breaking news
-
నారా రోహిత్-శిరీష పెళ్లి సందడి: హల్దీ వీడియో చూశారా?
తెలుగు హీరో నారా రోహిత్ (Nara Rohit) పెండ్లిపనులు షురూ అయ్యాయి. పెళ్లికూతురు శిరీష (Siree Lella) ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం ఇటీవలే జరిగింది. తాజాగా రోహిత్- శిరీషలు జంటగా హల్దీ ఫంక్షన్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫామ్‌హౌస్‌లో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. ఆటలు, పాటలతో ఈ సెలబ్రేషన్స్ రెట్టింపు ఉత్సాహంతో సాగాయి. రోహిత్- శిరీష అక్టోబర్ 30న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు.అలా మొదలైందినారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి 2 సినిమాలో శిరీష హీరోయిన్గా నటించింది. రోహిత్ ప్రియురాలిగా మెప్పించింది. సినిమాలోనే కాకుండా నిజ జీవితంలోనూ అతడితో ప్రేమలో పడింది. అదే విషయాన్ని ఇంట్లో చెప్పగా.. ఇరు కుటుంబాలు పెళ్లికి పచ్చజెండా ఊపాయి. ఈ క్రమంలోనే గతేడాది అక్టోబర్‌లో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఏడాది తర్వాత ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు.సినీ జర్నీనారా రోహిత్ విషయానికి వస్తే.. బాణం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సోలో సినిమాతో విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక్కడినే, ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అసుర, జ్యో అచ్యుతానంద, శమంతకమణి.. ఇలా పలు సినిమాలు చేసుకుంటూ పోయాడు. 2018లో వచ్చిన వీర భోగ వసంత రాయలు సినిమా తర్వాత దాదాపు ఆరేళ్లు బ్రేక్ తీసుకుని ప్రతినిధి 2తో రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. ఈ ఏడాది భైరవం, సుందరకాండ సినిమాలతో అలరించాడు. Glimpses from the vibrant #Haldi ceremony of #NaraRohith & #SireeLella 💛A celebration filled with joy, love, and laughter!@IamRohithNara pic.twitter.com/Dm9Hxh62WG— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) October 26, 2025చదవండి: అల్లు అరవింద్ తిట్టినన్ని తిట్లు మా నాన్న కూడా తిట్టలేదు! -
అదే జరిగితే ఆఫ్ఘనిస్థాన్‌తో యుద్దమే.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య కొద్దిరోజులుగా యుద్ధ వాతావరణం నెలకొంది. దాడులు, ప్రతి దాడులతో రెండు దేశాల సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. మరోవైపు.. ఇరు దేశాల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చల్లో ఒప్పందం కుదరకపోతే బహిరంగ యుద్దమే అని కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది.తాజాగా పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ఆఫ్ఘనిస్థాన్ శాంతిని కోరుకుంటుందనే విశ్వాసం ఉంది. ఒకవేళ శాంతి ఒప్పందం కుదరకపోతే వాళ్లతో బహిరంగ యుద్ధం చేస్తాం. అందుకు మాకు ఓ అవకాశం ఉంది. కానీ, వాళ్లు శాంతిని కోరుకుంటారని విశ్వసిస్తున్నా. ఇరు పక్షాలు కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నాయని అనుకుంటున్నా. గత నాలుగైదు రోజులుగా సరిహద్దులు ప్రశాంతంగానే ఉన్నాయి’ అని అన్నారు. అయితే, ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్న వేళ ఆసిఫ్ ఈ విధంగా స్పందించారు.Former Interior Minister Aftab Sherpao Criticizes Khawaja Asif’s Remarks on Possible War with AfghanistanPakistan’s former Interior Minister and head of the Qaumi Watan Party, Aftab Sherpao, has called Khawaja Asif’s recent statement—that Pakistan could wage an open war against… pic.twitter.com/3u94aQcvss— Truth Lens (@truthlenns) October 26, 2025ఆసిఫ్‌కు కౌంటర్.. మరోవైపు.. మహమ్మద్ ఆసిఫ్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ మాజీ మంత్రి, క్వామి వతన్ పార్టీ అధినేత అఫ్తాబ్ షెర్పావ్ ఘాటు విమర్శలు చేశారు. తాజాగా అఫ్తాబ్ స్పందిస్తూ..‘ఆసిఫ్ వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు అనవసరం. ప్రభుత్వ సీనియర్ మంత్రి నుండి ఇటువంటి వ్యాఖ్యలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత దెబ్బతీస్తాయి. