breaking news
-
మార్క్ జుకర్‌బర్గ్ (మెటా సీఈవో) రాయని డైరీ
చీఫ్ ఏఐ ఆఫీసర్‌గా ‘మెటా’ లోకి వచ్చీ రావటంతోనే అలెగ్జాండర్ వాంగ్ చేసిన రెండో పని... జింజర్ ఫైర్‌బాల్ తెప్పించుకుని వాక్ ఏరియాలో నాతో కలిసి నడుస్తూ తాగటం.ఇక అతడు చేసిన మొదటి పని... 600 మంది ఏఐ నిపుణులను ఒకేసారి ఫైర్ చేసి, నవంబర్ 21లోగా రిజైన్ చేయాలని కోరుతూ వాళ్లందరికీ లెటర్స్ మెయిల్ చేయించటం.28 ఏళ్ల వయసుకే కాఫీ, టీలను త్యజించినవాడు వాంగ్. నిజంగా జ్ఞానోదయం పొందినవారు మాత్రమే పని మధ్యలో ఒక కప్పు సాదాసీదా వేడి నీటితో తమ ఇంద్రియాలను పునరుజ్జీవింప జేసుకోగలరని అంటాడతడు. ‘‘ఎవర్నీ ఫైర్ చెయ్యకుండా మెటా ‘ఏఐ’ని నడిపించలేమా వాంగ్?’’ అన్నాను. ఫైర్‌బాల్ జ్యూస్‌ను సిప్ చేస్తున్న క్రీస్తు పూర్వపు చైనా తత్వవేత్త కన్ఫ్యూషియస్లా... నా వైపు చూశాడు వాంగ్,‘‘హైర్ చేసేటప్పుడు ఎంపిక చేసుకుంటాం కదా, ఇదీ అంతే మార్క్. ఫైర్ చేయటానికి ఎంపిక చేసుకుంటున్నాం’’ అన్నాడు.ట్రంప్ కంటే మొండివాడు వాంగ్. ‘‘ఏఐ వార్‌లో అమెరికా గెలిచి తీరవలసిందే’’ అని ట్రంప్‌కే నేరుగా లెటర్ రాసినవాడు! వాంగ్ ‘రూట్స్’ చైనావి. వాంగ్ ‘హార్ట్ బీట్స్’ అమెరికావి.‘‘కానీ వాంగ్, కొన్నిసార్లు ఆఫ్రికా ఖండంలోని ఆకలి చావుల కన్నా, మన ఇంటి ముందర నిర్జీవంగా పడి ఉన్న ఉడుతే మనల్ని ఎక్కువగా కలచివేస్తుంది!’’ అన్నాను. మెటాకు నేనొక ‘ఔట్మోడెడ్’ వెర్షన్ అన్నట్లుగా నా వైపు చూశాడతడు. ‘‘ఓకే మార్క్... మళ్లీ కలుద్దాం’’ అనేసి వెళ్లిపోయాడు.ఎంప్లాయీస్‌ని తొలగించినందుకు యూజర్స్ చేస్తున్న కామెంట్స్ అన్నీ వాంగ్ మీద వస్తున్నవే! వాంగ్ చైనీస్ పర్సన్ కనుక అతడు ఫైర్ చేసిన వాళ్లలో ఒక్కరు కూడా చైనీస్ ఉండకపోవచ్చని ఒకరు కామెంట్ చేశారు!దారుణమైన కామెంట్ కూడా ఒకటి ఉంది. జుకర్‌బర్గ్ భార్య చైనీస్ పర్సన్ కనుక, వాంగ్ అనే చైనీస్ పర్సన్ కి ‘మెటా’లో అంత పెద్ద ఉద్యోగం దొరికిందని!!నిజానికి, మెటాలోకి వచ్చేటప్పటికే వాంగ్ ‘స్కేల్ ఏఐ’ అనే ఒక పెద్ద కంపెనీకి కో–ఫౌండర్. అందులో సగ భాగాన్ని మెటా కొనేయటంతో అతడు మెటాలోకి వచ్చాడు కానీ, మెటాలో ఉద్యోగం దొరకటం వల్ల వచ్చినవాడు కాదు.వాంగ్ వెళ్లిపోయాక, వాకింగ్ ఏరియా నుంచి నా డెస్క్‌లోకి వచ్చి కూర్చున్నాను. ఓపెన్ డెస్క్ అది. చుట్టూ ఎంప్లాయీస్ ఉంటారు.‘‘మార్క్! మీతో మాట్లాడాలి. యాక్చువల్లీ మీతో మాట్లాడటం కోసమే నేను ఎదురు చూస్తున్నాను’’ అంటూ – ఇండియన్ యాక్సెంట్‌తో ఒక అమ్మాయి. చాలా కోపంగా ఉంది. చాలా అంటే చాలా! ‘‘షూట్ మీ..’’ అన్నాను నవ్వుతూ.తను నవ్వదలచుకోలేదని ఆమె ముఖంలో స్పష్టంగా తెలుస్తూ ఉంది.‘‘మార్క్! ఎంప్లాయీస్ అంటే స్ప్రెడ్‌షీట్స్ కాదు.. మనుషులు. యునీక్ స్కిల్స్, ఎమోషన్ ్స, అనుభవం ఉన్నవారు. ఎలా తీసేస్తారు అంతమందిని? అంతమంది అని కాదు. అసలు వారిలో ఒక్కరినైనా?!!’’ – స్థిరంగా, స్ట్రాంగ్‌గా అంటోంది. అం... టూ...