breaking news
-
400 సెల్ఫోన్లు పేలితే ఇంత తీవ్రత ఉంటుందా?
కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన ఘటనలో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా కొత్త కోణాన్ని గుర్తించాయి. ప్రమాదానికి ఇతర అంశాలు కారణమైనా, బస్సు లగేజీ క్యాబిన్లో ఉన్న సుమారు 400 మొబైల్ ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగినట్లు తెలిపాయి.ఘటన జరిగిందిలా..కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి ఇంకా విచారణ జరుగుతోంది. అయితే ప్రాథమిక వివరాల ప్రకారం.. బస్సు ఒక బైకును ఢీకొట్టగానే ఆ బస్సు కింద బైకు ఇరుక్కుపోయింది. దాన్ని కొంత దూరం ఈడ్చుకెళ్లడం వల్ల మంటలు చెలరేగాయి. ఈ మంటలు తొలుత లగేజీ క్యాబిన్‌కు అంటుకున్నాయి. ఆ క్యాబిన్లో 400కు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉంది. అధిక వేడి వల్ల ఈ ఫోన్లలో వాడే బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి.బ్యాటరీలు పేలడం వల్ల భారీ శబ్దం వచ్చి మంటలు మరింత తీవ్రమయ్యాయి. ఈ మంటలు లగేజీ క్యాబిన్ పైభాగంలోని ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు వేగంగా వ్యాపించాయి. లగేజీ క్యాబిన్ పైభాగంలో, అంటే బస్సు మొదటి భాగంలో ఉండే సీట్లు, బెర్తుల్లో ఉన్నవారికి తప్పించుకునే సమయం లేకుండా పోయింది. దట్టమైన పొగ, మంటల్లో చిక్కుకున్న ప్రయాణికులు అత్యవసర ద్వారం తెరుచుకోకపోవడంతో బయటపడలేకపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ మాత్రం తన సీటు పక్కన ఉండే కిటికీ నుంచి తప్పించుకున్నాడు. ప్రాథమికంగా ఫొరెన్సిక్ అధికారులు చెప్పిన పైవివరాల ప్రకారం బస్సు ఢీకొనడం వల్ల మంటలు ప్రారంభమైనప్పటికీ మొబైల్ ఫోన్లలోని బ్యాటరీల పేలుడే ప్రమాద తీవ్రతను పెంచింది.లిథియం అయాన్ బ్యాటరీలుమొబైల్ ఫోన్లలో సాధారణంగా లిథియం అయాన్ బ్యాటరీలు ఎక్కువగా వాడుతున్నారు. ఈ బ్యాటరీలు అధిక శక్తి సాంద్రత కలిగి ఉండటం వల్ల చిన్న పరిమాణంలో ఎక్కువ శక్తిని నిల్వ చేయగలవు. అయితే ఇవి వేడెక్కినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తాయి.ఈ బ్యాటరీలు పేలేందుకు కారణాలుఈ బ్యాటరీలకు వేడి తగిలితే పేలే అవకాశం ఉంటుంది. బస్సు ప్రమాదంలో జరిగింది ఇదే. బయట నుంచి అగ్ని ప్రమాదం కారణంగా వేడి ఎక్కువై పార్శిల్ క్యాబిన్లోకి వచ్చింది. దాంతో ఫోన్లలోని బ్యాటరీలు వేడై పేలిపోయాయి.బ్యాటరీ పూర్తిగా నిండిన తర్వాత కూడా ఛార్జింగ్ కొనసాగడం వల్ల బ్యాటరీ లోపల ఉష్ణోగ్రత పెరుగుతుంది.బ్యాటరీ లోపల అనోడ్, కాథోడ్ పొరలు దెబ్బతినడం లేదా పటిష్టమైన తయారీ విధానాలు అనుసరించకపోవడంతో అవి ఒకదానితో ఒకటి తాకితే పేలిపోతాయి.పూర్తిగా బ్యాటరీ అయిపోయేంత వరకు వేచి చూసి ఒక్కసారిగా ఛార్జింగ్ పెట్టినా పేలే అవకాశం ఉంటుంది.బస్సు ఢీకొన్న సందర్భంలో పార్శిళ్లు, అందులోని వస్తువులు గట్టిగా కొట్టుకోవడం వల్ల బ్యాటరీ నిర్మాణంలో మార్పులు వచ్చి అంతర్గత షార్ట్ సర్క్యూట్‌కు దారితీయవచ్చు.బ్యాటరీ పేలుడు వెనుక రసాయన చర్యలులిథియం అయాన్ బ్యాటరీ పేలడాన్ని ‘థర్మల్ రన్అవే’ అని కూడా పిలుస్తారు. అధిక వేడిమి లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాటరీ సెల్లో ఉష్ణోగ్రత నిర్ణీత పరిమితి దాటినప్పుడు థర్మల్ రన్అవేకు దారి తీస్తుంది. మొదట కాథోడ్, అనోడ్లను వేరు చేసే సెపరేటర్ (పాలిమర్) కరిగిపోతుంది. సెపరేటర్ కరగడం వల్ల కాథోడ్, అనోడ్ నేరుగా ఒకదాంతో ఒకటి తాకి ఇంటర్నల్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడుతుంది. దీనివల్ల మరింత ఎక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. అధిక ఉష్ణోగ్రత వద్ద అందులోని కెమికల్స్ విచ్ఛిన్నం కావడం మొదలవుతుంది. అదే సమయంలో ఎలక్ట్రోలైట్ (బ్యాటరీ లోపల ఉండే ద్రవం) వేడెక్కి ఆవిరై మండే స్వభావం గల హైడ్రోకార్బన్ వాయువులను విడుదల చేస్తుంది.ఈ చర్యలో విడుదలైన ఆక్సిజన్, ఇతర మండే వాయువులు అధిక వేడి వల్ల మరింత తీవ్రంగా పేలిపోతాయి. ఒక సెల్ పేలడం వల్ల విడుదలైన వేడి పక్కనే ఉన్న ఇతర మొబైళ్లకు వ్యాపించి అవి కూడా థర్మల్ రన్అవేకు గురవుతాయి. ఈ గొలుసుకట్టు చర్య కారణంగా బస్సు లగేజీ క్యాబిన్లో వందల కొద్దీ ఫోన్లు వరుసగా పేలి భారీ శబ్దంతో అగ్ని తీవ్రత పెరగడానికి కారణం కావచ్చు.