breaking news
-
మళ్ళీ పాతరోజుల్లోకి యువత
కాలం వెనక్కి నడుస్తున్నట్లుంది... డెబ్బై.. ఎనభైల్లో మాదిరి బతకడం ఇప్పుడు ఫ్యాషన్ అయింది.. మట్టి కుండల్లో వంట చేయడం.. చెట్లు చేమల్లో తిరగడం.. వాగుల్లో స్నానం చేయడం.. మజ్జిగన్నం.. ఉల్లిపాయ.. రాగిసంకటి.. నాటు కోడి కూరా.. నాటు పుట్టగొడుగులు.. అమ్మమ్మ ఊళ్లోకి వెళ్లి నాలుగురోజులు ఉండడం.. ఇవన్నీ మళ్ళీ కొత్తగా మొదలయ్యాయి..యువత కూడా వాటిని బాగానే ఆదరిస్తోంది.. చిరంజీవి.. నాగార్జున సినిమాలు రీ రిలీజ్ చేయడం.. అమ్మాయిలు.. పట్టు పరికిణీలు వేసుకోవడం.. వాలు జాడలు.. వెండిపట్టీలు.. ఇవన్నీ మళ్ళీ ట్రేండింగ్ అయ్యాయి.. ఇదేమాదిరి. కుర్రాళ్ళు కూడా పంచె లాల్చీ వేసుకోవడం.. బుర్ర మీసాలు పెంచడం.. కిర్రు చెప్పులు వేయడం.. ఊళ్ళో పందిరి కింద వెన్నెల్లో మంచం వేసి అమ్మమ్మ..తాతయ్యతో కబుర్లు చెప్పుకోవడం..కోడి పందాలు..ఊళ్ళోని పిల్లలతో గోళీలాట.. ఇవన్నీ మళ్ళీ ట్రెండింగ్ అయ్యాయి.దీంతోబాటు కొంతమంది ఓల్డ్ ఫ్యాషన్ ను అవలంబిస్తూ ఎన్టీఆర్ ఏఎన్నార్ మాదిరి బెల్ బాటమ్ ఫ్యాంట్లు వేయడం.. వాణిశ్రీ లెక్క సిగ ముడి వేయడం..ఇవి కూడా ట్రెండింగ్ ఉండేది కొన్నాళ్ళు. The striped underwear that our grandfather and great-grandfather wore is now internationally branded and priced between 2,500 and 11,000 rupees.🤔🤔🤨🤨 pic.twitter.com/V2Cs1DYEd9— Aviator Anil Chopra (@Chopsyturvey) October 23, 2025 అయితే ఇప్పుడు ఏకంగా మన తాతలు కాలంలో వేసుకునే గళ్ళ నిక్కర్ ఇప్పుడు అతి పెద్ద ట్రెండ్ అయి కూర్చుంది. పాతిక ముప్పై ఏళ్ల క్రితం ప్యాంట్లు.. పంచెకట్టు లోపల గళ్ళ నిక్కర్లు వేసుకునేవాళ్ళు..దానికి ఒక లాడా కూడా ఉండేది..దాన్ని లాగితే సులువుగా నిక్కర్ విప్పేసుకోవచ్చు..పైగా ఖద్దరు వస్త్రం కాబట్టి శరీరానికి సౌకర్యంగా ఉంటుంది.. చెమట పీల్చుతుంది.. వ్యవసాయ పనుల్లోనూ..నిద్ర పోయేటపుడు కూడా హాయిగా ఉండేది. ఇప్పుడు మళ్లీ ఆ నిక్కర్లు ఆన్లైన్ లో అమ్మకానికి పెట్టారు. హెచ్ అండ్ ఎం అనే కార్పొరేట్ బ్రాండింగ్ స్టోర్‌లో ఈ చెడ్డీలు అమ్మకానికి ఉంచారని వాటి ధర మాత్రం రూ.2500 నుంచి రూ.11,000 వరకు ఉందంటూ ఏవియేటర్ అనిల్ చోప్రా అనే ఆయన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో పోటోలు వీడియోలు పోస్ట్ చేశారు. మా తాతయ్య కాలంలో వేసుకునే గళ్ళ చెడ్డీలు మళ్ళీ వచ్చాయి కానీ ధర బాగా ఎక్కువే ఉంది అంటూ ఆయన చేసిన పోస్ట్ విపరీతంగా వైరల్ అయింది.వాస్తవానికి ఆ చెడ్డి మహా అయితే ఓ రెండు వందలు ఉండచ్చు కానీ దాన్ని ఈ కార్పొరేట్ సంస్థలు బ్రాండింగ్ చేసి ఏకంగా రూ.11,000 వరకు పెట్టి విక్రయిస్తుండగా యూత్ కూడా అంతే క్రేజీతో కొంటున్నారు. కొత్త ఒక వింత..పాత ఒక రోత అని అనుకుంటాం కానీ ఇప్పుడు పాత బంగారానికే డిమాండ్ ఎక్కువ..దానిపైనే మోజు పెరుగుతోందని అర్థం అవుతోంది.సిమ్మాదిరప్పన్న -
మోసాలే ‘పెట్టుబడి’
సాక్షి, హైదరాబాద్: కంటికి కనిపించకుండా మన కష్టార్జితాన్ని కాజేసే సైబర్ మోసగాళ్లు ఎప్పటికప్పుడు సరికొత్త రకం మోసాలకు తెరతీస్తూనే ఉన్నారు. లాటరీ వచ్చిందని, ఆఫర్లు ఉన్నాయని, ఆన్లైన్ జాబ్‌లు ఇస్తామని, పెట్టిన పెట్టుబడి రోజులు, నెలల వ్యవధిలోనే ఎన్నో రెట్లు పెరుగుతుందని.. ఇలా నిత్యం ఏదో ఒక రకమైన మోసపూరిత వల విసురుతూనే ఉన్నారు. అయితే, గతేడాదితో పోలిస్తే 2025లో సెప్టెంబర్ వరకు సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల సంఖ్యలో తగ్గుదల కాస్త ఊరటనిచ్చే అంశం. