breaking news
-
బిగ్‌బాస్‌లో బాడీ షేమింగ్.. దివ్యపై సంజన వ్యాఖ్యలు
బిగ్‌బాస్ షో అంటేనే బూతులకు కేరాఫ్ అంటూ చాలామంది విమర్శించడం చూస్తూనే ఉన్నాం. గతంలో సీపీఐ నారాయణ మరో అడుగు ముందుకేసి ఏకంగా బ్రోతల్ హౌస్ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలను చాలామంది తప్పుబట్టారు. అయితే, గతంలో ఎప్పుడూ లేనంత విమర్శలు బిగ్‌బాస్ 9వ సీజన్ మీద వస్తున్నాయి. రోజురోజుకూ షో మరీ దిగజారిపోయిందనే అభిప్రాయం కనిపిస్తుంది.హౌస్‌లో నటి సంజన గల్రానీ ప్రవర్తన, ఆమె చేస్తున్న కామెంట్లు చాలా అభ్యంతరకంగానే ఉన్నాయి. వాటిని ఏకంగా టెలికాస్ట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏకంగా దివ్య అనే కామనర్ పట్ల సంజన బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేసింది. దివ్య ఒక రోడ్ రోలర్ మాదిరిగా మీదికి ఎక్కేస్తుందంటూ రమ్యతో చెప్పిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోసారి కల్యాణ్ పట్ల కూడా ఆమె ఇలాగే ప్రవర్తించింది. తాను క్లాస్ అంటూ 'కల్యాణ్' లో క్లాస్ అంటూ పేర్కొంది. ఒక సెలబ్రిటీ (తనూజ) చుట్టూ తిరుగుతున్నావ్ అంటూ కల్యాణ్‌పై చీప్ కామెంట్లు చేసింది.మరోసారి తనూజ పట్ల కూడా జలసీ రాణీ అంటూ హైపర్ అయిపోయింది. ఇలా సంజన పదేపదే నోరు జారడం పరిపాటిగా మారిపోయింది. ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కొన్ని షోలో టెలికాస్ట్ అవుతున్నాయి. మరికొన్ని లైవ్ ఎపిసోడ్స్‌లో వస్తున్నాయి. ఒకసారి తనూజ కూడా రాము రాథోడ్‌ను చాలా చులకన చేసి మాట్లాడిన సందర్భం ఉంది. ఇలాంటి ధోరణితో సమాజానికి ఏం చెప్పాలని బిగ్‌బాస్ చూస్తున్నాడు అంటూ కొన్ని వీడియో క్లిప్పింగ్స్‌ను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఈ వారం వీకెండ్ ఎపిసోడ్లో సంజనను హోస్ట్ నాగార్జున నిలదీస్తారా..? లేదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం బిగ్‌బాస్‌లో ఎప్పుడూ అరుపులు, బూతులు మాత్రమే వినిపిస్తున్నాయ్ అంటూ అభిప్రాయం కనిపిస్తుంది. బిగ్‌బాస్‌లో ఈసారి ఎక్కువగా కాంట్రవర్సీ కేరక్టర్లను ప్రవేశపెట్టారని తెలుస్తోంది. దీంతోనే ఎక్కువ వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తోంది.Can I get answer from #sanjanagalrani for this body shaming I this weekend @iamnagarjuna ??Rt for more visibility#biggbosstelugu9 #biggboss9telugupic.twitter.com/loa7fPlY3b— Edits reposter (@Inspiritmodee) October 24, 2025 -
ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు సబేష్ (68) ఇక లేరు (MC Sabesh). కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం 12.15 గంటల ప్రాంతంలో చైన్నెలో కన్నుమూశారు. ఈయన ప్రఖ్యాత సంగీత దర్శకుడు దేవా సోదరుడు. మరో సోదరుడు మురళితో కలిసి పలు చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అదేవిధంగా పలు సంగీత కచేరీలను నిర్వహించారు. వీరు సంగీతాన్ని అందించిన చిత్రాలలో సముద్రం, మాయాండి కుటుంబత్తార్, పొక్కిషం, తవమాయ్ తవమిరుందు వంటి విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి.నివాళులు అర్పించిన కార్తీసబేష్.. సినీ సంగీత కళాకారుల సంఘానికి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. స్థానిక వలసరవాక్కంలోని చౌదరినగర్లో నివసిస్తున్న సబేష్కు గీత, అర్చన అనే ఇద్దరు కూతుర్లు, కార్తీక్ అనే కొడుకు ఉన్నారు. ఈయన భార్య తార ఇంతకుముందే కన్నుమూశారు. సబేష్ భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. దక్షిణ భారత సినీ నటినటుల సంఘం (నడిగర్) కోశాధికారి, హీరో కార్తీ, ఉపాధ్యక్షుడు కరుణాస్ తదితరులు నివాళులు అర్పించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక బృందావన్ నగరంలోని శ్మశానవాటికలో సబేష్ అంత్యక్రియలు జరగనున్నాయి. చదవండి: తెలుసు కదా కొన్నేళ్లు మీతో ఉండి పోతుంది -