లిథియం బ్యాటరీలతో జాగ్రత్త - నాగసాయి, ఏసీపీ, సిటీ సెక్యూరిటీ వింగ్, సైబరాబాద్కర్నూలు బస్సు అగ్ని ప్రమాద సంఘటన దురదృష్టకరం. క్లూస్ టీమ్ ప్రాథమికంగా విచారించిన అంశాలను బట్టి బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో కింద ఇరుక్కుపోయి మంటలు చెలరేగాయి. అవికాస్తా పార్శిల్ క్యాబిన్‌కు వ్యాపించి అందులోని మొబైళ్లు ఒక్కసారిగా పేలాయి. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోంది. సాధారణంగా ఫోన్లలో వాడే లిథియం అయాన్ బ్యాటరీలకు పేలే గుణం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా అవి పేలే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఫోన్లు వాడటం జీవితంలో భాగమైంది. ఈ క్రమంలో యూజర్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఛార్జింగ్ చేసేటప్పుడు లేదా సాధారణంగా ఉపయోగించేటప్పుడు ఫోన్‌ను ఎండలోగానీ, కారు డాష్బోర్డ్ల్లో, స్టవ్ లేదా రేడియేటర్ వంటి అధిక వేడిని ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో పెట్టకూడదు. వేడి పెరిగితే బ్యాటరీ పేలే ప్రమాదం ఉంటుంది.ఎల్లప్పుడూ ఫోన్ తయారీదారు సిఫార్సు చేసిన ఒరిజినల్ ఛార్జర్, కేబుల్‌ను మాత్రమే ఉపయోగించాలి.నాసిరకం ఛార్జర్లు ఓవర్ఛార్జింగ్కు లేదా అధిక వేడికి దారితీయవచ్చు.ఫోన్‌ను రాత్రంతా లేదా ఎక్కువ సేపు ఛార్జింగ్‌లో ఉంచడం మానుకోండి. 80 నుంచి 90 శాతం వరకు ఛార్జ్ అయిన తర్వాత తీసివేయడం ఉత్తమం.ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఫోన్‌ను వాడడం మానుకోవాలి. దీనివల్ల వేడి పెరిగే ప్రమాదం ఉంది.ఛార్జింగ్ చేసేటప్పుడు ఫోన్‌ను దుప్పటి, దిండు లేదా మంచం వంటి గాలి ఆడకుండా ఉండే మెత్తటి ఉపరితలాలపై కాకుండా గట్టి, చల్లటి ఉపరితలం (టేబుల్)పై ఉంచండి.బ్యాటరీ స్థాయి 20 శాతం కంటే తక్కువకు పడిపోకుండా చూసుకోవడం మంచిది.ఫోన్‌ను కింద పడేయడం, బలంగా కొట్టడం లేదా వంచడం వంటివి చేయకండి. దీనివల్ల బ్యాటరీ లోపల షార్ట్ సర్క్యూట్‌కు దారితీయవచ్చు.మీ ఫోన్ బ్యాటరీ ఉబ్బినట్లు అనిపిస్తే లేదా ఫోన్ వెనుక భాగం ఉబ్బినట్లయితే వెంటనే దాన్ని ఉపయోగించడం ఆపివేసి సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లండి. ఉబ్బిన బ్యాటరీలు చాలా ప్రమాదకరం.ఒక్క మొబైళ్లలోనే కాదు, ఇంట్లో వాడే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, ఈవీ వాహనాల్లోనూ లిథియం బ్యాటరీలు వాడుతున్నారు. వీటిని వాడే సమయంలో నిబంధనలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. -
దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలలు 8,000..!
భారతదేశం విద్యారంగం చాలా మందికి ఉపాధి కల్పిస్తోంది. 2024-25లో మొత్తం పాఠశాల ఉపాధ్యాయుల సంఖ్య ఒక కోటి మార్కును దాటడం దీనికి నిదర్శనం. అయితే దేశంలోని విద్యారంగంలో కొన్ని కీలకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు కేవలం విద్యా నాణ్యతకే పరిమితం కాకుండా, దేశ సుస్థిర ఆర్థిక వృద్ధికి, మానవ వనరుల అభివృద్ధిపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.ప్రభుత్వ పాఠశాల వ్యవస్థలో ప్రధాన సమస్యలువిద్యార్థులు లేని పాఠశాలలు2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం అంతటా దాదాపు 8,000 పాఠశాలల్లో విద్యార్థులు లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. విద్యార్థులు లేని పాఠశాలలు ప్రభుత్వం ఖర్చు చేసిన వనరులపై ఎలాంటి ఫలితాలు అందించని పెట్టుబడిని సూచిస్తాయి. భవనాలు, మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల జీతాల కోసం ఖర్చు చేసిన ప్రజా ధనం వృథా అవుతుంది. చాలాచోట్ల పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయుల జీతాల రూపంలో ప్రజాధనం పంపిణీ అవుతున్నా ఉత్పత్తి శూన్యం (Zero Output). అంటే విద్యార్థులకు విద్య అందకపోవడం, ద్రవ్య వనరుల దుర్వినియోగానికి ఇది దారితీస్తుంది. ఇది ప్రభుత్వ ఆర్థిక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.జీతాలు లేకుండా పనులు..కొన్ని చోట్ల కాంట్రాక్టు ఉపాధ్యాయులు సుమారు 20,000 మందికి పైగా జీతాలు లేకుండా పని చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది వ్యవస్థాపరమైన లోపాలను స్పష్టం చేస్తుంది. తమిళనాడు, కేరళతోపాటు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో ‘సమగ్ర శిక్ష’ వంటి పథకాల కింద పనిచేస్తున్న వేలాది మంది ఉపాధ్యాయులు తమ వేతనాల్లో ఆలస్యం జరుగుతున్నట్లు చెప్పారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల విడుదలలో జాప్యం జరుగుతుండడం కారణంగా ఉంది.జీతాల ఆలస్యం ఉపాధ్యాయుల్లో నిరాశ, పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వారు తమ వృత్తిపై దృష్టి పెట్టలేక ఆర్థిక భద్రత కోసం అదనపు వనరులను వెతుక్కోవాల్సి వస్తుంది. జీతాల ఆలస్యం కారణంగా ఉపాధ్యాయుల కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఇది వినియోగాన్ని తగ్గించి మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.ఇదీ చదవండి: రిటైర్డ్ బ్యాంకర్లకు గుడ్ న్యూస్ -