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చల ప్రక్రియను దెబ్బతీస్తాయి. చర్చల ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. దశాబ్దాల సంఘర్షణలో అధికారులు శాంతి, ప్రాంతీయ స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన భవిష్యత్తును నిర్ధారిస్తారు’ అని కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ఖతార్, తుర్కియే మధ్యవర్తిత్వంతో దోహా వేదికగా రెండోసారి శాంతి చర్చలు జరుగుతున్నాయి. కాగా, అక్టోబర్ 18,19 తేదీల్లో జరిగిన మొదటి చర్చల్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్‌లు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ క్రమంలోనే శనివారం ఇస్తాంబుల్‌లో ఇరు దేశాల మధ్య చర్చలు మొదలయ్యాయి. ఆదివారం కూడా చర్చలు కొనసాగుతున్నాయి. -
కమల్-రజనీ మూవీ.. శృతి హాసన్, సౌందర్య ఏమన్నారంటే?
స్టార్ హీరోలు కమల్ హాసన్ (Kamal Haasan), రజనీకాంత్ గతంలో పలు హిట్ చిత్రాల్లో కలిసి నటించారు. ఆ తరువాత ఇద్దరూ కావాలనే విడివిడిగా నటించడం మొదలెట్టారు. అలాంటిది దాదాపు 46 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ కానుందన్న వార్త సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే! ఈ విషయాన్ని కమల్ హాసన్, రజనీకాంత్ కూడా నిజమేనని ధ్రువీకరించారు. రజనీ కూతురి రియాక్షన్అయితే ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుంది? దర్శకుడు ఎవరు? అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో అసలు ఈ చిత్రం తెరకెక్కుతుందా? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య.. కమల్, రజనీల మల్టీస్టారర్ మూవీ కచ్చితంగా ఉంటుందని ఓ అవార్డుల ప్రదానోత్సవంలో పేర్కొన్నారు. తన తండ్రి రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించే చిత్రాన్ని కమల్‌హాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తారని ఆమె స్పష్టం చేశారు. శ్రుతి హాసన్ ఏమందంటే?అదే వేడుకలో పాల్గొన్న హీరోయిన్ శ్రుతిహాసన్ (Shruti Haasan) కూడా కమల్, రజనీ మరోసారి కలిసి నటిస్తే చూడాలన్న ఆశ తనకూ ఉందన్నారు. దీంతో ఈ క్రేజీ కాంబోలో చిత్రం రావడం ఖాయం అనిపిస్తోంది. కాగా కెరీర్ తొలినాళ్ళలో ‘అపూర్వ రాగంగాళ్, మూండ్రు ముడిచ్చు, అంతులేని కథ’... ఇలా దాదాపు ఇరవైకి పైగా సినిమాల్లో కలిసి నటించారు రజనీకాంత్, కమల్‌హాసన్. 1979లో వచ్చిన ‘అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్’ తర్వాత వీరు కలిసి నటించింది లేదు.చదవండి: పూజా హెగ్డేకు రూ. 5 కోట్లా..? -
రేపు బంగాళాఖాతంలో తుపాను
సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది క్రమంగా పశ్చిమ దిశలో కదిలి శుక్రవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో వాయుగుండంగా మారింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో విశాఖపట్నం నుంచి ఆగ్నేయంగా 970 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 970 కిలోమీటర్లు, కాకినాడకు ఆగ్నేయంగా 990 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం మరింత బలపడి ఆదివారం ఉదయంకల్లా తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.తదుపరి 24 గంటల్లో ఈ తీవ్ర వాయుగుండం బలపడి సోమవారం నాటికి తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అనంతరం తుపాను మరింత బలపడి ఈనెల 28వ తేదీనాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ తర్వాత తీవ్ర తుపాన్ ఉత్తర వాయవ్య దిశలో కదులుతూ కాకినాడకు సమీపంలో 28వ తేదీ సాయంత్రానికి తీవ్ర తుపానుగా తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.నాలుగు రోజులపాటు మోస్తరు వర్షాలు..బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, తదుపరి తుపాను ప్రభావం రాష్ట్రంపైన మధ్యస్తంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనావేసింది. రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచిస్తోంది. కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా నమోదు కావచ్చని చెబుతూ, రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. -
రైల్వే బోర్డు కీలక నిర్ణయం: తక్షణమే అమల్లోకి..