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అందుతున్న ఫిర్యాదులలో ఎక్కువగా ఐదు రకాల మోసాలకు సంబంధించినవే ఉన్నట్టు సమాచారం. ఇన్వెస్ట్మెంట్ మోసాలు ఇందులో మొదటి స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత స్థానాల్లో ఐడెంటిటీ థెఫ్ట్ (వ్యక్తిగత సమాచారం సేకరించి మోసాలు) మోసాలు, అడ్వరై్టజ్‌మెంట్ ఫ్రాడ్స్, లోన్ ఫ్రాడ్స్, బిజెనెస్–పార్ట్‌టైం జాబ్ మోసాలు ఉన్నాయి. అత్యాశే అనర్థాలకు మూలం.. పెట్టిన పెట్టుబడి రోజులు, నెలల్లోనే రెట్టింపు అవుతుందన్న ప్రకటనలు నమ్మి మోసపోతున్నవారే అధికంగా ఉంటున్నారు. ప్రజల అత్యాశనే సైబర్ నేరగాళ్లు తమ ఆయుధంగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల ద్వారా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అధిక రాబడి వాగ్దానాలను నమ్మవద్దు. నెలకు 10 నుంచి 20 శాతం రిటర్న్‌ల వంటి వాగ్దానాలు ఇస్తున్నారంటే అది మోసమని గ్రహించాలి. ఆన్లైన్ ట్రేడింగ్ యాప్‌లతో జాగ్రత్తగా ఉండాలి. సెబీ (సెక్యురిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ఆమోదం లేని యాప్‌లు వాడవద్దు. ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలని సైబర్ నేరగాళ్లు సూచించిన యాప్‌లలో లాభాలు చూపి, రియల్ అకౌంట్లో నష్టం కలిగిస్తారని మరవొద్దు అని నిపుణులు సూచిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి.. తెలంగాణలో నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ 18 నుంచి 20 శాతం వరకు ఉంటున్నాయి. ఈ తరహా మోసాలకు ఎక్కువగా రిటైర్డ్ ఉద్యోగులు బలవుతున్నారు. ఆ తర్వాత 30 నుంచి 45 ఏళ్ల వయసులో ఉన్న ఐటీ ఉద్యోగులు, డాక్టర్లు, ఇతర విద్యాధికులు ఉంటున్నారు. అయితే, స్టాక్స్ ఇతర షేర్లలో పెట్టుబడులకు సంబంధించి వెరిఫైడ్ ఏజెన్సీల నుంచి మాత్రమే సూచనలు తీసుకోవాలి. అదేవిధంగా డీమ్యాట్ అకౌంట్ ద్వారానే చెల్లింపులు చేయాలి. వాట్సాప్ లింక్‌లలో వచ్చే సందేశాలు నమ్మి మోసపోవద్దు. మీరు పెట్టుబడి పెట్టే స్టాక్స్ వివరాలు ముందుగా ఆన్లైన్లో చెక్ చేసుకున్న తర్వాతే పెట్టుబడి పెట్టాలి. – శిఖాగోయల్, డైరెక్టర్, టీజీ సీఎస్బీ (ఫొటో కామన్‌లో శిఖాగోయల్ పేరిట ఉంటుంది) -
‘పొట్ట’ కొడుతున్న వానలు
సాక్షి, అమరావతి: వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలు అన్నదాతల పొట్ట కొడుతున్నాయి. పొట్ట దశలో ఉన్న వరికి సంకటంగా మారాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో లక్షలాది ఎకరాలు నీటమునిగాయి. పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, అపరాల పంటలకు అపార నష్టం వాటిల్లింది. ప.గో., గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వరితోపాటు వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లింది. చిత్తూరు జిల్లాలో వరి చేలు పడిపోయాయి. నంద్యాలలో మొక్కజొన్న రైతును దెబ్బతీసింది. భారీ వర్షాల ధాటికి ఇప్పటి వరకు దాదాపు లక్షన్నర ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వాస్తవానికి రెండున్నర లక్షల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నట్టు రైతులు చెబుతున్నారు. రైతుల కష్టాలుకుండపోత వర్షాలకు పొట్ట దశకు చేరుకున్న వరి పంట నేలకొరగడంతో రైతులు పడరాని పాట్లు పడుతన్నారు. పొలాల్లో నిలిచిన నీటిని బయటకు పంపేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తేమ శాతం అధికంగా ఉండడంతో పాటు గింజలు రంగుమారే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే నూర్పిడి పనులు మొదలు పెట్టిన ప్రాంతాల్లో ధాన్యం రాశులు తడిసిపోతుండడంతో వాటిని కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారు. అన్ని పంటలకూ నష్టం రబీ సీజన్లో మినుము, జొన్న, వేరుశనగ, మొక్కజొన్నతోపాటు ఆరుతడి