హెచ్-1బీ వీసాలు.. వైట్‌హౌస్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: అమెరికాలో హెచ్-1బీ వీసాల(H-1B Visa) అంశంలో వైట్‌హౌస్ సంచలన ప్రకటన చేసింది. హెచ్-1బీ వీసా వ్యవస్థల్లో మోసాలు జరుగుతున్నాయని వైట్‌హౌస్(White House) ప్రెస్ సెక్రటరీ కరోలీనా లివిట్(Karoline Leavitt) తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో కోర్టులో పోరాడేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు స్పష్టం చేశారు.హెచ్-1బీ వీసాల(H-1B Visa) ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా.. కోర్టుల్లో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో పిటిషన్ల వ్యవహారమై తాజాగా వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలీనా లివిట్ స్పందించారు. ఈ సందర్భంగా లివిట్ మాట్లాడుతూ..‘అమెరికాలో చాలాకాలంగా హెచ్-1బీ వీసా వ్యవస్థలో మోసాలు జరుగుతున్నాయి. అమెరికన్ల వేతనాలను హెచ్-1బీ వీసాలు తగ్గించేస్తున్నాయి. కాబట్టి ట్రంప్ ఈ వ్యవస్థను మెరుగుపరచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యలు చట్టబద్ధమైనవి. అయితే, ట్రంప్ నిర్ణయంపై కొందరు కోర్టులను ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై కోర్టులో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం. అమెరికన్ కార్మికులకు అవకాశాలు అందడంతో పాటు వీసా వ్యవస్థను బలోపేతం చేయడమే అధ్యక్షుడు ట్రంప్ తొలి ప్రాధాన్యం. దీనిపై కోర్టులో పోరాడేందుకు సిద్ధం. వీసా ఫీజుపెంపుపై కోర్టుల్లో వచ్చిన పిటిషన్లను ఎదుర్కొంటాం’ అని కామెంట్స్ చేశారు.#WATCH | Washington, DC | On H-1B visas, White House Press Secretary Karoline Leavitt says, "The administration will fight these lawsuits in court. The president's main priority has always been to put American workers first and to strengthen our visa system. For far too long, the… pic.twitter.com/9WLktOOaqd— ANI (@ANI) October 23, 2025హెచ్-1బీపై ట్రంప్ నిర్ణయాన్ని అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. పలు ఉద్యోగ సంఘాలు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఈ క్రమంలో ట్రంప్ నిర్ణయం కాంగ్రెస్ తీసుకొచ్చిన సంక్లిష్టమైన వీసా వ్యవస్థను ఇది దెబ్బతీస్తోందని ఆ గ్రూప్ ఆందోళన వ్యక్తంచేసింది. హెచ్-1బీపై ఆధారపడిన వ్యాపారులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోందని తన వ్యాజ్యంలో వాదించింది. ఫీజు రాయితీలు..ఇదిలా ఉండగా.. హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు(దాదాపు రూ. 