దేశంలో పెరుగుతున్న మధుమేహ రోగుల సంఖ్యకు దృష్టిలో ఉంచుకుని.. రైల్వే బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లకు టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు, మీకు డయాబెటిక్ ఆహారం అవసరమని ముందుగానే సూచించవచ్చు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని రైల్వే బోర్డు వెల్లడించింది.రైల్వే బోర్డు సీనియర్ అధికారి దీని గురించి మాట్లాడుతూ, అన్ని ప్రీపెయిడ్ రైళ్లు ఇప్పుడు ఐదు రకాల ఆహార ఎంపికలను అందిస్తాయని తెలిపారు. అవి శాఖాహారం, మాంసాహారం, జైన్ భోజనం, డయాబెటిక్ శాఖాహారం, డయాబెటిక్ మాంసాహారం. దీని అర్థం డయాబెటిస్ ఉన్నవారికి శాఖాహారం & మాంసాహారం రెండూ ఉంటాయి.భారతదేశంలో.. ప్రతి సంవత్సరం సగటున 1.6 మిలియన్ల మంది డయాబెటిస్ కారణంగా మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రాజధాని ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లలో ఆహార ఎంపికలను విస్తరించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది.మధుమేహ రాజధానిగా భారత్!భారతదేశం ప్రస్తుతం ప్రపంచ మధుమేహ రాజధానిగా గుర్తింపు పొందుతోంది. ఇక్కడ దాదాపు 220 మిలియన్ల మంది టైప్ 2 డయాబెటిస్తో బాధపడుతున్నారు. కాగా ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో వృద్ధులు మాత్రమే ఈ వ్యాధితో బాధపడేవారు. కానీ ఇప్పుడు యువకులు కూడా పెద్ద సంఖ్యలో దీనికి బలైపోతున్నారు.ది లాన్సెట్ 2023 నివేదిక ప్రకారం.. భారతదేశంలో 212 మిలియన్ల మంది డయాబెటిక్ రోగులు ఉన్నారు. ఈ సంఖ్య చైనాలో 149 మిలియన్లు, యునైటెడ్ స్టేట్స్లో కేవలం 42 మిలియన్లు మాత్రమే. దీని అర్థం చైనా & యునైటెడ్ స్టేట్స్ రెండింటి సంఖ్యలను కలిపినా, మొత్తం ఇప్పటికీ 191 మిలియన్లుగానే ఉంది. ఒక్క భారతదేశంలో మాత్రమే 210 మిలియన్లకు పైగా డయాబెటిక్ రోగులు ఉన్నారు.ఇదీ చదవండి: ఇవి జరిగితేనే.. బంగారం ధరలు తగ్గుతాయి! -
ధీరుడు కొమురం భీమ్
సాక్షి, న్యూఢిల్లీ: నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి అణగారిన వర్గాల్లో కొత్త శక్తిసామర్థ్యాలను, స్ఫూర్తిని నింపిన ధీరుడు కొమురం భీమ్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్లాఘించారు. ముఖ్యంగా గిరిజన సమాజంపై ఆయన చెరగని ముద్ర వేశారని కీర్తించారు. నెలవారీ మాసాంతపు రేడియో ప్రసంగం ‘మన్ కీ బాత్’లో భాగంగా ఆదివారం ప్రధాని మోదీ ప్రసంగించారు. అక్టోబర్ 22న కొమురం భీమ్ జయంతిని గుర్తుచేస్తూ ఆయన పోరాట స్ఫూర్తిపై మోదీ ప్రసంగించారు. ‘20వ శతాబ్దం తొలినాళ్లలో దేశంలో కనుచూపుమేరలో స్వాతంత్య్రంపై నమ్మకం లేదు. బ్రిటిష్ పాలకులు భారత్‌ను