పంటలు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో భారీ వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. చాలా చోట్ల మళ్లీ విత్తుకోవల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో వరి, కూరగాయలు, చెరకు, ఆరుతడి పంటలకు అధిక నష్టం వాటిల్లగా, రాయలసీమ జిల్లాల్లో అపరాలు, మొక్కజొన్న పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పత్తి రైతును తేమ ముప్పు వణికిస్తోంది. పత్తి తీసి అమ్మకాలకు సిద్ధపడుతున్న తరుణంలో భారీ వాన రైతుల ఆశలను చిదిమేసింది. వరిపైనే అధిక ప్రభావం వరిపై అధిక వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. గింజల్లో మొలకలు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బీపీటీ 5204, పీఎల్ 1100 వంటి రకాలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఆకు మచ్చ, పాముపొడ, కాటుక తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షాల వల్ల వరి దిగుబడులు 15–25 శాతం తగ్గే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అపరాలకు 10–20 శాతం, కూరగాయలకు 20–30 శాతం,మిరపకు 15–30 శాతం, మొక్కజొన్నలో 10–18 శాతం, చెరకులో 8–15 శాతం మేర దిగుబడులపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. వరిలో...యాజమాన్య పద్ధతులిలా..వరి పొలాల్లో ఉన్న నీటిని వెంటనే బయటకు పంపాలి. చిన్న కమతాలలో పంటను నిలబెట్టవచ్చు. పెద్ద కమతాలలో డ్రెయినేజీ మురుగు నీరు పోయే సదుపాయం చేయాలి.గింజ రంగు మారడాన్ని నివారించడానికి, పాము పొడ ,కాటుక తెగులు వ్యాప్తిని అరికట్టడానికి ఎకరానికి 200 ఎంఎల్ ప్రాపికోనజోల్ పిచికారి చేయాలి » ధాన్యం గట్టిపడే నుంచి కోత దశలో ఉన్న పంట పొలాల్లోని నీటిని లోపలి కాలువల ద్వారా తొలగించాలి. కంకుల గింజలపై మొలకలు కనిపిస్తే (వాలిన లేదా నిలిచిన పంటలో) 5% ఉప్పు ద్రావణం (50 గ్రాముల గళ్ళ ఉప్పు / లీటరు నీరు) పిచికారీ చేయాలి.» ఆలస్యంగా నాటిన పంట (పిలకలు తొడిగే దశ) వర్షపు నీరు పొలాల్లో సాధారణ రకాలలో 7 రోజుల్లో తగ్గితే ఎకరాకు యూరియా 20 కేజీలు + పొటాష్ 20 కేజీలు/ బూస్టర్ డోసుగా వేయాలి.» నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో నర్సరీ దశలో ఉన్న పంట పొలాలకు నీరు తగ్గిపోయిన తర్వాత ప్రతి 5 సెంట్ల నారుమడికి యూరియా 1 కిలో + పొటాష్ 1 కిలో కలిపి బూస్టర్ డోసుగా వేయాలి. నారుమడులు కుళ్లిపోకుండా ఉండేందుకు కార్బెండాజిం 1 గ్రాము లేదా కార్బెండాజిం + మాంకోజెబ్ 2 గ్రాములు/లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేయాలి.పత్తి, వేరుశనగలో యాజమాన్య పద్ధతులిలా..ఈ వర్షాలకు ఆకుమచ్చ తెగులు నివారణకు హెక్సా కొనజోల్ 2 మి.లీ లేదా కార్బన్ డిజిమ్ 1 గ్రామ్ లీటరు నీటికి కలిపి15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయ్యాలి » పత్తిలో పూత, గూడ రాలే అవకాశం ఉంది కాబట్టి నివారణకు బోరాక్స్‌ను లీటర్ నీటికి 1.5 గ్రాములు కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.» 2 శాతం యూరియ లేదా నీటిలో కరిగే ఎరువులైన 19–19–19 లేదా 17–17–17 లేదా పొటాషియం నైట్రేట్‌ను పిచికారి చేయాలి.» కాయ దశలో కాయ కుళ్ళు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రాములు మరియు 2 గ్రాముల ప్లాంటో మైసిన్ 10లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.సజ్జ పంట: కోత దశలో గింజ మొలక రాకుండా కంకులపై గళ్ళ ఉప్పు 50 గ్రాములను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మెట్ట ప్రాంతాల్లో అయితే... అన్ని పంటలకు ఒకే రీతిలో పొలం నుంచి నీళ్లను పూర్తిగా దిగిపోయిన తర్వాత బూస్టర్ డోస్ గా 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్‌ను మొక్కల మొదట్లో వేయాలి. ఆకుమచ్చ, పొడ తదితర శిలీంద్ర తెగుళ్లకు హెక్సాకొనజోల్ 2 గ్రాములు లీటరు నీటికి లేదా కార్బన్ డిజిమ్ 1 గ్రాము లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. -