పక్కటెముకల్లో రక్తస్రావం.. ఐసీయూలో శ్రేయస్ అయ్యర్
భారత క్రికెట్ అభిమానులకు షాకింగ్ వార్త. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో గాయపడ్డ టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా మారింది. ఆ మ్యాచ్‌లో అలెక్స్ క్యారీ క్యాచ్ అందుకునే క్రమంలో శ్రేయస్ ఎడమ వైపు రిబ్ కేజ్‌పై పడిపోయాడు. మొదట్లో స్వల్ప నొప్పిగా కనిపించినా, డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన తర్వాత పరిస్థితి విషమంగా మారింది. వెంటనే మెడికల్ టీమ్ ఆయనను ఆసుపత్రికి తరలించింది.సిడ్నీలోని ఆసుపత్రిలో స్కానింగ్ చేసిన వైద్యులు, శ్రేయస్‌కు అంతర్గత రక్తస్రావం (internal bleeding) ఉందని గుర్తించారు. వెంటనే ఐసీయూకు తరలించి, రెండు రోజులుగా పర్యవేక్షణలో ఉంచారు. రక్తస్రావం ఆగే వేగం, ఇన్ఫెక్షన్ ప్రమాదం ఆధారంగా శ్రేయస్‌ను మరో రెండు నుంచి ఏడు రోజులు ఐసీయూలో ఉంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. శ్రేయస్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా స్పందించారు. శ్రేయస్‌కు స్ప్లీన్‌లో లాసరేషన్ గాయం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం శ్రేయస్ అరోగ్యం నిలకడగా ఉందని, వేగంగా కోలుకుంటున్నాడని తెలిపారు. బీసీసీఐ మెడికల్ టీమ్.. సిడ్నీ, భారత్‌లో ఉన్న వైద్యులను సమన్వయం చేసుకుంటూ శ్రేయస్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత డాక్టర్ శ్రేయస్‌తో పాటే ఉండి రోజువారీగా అతని ఆరోగ్యాన్ని పరిశీలిస్తారని తెలిపారు.30 ఏళ్ల శ్రేయస్, ఇటీవలే టెస్ట్ క్రికెట్‌కు విరామం తీసుకుని వన్డేలపై ఫోకస్ పెంచనున్నట్లు ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో (11) నిరాశపరిచిన శ్రేయస్.. రెండో వన్డేలో పుంజుకొని 61 పరుగులు చేశాడు. శ్రేయస్ మరో 83 పరుగులు చేస్తే.. వన్డేల్లో 3000 పరుగుల మైలురాయిని తాకుతాడు.తాజాగా గాయం కారణంగా శ్రేయస్ త్వరలో (నవంబర్ 30) స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో ఆడటం అనుమానంగా మారింది. శ్రేయస్ త్వరగా కోలుకోవాలని భారత క్రికెట్ అభిమానులు దేవుళ్లను ప్రార్దిస్తున్నారు. ఇటీవలికాలంలో శ్రేయస్ టీమిండియాకు ప్రధానాస్త్రంగా ఉన్నాడు. వన్డేల్లో నాలుగో స్థానంలో కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ తురుపుముక్కగా మారాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌కు శ్రేయస్ దూరమైతే టీమిండియా విజయావకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది.చదవండి: భారత్‌తో తొలి టీ20.. ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పు -
వ్యాపార విస్తరణకు కీలకంగా భారత్
భవిష్యత్తులో వ్యాపార విస్తరణ ప్రణాళికలకు సంబంధించి భారత్ కీలకంగా ఉంటుందని అమెరికన్ ఐటీ దిగ్గజం సేల్స్‌ఫోర్స్ సీఈవో మార్క్ బెనియాఫ్ చెప్పారు. దక్షిణాసియా కార్యకలాపాలకు సారథ్యం వహిస్తున్న అరుంధతి భట్టాచార్య (గతంలో ఎస్బీఐ చైర్పర్సన్) నాయకత్వాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు.భారత్‌లో తమ సంస్థను గొప్పగా తీర్చిదిద్దుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ దిశగా అరుంధతి అత్యుత్తమంగా సేవలు అందిస్తున్నారని బెనియాఫ్ పేర్కొన్నారు. ఆమె నాయకత్వంలో కంపెనీ కార్యకలాపాలు అనేక రెట్లు విస్తరించాయని కంపెనీ ఫ్లాగ్షిప్ కార్యక్రమం ‘డ్రీమ్‌ఫోర్స్ 2025’లో పాల్గొన్న సందర్భంగా వివరించారు. మరోవైపు, గతంలో ఎన్నడూ లేనంత సమర్ధవంతంగా పని చేసేందుకు మనుషులకు ఏజెంటిక్ ఎంటర్ప్రైజ్ సహాయపడుతుందని బెనియాఫ్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయంగా 41 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సేల్స్‌ఫోర్స్ అంచనా వేస్తోంది.ఇదీ చదవండి: ఇన్ఫ్రా కంపెనీలకు తక్షణమే బకాయిలు చెల్లించాలి -
Kurnool: ప్రాణాల కంటే ఫొటోలే ముఖ్యమా?
