హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 28వ తేదీనగ బహిరంగ సభతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారాన్ని న రోడ్ షోతో ఆరంభించనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఆదివారం(అక్టోబర్ 26వ తేదీ) వెల్లడించారు.
నాలుగు రోడ్ షోలు, ఒక బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొంటారని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ నెల 28వ తేదీన సీఎం రేవంత్ బహిరంగ సభకు ప్లాన్ చేసిన కాంగ్రెస్.. ఈ సభను పోలీస్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆపై అక్టోబర్ 30, 31, నవంబర్ 4,5 తేదీలలో సీఎం రోడ్ షో చేపట్టనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. పలువురు సినీ ప్రముఖులు కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొననున్నారు.