సౌతాఫ్రికా బౌలర్ సంచలనం.. ఏకంగా 1000 వికెట్లతో!
సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హర్మర్ 36 ఏళ్ల వయస్సులో సత్తచాటుతున్నాడు. రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో జగిన రెండో టెస్టులో హర్మర్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టిన హర్మర్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం బంతితో అద్భుతం చేశాడు. ఏకంగా 6 వికెట్లు పడగొట్టి పాక్ ఓటమిని శాసించాడు.మొత్తంగా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 8 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా వెటరన్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 1000 వికెట్లు పూర్తి చేసుకున్న నాలుగో దక్షిణాఫ్రికా బౌలర్‌గా హర్మెర్ నిలిచాడు.ఇప్పటివరకు తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 234 మ్యాచ్‌లు ఆడిన హర్మెర్.. 1000 వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికా తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా దిగ్గజం చార్లీ లెవెలిన్(1013) అగ్రస్ధానంలో కొనసాగుతుండగా.. తర్వాతి స్ధానాల్లో మైక్ ప్రాక్టర్(1417), అలెన్ డొనాల్డ్(1216) ఉన్నారు.కాగా ఫస్ల్ క్రికెట్లో సంచలన ట్రాక్ రికార్డు ఉన్న హర్మెర్.. జాతీయ జట్టుకు మాత్రం అతి తక్కువ మ్యాచ్‌లలో ప్రాతినిథ్యం వహించాడు. 2015లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అతడు ఇప్పటివరకు కేవలం 12 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. హర్మెర్ సెలక్టర్లు ఎక్కువగా అవకాశాలు ఇవ్వలేదు. కానీ ఇటీవల కాలంలో ప్రోటీస్ టెస్టు జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు. అతడి పేరిట 52 టెస్టు వికెట్లు ఉన్నాయి.వచ్చే నెలలో భారత పర్యటనకు రానున్న సౌతాఫ్రికా జట్టులో భాగం కానున్నాడు. భారత్ పిచ్‌లు స్పిన్‌కు ఎక్కువగా అనుకూలించే అవకాశమున్నందన అతడు ప్రోటీస్ జట్టుకు కీలకం కానున్నాడు.చదవండి: IND vs AUS: అతడే ఉంటే కథ వేరేలా ఉండేది.. గంభీర్ ఇకనైనా మారవా? -
ఒకే గ్రామంలో ముగ్గురి ఆత్మహత్య
హయత్‌నగర్: వారంతా ఒకే గ్రామానికి చెందిన వారు. చిన్నప్పుడు ఒకే పాఠశాలలో, ఒకే తరగతిలో చదువుకు న్నారు. కానీ ఏమైందో ఏమో ఉన్నట్టుండి ఒకరి తర్వాత ఒకరు ఉరేసుకొని ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొహెడ గ్రామంలో జరిగిన ఈ ఘటనలు స్థానికంగా కలకలం సృష్టించాయి. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన గ్యార శివరాజు కుమార్తె వైష్ణవి (18) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. మంగళవారం కడుపు నొప్పి ఎక్కువ కావడంతో సాయంత్రం డాక్టర్ వద్దకు తీసుకెళ్తామని కుటుంబ సభ్యులు చెప్పారు. అనంతరం స్నానం చేసి వస్తానంటూ వెళ్లిన వైష్ణవి.. బెడ్రూంలో గడియ పెట్టుకొని చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఎంత సేపటికీ ఆమె బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపు బద్దలుకొట్టి చూడగా వైష్ణవి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన జరిగిన మర్నాడే సతాలి వెంకటేశ్ కుమారుడు రాకేశ్ (21) బుధవారం రాత్రి తన సోదరుడి దుకాణంలో పడుకుంటానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లి అర్ధరాత్రి తర్వాత ఫ్యాన్‌కు ఉరేసుకొని తనువు