నే ఉంది! తను వెళ్లాక, వాంగ్‌కి కాల్ చేసి... ‘‘ఏఐ ల్యాబ్స్ నుంచి ఫైర్ చేసిన వాళ్లలో తను కూడా ఉందా?’’ అని అడిగాను. కాసేపటి తర్వాత వాంగ్ కాల్ బ్యాక్ చేసి, ‘‘ఏఐ ల్యాబ్స్ ఫైరింగ్ లిస్ట్‌లో తను లేరు మార్క్! కానీ తను చేస్తున్నది ఏఐ ల్యాబ్స్‌లోనే!!ఇంటెర్న్. సూపర్ ఇంటెలిజెంట్ అని విన్నాను’’ అన్నాడు వాంగ్. ఆ అమ్మాయి తన కోసం తను ఫైట్ చెయ్యటం లేదంటే తను ఎవరితోనైనా ఫైట్ చేయగలదని! అమెరికన్ కంపెనీలు ప్రపంచంలో నంబర్ 1గా ఉండటానికి నాకిప్పుడు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి –ప్రాక్టికల్‌గా ఉండే చైనీస్ చీఫ్ ఆఫీసర్స్. రెండు – ‘ఫైటింగ్ స్పిరిట్’ ఉన్న ఇండియన్ ఇంటెర్న్‌లు! -
చావుతెలివి!
ఇన్సూరెన్స్ కోసం హత్యలు చేసిన వాళ్లని; ఆస్తులు తగలపెట్టుకున్న వాళ్లని; అక్రమాలకు పాల్పడిన వాళ్లని చూస్తూనే ఉంటాం. వీటన్నింటికీ భిన్నమైన వ్యవహారం 2012లో చోటు చేసుకుంది. అమెరికాలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ప్రవాస భారతీయుడు (ఎన్నారై) ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. వీటి నుంచి బయటపడటానికి తనపై ఉన్న ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడమే మార్గమని భావించాడు. దీనికోసం తానే చనిపోయినట్లు కథ అల్లాడు. దీనికి సంబంధించిన వ్యవహారం ఆద్యంతం పక్కాగానే నడిచినా, ఇన్సూరెన్స్ కంపెనీ క్రాస్ వెరిఫికేషన్‌లో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. ఈ హైడ్రామాలో సూత్రధారితో పాటు పాత్రధారులుగా ఉన్న ఓ వైద్యుడు, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సిబ్బందికీ ఉచ్చు బిగిసింది. హైదరాబాద్ నగర శివార్లలోని రాజేంద్రనగర్‌లో ఉన్న హైదర్‌గూడ ప్రాంతానికి చెందిన సోమారం కమలాకర్ రెండో కుమారుడు రాజ్‌కమల్. ఇతడికి తొమ్మిది నెలల వయస్సు ఉన్నప్పుడే ఆ కుటుంబం అమెరికాకు వలస వెళ్లి మేరీలాండ్‌లో స్థిరపడింది. కమలాకర్ మేల్ నర్స్‌గా, ఆయన భార్య స్టాఫ్ నర్స్‌గా పని చేసేవాళ్లు. రాజ్‌కమల్ అక్కడే ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. ఇతడి తల్లి అక్కడ ఓ ఇల్లు కొనుగోలు చేయడానికి అప్పులు చేసింది. ఆ అప్పులతోనే తిప్పలు ప్రారంభమయ్యాయి. అప్పులకు తోడు వడ్డీలు పెరిగిపోవడంతో ఆ కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఓ దశలో రాజ్‌కమల్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల కార్డులన్నీ బ్లాక్ అయిపోయాయి. దీంతో గత్యంతరం లేక అతడి సన్నిహితురాలైన శ్రీలంక జాతీయురాలికి చెందిన కార్డుల్నీ వినియోగించేశాడు. దీంతో మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోయాడు.రాజ్‌కమల్ అమెరికాలోని మెట్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 75 వేల డాలర్లు (దాదాపు రూ.15 లక్షలు) విలువైన పాలసీ తీసుకున్నాడు. దీనికి తన సోదరిని నామినీగా పెట్టాడు. 