కర్నూలు(సెంట్రల్): ఎగిసిపడుతున్న అగ్ని కీలలు.. మరో వైపు ప్రయాణికుల ఆర్తనాదాలు.. కళ్ల ముందు భయానక వాతావరణం.. ఆ సమయంలో కొందరు వ్యక్తులు మృత్యువును సైతం ఎదిరించి కొందరి ప్రాణాలను కాపాడారు. కర్నూలు శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు దుర్ఘటనలో ప్రయాణికులను కాపాడేందుకు వాహనదారులు ఎంతో ధైర్యంగా సాహసం చేసి మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారు. బస్సులో కళ్లెదుటే మంటల్లో ఆహుతవుతున్నా ప్రయాణికులను కొందరు వాహనదారులు ప్రాణాలకు తెగించి కాపాడే ప్రయత్నం చేశారు. మంటల్లో దగ్ధమవుతున్న బస్సు డోర్లు, కిటికీలు, అద్దాలు పగలగొట్టి కొందరిని బయటకు లాగారు. ఫలితంగా 43 మంది ఉన్న కావేరి ట్రావెల్స్‌లో 24 మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఎంత ప్రయతి్నంచినప్పటికీ 19 మందిని కాపాడలేకపోవడంతో అగ్నికి ఆహుతై బస్సులోనే ప్రాణాలను వదిలి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చారు. ప్రమాద సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న ధర్మవరానికి చెందిన హరీష్ అనే వ్యక్తి సహాయక చర్యల్లో కీలకంగా వ్యవహరించాడు. అతడిని చూసి ప్రేరణ పొందిన మరికొంతమంది తమలో మానవత్వాన్ని నిద్రలేపి ముందుకొచ్చారు. ఈ క్రమంలో మంటలు ఉద్ధృతమవుతున్న సమయంలో బస్సు కిటికీలు, అద్దాలను బద్దలు కొట్టి ఐదుగురును బయటకు లాగినట్లు తెలుస్తోంది. అంతేకాక వెంటనే పోలీసులు, ఫైర్, 108 అంబులెన్స్‌లకు సమచారం ఇచ్చారు. అయితే అప్పటికే అంబుల్సెన్‌లు చేరుకోకపోవడంతో తమ సొంత వాహనాల్లో ప్రమాదం నుంచి బయట పడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మరికొంత మందిని కాపాడే ప్రయత్నంలో ఉండగా ఒక్క ధాటిగా మంటలు ఎగిసిపడటంతో మిగతా వారిని కాపాడలేకపోయారు. కళ్ల ముందు కొందరు మంటల్లో ఆహుతి అవుతున్న వారిని చూసి బరువెక్కిన హృదయాలతో చలించిపోయారు. వెనక డోర్‌ను బద్దలు కొట్టి.. బస్సులోని వ్యక్తుల ప్రాణాలను కాపాడడంలో బస్సు రెండో డ్రైవరు, క్లీనరు కూడా కీలకంగా వ్యవహరించారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణికులను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. వెనక డోర్‌ను బద్దలు కొట్టి దాదాపు 10 మంది దాకా బయటకు వెళ్లేలే చేశారని సమాచా రం. అప్పటికే కొంతమంది ప్రయాణికులు డోర్‌ను బద్దలు కొట్టేందుకు ప్రయతి్నస్తున్నా ఓపెన్ కాకపోవడంతో వారు పెద్ద రాడ్డు తీసుకొని బద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది ప్రయాణికులు ప్రాణాలతో బయట పడ్డారు. వారు తమకేమి అనుకొని రన్నింగ్ డ్రైవర్ మాదిరిగా పారిపోయి ఉంటే మృతుల సంఖ్య మరింత పెరిగేది. కొందరు సోషల్ మీడియా కోసం తాపత్రయం... బస్సు ప్రమాద సమయంలో కొందరు మాత్రం తమలో మానవత్వం లేదనే విధంగా ఘటన స్థలంలో వ్యవహరించినట్లు ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నారు. కళ్లముందు మంటల్లో ప్రాణాలు కలిసి పోతుంటే కాపాడే ప్రయత్నం చేయకుండా సోషల్ మీడియా కోసం ఫొటోలు, వీడియోలు తీసి అప్లోడ్ చేస్తూ కనిపించారని చెప్పారు. ఆపదలో ఉన్న వారిని రక్షించడం కోసం ప్రతి ఒక్కరూ ప్రయతి్నంచి ఉంటే మరికొంతమంది ప్రాణాలతో బయటపడే అవకాశం ఉండేది. ఇప్పటికైనా ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవడానికి ప్రయతి్నంచాల్సిన అవసరం ఉంది. పత్తాలేని పెట్రోలింగ్ వాహనం.. 44వ జాతీయ రహదారిలో ఎన్హెచ్ఏఐ(నేషనల్ హై అథారిటీ ఆఫ్ ఇండియా) రోడ్డు భద్రతను గాలికొదిలినట్లు తెలుస్తోంది. ఏదైనా ప్రమాదం జరిగితే క్షణాల్లో అక్కడ ఉండాల్సిన పెట్రోలింగ్ వాహనం, అంబులెన్స్‌లు కనిపించలేదు. ఈ ప్రమాద ఘటనన జరిగిన ప్రదేశం నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో పుల్లూరు టోల్‌ప్లాజా, 24 కిలోమీటర్ల పరిధిలో అమడగుంట్ల టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఆయా టోల్ ప్లాజాల పరిధిలో పెట్రోలింగ్ వాహనాలు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉండాలి. అయితే ప్రమాద సంఘటనకు రెండు టోల్ ప్లాజాల నుంచి ఎలాంటి పెట్రోలింగ్ వాహనాలు రాలేదు. చివరికి అమడగుంట్ల టోల్ ప్లాజాకు సంబంధించి అంబులెన్స్ కూడా రాకపోవడంతో చిత్తూరు జాతీయ రహదారి 40కు చెందిన నన్నూరు టోల్ ప్లాజా అంబులెన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి టోల్ ఫీజులను వసూలు చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఎన్హెచ్ఏఐ..