చాలించాడు. గురువారం ఉదయం తల్లి యాదమ్మ షాప్ ఊడ్చేందుకు షట్టర్ తెరిచి చూసి కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారు వచ్చి కిందకు దించి చూడగా అప్పటికే రాకేశ్ మృతిచెందాడు. రాకేశ్ మరణవార్త తెలుసుకొని అతని మృతదేహాన్ని చూసి ఇంటికొచ్చిన బుద్ద నర్సింహ రెండో కుమార్తె శ్రీజ (18) ఇంట్లోకి వెళ్లి లోపలి నుంచి తాళం వేసుకుంది. ఆమె సోదరి గమనించి కజిన్‌కు విషయం చెప్పడంతో అతను వచ్చి చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు తెరిచాడు. అప్పటికే శ్రీజ లుంగీతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న 108 అంబులెన్స్ వైద్య సిబ్బంది శ్రీజను పరీక్షించి ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. వరుస ఆత్మహత్య ఘటనలపై కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
భారత బౌలర్ల విజృంభణ... ఆసీస్ ఆలౌట్.. స్కోరెంతంటే?
ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో టీమిండియా (IND vs AUS 3rd ODI) బౌలర్లు రాణించారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఆతిథ్య జట్టును నామమాత్రపు స్కోరుకే ఆలౌట్ చేశారు. యువ పేసర్ హర్షిత్ రాణా (Harshit Rana) నాలుగు వికెట్లతో మెరిసి.. యాజమాన్యం తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా చేదు అనుభవం చవిచూసింది. తొలి రెండు వన్డేల్లో ఓడి సిరీస్‌ను ఆసీస్‌కు కోల్పోయింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య సిడ్నీ వేదికగా శనివారం నాటి నామమాత్రపు మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. భారత్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది.సిరాజ్ మొదలెడితే..ఆసీస్ టాపార్డర్‌లో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (25 బంతుల్లో 29) వేగంగా ఆడే ప్రయత్నంలో మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ప్రసిద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక మరో ఓపెనర్, కెప్టెన్ మిచెల్ మార్ష్ (41)ను అక్షర్ పటేల్ బౌల్డ్ చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ (30) వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.అదరగొట్టిన హర్షిత్విరాట్ కోహ్లి అద్భుత క్యాచ్ అందుకుని షార్ట్‌ను పెవిలియన్‌కు పంపడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక అలెక్స్ క్యారీ (24), కూపర్ కన్నోలి (23), మిచెల్ ఓవెన్ (1) రూపంలో మూడు కీలక వికెట్లు తీసిన హర్షిత్ రాణా.. జోష్ హాజిల్‌వుడ్ (0)ను కూడా అవుట్ చేశాడు. మొత్తంగా 8.4 ఓవర్లు బౌల్ చేసి 39 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.CLUTCH! ⭐⭐⭐⭐#HarshitRana bags his maiden 4-wicket haul in international cricket as #TeamIndia bowl out Australia in Sydney 👏#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuANAu pic.twitter.com/JXFhwCDgzX— Star Sports (@StarSportsIndia) October 25, 2025మిగతా వారిలో సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీయగా.. వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. భారత బౌలర్ల ధాటికి ఆసీస్ 46.4 ఓవర్లలో 236 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మ్యాట్ రెన్షా (56) టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. లోయర్ ఆర్డర్లో నాథన్ ఎల్లిస్ (16) ఫర్వాలేదనిపించాడు. స్టార్క్ (2), జంపా (2*) ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇక సిడ్నీలో గత మూడు మ్యాచ్‌లు ఓడిన టీమిండియా 237 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించి గెలుపు నమోదు చేయాలని పట్టుదలగా ఉంది.చదవండి: శ్రేయస్ అయ్యర్ సంచలన క్యాచ్.. టీమిండియాకు ఊహించని షాక్! -