2012లో రాజేంద్రనగర్‌లోని స్వస్థలానికి వచ్చిన రాజ్‌కమల్ అప్పుల బాధ నుంచి బయటపడటానికి ఉన్న మార్గాలను అన్వేషించాడు. ఇక్కడే తాను చనిపోయినట్లు నాటకమాడి, అందుకు అవసరమైన ధ్రువీకరణలు సంపాదించాలని పథకం వేశాడు. వీటిని దాఖలు చేయించడం ద్వారా అమెరికాలో ఉన్న ఇన్సూరెన్స్‌లు క్లెయిమ్ చేసుకోవాలని కుట్రపన్నాడు. దీన్ని అమలులో పెట్టడానికి సహకరించాల్సిందిగా రాజేంద్రనగర్‌లోని శివరామ్‌పల్లిలో నివసించే తన బంధువు, అప్పట్లో జీహెచ్ఎంసీ ఉద్యోగి అయిన ప్రసన్నకుమార్‌ను సంప్రదించాడు. రాజ్‌కమల్ ‘చావు’కు సహకరించడానికి ప్రసన్నకుమార్ అంగీకరించారు. ఈ హైడ్రామాకు అవసరమైన పత్రాల సమీకరణ కోసం ఈ ద్వయం అనేక ఫోర్జరీలు చేసింది. ప్రసన్నకుమార్ తొలుత హైదర్‌గూడలో ఓ నర్సింగ్‌హోమ్ నిర్వహించే తన పరిచయస్తుడిని సంప్రదించాడు. బాగా కావాల్సిన వారి తరఫు వారు మృతి చెందారని, డెత్ సర్టిఫికెట్ కావాలని కోరాడు. నిజమని నమ్మిన ఆయన పూర్వాపరాలు పట్టించుకోకుండా, అంగీకరించారు. ఇలా రాజ్‌కమల్ పేరుతో డెత్ సర్టిఫికెట్ సిద్ధమైంది. 2012 డిసెంబర్ 12న ప్రసన్న కుమార్‌కు కుమారుడు పుట్టి చనిపోయాడు. ఆ శిశువును శివరామ్పల్లిలోని శ్మశాన వాటికలో ఖననం చేశారు. ఈ ధ్రువీకరణలను ఫోర్జరీ చేయడం ద్వారా రాజ్‌కమల్‌ను ఖననం చేసినట్లు పత్రాలు సృష్టించారు. వీటి ఆధారంగా రాజేంద్రనగర్ జోన్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో పని చేసే కుమార్‌ను సంప్రదించారు. అతడి ద్వారా జీహెచ్ఎంసీ రికార్డుల్లోకి ఈ మరణాన్ని జొప్పించారు. ఆపై ఈ–సేవ కేంద్రం నుంచి రాజ్‌కమల్ చనిపోయినట్లు మరణ ధ్రువీకరణ పత్రం పొందారు. ఇవన్నీ కలిపి రాజ్‌కమల్ చనిపోయినట్లు మెట్‌లైఫ్ కంపెనీకి తన స్నేహితుడి ద్వారా క్లెయిమ్ పంపారు. రాజ్‌కమల్ చనిపోయినట్లు వచ్చిన క్లెయిమ్ పత్రాలను ఇన్సూరెన్స్ కంపెనీ సైతం పరిగణనలోకి తీసుకుంది. అయితే నగదు విడుదల చేయడానికి ముందు ప్రాథమిక పరిశీలన చేపట్టింది. ఇందులో భాగంగా హైదర్‌గూడలోని సదరు నర్సింగ్‌హోమ్ అధిపతిని సంప్రదించింది. కంపెనీ అడిగిన ప్రశ్నలకు, ఆయన చెప్పిన సమాధానాలకు పొంతన లేకపోవడంతో కథ అడ్డం తిరిగింది. దీంతో అనుమానం వచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీ తమ ప్రతినిధుల్ని రంగంలోకి దింపి లోతుగా ఆరా తీయించింది. ఇలా రాజ్‌కమల్ ‘చావు’తెలివి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ నేపథ్యంలో నేరం జరిగినట్లు గుర్తించిన పోలీసులు రాజ్కమల్తో పాటు ప్రసన్నకుమార్, కుమార్ తదితరులపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై జీహెచ్ఎంసీ అధికారులూ అంతర్గత విచారణ చేశారు. బాధ్యుల్లో కొందరిని సస్పెండ్ చేయడంతో పాటు మరికొందరిని విధుల నుంచి తొలగించారు. -
అతడే ఉంటే కథ వేరేలా ఉండేది.. గంభీర్ ఇకనైనా మారవా?
