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ ఆది నుంచే బౌండరీలు బాదుతూ పరుగులు పిండుకున్నారు.డైరెక్ట్ త్రో మిస్ చేసిన గిల్ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు గట్టిగానే ప్రయత్నించగా.. మొహమ్మద్ సిరాజ్ సఫలమయ్యాడు. ఆసీస్ ఇన్నింగ్స్ పదో ఓవర్లో రెండో బంతికి డేంజరస్ బ్యాటర్ హెడ్ (29)ను పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో మాథ్యూ షార్ట్ క్రీజులోకి వచ్చాడు. పదో ఓవర్లో సిరాజ్ వేసిన మూడో బంతికి అతడు పరుగులు రాబట్టలేకపోయాడు.ఫ్రంట్ ఫుట్ డిఫెండ్ షాట్‌తో సేవ్ అయ్యాడు. అయితే, సిరాజ్ సంధించిన నాలుగో బంతిని షార్ట్.. షార్ట్ కవర్ దిశగా బాదాడు. ఈ క్రమంలో మిడాఫ్ నుంచి పరిగెత్తుకు వచ్చిన ఫీల్డర్ గిల్ బంతిని అందుకున్నా.. దానిని సమర్థవంతంగా వికెట్లకు గిరాటేయడంలో విఫలమయ్యాడు. ఈజీ డైరెక్ట్ త్రోకు ఆస్కారం ఉన్నా గిల్ మిస్‌ఫీల్డ్ కారణంగా టీమిండియా రనౌట్ చేసే అవకాశాన్ని కోల్పోయింది.Can't BatCan't BowlCan't FieldCan't Captain What does Shubman Gill even do? pic.twitter.com/1tftX7250A— ADITYA (@Wxtreme10) October 25, 2025రవిశాస్త్రి ఫైర్అప్పటికే సింగిల్‌కు వచ్చిన షార్ట్ నాన్ స్ట్రైకర్ ఎండ్‌లోకి చేరుకోగా.. నిరాశగా స్టంప్స్ వైపు వచ్చిన సిరాజ్ అదుపు తప్పి షార్ట్‌పై పడిపోయాడు. మరోవైపు.. మార్ష్ కూడా సర్వైవ్ అయ్యాడు. ఈ ఘటన గురించి కామెంటేటర్ .. ‘‘ఇదొక మిక్స్ అప్. రనౌట్ చేసే అవకాశం మిస్సయ్యారు’’ అని పేర్కొనగా.. రవిశాస్త్రి.. ‘‘అవును.. అతడికి చాలా సమయం ఉన్నా సరైన విధంగా హిట్ చేయలేకపోయాడు’’ అని గిల్‌ను విమర్శించాడు.ఇదిలా ఉంటే.. సున్నా వద్ద లైఫ్ పొందిన షార్ట్ 30 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మరోవైపు మార్ష్ (41) అక్షర్ పటేల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 33 ఓవర్ల ఆట ముగిసేసరికి ఆసీస్ మూడు వికెట్ల నష్టానికి 178పరుగులు చేసింది. అలెక్స్ క్యారీ 24, మ్యాట్ రెన్షా 46 పరుగులతో ఉన్నారు.చదవండి: IND vs AUS 3rd ODI: నితీశ్ రెడ్డి అవుట్.. కారణం వెల్లడించిన బీసీసీఐ A classic Axar Patel delivery! 🔥The Aussie skipper heads back, and #TeamIndia are right back in the contest! 🇮🇳👏#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuANAu pic.twitter.com/BDrWFPLvgs— Star Sports (@StarSportsIndia) October 25, 2025 -
సంకల్ప బలముంటే.. ప్రతీది సాధ్యమే..!