88 లక్షలు) పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నెలరోజుల తర్వాత ఫీజును ఎలా చెల్లించాలో, ఈ ఫీజు నుంచి ఎవరికి మినహాయింపు లభిస్తుందో వివరాలు వెల్లడించింది. అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) ఫీజు పేమెంట్ పోర్టల్‌ను ప్రవేశపెడుతూ ఫీజు చెల్లించినట్లు రసీదు సమర్పించిన దరఖాస్తుదారులు మాత్రమే తదుపరి అడుగులు వేయాలని, అయితే కొందరు స్టూడెంట్ వీసాదారులకు మాత్రం ఫీజు రాయితీ ఉంటుందని తెలిపింది.ఎఫ్-1 వీసాలపై ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు, ఎల్-1 వీసాలపై ఉన్న ప్రొఫెషనల్స్‌తో సహా ప్రస్తుత వీసాదారులు హెచ్-1బీ హోదా కోసం దరఖాస్తు చేసినపుడు లక్ష డాలర్లను చెల్లించవలసిన అవసరం లేదని యూఎస్సీఐఎస్ వెల్లడించింది. అమెరికా వెలుపల ఉన్న వ్యక్తులు దాఖలు చేసే దరఖాస్తులకు మాత్రం కొత్త ఫీజు వర్తిస్తుందని గ్రీన్ అండ్ స్పీగెల్‌కు చెందిన డాన్ బెర్గెర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఫోర్బ్స్ తెలిపింది. అమెరికాను వీడి ఉండి ప్రస్తుత హెచ్-1బీ వీసాపై దేశంలోకి తిరిగి ప్రవేశించడం కోసం మళ్లీ దరఖాస్తు చేసుకునే వారికి కొత్త ఫీజు వర్తిస్తుందని యూఎస్సీఐఎస్ తెలిపింది. హోదా మార్పు లేదా స్టే పొడిగింపునకు దరఖాస్తుదారు అర్హుడు కాదని తాము నిర్ధారిస్తే కంపెనీ యజమాని ఫీజును చెల్లించాల్సిన అవసరం ఉంటుందని యూఎస్సీఐఎస్ పేర్కొంది. -
Bihar Elections: ‘20 నెలల్లో నం. వన్’: తేజస్వి యాదవ్
పట్నా: నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింతగా రాజుకుంటోంది. అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)ప్రతిపక్ష మహాఘట్ బంధన్.. రెండూ కూడా పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. అదే సమయంలో ప్రజలకు హామీలను కూడా గుప్పిస్తున్నాయి. తాజాగా పట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే కేవలం 20 నెలల్లో బీహార్‌ను నంబర్ వన్ చేస్తామని పేర్కొన్నారు.మహా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘మా ప్రచారం ప్రారంభమైంది. బీహార్ మార్పు కోసం ఆసక్తిగా వేచి చూస్తోంది. మేము ఎక్కడికి వెళ్లినా, అన్ని కులాలు, మతాల ప్రజలు మాకు మద్దతు పలికేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు. దానిని మార్చాలనుకుంటున్నారు. ఈ ప్రభుత్వంలో అవినీతి, నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. బీహార్ ప్రజల నుండి మేము 20 నెలలు కోరుకుంటున్నాం. ఈ కాలంలో బీహార్‌ను నంబర్ వన్‌గా మార్చడానికి మేము కృషి చేస్తాం’ అని అన్నారు.ఈ సమావేశంలో తేజస్వి యాదవ్ పలు ప్రధాన ప్రకటనలు కూడా చేశారు. మూడు అంచెలుగా పంచాయతీ ప్రతినిధులు, గ్రామ ప్రతినిధుల గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తామని హామీనిచ్చారు. వారికి పెన్షన్లు అందించాలని కూడా నిర్ణయించామన్నారు. వారికి రూ. 50 లక్షల బీమా అందజేయనున్నామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పంపిణీదారుల గౌరవ వేతనాన్ని నిర్ధారించడానికి కృషి చేస్తామని, క్వింటాలుకు మార్జిన్ మనీ పెంచుతామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఉన్నవారికి కారుణ్య ఉపాధికి వర్తించే వయోపరిమితి కూడా పెంచుతామన్నారు. కుమ్మరి, కమ్మరి వడ్రంగి తదితర స్వయం ఉపాధి పనుల కోసం ఐదేళ్ల వ్యవధితో వడ్డీ లేని విధంగా రూ. 5 లక్షల రుణం అందిస్తామని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న నిర్వహించనున్నారు. ఇది కూడా చదవండి: అమ్మని విడిచి ఉండలేక.. 15వ అంతస్తు నుంచి దూకి.. -
అత్యధిక పరుగుల వీరుడు.. సచిన్ తర్వాత స్థానం కోహ్లిదే!