బస్సులో ఉండాల్సిన రక్షణ వ్యవస్థలు
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ప్యాసింజర్లు మరణించడం అత్యంత దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు ప్రయాణికుల భద్రతపై ఆందోళనలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీ, స్లీపర్ బస్సుల్లో తప్పనిసరిగా ఉండాల్సిన భద్రతా వ్యవస్థలు, వాటిని ఉపయోగించే విధానం గురించి తెలుసుకుందాం. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడానికి కింది భద్రతా వ్యవస్థలు, సదుపాయాలు ఎంతో అవసరం అవుతాయి.ఫైర్ సేఫ్టీ (అగ్నిమాపక భద్రత)అగ్నిప్రమాదాల వల్ల బస్సుల్లో తీవ్రత అధికంగా ఉంటుంది. ఏసీ, స్లీపర్ బస్సుల్లో కిటికీలు తెరవడానికి వీలులేకపోవడం, తక్కువ ఎంట్రీ/ ఎక్జిట్ మార్గాలు ఉండడం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. బస్సు ప్రయాణిస్తున్న సమయంలో ఇంజిన్ లేదా ఇతర భాగాల్లో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, పొగ వచ్చినప్పుడు వెంటనే డ్రైవర్‌ను, ప్రయాణికులను అప్రమత్తం చేసే సెన్సార్ ఆధారిత అలారం వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలి. ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా, సులభంగా ఉపయోగించగలిగే కనీసం రెండు లేదా అంతకంటే ఎక్కువ ఫైర్ ఎక్స్‌టింగ్యుషర్లు ఉండాలి.ఎమర్జెన్సీ ఎక్జిట్సాధారణ ఎంట్రీ/ ఎక్జిట్ ద్వారాలు కాకుండా బస్సులో కనీసం రెండు సులభంగా తెరవగలిగే అత్యవసర ద్వారాలు (కిటికీలు లేదా హాచ్లు) తప్పనిసరిగా ఉండాలి. ఈ మార్గాలను స్పష్టంగా గుర్తించేలా ఏర్పాటు చేయాలి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అగ్నిప్రమాదం తీవ్రతను తగ్గించడానికి ఇంధన సరఫరాను ఆటోమేటిక్‌గా నిలిపివేసే వ్యవస్థ ఉండాలి.ఫస్ట్ ఎయిడ్ (ప్రథమ చికిత్స) కిట్ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో బ్యాండేజీలు, యాంటీసెప్టిక్ వైప్స్, కత్తెర, పట్టీలు, నొప్పి నివారణ మందులు (చిన్న గాయాలు, తలనొప్పి, వాంతులు మొదలైన వాటికి), బర్న్ క్రీమ్స్ వంటి ప్రాథమిక వైద్య సామాగ్రి అందుబాటులో ఉంచాలి. డ్రైవర్, అటెండర్లు ఈ పరికరాలను ఉపయోగించడంపై శిక్షణ పొంది ఉండాలి.ఇతర భద్రతా అంశాలుఅత్యవసర పరిస్థితుల్లో (ముఖ్యంగా అగ్నిప్రమాదం లేదా బస్సు నీటిలో పడినప్పుడు) కిటికీల అద్దాలు పగలగొట్టి బయటపడేందుకు ఉపయోగపడే సేఫ్టీ హ్యామర్లు బస్సులో కనీసం 4-6 చోట్ల ఏర్పాటు చేయాలి.స్లీపర్ బెర్త్‌ల్లో ఇవి లేకపోయినా సీటింగ్ విధానం ఉన్న బస్సుల్లో కచ్చితంగా సీట్ బెల్ట్‌లు ఉండాలి.ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్‌ను, ఇతరులను అప్రమత్తం చేయడానికి ఉపయోగించే అత్యవసర బటన్ ఉండాలి.ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా విద్యుత్ సరఫరా ఆగిపోయినప్పుడు కూడా మార్గాలు కనిపించేలా అత్యవసర లైటింగ్ వ్యవస్థ ఉండాలి.భద్రతా వ్యవస్థలను ఉపయోగించే విధానంఅగ్నిప్రమాదం సంభవించినప్పుడు మొదట డ్రైవర్‌ను, తోటి ప్రయాణికులను వెంటనే అప్రమత్తం చేయాలి. అత్యవసర బటన్‌ను నొక్కాలి. అగ్ని ప్రమాద సమయంలో దగ్గరలో ఉన్న ఫైర్ ఎక్స్టింగ్యుషర్ను ఉపయోగించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాలి. మంటలు అదుపు తప్పితే వెంటనే బయటకు వెళ్లాలి. ప్రమాద సమయాల్లో అత్యవసర ద్వారాలు లేదా కిటికీలు (సేఫ్టీ హ్యామర్‌తో పగలగొట్టి) ద్వారా బయటకు రావాలి.బస్సు నుంచి బయటకు వచ్చిన తర్వాత గాయాలు తగిలిన వారికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో ఉన్న యాంటీసెప్టిక్ ద్రవంతో శుభ్రం చేసి, బ్యాండేజీ వేయాలి. ఎక్కువగా రక్తస్రావం అవుతుంటే శుభ్రమైన గుడ్డ లేదా ప్యాడ్‌తో గాయంపై గట్టిగా నొక్కి పట్టుకోవాలి. వీలైనంత త్వరగా వైద్య సాయం అందేలా చూడాలి.ఇదీ చదవండి: భారత్‌లో సొంతింటి కోసం తంటాలు.. కానీ చైనాలో.. -