దారుణంగా లూటీ చేశారు. ఆ సమయంలో హైదరాబాద్ సంస్థానంలో దేశభక్తులు అత్యంత హేయమైన అణచివేతను ఎదుర్కొన్నారు. క్రూరమైన, కనికరం లేని నిజాం దురాగతాలను భరించారు. పేదలు, అణగారిన, గిరిజన వర్గాలపై జరిగిన దురాగతాలకు అంతే లేదు. వారి భూములను లాక్కున్నారు. భారీ పన్నులు విధించారు. ఇది అన్యాయని ఎదిరించిన వాళ్ల చేతులు నరికేశారు. అలాంటి క్లిష్ట సమయాల్లో దాదాపు ఇరవై ఏళ్ల యువకుడు ఈ అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. నిజాంకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా ఆ కాలంలో పెద్ద నేరం. అలాంటిది ఆ యువకుడు సిద్ధిఖీ అనే నిజాం అధికారిని సవాల్ చేశాడు. రైతుల పంటలను జప్తు చేయడానికి నిజాం సిద్ధిఖీని పంపాడు. కానీ అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన ఈ పోరాటంలో ఆ యువకుడు సిద్ధిఖీని అంతంచేశాడు. అతను అరెస్ట్‌ను సైతం తప్పించుకోగలిగాడు. ఆ గొప్ప వ్యక్తే కొమురం భీమ్. అక్టోబర్ 22న ఆయన జయంతి చేసుకున్నాం. భీమ్ ఎక్కువ కాలం జీవించలేదు. కేవలం 40 ఏళ్లు మాత్రమే జీవించారు. నిజాం పాలకులకు కంటిమీద కునుకులేకుండా చేశారు. అంతటి యోధుడి ప్రాణాలను 1940లో నిజాం సైన్యం బలిగొంది. ఇంతటి గొప్ప వీరుని సాహసాలు, గొప్పతనం ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయతి్నంచాలని ప్రజల్ని కోరుతున్నా’ అని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో మాట్లాడారు. ‘‘నా వినమ్ర నివాళులు. ఆయన ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు’’ అని అన్నారు.వందేమాతరం వేడుకలు ‘‘మనందరి హృదయాలకు దగ్గరైన ఒక గీతం గురించి మొదట మాట్లాడుకుందాం. అదే మన జాతీయగీతం వందేమా తరం. ఈ ఒక్క పదమే ఎన్నో భావోద్వేగాలను, ఉరిమే ఉత్సాహాలను తట్టిలేపుతుంది. భరతమాతతో మన అనుబంధాన్ని గుర్తుచేస్తుంది. వందేమాతర గీతా న్ని ఆలపించి 140 కోట్ల మంది ఐక్యశక్తిని చాటుదాం’’ అని మోదీ అన్నారు. కమ్మని కోరాపుట్ కాఫీ ‘‘చాయ్‌తో నా అనుబంధం మీకు తెల్సిందే. కానీ ఈసారి కాఫీ విషయాలు మాట్లాడుకుందాం. గత మన్ కీ బాత్‌లో ఏపీలోని అరకు కాఫీ గురించి చర్చించాం. ఇప్పుడు ఒడిశా ప్రజలు ఎంతో ఇష్టపడే కొరాపుట్ కాఫీ కబుర్లు చెప్పుకుందాం. కోరాపుట్ కాఫీ ఘుమఘుమలు అద్భుతం. అంతేకాదు అక్కడి కాఫీ గింజల సాగు సైతం స్థానికుల ఆదాయాన్ని పెంచుతోంది. కోరాపుట్ కాఫీ ఎంతో స్వాదిష్టమైంది. అది ఒడిశా గౌరవం. అసలు భారతీయ కాఫీ అంటేనే ప్రపంచం దేశాలు పడిచస్తాయి’’ అని మోదీ అన్నారు. -
బ్లడ్‌బ్యాంక్ నిర్వాకం.. ఐదుగురు చిన్నారులకు హెచ్ఐవీ పాజిటివ్