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో 2 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కోల్పోయింది. తొలి వన్డేతో పోలిస్తే మెరుగైన బ్యాటింగ్... బౌలింగ్‌లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరిచినప్పటికి కీలక క్షణాల్లో పట్టు వదలడంతో చివరికి భారత్‌కు నిరాశే మిగిలింది.265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఆరంభంలోనే భారత బౌలర్లకు షాకిచ్చారు. స్టార్ ఓపెనర్లు మిచెల్ మార్ష్(11), హెడ్(28) వెంటవెంటనే ఔటయ్యారు. ఆ తర్వాత మాథ్యూ షార్ట్(74), రెన్ షా(30) దూకుడుగా ఆడి భారత బౌలర్లపై ఒత్తిడి పెంచారు. రెన్ షా ఔటయ్యాక బ్యాటింగ్‌కు వచ్చిన అలెక్స్ క్యారీ(9) ఎక్కవసేపు క్రీజులో ఉండలేకపోయాడు. దీంతో 132/4 వద్ద భారత్‌కు పట్టు బిగించే అవకాశం వచ్చింది. అయితే షార్ట్, యువ ఆటగాడు కూపర్ కొన్నోలీ(61 నాటౌట్) కలిసి జట్టును గెలుపు దిశగా నడిపించారు. చివర్లో 14 పరుగుల వ్యవధిలో ఆసీస్ 3 వికెట్లు కోల్పోవడంతో ఉత్కంఠ పెరిగింది. కానీ కనోలీ ప్రశాంతంగా ఆడి మ్యాచ్‌ను ముగించాడు.అంతకుముందు భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (97 బంతుల్లో 73; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (77 బంతుల్లో 61; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించగా...అక్షర్ పటేల్ (41 బంతుల్లో 44; 5 ఫోర్లు) రాణించాడు.గంభీర్ ప్లాన్ అట్టర్ ప్లాప్..కాగా అడిలైడ్‌లో భారత్ ఒక వన్డే మ్యాచ్‌లో ఓడిపోవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో భారత తుది జట్టు ఎంపికపై సర్వాత్ర విమర్శల వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఆడించికపోవడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. గంభీర్ ఆల్‌రౌండర్ల వ్యూహాం బెడిసి కొట్టింది అని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. పిచ్ కండీషన్స్ తగట్టు ఆస్ట్రేలియా మెనెజ్‌మెంట్ ఒక ఫాస్ట్ బౌలర్‌ను పక్కన పెట్టి స్పిన్నర్‌ను తీసుకొస్తే.. భారత్ మాత్రం ముగ్గురు ఆల్‌రౌండర్లు, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగింది. ఆసీస్ జట్టులోకి వచ్చిన ఆడమ్ జంపా నాలుగు వికెట్లు పడగొట్టి ఏకంగా ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. అడిలైడ్‌లో పిచ్ పేసర్లతో పాటు స్పిన్నర్లకు కూడా అనుకూలిస్తుంది. ఇటువంటి వికెట్‌పై కుల్దీప్ బంతితో అద్భుతాలు చేయగలడు. కానీ గంభీర్ మాత్రం వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా కుల్దీప్కు ఛాన్స్ ఇవ్వలేదు. బ్యాటింగ్ డెప్త్‌ను కారణంగా చూపుతూ.. మ్యాచ్ విన్నర్ కుల్దీప్ యాదవ్‌ను బెంచ్‌కే పరిమితం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ తరపున ఆడిన ముగ్గురు ఆల్రౌండర్లలో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ రాణించినప్పటికి.. నితీశ్ కుమార్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. బ్యాటింగ్‌లో విఫలమైన నితీశ్.. బౌలింగ్‌లో కేవలం 3 ఓవర్లలోనే 24 పరుగులు సమర్పించుకున్నాడు. ఇప్పటికైనా కళ్లు తెరిచి కుల్దీప్ ఛాన్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. కుల్దీప్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆసియాకప్-2025లో అతడు 17 వికెట్లు తీసి.. లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఆ తర్వాత వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌లోనూ సత్తాచాటాడు. ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే అక్టోబర్ 25న సిడ్నీ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ ఆడే అవకాశముంది.చదవండి: IND vs AUS: ఏయ్.. ఏమి చేస్తున్నావు! శ్రేయస్‌పై రోహిత్ సీరియస్(వీడియో) -
అవును పనిచేశారు.. అయినా వేతనం ఇవ్వం!