నాగార్జున 'శివ' రీ రిలీజ్.. బన్నీ పోస్టర్ రిలీజ్..!
అక్కినేని నాగార్జున నటించిన కల్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ 'శివ'. ఈ మూవీ నాగ్ కెరీర్లోనే చాలా ప్రత్యేకం. ఈ సినిమా రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో రామ్‌గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమయ్యారు. అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న రిలీజైంది. ఇళయరాజా సంగీతంలో ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గానూ నిలిచింది. ఈ సినిమాని శివ(1990) పేరుతోనే హిందీలో రీమేక్ చేసిన రామ్‌గోపాల్ వర్మ అక్కడ కూడా హిట్ అందుకున్నారు.ఈ సినిమా 4కె వర్షన్, డాల్బీ అట్మాస్‌లో ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వనుంది. తెలుగులో మరోసారి వెండితెరపై సందడి చేయనుంది. ఈ మూవీ గురించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. టాలీవుడ్ సినిమా శివ మూవీ తెచ్చిన మార్పు గురించి ప్రస్తావించనున్నారు. ఈ శుక్రవారం ఉదయం 11 గంటల 7 నిమిషాలకు మాట్లాడనున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ ట్వీట్ చేసింది. దీంతో బన్నీ స్పీచ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శివ మూవీ గురించి ఏం మాట్లాతారనే విషయంపై అభిమానులతో పాటు అందరిలోనూ ఆతృత నెలకొంది. కాగా.. ఈ సినిమాను నవంబర్ 14న థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. కాగా.. నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రంలో అమల హీరోయిన్గా నటించారు. కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవలు, గ్యాంగ్‌లు, రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం స్టూడెంట్స్‌ని ఎలా ఉపయోగించుకుంటారు? విద్యార్థుల మధ్య ఎలాంటి గొడవలు సృష్టిస్తారు? ఇలాంటి సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించి సరికొత్త ట్రెండ్‌ని సృష్టించారు వర్మ. ICON STAR of Indian Cinema 🔥🔥🔥× ICONIC FILM of Indian Cinema ❤️🔥❤️🔥❤️🔥Watch India's Favourite Star, @alluarjun talks about the Impact of SHIVA, Tomorrow at 11:07 AM💥💥💥#SHIVA4K with Dolby Atmos Grand Re-Release in theatres on NOVEMBER 14TH, 2025. #50YearsOfAnnapurna… pic.twitter.com/b2sB6nLIk5— Annapurna Studios (@AnnapurnaStdios) October 24, 2025 -
లక్ష కోట్ల పెట్టుబడులు.. 5 లక్షల మందికి ఉపాధి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో 2030 నాటికి కొత్తగా రూ.లక్ష కోట్ల పెట్టుబడులను రప్పించడం ద్వారా 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగ ఆర్థిక వ్యవస్థ విలువ ప్రస్తుతం 80 బిలియన్ డాలర్లు కాగా, 2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా త్వరలో ‘కాంప్రహెన్సివ్ లైఫ్ సైన్సెస్ పాలసీ’ని అమలు చేస్తామని ప్రకటించారు.గడిచిన 20 నెలల్లో రాష్ట్రానికి రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, అందులో లైఫ్ సైన్సెస్ రంగంలోనే రూ.63 వేల కోట్లుగా ఉందన్నారు. తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ఆస్ట్రేలియా లైఫ్ సైన్సెస్ సంస్థ ‘ఆస్ బయో టెక్’, విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం మెల్బోర్న్లో సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఆస్ బయోటెక్ ఇంటర్నేష నల్ కాన్ఫరెన్స్ 2025’లో మంత్రి శ్రీధర్‌బాబు గురు వారం కీలకోపన్యాసం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో గడిచిన రెండేళ్లలో తెలంగాణ సాధించిన పురోగతి, భవిష్యత్ ప్రణాళికలు, అవకాశాలు, పెట్టు బడులకు ఉన్న అనుకూల తలను మంత్రి వివరించారు.