అంతర్జాతీయ వన్డే ఫార్మాట్లో విరాట్ కోహ్లి (Virat Kohli) తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు. సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) తర్వాత యాభై ఓవర్ల క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా.. కుమార్ సంగక్కరను అధిగమించి కోహ్లి ఈ ఘనత సాధించాడు. అంతేకాదు అతి తక్కువ ఇన్నింగ్స్‌లోనే పద్నాలుగు వేల పరుగుల మైలురాయిని అధిగమించిన ఆటగాడిగానూ కోహ్లి నిలిచాడు.వరుసగా డకౌట్లుదాదాపు ఏడు నెలల విరామం తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సందర్భంగా కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేశాడు. పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో డకౌట్ అయిన ఈ దిగ్గజ బ్యాటర్.. అడిలైడ్ వన్డేలోనూ ఇదే పునరావృతం చేశాడు. ఈ క్రమంలో భారీ అంచనాలు, ఒత్తిడి నడుమ సిడ్నీ వన్డే బరిలో దిగిన కోహ్లి వింటేజ్ కింగ్‌ను గుర్తు చేశాడు. నెమ్మదిగానే ఇన్నింగ్స్ ఆరంభించినా ఆ తర్వాత జోరు పెంచరీ అర్ధ శతకం సాధించాడు. వన్డే కెరీర్లో 75 హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో కోహ్లి 74 పరుగులతో అజేయంగా నిలిచాడు. తొమ్మిది వికెట్ల తేడాతో భారత్ గెలుపుశతకధీరుడు ఓపెనర్ రోహిత్ శర్మ (121 నాటౌట్)తో కలిసి 168 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. సిడ్నీ వన్డేలో తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచిన భారత్.. ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించి క్లీన్‌స్వీప్ గండం నుంచి తప్పించుకుంది.అంతర్జాతీయ వన్డే ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లు🏏సచిన్ టెండుల్కర్ (ఇండియా)- 452 ఇన్నింగ్స్‌లో 18426 పరుగులు🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 293* ఇన్నింగ్స్‌లో 14235 పరుగులు🏏కుమార్ సంగక్కర (శ్రీలంక)- 380 ఇన్నింగ్స్‌లో 14234 పరుగులు🏏రిక్కీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 365 ఇన్నింగ్స్‌లో 13704 పరుగులు🏏సనత్ జయసూర్య (శ్రీలంక)- 433 ఇన్నింగ్స్‌లో 13430 పరుగులుHence proved: 𝘚𝘢𝘣𝘳 𝘬𝘢 𝘱𝘩𝘢𝘭 𝘩𝘶𝘮𝘦𝘴𝘩𝘢 𝘮𝘦𝘦𝘵𝘩𝘢 𝘩𝘰𝘵𝘢 𝘩𝘢𝘪! 🙌👉 Virat Kohli's 75th ODI fifty👉 His 70th 50+ score in ODI run chases - most by any batter👉 Completes 2500 runs against AUS in ODIs#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉… pic.twitter.com/Mw6oU1cNzk— Star Sports (@StarSportsIndia) October 25, 2025 -
స్టార్ హీరోల సినిమా.. హీరోయిన్స్ వీళ్లేనా?