రోడ్డులో వెళ్లే వాహనాలు, ప్రయాణికుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవడంలేదని తేటతెల్లమవుతోంది. ఎట్టా కాలిందో సూడు.. ఎంత నరకం చూశారో పాపం దగ్ధమైన బస్సును చూస్తూ వాహనదారుల దిగ్భ్రాంతి ప్రమాదంతో జిల్లా ప్రజల్లో విషాదం వెల్దుర్తి: కర్నూలు – బెంగళూరు జాతీయ రహదారిపై బస్సు ప్రమాద ఘటన నుంచి జిల్లా ప్రజలు ఇంకా తేరుకోలేక పోతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున చావుకేకతో ఉలిక్కిపడిన జనం శనివారం కూడా అదే ప్రమాద విషయాన్ని చర్చించుకుంటూ కనిపించారు. పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కథనాలపై విశ్లేషిస్తూ కనిపించారు. కాగా జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న వాహనదారులు ప్రమాద ఘటన స్థలంలో నిలిచి పక్కనే దగ్ధమైన బస్సును పరిశీలిస్తున్నారు. ‘అబ్బా ఎట్టా కాలిపోయిందో సూడు బస్సు.. ఈ బస్సే ఇట్టయిందంటే ఆ మంటలకు బస్సులో చచ్చిపోయిన్నోళ్లు ఎంత నరకం అనుభవించింటారో కదా’ అంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కనిపించారు. జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న వివిధ రాష్ట్రాల ప్రయాణికులు, వాహనదారులు బస్సు దుర్ఘటను చూసి అయ్యో పాపం అంటూ వెళ్తున్నారు. బైక్ పడిన ప్రాంతం, చనిపోయిన బైకిస్ట్ గురించి, బస్సు ఈడ్చుకుంటూ వెళ్లిన ఆనవాళ్లు, పూర్తిగా దగ్ధమైన బస్సుపై వివిధ రకాలుగా వి చారు.‘ ఒక వ్యక్తి వల్ల ఇంత ఘోరం జరిగిందా? ప్రమాదానికి మద్యం కారణం’ అంటూ కొందరు ఘటనా స్థలంలో చర్చించుకుంటూ కనిపించారు. వెనుకాల వచ్చిన వాహనదారులు రోడ్డుపై పడిన బైక్‌ను పక్కకు తీసినా సరిపోయేదని.. ప్రైవేటు వాహనాల వేగాన్ని నియంత్రించాలని.. ప్రమాద సమయంలో వాహనదారులు ఇంకా స్పందించి ఉంటే బాగుండేది’ అని మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరో వైపు సంఘటన స్థలంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బైక్ పడిన ప్రాంతం నుంచి బస్సు దగ్ధమైన చోటు వరకు చోటు చేసుకున్న పరిణామాలపై వివరాలు సేకరిస్తూ కనిపించారు. ప్రాణాల కంటే ఫొటోలే ముఖ్యమా? కొందరు ప్రాణాల కంటే ఫొటోలే ముఖ్యమన్నట్లుగా వ్యవహరించడం చాలా బాధాకరం. వారిలో మానవత్వం లేదు. మనిషి ప్రాణాలకు విలువ కనిపించలేదు. కళ్ల ముందే ప్రాణ భయంతో కాపాడండి అంటూ మహిళలు, పిల్లలు అరుపులు, కేకలు పెడుతున్నా పట్టించుకోకుండా వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో ప్రొజెక్టు చేసుకున్నారు. అయితే కొందరు మాత్రం వారిలో ఇంకా మానవత్వం చావలేదని నిరూపించారు. ప్రాణాలకు తెగించి కొందరిని కాలే బస్సు నుంచి బయటకు లాగారు. ధర్మవరానికి చెందిన హరీష్ అనే వ్యక్తి ఎంత మంచివాడంటే చెప్పలేం. అందరూ అతన్ని ఆదర్శంగా తీసుకొని సహాయక చర్యల్లో పాల్గొని కొందరిని ప్రాణాల నుంచి రక్షించారు. – హైమారెడ్డి, హైదరాబాద్, ప్రమాద ఘటన ప్రత్యక్ష సాక్షి -
అదే కర్నూలు బస్సు ప్రమాదానికి మూల కారణం: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బెంగుళూరు-హైదరాబాద్ జాతీయరహదారిపై జరిగిన బస్సు దహనం ఘటన ప్రమాదం కాదని ఇది ముమ్మూటికీ ప్రభుత్వ హత్యలేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇరవై నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని.. ఈ ఘటనలో సీఎం చంద్రబాబే ప్రథమ ముద్దాయని రాచమల్లు స్పష్టం చేశారు.రాష్ట్రంలో విచ్చలవిడిగా ఏరులై పారుతున్న మద్యమే.. ఈ ప్రమాదానికి కారణమని ఆయన తేల్చి చెప్పారు. ప్రమాదం జరగడాని కంటే ముందు జాతీయ రహదారి సమీపంలోని బెల్టుషాపులో మద్యం కొనుగోలు చేసిన బైకిస్టే.. మద్యం మత్తులో ఇంత పెద్ద ప్రమాదానికి కారణమయ్యారని వెల్లడించారు. దీనికి ప్రభుత్వం, అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆదాయమే లక్ష్యంగా రాష్ట్రంలో ఏటీఎం(ఎనీ టైం మందు) తరహాలో మద్యం అమ్మకాలు చేస్తూ ప్రభుత్వమే ప్రజల ప్రాణాలను హరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే..బెంగుళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై బస్సు దహనం ఘటన దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదం కాదు.. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం, స్వార్థంతో జరిగిన హత్యలివి. ఈ హత్యల్లో మొదటి ముద్దాయి ముఖ్యమంత్రి చంద్రబాబే అయితే, ఎక్సైజ్ శాఖ మంత్రి రెండో ముద్దాయి, జాతీయ రహదారిపై మద్యం అమ్ముతున్న బెల్టుషాపు నిర్వాహకుడు మూడో ముద్దాయి కాగా.. బెల్టుషాపు లేకుండా చేయాల్సిన ఎక్సైజ్ అధికారి నాలుగో ముద్దాయి కాగా ఐదో ముద్దాయి రవాణాశాఖ అధికారులు, ఆరో ముద్దాయి బస్సు ఓనరు, ఏడో ముద్దాయి డ్రైవరు, ఎనిమిదో ముద్దాయి బైక్ డ్రైవర్ వీరందరూ కలిసి వీరి ఉసురు పోసుకున్నారు. జాతీయ రహదారిమీద తిరగడానికి కావాల్సిన ఫిట్ నెస్ సహా ఏ అనుమతలూ లేకుండానే ఆ బస్సు తిరుగుతోంది. అధికారుల ఉదాసీనతకు నిదర్శనం ఇది.