రాంచీ: జార్ఖండ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త మార్పిడి తర్వాత ఐదుగురు చిన్నారులకు హెచ్ఐవీ పాజిటివ్ రావడం తీవ్ర కలకలం సృష్టించింది. హైకోర్టు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం ఉన్నతస్థాయి వైద్యబృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఘటన కారణంగా ప్రభుత్వం, రాష్ట్ర ఆరోగ్యశాఖపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. జార్ఖండ్‌లోని చాయ్‌బాసాలో స్థానిక బ్లడ్ బ్యాంకులో రక్తం ఎక్కించుకున్న తర్వాత తలసీమియాతో బాధపడుతున్న తమ ఏడేళ్ల కుమారుడికి హెచ్ఐవీ సోకిందని శుక్రవారం ఓ బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. దీంతో, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి వైద్యబృందాన్ని ఏర్పాటు చేసింది. ఆరోగ్య సేవల డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల వైద్య బృందాన్ని విచారణకు పంపింది. శనివారం జరిగిన విచారణలో అదే ఆసుపత్రిలో తరచుగా రక్తం ఎక్కించుకుంటున్న తలసేమియాతో బాధపడుతున్న మరో నలుగురు పిల్లలకు కూడా హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య ఐదుగురికి పెరిగింది.ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘తలసీమియా రోగికి కలుషిత రక్తం ఎక్కించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బ్లడ్ బ్యాంకులో కొన్ని లోపాలు ఉన్నట్లు విచారణ సందర్భంగా గుర్తించాం. లోపాలు సరిచేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించాం’’ అని అన్నారు. ఈ అవకతవకలను వివరించే నివేదికను రాష్ట్ర ఆరోగ్య శాఖకు సమర్పించారు.అనంతరం, జిల్లా సివిల్ సర్జన్ డా. సుశాంత్ కుమార్ మాఝీ ఈ అంశంపై మాట్లాడారు. ఇన్ఫెక్షన్ ఎలా వ్యాపించిందో తెలుసుకోవడానికి సమగ్ర విచారణ జరుగుతోందని అన్నారు. అయితే, ఇన్ఫెక్షన్ రక్త మార్పిడి ద్వారా మాత్రమే వచ్చిందని నిర్ధారించడం తొందరపాటు అవుతుందని, ఎందుకంటే కలుషితమైన సూదులు వంటి ఇతర కారణాల వల్ల కూడా హెచ్ఐవీ సంక్రమించవచ్చని ఆయన తెలిపారు.హైకోర్టు ఆగ్రహం..ఈ ఘటనను జార్ఖండ్ హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి, జిల్లా సివిల్ సర్జన్ నుంచి ఈ విషయంపై నివేదిక కోరింది. ప్రస్తుతం అధికారిక రికార్డుల ప్రకారం, వెస్ట్ సింగ్భూమ్ జిల్లాలో 515 హెచ్ఐవీ పాజిటివ్ కేసులు, 56 తలసేమియా రోగులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రక్త దాతలందరిని గుర్తించి వారి రక్త నమూనాలను మళ్లీ పరీక్షించాలని ఆదేశించింది.వ్యక్తిగత కక్ష కారణమా?అయితే, ఈ వ్యవహారంలో మరో కోణం వెలుగుచూసింది. మంజహరి జిల్లా పరిషత్ సభ్యుడు మాధవ్ చంద్ర కుంకల్ ఈ ఘటన వెనుక వ్యక్తిగత విద్వేషం కారణంగా ఉన్నట్లు ఆరోపించారు. రక్త బ్యాంక్ సిబ్బందికి, బాధితుల్లో ఓ బాలుడి బంధువులో ఒకరికి మధ్య ఏడాదికాలంగా కోర్టులో కేసు నడుస్తోందని ఆయన పేర్కొన్నారు. -