‘ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకా... నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపికా’.. ఈ పాట మహేశ్‌బాబు హీరోగా చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘మురారి’ లోనిదని ప్రత్యేకించి చెపక్కర్లేదు. ఇప్పుడు ఈ పాటను సరదాగా కొందరు తెలుగు హీరోలు పాడుకుంటున్నారట... ఎందుకంటే ఈ హీరోలు కమిట్ అయిన తాజా చిత్రాల్లో ఇంకా హీరోయిన్ ఫైనలైజ్ కాలేదు. అయితే ఫలానా హీరో సరసన ఫలానా హీరోయిన్ నటించనున్నారంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మరి... ఈ కొత్త ఊహా తారల కహానీ ఏంటో మీరూ ఓ లుక్ వేయండి. గ్యాంగ్‌స్టర్ డ్రామాలో... చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా, ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాగానే దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) తెరకెక్కించనున్న గ్యాంగ్‌స్టర్ డ్రామాలో చిరంజీవి హీరోగా నటిస్తారు. కేవీన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి సూపర్‌హిట్ తర్వాత చిరంజీవి, బాబీల కాంబినేషన్లో రూపొందనున్న ఈ మూవీపై మెగా అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ వర్క్స్‌లో భాగంగానే దర్శకుడు బాబీ ఈ చిత్రంలోని ఇతర నటీనటుల ఎంపికపై కూడా దృష్టి పెట్టారని తెలిసింది. కథ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కు చాన్స్ ఉందట. ఈ హీరోయిన్స్ రోల్స్‌కు మాళవికా మోహనన్, రాశీ ఖన్నాలను సంప్రదించారట బాబీ. అలాగే ఈ మూవీలో ఓ పవర్ఫుల్ రోల్ కూడా ఉందని, ఈ పాత్ర కోసం చిత్రయూనిట్ మోహన్‌లాల్ వంటి యాక్టర్స్‌తో చర్చలు జరుపుతోందనే టాక్ తెరపైకి వచ్చింది. మరి... చిరంజీవి సినిమాలో మాళవికా మోహనన్, రాశీ ఖన్నా భాగం అవుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ సినిమా 2027 సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్. జోడీ రిపీట్ నాగార్జున కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్). నాగార్జున కెరీర్లో ఇది వందో సినిమా. తమిళ దర్శకుడు ఆర్ఏ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌కు చాన్స్ ఉందట. ఇప్పటికే అనుష్కా శెట్టి, టబు భాగమయ్యారనే టాక్ తెరపైకి వచ్చింది. 2005లో వచ్చిన ‘సూపర్’ సినిమా కోసం నాగార్జున, అనుష్క తొలిసారి కలిసి నటించారు. ఆ తర్వాత ఈ ఇద్దరూ హీరో హీరోయిన్లుగా ‘డాన్’, ‘రగడ’, ‘ఢమరుకం’ చిత్రాల్లో నటించారు. అలాగే ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రంలో నాగార్జున, అనుష్కా శెట్టి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇంకా నాగార్జున ‘కింగ్, ఊపిరి, సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి చిత్రాల్లో అనుష్క అతిథిగా నటించారు. మరి... ‘కింగ్ 100’లో కూడా అనుష్కా శెట్టి భాగం అవుతారా? అయితే హీరోయిన్గా నటిస్తారా? లేక ఏదైనా ఇంపార్టెంట్ రోల్ చేస్తారా? అనే అంశాలపై ఓ స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ‘నిన్నే పెళ్లాడతా.., ఆవిడా మా ఆవిడే!’ వంటి సినిమాల్లో నాగార్జున – టబు హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే ‘కింగ్ 100’ సినిమాలో టబు కూడా కనిపిస్తారా? ఈ జోడీలు రిపీట్ అవుతాయా? వేచి చూడాలి. ఇక ‘కింగ్ 100’ సినిమా పొలిటికల్ డ్రామా నేపథ్యంలో సాగుతుందని, ఇందులో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కబురు వెళ్లిందా? ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో రామ్‌చరణ్(Ram Charan), దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమా రానుంది. ఈ మూవీ అధికారిక ప్రకటన వచ్చి ఏడాదిన్నర పైనే అవుతున్నా ఇంకా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. రామ్‌చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతనే సుకుమార్‌తో చేయాల్సిన మూవీని సెట్స్‌కు తీసుకువెళ్లాలని అనుకుంటున్నారట రామ్‌చరణ్. ఈలోపు ఈ సినిమా స్క్రిప్ట్‌కు సంబంధించిన పనులపై దర్శకుడు సుకుమార్ మరింత ఫోకస్ పెట్టారట. అలాగే ఇందులోని నటీనటుల ఎంపిక గురించి కూడా సుకుమార్ ఆలోచిస్తున్నారట. ఆల్రెడీ సమంత, రష్మికా మందన్నా, మృణాల్ ఠాకూర్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కృతీ సనన్ పేరు కూడా వినిపిస్తోంది. గతంలో మహేశ్ బాబు హీరోగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ‘వన్: నేనొక్కడినే’ చిత్రంలో కృతీ సనన్ హీరోయిన్గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మరి... రామ్‌చరణ్‌తో సుకుమార్ చేయబోయే సినిమా గురించిన కబురు కృతీ సనన్‌కు వెళ్లిందా? ఈ సినిమాలో ఆమె హీరోయిన్గా నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. అంతర్జాతీయ స్థాయిలో... అల్లు అర్జున్( Allu Arjun) హీరోగా అట్లీ దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్‌కు చాన్స్ ఉందట. ఆల్రెడీ దీపికా పదుకోన్ ఈ చిత్రంలో భాగమయ్యారు. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, ఆలియా.ఎఫ్, భాగ్యశ్రీ బోర్సే కూడా ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తారనే ప్రచారం టాలీవుడ్లో తెరపైకి వచ్చింది. అయితే ఆల్రెడీ మృణాల్ ఠాకూర్ ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారని తెలిసింది. ఇక మిగతా హీరోయిన్స్ ఎంపికలపై కూడా త్వరలోనే ఓ ప్రకటన రానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. అంతర్జాతీయ స్థాయిలో 2027లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని, ఈ దిశగా అల్లు అర్జున్, అట్లీ అండ్ టీమ్ సన్నాహాలు చేస్తున్నారని టాక్. జూలియట్ ఎవరో! ‘ది ప్యారడైజ్’ సినిమా చిత్రీకరణతో ప్రస్తుతం నాని బిజీగా ఉన్నారు. ‘దసరా’ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. అయితే నాని హీరోగా సుజిత్ డైరెక్షన్‌లోని సినిమా ప్రారంభోత్సవం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ‘ది ప్యారడైజ్’ సినిమా చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత సుజిత్‌తో చేసే చిత్రం షూటింగ్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారట నాని. ఈ సినిమాకు ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని, ఇదో గ్యాంగ్‌స్టర్ సినిమా అనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు తొలుత ప్రియాంకా అరుళ్ మోహన్ పేరు వినిపించింది. నాని – ప్రియాంక ‘నానీస్ గ్యాంగ్‌లీడర్, సరిపోదా శనివారం’ చిత్రాల్లో జోడీగా నటించారు. కానీ ‘బ్లడీ రోమియో’ సినిమాలోని హీరోయిన్గా పూజా హెగ్డే కనిపిస్తారనే ప్రచారం లేటెస్ట్గా ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఫైనల్‌గా ఈ ‘బ్లడీ రోమియో’ సరసన జూలియట్‌గా ఎవరు కనిపిస్తారనే విషయంపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. 2026 చివర్లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి... ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ సినిమాల్లో విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ కాంబినేషన్ ముచ్చటగా మూడోసారి రిపీట్ కానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ‘టాక్సీవాలా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో ఓ హిస్టారికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. రాయలసీమ నేపథ్యంలో స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిసింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఈ చిత్రంలోనే విజయ్–రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా నటించనున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. మరి... విజయ్–రష్మిక మందన్నాల జోడీ మళ్లీ స్క్రీన్‌పై మ్యాజిక్ చేస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. దేవి సరసన.... సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఓ సినిమా రానుందనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ‘బలగం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత దర్శకుడు వేణు యెల్దండి ‘ఎల్లమ్మ’ అనే ఓ రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో హీరోగా నటిస్తారంటూ నాని, నితిన్, శర్వానంద్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఫైనల్‌గా ఈ చాన్స్ దేవిశ్రీ ప్రసాద్‌కు లభించిందని, కథ నచ్చడంతో దేవిశ్రీ కూడా ‘ఎల్లమ్మ’ సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్‌నగర్ సమాచారం. అలాగే ఈ సినిమాలో దేవి సరసన హీరోయిన్గా కీర్తీ సురేష్ దాదాపు ఖరారు అయ్యారని, త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ‘దిల్’ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. డబుల్ ఎంట్రీ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సోదరుడు, దివంగత నటుడు రమేష్‌బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేయనున్నారు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని టాక్. ఈ సినిమాలో రవీనా టాండన్ కుమార్తె రాషా టాండన్ హీరోయిన్గా నటిస్తారని, త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన ఫొటోషూట్ కూడా జరిగిందట. ఈ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ సినిమాను వైజయంతీ మూవీస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంస్థలు నిర్మించనున్నాయని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఇక జయకృష్ణకు యాక్టర్‌గా ఇది తొలి చిత్రం అయితే, రాషాకు తెలుగులో ఇది తొలి మూవీ అవుతుంది. అయితే ఈ చిత్రం గురించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఇలా హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కావాల్సిన మరికొన్ని సినిమాలు ఉన్నాయి. -
డాక్టర్ రెడ్డీస్ లాభం అప్
న్యూఢిల్లీ: ఫార్మా రంగ హైదరాబాద్ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్(క్యూ2)లో నికర లాభం దాదాపు 15 శాతం ఎగసి రూ. 1,437 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 1,255 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 8,016 కోట్ల నుంచి రూ. 8,805 కోట్లకు బలపడింది. బ్రాండెడ్ మార్కెట్లలో పుంజుకున్న అమ్మకాలు క్యూ2లో పటిష్ట పనితీరుకు సహకరించినట్లు కంపెనీ కోచైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ పేర్కొన్నారు. యూఎస్‌లో లెనలిడొమైడ్ అమ్మకాలు క్షీణించినప్పటికీ ప్రధానంగా నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ(ఎన్ఆర్టీజే పోర్ట్‌ఫోలియో) నుంచి సాధించిన ఆదాయం ఇందుకు సహకరించినట్లు వెల్లడించారు. కంపెనీకి కీలకమైన విభాగాలను పటిష్టపరచడం, ఉత్పాదకతను పెంచడం, వ్యాపార అభివృద్ధి ప్రణాళికలకు తెరతీయడం తదితరాలపై దృష్టిపెట్టినట్లు తెలియజేశారు. యూరప్ ఆదాయం జూమ్: ఉత్తర అమెరికా జనరిక్స్ (ఎంపిక చేసిన కొన్ని ప్రొడక్టుల ధరల క్షీణత, లెనలిడొమైడ్ అమ్మకాలు తగ్గడం) మినహా మిగిలిన కీలక మార్కెట్లలో పటిష్ట వృద్ధి నమోదైనట్లు డాక్టర్ రెడ్డీస్ వివరించింది. ఉత్తర అమెరికా అమ్మకాలు 13 శాతం నీరసించి రూ. 