ఆదాయమే లక్ష్యంగా ఏటీఎం- ఎనీటైం మందు..రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. ఇదే విషయాన్ని మేం ప్రతిరోజూ నెత్తీనోరూ మొత్తుకుని చెబుతున్నా పట్టించుకున్నపాపాన పోలేదు. రాష్ట్రంలో ఇప్పుడు రోజులో ఇరవై నాలుగు గంటలూ, వారానికి ఏడు రోజులూ ఎనీ టైమ్ మందు( ఏటీమ్) అందుబాటులో ఉంటుంది. బడి, గుడి, వీధి సందు, జాతీయ రహదారి, గ్రామీణ రోడ్లు అక్కడా ఇక్కడా అని లేదు.. కూటమి పాలనలో ఇప్పుడు ఎక్కడైనా మద్యం అందుబాటులో ఉంటుంది. తాగొచ్చు, తాగి ప్రమాదాలు చేసి మనుషులను చంపొచ్చు.. ఏం జరిగినా ప్రభుత్వానికి మాత్రం ఆదాయమే ముఖ్యం. నకిలీ మద్యం అమ్మి వేల కోట్లు సంపాదించడం, ఆ డబ్బును ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలవడమే వారి లక్ష్యం. తనకు అధికారం, తన మనుషులకు వేల కోట్ల డబ్బు సంపాదనే చంద్రబాబు పాలసీ.రవాణాశాఖ అధికారులు ప్రైవేటు బస్సులకు సంబంధించిన అనుమతులు, ఫిట్ నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్‌లు పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత బస్సులు రోడ్డెక్కేలా అనుమతులు ఇవ్వాలి. అన్ని అనుమతులు, పేపర్లు లేకుండా రాష్ట్రంలో ఏ ప్రైవేటు బస్సు అయినా రోడ్డెక్కి జరగరానిది జరిగితే అది ప్రమాదం కాదు.. నిస్సందేహంగా హత్యగానే భావిస్తాం. హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారిపై జరిగినది ప్రమాదం కాదు, ఇది ముమ్మూటికీ హత్యే. దీన్ని నేను డిజిటల్ బుక్ లో ఎంటర్ చేస్తాను.ఇకపై ప్రొద్దుటూరు రోడ్లపై అనుమతులు లేకుండా వచ్చిన వాహనాల వల్ల ప్రమాదం జరిగినా దాన్ని హత్యగానే ఈ జాతీయ రహదారిపై ఏ ప్రమాదం జరిగినా హత్యగానే భావించి డిజిటల్ బుక్ లో నమోదు చేస్తాను. వైయస్.జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీటిని హత్యలుగానే భావించి కేసులు నమోదు చేస్తాం. కూటమి ప్రభుత్వానికి మనుషులు ప్రాణాలంటే లెక్కలేకుండా పోయింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు నిద్రలోనే గాల్లో కలిసిపోయాయి. బెల్టుషాపుల్లో తాగిన మద్యం, అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణం. మీరు, మీ కుటుంబాలు మాత్రం బాగుండాలి. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు స్పెషల్ ప్లైట్లు, హెలికాప్టర్ లలో తిరుగుతారు. ప్రజలు మాత్రం కాలి బూడిదన్నా కావాలి, లేదంటే మీరు తయారు చేసిన నకిలీ మద్యం తాగి అన్నా చావాలి. కనికరం లేని దుర్మార్గ ప్రభుత్వమిది.రాష్ట్రంలో మద్యం పాలసీ సక్రమంగా లేదని మేం ఎన్నిసార్లు చెప్పినా.. ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ఉంది. నకిలీ మద్యం, విపరీతంగా బెల్టు షాపులుతో ప్రజలు ప్రాణాలను హరిస్తున్నారు. బెంగుళూరు, హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగినది ప్రమాదం కాదు. అమాయకులైన 20 మందిని ప్రభుత్వమే పొట్టన పెట్టుకుంది. బెల్టుషాపుల్లో విచ్చలవిడి మద్యం అమ్మకాలే ఈ ప్రమాదానికి కారణం. ఈ ప్రమాద ఘటనలో మొదటి ముద్దాయి చంద్రబాబు సహా అందరూ నిందితులే.. వీరి నేరాన్ని డిజిటల్ బుక్‌లో ఎంటర్ చేయనున్నట్టు రాచమల్లు తెలిపారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరందరికీ శిక్ష పడేలా చేయడం ఖాయమని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. -
అదే జరిగితే ఆఫ్ఘనిస్థాన్‌తో యుద్దమే.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య కొద్దిరోజులుగా యుద్ధ వాతావరణం నెలకొంది. దాడులు, ప్రతి దాడులతో రెండు దేశాల సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. మరోవైపు.. ఇరు దేశాల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చల్లో ఒప్పందం కుదరకపోతే బహిరంగ యుద్దమే అని కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది.తాజాగా పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ఆఫ్ఘనిస్థాన్ శాంతిని కోరుకుంటుందనే విశ్వాసం ఉంది. ఒకవేళ శాంతి ఒప్పందం కుదరకపోతే వాళ్లతో బహిరంగ యుద్ధం చేస్తాం. అందుకు మాకు ఓ అవకాశం ఉంది. కానీ, వాళ్లు శాంతిని కోరుకుంటారని విశ్వసిస్తున్నా. ఇరు పక్షాలు కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నాయని అనుకుంటున్నా. గత నాలుగైదు రోజులుగా సరిహద్దులు ప్రశాంతంగానే ఉన్నాయి’ అని అన్నారు. అయితే, ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్న వేళ ఆసిఫ్ ఈ విధంగా స్పందించారు.Former Interior Minister Aftab Sherpao Criticizes Khawaja Asif’s Remarks on Possible War with AfghanistanPakistan’s former Interior Minister and head of the Qaumi Watan Party, Aftab Sherpao, has called Khawaja Asif’s recent statement—that Pakistan could wage an open war against… pic.twitter.com/3u94aQcvss— Truth Lens (@truthlenns) October 26, 2025ఆసిఫ్‌కు కౌంటర్.. మరోవైపు.. మహమ్మద్ ఆసిఫ్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ మాజీ మంత్రి, క్వామి వతన్ పార్టీ అధినేత అఫ్తాబ్ షెర్పావ్ ఘాటు విమర్శలు చేశారు. తాజాగా అఫ్తాబ్ స్పందిస్తూ..