యువరానర్.. అనాలనేది చాలా మంది కల. కానీ యువరానర్ అనిపించుకునే స్థాయిలో ఉండేవారు కొందరే. ఆ కొందరిలోనూ మహిళలు తక్కువగా కనిపిస్తుంటారు. కానీ తెలంగాణ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటీవల మహిళా జడ్జీలు.. లాయర్ల సంఖ్య పెరుగుతుంది. రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు ప్రధాన న్యాయమూర్తులు మహిళలే. ఆత్మస్థైర్యంతో విజయం సాధిస్తే.. మనోధైర్యంతో వృత్తిలో రాణిస్తున్నామంటున్నారు మహిళా జడ్జిలు. వీరిపై ప్రత్యేక కథనం.ఆత్మస్థైర్యంతో ముందుకు.. సునీత కుంచాల, పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తిలక్ష్య సాధనలో ఆటుపోట్లు ఎదురైనా మనోధైర్యంతో ముందుకెళ్లి విజ యం సాధించారు పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల. సునీత తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు. తండ్రి గురువులు ఉపాధ్యాయుడిగా, తల్లి జయకుమారి ప్రభుత్వాస్పత్రిలో నర్సు. ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చిన్న వయసులోనే సునీతకు వివాహమైంది. భర్త, తల్లిదండ్రుల సహకారంతో డిగ్రీ, పీజీ ప్రైవేట్‌గానే పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలయ్యారు. ఎల్ఎల్బీ ఉత్తీర్ణురాలు అ య్యారు. సునీత ఆడపడుచు జడ్జీ కావడంతో తాను కూడా జడ్జీ కావాలనే లక్ష్యం పెట్టుకొని.. శ్రమించా రు. 2003లో జడ్జీ పోస్టుకు పరీక్ష రాసి.. ఇంటర్వ్యూ దాకా వెళ్లి త్రుటిలో ఉద్యోగావకాశాన్ని చేజార్చుకున్నారు. ఓటమితో నిరాశచెందకుండా మళ్లీ ప్రయత్నించారు. 2013లో జూనియర్ సివిల్‌జడ్జిగా ఎంపికయ్యారు. జిల్లా జడ్జీ కావాలనే కాంక్ష వెంటాడడంతో అదే ఏడాది పడ్డ నోటిఫికేషన్లో ఒకే పోస్టు ఉండడంతో కష్టపడి చదివి విజయం సాధించారు. పోక్సో నేరాలకు కఠిన శిక్షలుజిల్లా జడ్జిగా హైదరాబాద్‌లోని స్పెషల్ కోర్టులో రెండేళ్లపాటు పనిచేసిన కాలంలో 84 పోక్సో కేసుల్లో తీర్పునిచ్చారు. 10 కేసుల్లో జీవితఖైదు విధించారు. పెద్దపల్లి జిల్లా జడ్జిగా భాధ్యతలు చేపట్టిన తర్వాత మూడు కేసుల్లోనూ తీర్పులిచ్చారు. నిజామాబాద్ జిల్లాలో పనిచేసే సమయంలో ఇద్దరు ట్రాన్స్జెండర్లకు ఆఫీసు సబార్డినేటర్లుగా ఉద్యోగావకాశాన్ని కల్పించడం సంతోషాన్ని ఇచ్చిందంటారు సునీత కుంచాల. నిజామాబాద్‌లో పనిచేసిన కాలంలో 14 వేల మందికి కరాటేలో శిక్షణ ఇప్పించారు. నిజామాబాద్‌లోని బాలసదనంలోని విద్యార్థుల ఇబ్బందిని గుర్తించి ప్రైవేట్ స్కూల్లో ఉచిత విద్య అందించేలా ట్రస్టు ఏర్పాటు చేయించడం సంతృప్తినిచ్చిందంటారు.కష్టాలు ఎదురైనా కుంగిపోలేదు: తడిగొప్పుల ప్రవిళిక, జూనియర్ సివిల్ జడ్జి, పిడుగురాళ్లతన ప్రయాణంలో కష్టాలు, కన్నీళ్లు అనేకం ఉన్నాయని పిడుగురాళ్ల జూనియర్ సివిల్ జడీ్జగా విధులు నిర్వర్తిస్తున్న తడిగొప్పుల ప్రవళిక తెలిపారు. వేములవాడ ప్రాంతంలోని కొదురుపాకకు చెందిన ప్రవళిక జడ్జీగా ఎంపికయ్యే క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇంటర్ వరకు కరీంనగర్లో చదువుకున్నారు. 2020లో పీజీ లాసెట్‌లో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించిన ప్రవళిక క్లాట్ ద్వారా నల్సార్ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్ఎం చదివారు. అనంతరం మొదటి ప్రయత్నంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. వ్యవసాయ కుటుంబం. వివాహమైన తర్వాత తల్లిదండ్రులు, అత్తారింటి వారి సహకారంతో చదువు పూర్తి చేయడంతోపాటు జడ్జిగా ఎంపికయ్యారు. జడ్జిగా ఎంపికవ్వాలంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వూ్యలను విజయవంతంగా పూర్తి చేయాల్సిందే. వీటన్నింటిని విజయవంతంగా పూర్తి చేయాలంటే హైకోర్టు, సుప్రీంకోర్టులు ఇచ్చిన తీర్పులపై పూర్తి అవగాహన ఉండాలి. లాయర్‌గా వృత్తిలో రాణించాలంటనే నిత్య విద్యార్థి మాదిరిగా కొత్త అంశాలను నేర్చుకుంటూ ఉండాల్సిందేనని ప్రవళిక తెలిపారు.