3,241 కోట్లకు పరిమితంకాగా.. యూరప్ నుంచి ఆదాయం రెట్టింపై రూ. 1,376 కోట్లకు చేరింది. దేశీయంగా అమ్మకాలు 13 శాతం వృద్ధితో రూ. 1,578 కోట్లను తాకాయి. వర్ధమాన మార్కెట్ల ఆదాయం 14 శాతం పురోగమించి రూ. 1,655 కోట్లకు చేరాయి. ఫార్మాస్యూటికల్ సర్వీసులు, యాక్టివ్ ఇన్‌గ్రెడియంట్స్(పీఎస్‌ఏఐ) బిజినెస్ 12 శాతం పుంజుకుని రూ. 945 కోట్లయ్యింది. డాక్టర్ రెడ్డీస్ షేరు 0.3% లాభపడి రూ. 1,284 వద్ద ముగిసింది. -
రూ. వెయ్యి కోసం చంపేశారు
రంగారెడ్డి జిల్లా: డబ్బు కోసం స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసింది. ముగ్గురు స్నేహితులు కలిసి మరో స్నేహితుడిని హత్య చేసిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ నరేందర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... మైలార్‌దేవ్‌పల్లి వట్టెపల్లి ప్రాంతానికి చెందిన అఫ్రోజ్ (25) ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి అతను తన స్నేహితులు సోహెల్, అబ్బు, రిజ్వాన్‌లతో కలిసి అర్ధరాత్రి వరకు గడిపాడు. ఈ సమయంలో స్నేహితుల మధ్య డబ్బు విషయమై చోటు చేసుకున్న వివాదం ఘర్షణకు దారి తీసింది. రూ.వెయ్యి కోసం చెలరేగిన గొడవ దాడి వరకు వెళ్లింది. దీంతో ముగ్గురు స్నేహితులు కలిసి అఫ్రోజ్‌పై కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి కుప్పకూలాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా అతను అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నమయ్య జిల్లాలో కంపించిన భూమి
అన్నమయ్య జిల్లా: రామసముద్రం మండలం మాలేనత్తం పంచాయతీ సింగంవారిపల్లెలో శనివారం సాయంత్రం భూమి కంపించి.. పెద్దగా శబ్ధం రావడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. ఒక్కసారిగా ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. సాయంత్రం 6:54 నిముషాలకు భూమి రెండు సార్లు కంపించినట్టు తెలిపారు. ఇళ్లలోని సామాన్లు, పొయ్యిపై పాత్రలు, పడుకున్న మంచాలు సైతం కిందపడిపోయినట్టు తెలిపారు. -
రోడ్డు మార్జిన్ దిగిన ప్రైవేట్ స్కూల్ బస్సు
కొండపి: డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రైవేటు స్కూల్ బస్సు రోడ్డు మార్జిన్ దిగి ఒక వైపునకు ఒరిగిన ఘటన ప్రకాశం జిల్లా కొండపి మండలం కొండపి–అనకర్లపూడి గ్రామాల మధ్య అట్లేరు వాగు వద్ద శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు..వర్షాలకు మండలంలోని అట్లేరు వాగు పొంగడంతో రెవెన్యూ, పోలీసు సిబ్బంది వాగుకు ఇరువైపులా ముళ్లకంచె వేసి రాకపోకలు నిలిపేశారు.శనివారం మండలంలోని అనకర్లపూడి సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్ బస్సు 40 మంది విద్యార్థులతో కొండపి నుంచి అనకర్లపూడికి వెళ్తుండగా అట్లేరును దాటేందుకు ముళ్లకంచెను తప్పించే క్రమంలో డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్సు ముందు భాగం టైరు రోడ్డు మార్జిన్ దిగింది. అయినా బస్సును ఆపకుండా డ్రైవర్ ముందుకు వెళ్లడంతో వెనుక టైర్లు కూడా మార్జిన్ దిగాయి. దీంతో బస్సు ఒకవైపు ఒరిగింది. రెండో వైపు టైర్లు పైకి లేవడంతో బస్సులోని పిల్లలు, టీచర్లు కేకలు వేశారు. దీన్ని గమనించిన ఇతర వాహనదారులు..ఎమర్జెన్సీ డోర్ నుంచి పిల్లలను దించారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అనంతరం క్రేన్‌తో బస్సును రోడ్డు మీదకి తీసుకొచ్చారు.