రాహుల్ అజేయ సెంచరీ
పుదుచ్చేరి: రాహుల్ సింగ్ (174 బంతుల్లో 114 బ్యాటింగ్; 12 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో చెలరేగడంతో... హైదరాబాద్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా పాండిచ్చేరితో శనివారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 70 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 255 పరుగులు చేసింది. రెగ్యులర్ కెప్టెన్ తిలక్ వర్మ ఆ్రస్టేలియాతో టి20 సిరీస్ ఆడేందుకు వెళ్లడంతో ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టుకు రాహుల్ సింగ్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయి ‘డ్రా’ చేసుకున్న హైదరాబాద్ జట్టు... ఈ పోరులో సాధికారికంగా ఆడింది. రాహుల్ అజేయ శతకంతో ఆకట్టుకోగా... కొడిమ్యాల హిమతేజ (137 బంతుల్లో 62 బ్యాటింగ్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో అతడికి అండగా నిలిచాడు. తన్మయ్ అగర్వాల్ (36), అభిరత్ రెడ్డి (35) ఫర్వాలేదనిపించారు. వర్షం కారణంగా మ్యాచ్ పూర్తి ఓవర్లపాటు సాగలేదు. పాండిచ్చేరి బౌలర్లలో సాగర్ ఒక వికెట్ పడగొట్టాడు. రాహుల్, హిమతేజ క్రీజులో ఉన్నారు. సత్తా చాటిన సాయితేజ విజయనగరం వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్‘ఎ’ మ్యాచ్‌లో ఆంధ్ర అరంగేట్ర బౌలర్ కావూరి సాయితేజ సత్తా చాటాడు. శనివారం ప్రారంభమైన పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బరోడా తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 79 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. విష్ణు సోలంకి (183 బంతుల్లో 99 బ్యాటింగ్; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీకి అడుగు దూరంలో నిలిచాడు. కెప్టెన్ అతీత్ సేథ్ (122 బంతుల్లో 65 బ్యాటింగ్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకంతో రాణించాడు. శివాలిక్ శర్మ (3), శాశ్వత్ రావత్ (8), సుకీర్త్ పాండే (15), నినాద్ రాథ్వా (0), మితేశ్ పటేల్ (0) విఫలమయ్యారు. జ్యోస్నిల్ సింగ్ (32) ఫర్వాలేదనిపించాడు. ఆంధ్ర బౌలర్లలో సాయితేజ 28 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అతడికిదే తొలి మ్యాచ్ కాగా... ఈ కుడి చేతివాటం మీడియం పేసర్ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. త్రిపురాన విజయ్ 2 వికెట్లు తీశాడు. -
ఆర్బీఐ మార్గదర్శకాలు.. పేటిఎం ఆఫ్‌లైన్ బిజినెస్ బదిలీ!