‘ఆసిఫ్ వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు అనవసరం. ప్రభుత్వ సీనియర్ మంత్రి నుండి ఇటువంటి వ్యాఖ్యలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత దెబ్బతీస్తాయి. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చల ప్రక్రియను దెబ్బతీస్తాయి. చర్చల ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. దశాబ్దాల సంఘర్షణలో అధికారులు శాంతి, ప్రాంతీయ స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన భవిష్యత్తును నిర్ధారిస్తారు’ అని కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ఖతార్, తుర్కియే మధ్యవర్తిత్వంతో దోహా వేదికగా రెండోసారి శాంతి చర్చలు జరుగుతున్నాయి. కాగా, అక్టోబర్ 18,19 తేదీల్లో జరిగిన మొదటి చర్చల్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్‌లు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ క్రమంలోనే శనివారం ఇస్తాంబుల్‌లో ఇరు దేశాల మధ్య చర్చలు మొదలయ్యాయి. ఆదివారం కూడా చర్చలు కొనసాగుతున్నాయి. -
సూర్యుడిలో భారీ పేలుడు
వాషింగ్టన్: సూర్యుడిలో మన కంటికి కనిపించని అవతలి వైపు భారీ పేలుడు సంభవించడంతో శక్తివంతమైన తరంగాలు(షాక్‌వేవ్స్) మన సౌర వ్యవస్థలోకి వెలువడినట్లు ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నెల 21వ తేదీన ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్(సీఎంఈ) ఢీకొట్టడంతో శుక్ర గ్రహం(వీనస్)లో స్వల్పభాగం దెబ్బతిన్నట్లు కనిపెట్టారు. సౌర ఉద్గారం తదుపరి లక్ష్యం ఏమిటి? మన భూగోళమేనా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. సెకన్‌కు దాదాపు 2,474 కిలోమీటర్ల వేగంతో సూర్యుడి నుంచి షాక్‌వేవ్స్ వెలువడినట్లు అమెరికా వైమానిక దళం వెల్లడించింది. ఇది అత్యంత వేగవంతమైన, శక్తివంతమైన కరోనల్ మాస్ ఎజెక్షన్ అని శాస్త్రవేత్తలు స్పష్టంచేశారు. 1972, 2017లో ఈ తరహా ఉద్గారాలు సూర్యగోళం నుంచి సౌరవ్యవస్థలోకి వెలువడ్డాయి. అప్పట్లో విద్యుత్ గ్రిడ్లకు అంతరాయం ఏర్పడింది. ఇలాంటి ఉద్గారాలను సౌర తుఫాన్లు అని కూడా అంటారు. భూమికి ఉన్నట్లుగా శుక్ర గ్రహానికి రక్షణ అయస్కాంత క్షేత్రం లేదు. అందుకే సూర్యుడి ఉద్గారాల వల్ల ప్రభావితమైనట్లు చెబుతున్నారు. షాక్‌వేవ్స్ పయనిస్తున్న ప్రాథమిక మార్గంలోనే శుక్రగ్రహం ఉంది. అయితే, ఈ తరంగాలు మరింత విస్తరించి, భూమిని తాకే అవకాశం లేకపోలేదని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే, ఈ తరంగాల వల్ల భూమికి నష్టమేమీ ఉండదని నేషనల్ ఓషియానిక్, అటా్మస్పియరిక్ అడ్మిని్రస్టేషన్(ఎన్ఓఏఏ) నిపుణులు స్పష్టంచేశారు. సూర్యుడి అవతలి వైపు నుంచి వెలువడే తరంగాలు భూమిని ప్రభావితం చేయబోవని, మనకు ఎలాంటి ముప్పు ఉండదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. కరోనల్ మాస్ ఎజెక్షన్‌ను వాతావరణ నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. -
ఏపీలో మరో బస్సు ప్రమాదం
సాక్షి, పల్నాడు జిల్లా: రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్ వద్ద బస్సు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను దాచేపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిర్యాలగూడ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు దాచేపల్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.హైదరాబాద్‌లో ట్రావెల్స్ బస్సు బోల్తామరో ఘటనలో హైదరాబాద్ పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఇవాళ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రావెల్స్ బస్సు బోల్తా పడడంతో అందులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో ఆంబులెన్స్‌లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నట్లు అధికారులు తెలిపారు. -
రోడ్డు విస్తరణకు బ్రేక్