అత్యుత్తమ లైఫ్‌సైన్సెస్ క్లస్టర్లలో హైదరాబాద్‘ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ రూపొందించిన ’గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ 2025’లో ప్రపంచంలోని అత్యుత్తమ లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో హైదరాబాద్‌కు చోటు దక్కి ంది. బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, కేంబ్రిడ్జ్, బీజింగ్, టోక్యో సరసన హైదరాబాద్ నిలిచింది. లైఫ్ సైన్సెస్ ఆఫీస్ లీజింగ్ 2022లో 0.6 మిలియన్ చదరపు అడుగులు కాగా, 2024 నాటికి నాలుగు రెట్లు పెరిగి 2.4 మిలియన్ చదరపు అడుగు లకు చేరింది.లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ, యంగ్‌ఇండియా స్కిల్క్స్ యూనివర్సిటీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్, ఇతర అంతర్జాతీయ దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో భవిష్యత్ బయో –డిజిటల్ యుగానికి కావాల్సిన అత్యుత్తమ నైపుణ్యమున్న మానవ వనరులను తయారు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసు కుంది. ఆస్ బయోటెక్ ఇంటర్నేషనల్ సద స్సు ‘విక్టోరియా తెల ంగాణ ఇన్నోవేషన్ కారిడార్’కు నాంది పలకాలి’అని శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైదరా బాద్‌లో జరిగే బయో ఏషియా సదస్సు కు హాజరు కావాలని దిగ్గజ లైఫ్ సైన్సెస్ పరిశ్రమలను మంత్రి ఆహ్వానించారు. సదస్సులో విక్టోరియా మంత్రులు రోస్ స్పెన్స్, డానీ పియ ర్సన్, ఆస్ బయోటెక్ చైర్మన్ డాక్టర్ జేమ్స్ క్యాంప్‌బెల్, తెల ంగాణ ఇన్వెస్ట్మెంట్ సెల్ డైరెక్టర్ మధుసూదన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్ పాల్గొన్నారు. -
కరీబియన్ జలాల్లో అమెరికా మళ్లీ దాడి
వాషింగ్టన్: కరీబియన్ సముద్ర జలాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ బోటుపై చేపట్టిన వైమానిక దాడిలో ఆరుగురు చనిపోయారని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ శుక్రవారం తెలిపారు. వీరంతా వెనిజులా జైలు నుంచి నడుస్తున్న ట్రెన్ డె అరాగ్వా గ్యాంగ్‌కు చెందిన వారేనన్నారు. ఈ ప్రాంతంలోని నార్కో– టెర్రరిస్ట్ డ్రగ్స్ రవాణాదారులను అల్‌ఖైదా ఉగ్రవాదులుగానే భావిస్తామన్నారు. వారిని వెంటాడి వేటాడి చంపుతామని హెగ్సెత్ హెచ్చరించారు. తాజా ఘటనతో సెపె్టంబర్ నుంచి ఆ ప్రాంతంలో అమెరికా చేపట్టిన దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య 43కు చేరుకుంది. ఇలా ఉండగా, దక్షిణ అమెరికా ప్రాంతంలోకి విమాన వాహక నౌకను పంపిస్తున్నట్లు రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. గురువారం అమెరికా సైనిక సూపర్సోనిక్ హెవీ బాంబర్లు రెండు వెనిజులా తీరం వెంబడి చక్కర్లు కొట్టాయి. కరీబియన్ సముద్రం, వెనిజులా తీర వెంబడి అమెరికా బలగాల అసాధారణ మోహరింపులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో నార్కో టెర్రరిజమ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురోను గద్దె దించే లక్ష్యంతోనే ఇవన్నీ చోటుచేసుకుంటున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. డ్రగ్స్ రవాణా ఒక కారణం మాత్రమే కాగా, ఆయా దేశాలను బెదిరించి దారికి తెచ్చుకోవడమే అమెరికా అసలు లక్ష్యమని పరిశీలకులు అంటున్నారు.