న్యూఢిల్లీ: పేమెంట్ ఆగ్రిగేటర్లకు రిజర్వ్ బ్యాంకు సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆఫ్‌లైన్ మర్చెంట్ పేమెంట్స్ వ్యాపారాన్ని తన అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్(పీపీఎస్ఎల్)కు బదిలీ చేసేందుకు పేటీఎం మాతృసంస్థ ‘వన్97 కమ్యూనికేషన్స్’ ఆమోదం తెలిపింది. తద్వారా గ్రూప్ ఆన్లైన్, ఆఫ్‌లైన్ మర్చెంట్ పేమెంట్స్ వ్యాపారాలు పీపీఎస్ఎల్ పరిధిలోకి వస్తాయని పేర్కొంది.ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్ వ్యాపార నిర్వహణకు పీపీఎస్ఎస్ ఇప్పటికే ఆర్బీఐ నుంచి ప్రాథమిక అనుమతి పొందినట్లు వివరించింది. పేమెంట్ అగ్రిగేషన్ కార్యకలాపాలన్నీ ఒకే సంస్థ నియంత్రణలో ఉండటం వల్ల.. సమన్వయ సామర్థ్యాలు మరింత పెరుగుతాయని కంపెనీ చెప్పుకొచ్చింది.‘‘క్యూఆర్ కోడ్లు, సౌండ్ బాక్సులు, ఈడీసీ మెషిన్ పేమెంట్లు ఆఫ్‌లైన్ మర్చెంట్ పేమెంట్స్ వ్యాపారం కింద వస్తాయి. పీపీఎస్ఎల్ బోర్డు, షేర్‌హోల్డర్ల ఆమోదానికి లోబడి బదిలీ ప్రక్రియ ఉంటుంది. కావున ఆర్థిక ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఉండదు’’ అని కంపెనీ వివరణ ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరం 2024 - 25లో ఆఫ్‌లైన్ మర్చెంట్ పేటమెంట్స్ బిజినెస్ ఆదాయం రూ.2,850 కోట్లుగా నమోదైంది. కంపెనీ మొత్తం ఆదాయంలో 47% వాటా ఇది. -
ఓటీటీలోకి సూపర్ హీరోల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
సూపర్ హీరో సినిమాలు అనగానే హాలీవుడ్లో మార్వెల్, డీసీ యూనివర్స్లే గుర్తొస్తాయి. కొన్నేళ్ల ముందు వరకు వీటి నుంచి అద్భుతమైన మూవీస్ వచ్చాయి. ప్రేక్షకుల నుంచి అలాంటి రెస్పాన్స్ వచ్చేది. కానీ రీసెంట్ టైంలో మాత్రం చిత్రాలైతే వస్తున్నాయి గానీ అంతంత మాత్రంగానే ఆదరణ దక్కించుకుంటున్నాయి. అలా ఈ ఏడాది జూలైలో వచ్చిన లేటెస్ట్ సూపర్ హీరోల మూవీ 'ద ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్'. ఇప్పుడు ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్ అయింది.జూలై 25న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాగా.. పాజిటివ్ టాక్ వచ్చినప్పుడు ఎందుకనో పెద్దగా కలెక్షన్స్ సాధించలేకపోయింది. కొన్నిరోజుల ముందు రెంట్ విధానంలో ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు ఉచితంగానే నవంబర్ 5 నుంచి హాట్స్టార్లోకి రాబోతుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఒకవేళ సూపర్ హీరో జానర్ మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని ట్రై చేయండి.(ఇదీ చదవండి: 9 నెలల పిల్లాడు.. దెయ్యమై పగ తీర్చుకుంటే?)'ద ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్' విషయానికొస్తే.. రీడ్ రిచర్డ్ (పెడ్రో పాస్కల్), స్యూ స్ట్రామ్ (వన్నెసా), జానీ స్ట్రామ్ (జోసెఫ్ క్విన్), బెన్ (మోస్ బాక్రాక్).. ఓ జట్టుగా ఉండే వీళ్లు ఆస్ట్రోనాట్స్. అందరూ వీళ్లని ఫెంటాస్టిక్ ఫోర్ అని పిలుస్తుంటారు. భూమిని ఎప్పుడూ కాపాడటమే వీళ్ల పని. స్యూ ప్రెగ్నెంట్ కావడంతో ఈమెకు పుట్టబోయే బిడ్డకు కూడా సూపర్ పవర్స్ వస్తాయా అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి టైంలో గలాక్టస్ (రాల్ఫ్ ఇన్నేసన్) భూమిని అంతం చేయబోతున్నాడని తెలుస్తుంది. దీంతో ఇతడికోసం ఫెంటాస్టిక్ ఫోర్ వేట మొదలుపెడతారు.స్యూకి పుట్టబోయే బిడ్డని తనకు ఇస్తే.. భూమిని, మనుషుల్ని విడిచిపెడతానని గలాక్టస్ చెబుతారు. అప్పుడు స్యూ ఏం చేసింది? భూమ్మీదకు వచ్చిన గలాక్టస్ని ఫెంటాస్టిక్ ఫోర్ ఏం చేసింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: పిల్లలతో తీసిన హారర్ సినిమా.. ఓటీటీ రివ్యూ)