జోగిపేట(అందోల్): జోగిపేట పట్టణంలోని ప్రధాన రహదారిని విస్తరించకపోవడానికి గల కారణాలపై స్థానికంగా చర్చ జరుగుతోంది. అందోల్ అంబేడ్కర్ విగ్రహం నుంచి జోగిపేట అంబేడ్కర్ వరకు ఉన్న రోడ్డును విస్తరించకుండా కేవలం అంబేడ్కర్ విగ్రహం నుంచి మాసానిపల్లి చౌరస్తా వరకు మాత్రమే 70 అడుగుల రోడ్డును నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి రోడ్లు భవనాల శాఖ అధికారులు సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. సంగుపేట నుంచి అందోల్ అంబేడ్కర్ వరకు, పట్టణంలోని పెట్రోల్ పంపు వద్ద నుంచి అన్నాసాగర్ దర్గా వరకు రోడ్డును ఫోర్‌లేన్‌గా ఏర్పాటు చేసేందుకు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అందోల్ వైపు డివైడర్ పనులు కూడా దాదాపుగా పూర్తి కావొస్తున్నాయి. అయితే అందోల్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి భారత్ పెట్రోల్ పంపు వరకు పదేళ్ల క్రితం కేవలం డివైడర్ పనులు చేపట్టి రోడ్డును విస్తరించకుండా వదిలేశారు. పట్టణంలో కనీసం 60 అడుగుల వరకు రోడ్డును విస్తరించకుండా వదిలేసి మిగతా భాగాన్ని రోడ్డు విస్తరించడంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ రోడ్డుకిరువైపులా ఉన్న వ్యాపార, వాణిజ్య సంస్థలు ఇరుకుగా ఉన్నాయి. ఈ రోడ్డుపైనే ఆటోలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కార్లు, బైకులు రోడ్డుపైనే పెట్టుకుని దుకాణాల్లో కొనుగోలు చేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గతంలో సర్వేలు చేసి వదిలేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జోగిపేట పట్టణంలోని ప్రధాన రహదారికిరువైపులా రోడ్డు విస్తరణకుగాను మార్కింగ్ కూడా చేశారు. కొన్నిచోట్ల రోడ్డు ముందుకు వచ్చి నిర్మాణాలు చేసుకున్న వారు కూలగొట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. సిద్దిపేట, దుబ్బాక, సిరిసిల్ల, నర్సాపూర్ ప్రాంతాల్లో రోడ్డును విస్తరించి పాదాచారుల కోసం బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో పట్టణాలు సైతం చూడటానికి విస్తారంగా కనిపించడంతోపాటు రవాణా రాకపోకలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందనుకున్నారు. అయితే మధ్యలోనే ఈ పనులను ఆపివేశారు. నాయకుల ఒత్తిడే కారణమా? 2023 ఎన్నికల్లో అందోల్ ఎమ్మెల్యేగా ఎన్నికై న తర్వాత మంత్రి దామోదర రాజనర్సింహ జోగిపేట పట్టణాన్ని సిరిసిల్ల, సిద్దిపేట పట్టణాల కంటే అందంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేశారు. పట్టణంలో 60 అడుగుల రోడ్డును ఏర్పాటు చేయాలని పలుమార్లు ప్రకటించారు. సంగుపేట వద్ద నుంచి అన్నాసాగర్ వరకు రోడ్డు విస్తరణ పనులకుగాను ప్రభుత్వం ద్వారా రూ.20 కోట్ల నిధులను మంజూరు చేయించారు. అయితే స్థానిక నాయకుల ప్రమేయంతో పట్టణంలోని రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయినట్లుగా స్థానికంగా చర్చ జరుగుతోంది. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉ ండటంతో స్థానిక నాయకులు మంత్రిపై ఒత్తిడి తెచ్చి ఈ పనులు నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంబేడ్కర్ రోడ్డును 70 అడుగుల వెడల్పుతో అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి మాసానిపల్లి వరకు గల కి.మీ రోడ్డును మాత్రం 70 అడుగుల రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి సర్వే పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ రోడ్డు అజ్జమర్రి బ్రిడ్జి వద్ద నుంచి డాకూరు రోడ్డుకు అనుసంధానిస్తూ రోడ్డును అభివృద్ధి చేసేలా ప్రణాళికను చేపడుతున్నట్లు సమాచారం. మంత్రి దామోదర ఈ రోడ్డుపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ రోడ్డు పనులు చేపట్టి తీరాల్సిందేనని రెవెన్యూ శాఖ అధికారులకు ఆదేశించిన విషయం తెలిసిందే. అధికారపార్టీ నాయకుల జోక్యమే కారణమా? ఇరుకై న రోడ్లతో ప్రజలకు తప్పని ఇబ్బందులు జోగిపేట రోడ్డు విస్తరణపై మంత్రి గతంలో హమీ! పాదాచారులకు ప్రత్యేకంగా రోడ్డు పాదాచారులు రోడ్డుపై నడవకుండా ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి రోడ్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సిద్దిపేట, సిరిసిల్ల, నర్సాపూర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విధంగా జోగిపేటలో కూడా ఏర్పాటు చేయాలని జోగిపేట అభివృద్ధిని కాంక్షించే పలువురు సీనియర్ సిటిజన్లు కోరుతున్నారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు గతంలో మంత్రిగా పనిచేసిన కాలంలోనే ఈ పనుల కోసం రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రకటించారు. కానీ ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. మంత్రి దామోదర రాజనర్సింహ అయినా ఈ విషయంలో చొరవచూపాలని స్థానికులు కోరుతున్నారు.