ఆత్మవిశ్వాసంతోనే విజయం: గడ్డం వందన, జూనియర్ సివిల్ జడ్జి,వేములవాడ అమ్మాయిలు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా.. కష్టపడితే ఏదైనా సాధిస్తారని వేములవాడకు చెందిన జూనియర్ సివిల్ జడ్జి గడ్డం వందన నిరూపించారు. జడ్జీ అంటే కేవలం ఉద్యోగమే కాదని.. జీవన విలువలు.. సమాజాన్ని అర్థం చేసుకోవడమని ఆమె అంటున్నారు. వేములవాడకు చెందిన వందన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నందిగామ జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సవాళ్లను స్వాగతించాలివందన తల్లిదండ్రులు గడ్డం శైలజ, సత్యనారాయణరెడ్డి. వేములవాడలో 10వ తరగతి వరకు చదువుకున్న వందన ఇంటర్ హైదరాబాద్‌లో, లా కోర్సు మహాత్మాగాంధీ న్యాయ కళాశాలలో పూర్తి చేశాను. న్యాయవిద్యలో పీజీని ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు. ఎల్ఎల్ఎం పూర్తయ్యాక జ్యుడీషి యల్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అయ్యారు. మొదటి ప్రయత్నంలోనే 2022లో ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జడ్జిగా ఎంపికయ్యారు. చదువుతోపాటు క్రమశిక్షణ ఉంటేనే విజయం సాధిస్తామని వందన అంటున్నారు.(చదవండి: ఫ్యాషన్ సెన్స్.. కారాదు నాన్సెన్స్..) -
Delhi: సీఎం రేవంత్ నివాసంలోకి అధికారిణికి అనుమతి నిరాకరణ
ఢిల్లీ: హర్ష భార్గవి.. తెలంగాణ ప్రభుత్వ సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ(I&PR)లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఇటీవల న్యూఢిల్లీకి బదిలీ అయి, రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO)గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆమెకు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ఈరోజు(శనివారం, అక్టోబర్ 25వ తేదీ) ఢిల్లీలోని సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్లారు. అయితే అక్కడ పోలీస్ సిబ్బంది ఆమెను గేట్ వద్దే నిలిపేశారు. ఆమెను సీఎం నివాసం లోపలికి వెళ్లేందుకు అనుమంతిచలేదు. ఆమె ప్రభుత్వ ఉద్యోగిగా తనను పరిచయం చేసినప్పటికీ, పర్మిషన్ ఇవ్వలేదు. ఆమె ప్రశ్నించగా, అరెస్ట్ చేస్తామని బెదిరింపులకు దిగారు. దాంతో ఆమె కంటతడి పెట్టుకున్నారు. ఇదీ చదవండి:ఓటర్ల జాబితాపై సమీక్ష.. తెలంగాణలో SIR -
మౌలిక సదుపాయాల కల్పనకు సిద్ధమవుతున్న కంపెనీ
కామన్వెల్త్ గేమ్స్ శతాబ్ది ఉత్సవాలకు 2030లో గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడి స్థానిక మార్కెట్లో సిమెంట్ డిమాండ్ గణనీయంగా పెరగడానికి అవకాశం ఉంది. ఈ అంతర్జాతీయ క్రీడా కార్యక్రమం వల్ల పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రారంభమవుతాయని, ఇది నిర్మాణ రంగానికి, సిమెంట్ కంపెనీలకు కలిసి వస్తుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి.నువోకో విస్తరణదేశంలోని ప్రముఖ సిమెంట్ సంస్థల్లో ఒకటైన నువోకో విస్టాస్ కార్పొరేషన్ లిమిటెడ్ భవిష్యత్తులో పెరిగే ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి వ్యూహాత్మకంగా చర్యలు చేపడుతోంది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ జయకుమార్ కృష్ణస్వామి మాట్లాడుతూ.. తమ కంపెనీ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. 2030 నాటికి అహ్మదాబాద్ మార్కెట్లో డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.వద్రాజ్ సిమెంట్ కొనుగోలునువోకో ఇటీవల వద్రాజ్ సిమెంట్ లిమిటెడ్‌ను కొనుగోలు చేసింది. దీని ద్వారా కంపెనీ గుజరాత్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది. ఈ కొనుగోలులో భాగంగా కచ్‌లో 3.5 ఎండీపీఏ(మిలియన్ టన్స్ పర్ యానం) క్లింకర్ ప్లాంట్, సూరత్‌లో 6 ఎంటీపీఏ గ్రైండింగ్ యూనిట్ వంటివి సొంతం అవుతాయి. ఈ ఆస్తులు 2027 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి పూర్తిగా పనిచేయడం ప్రారంభిస్తాయని భావిస్తున్నారు. ఈ అదనపు సామర్థ్యంతో నువోకో మొత్తం స్థాపిత సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలలు 8,000..! -
ఏనుగు దంతాల కేసులో మోహన్ లాల్‌కు ఎదురుదెబ్బ
మలయాళ నటుడు మోహన్ లాల్‌కు కేరళ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన ఇంట్లో రెండు జతల ఏనుగు దంతాలు (Ivory Tusks) ఉన్న విషయం తెలిసిందే. వాటిని రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోనే ఇంట్లో ఉంచానని గతంలో న్యాయస్థానానికి ఆయన తెలిపారు. అందుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన అనుమతి పత్రాలను కూడా చూపారు. ఏనుగు దంతాల విషయంలో మోహన్ లాల్ చట్టాన్ని ఉల్లంఘించలేదని, ఆయన ఇంట్లో ఉన్నవి చనిపోయిన ఏనుగు దంతాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కోర్టుకు తెలిపింది. అయితే, తాజాగా ఈ కేసులో కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మోహన్‌లాల్‌కు ఇచ్చిన యాజమాన్య ధ్రువీకరణ పత్రాలను న్యాయస్థానం రద్దు చేసింది. ఏనుగు దంతాల విషయంలో ఇలా అనుమతి ఇవ్వడం చట్టవిరుద్ధం.. మీకు నచ్చినట్లు అనుమతి ఎలా ఇస్తారని కేరళ ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసింది.15 ఏళ్ల నుంచి ఏనుగు దంతాల కేసు మోహన్‌లాల్‌ను వెంటాడుతున్న సంగతి తెలిసిందే. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ నటుడు మోహన్‌లాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది. 2012లో ఐటీ శాఖ అధికారులు మోహన్ లాల్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో రెండు జతల ఏనుగు దంతాలను గుర్తించారు. దాంతో వన్యప్రాణుల చట్టం ప్రకారం మోహన్ లాల్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్రమంగా ఏనుగు దంతాలను ఇంట్లో అలంకరణకు పెట్టుకొని చట్టాన్ని ఉల్లంఘించారంటూ ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. అయితే తాను చట్టప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు తీసుకున్న తర్వాతే ఏనుగు దంతాలను ఇంట్లో పెట్టుకున్నట్లు మోహన్ లాల్ చెప్పడంతో కోర్టుకు వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో 2016 జనవరి, ఏప్రిల్‌లో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ద్వారా మోహన్‌లాల్‌కు జారీ చేసిన యాజమాన్య ధృవీకరణ పత్రాలను వాటికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను కోర్టు తాజాగా కొట్టివేసింది. -
Jubilee Hills: సీఎం రేవంత్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 28వ తేదీనగ బహిరంగ సభతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారాన్ని న రోడ్ షోతో ఆరంభించనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఆదివారం(అక్టోబర్ 26వ తేదీ) వెల్లడించారు. నాలుగు రోడ్ షోలు, ఒక బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొంటారని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ నెల 28వ తేదీన సీఎం రేవంత్ బహిరంగ సభకు ప్లాన్ చేసిన కాంగ్రెస్.. ఈ సభను పోలీస్ గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆపై అక్టోబర్ 30, 31, నవంబర్ 4,5 తేదీలలో సీఎం రోడ్ షో చేపట్టనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. పలువురు సినీ ప్రముఖులు కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొననున్నారు. -
చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన న్యూజిలాండ్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's WC 2025) ఇవాళ (అక్టోబర్ 26) ఉదయం మొదలైన నామమాత్రపు మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు (England vs New Zealand) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడంతో ఆ జట్టు 38.2 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది.ఇంగ్లండ్ బౌలర్లలో లిండ్సే స్మిత్ 3, కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్, అలైస్ క్యాప్సీ తలో 2, ఛార్లీ డీన్, సోఫీ ఎక్లెస్టోన్ చెరో వికెట్ పడగొట్టారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జార్జియా ప్లిమ్మర్ (43) టాప్ స్కోరర్‌గా నిలువగా.. అమేలియా కెర్ (35), కెప్టెన్ సోఫీ డివైన్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.సూజీ బేట్స్ 10, బ్రూక్ హ్యాలీడే 4, మ్యాడీ గ్రీన్, ఇసబెల్లా గేజ్, జెస్ కెర్ 10, రోస్‌మేరీ మైర్ డకౌట్, లియా తహుహు 2 పరుగులకు ఔటయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ త్వరగా మ్యాచ్ ముగించే దిశగా సాగుతోంది. 10 ఓవర్లలో ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. ఇంగ్లండ్ గెలుపుకు మరో 119 పరుగులు కావాలి. యామీ జోన్స్ (20), ట్యామీ బేమౌంట్ (26) క్రీజ్‌లో ఉన్నారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో సెమీస్ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. అక్టోబర్ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్‌లో భారత్, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి. ఈ మెగా టోర్నీ ఫైనల్ (నవీ ముంబై) నవంబర్ 2న జరుగుతుంది.చదవండి: హ్యారీ బ్రూక్ ఐకానిక్ శతకం వృధా -
శర్వా వరస సినిమాలు.. కానీ హిట్ కొట్టెదెప్పుడు?
ఒకప్పుడు అంటే ఎలాంటి కమర్షియల్ సినిమాలు తీసినా సరే ఎలాగోలా హీరోల బండి నడిచేది. కానీ గత కొన్నాళ్లలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాల్ని చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మిడ్ రేంజ్ హీరోల పరిస్థితి దారుణంగా తయారైంది. దానికి తోడు పలువురు హీరోల మూవీస్ కూడా పెద్దగా వర్కౌట్ కావట్లేదు. అలాంటి వాళ్లలో శర్వానంద్ ఒకడు. ఇంతకీ ప్రస్తుతం ఈ హీరో ఏం చేస్తున్నాడు? కొత్త మూవీస్ సంగతేంటి?గమ్యం, ప్రస్థానం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్.. సోలో హీరోగా నిలదొక్కుకోవడానికి బాగానే కష్టపడ్డాడు. కానీ అదృష్టం త్వరగా కలిసి రాలేదు. మంచి నటుడే అని ప్రూవ్ చేసుకున్నప్పటికీ 2014లో 'రన్ రాజా రన్' హిట్ కొట్టి ట్రాక్‌లోకి వచ్చాడు. అలా 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు లాంటి సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. కానీ తర్వాత చేసిన రణరంగం, జాను, శ్రీకారం, మహాసముద్రం.. ఇలా ఒకదాన్ని మించి మరొకటి ఫ్లాప్ అయ్యాయి. చివరగా 2022లో 'ఒకే ఒక జీవితం' చిత్రంతో పర్వాలేదనిపించుకున్నాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బోల్డ్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)యంగ్ హీరోలు అంటే ఎలా ఉండాలి? పెద్ద హీరోల్లా కాకుండా ఏడాది కనీసం ఒకటి రెండు సినిమాలైనా చేస్తూ ప్రేక్షకుల దృష్టిలో ఉండాలి. లేదంటే ఆడియెన్స్ వీళ్లని మర్చిపోయే అవకాశముంది. అలాంటి శర్వానంద్ నుంచి గత మూడేళ్లలో ఒక్కటే సినిమా వచ్చింది. అది గతేడాది రిలీజైన 'మనమే'. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయింది. ఈ ఏడాది ఏవైనా కొత్త చిత్రాలు తీసుకొస్తాడా అని చూస్తే ప్రస్తుతానికైతే ఆ సూచనలు కనిపించట్లేదు.2026లో శర్వానంద్ నుంచి ఏకంగా మూడు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. వాటిలో 'నారీ నారీ నడుమ మురారి' చిత్రం సంక్రాంతిని టార్గెట్ చేశారు. కొన్ని రోజుల క్రితమే పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ పండకు చిరంజీవి, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల మూవీస్ ఉన్నాయి. మరి వాళ్లతో పోటీపడి శర్వా బరిలోకి దిగుతాడా అనేది చూడాలి? మరోవైపు బైకర్ అనే స్పోర్ట్స్ డ్రామా మూవీ, భోగీ అనే యాక్షన్ మూవీ కూడా ఈ హీరో చేస్తున్నాడు. వీటితో హిట్ కొట్టి కమ్ బ్యాక్ అయితే సరేసరి. లేదంటే మాత్రం ప్రస్తుత జనరేషన్లో వెనకబడిపోయే ప్రమాదముంది? మరి 2026 అయినా శర్వాకు కలిసొస్తుందేమో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)