సాక్షి, అమరావతి: ఎక్కడైనా ఉద్యోగులు పనిచేయకపోతే జీతం ఇవ్వరు.. కానీ కూటమి ప్రభుత్వంలో మాత్రం పనిచేసినా వేతనం ఇవ్వరని తేలింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేసిన కాలానికి వేతనం ఇవ్వకుండా కూటమి సర్కారు వేధిస్తోంది. రెండు విద్యాసంవత్సరాలకు సంబంధించి మే నెలలో వారితో పనిచేయించుకున్నా జీతం అడగొద్దంటోంది. ఇప్పటికే తక్కువ వేతనాలతో ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్నామని, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్ లెక్చరర్లతో సమానంగా పనిచేస్తున్నా ఈ వివక్ష ఏంటని అడిగితే.. ‘నోవర్క్–నోపే’ ఉత్తర్వులున్నాయంటోంది.అయినప్పటికీ 2024 మే నెలకు ఈ సాకు చెప్పిన ప్రభుత్వం.. 2025 మే నెలలోను కాంట్రాక్టు లెక్చరర్లతో పనిచేయించుకుంది. వేతనం అడిగితే మొండిచేయి చూపుతోంది. గత ప్రభుత్వంలో కాంట్రాక్టు లెక్చరర్లు 10 రోజుల విరామంతో 12 నెలల వేతనం అందుకునేవారు. గతేడాది మే నెలలో పనిచేసిన కాలానికి (ఒకరోజు విరామంతో) వేతనం ఇవ్వాలని ఇంటర్ విద్యామండలి నుంచి ఆర్థికశాఖకు ఫైల్ పెట్టారు.దీనిపై ఆ శాఖ ఉన్నతాధికారులు చేసిన పనిపై పూర్తి నివేదిక (వర్క్ అవుట్‌పుట్) ఇవ్వాలని ఆర్థికశాఖ ఆదేశించింది. దీంతో తిరిగి ఇంటర్ బోర్డు అధికారులు నివేదిక సమర్పించారు. 2025 మే నెలలో కూడా కాంట్రాక్టు లెక్చరర్లతో పనిచేయించుకున్న కూటమి ప్రభుత్వం వేతనం ఇవ్వకుండా వేధిస్తోంది. మొత్తం నివేదిక విద్యాశాఖ మంత్రి వద్ద ఉన్నా నిర్ణయం తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.12 నెలలకు వేతనం ఇస్తామని చెప్పి మోసం కాంట్రాక్టు లెక్చరర్లకు 10 రోజుల విరామంతో 12 నెలల కాలానికి వేతనం ఇస్తామని 2019లో నాటి టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి మండలిలో ఆమోదం తెలిపినట్టు అదే ఏడాది మార్చి 5వ తేదీన క్యాబినెట్ తరఫున ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు మీడియా ముఖంగా ప్రకటించారు. కానీ మంత్రిమండలిలో ఆమోదించిన అంశంపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదు. వైఎస్ జగన్ సీఎం కాగానే కాంట్రాక్టు లెక్చరర్లకు న్యాయం చేయాలని 2019 నుంచి 2023 వరకు అన్ని సంవత్సరాలు వరుసగా 10 రోజుల విరామంతో 12 నెలల జీతాలు చెల్లించారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టు లెక్చరర్లను వేధిస్తోంది.రెండు నెలలకు ఇవ్వాల్సిన వేతనం రూ.37 కోట్లేప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్ లెక్చరర్ల కంటే కాంట్రాక్టు లెక్చరర్లే అధికం. మొత్తం 3,572 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీరంతా సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ, పేపర్ల మూల్యాంకనం తదితర విధుల్లో కీలకంగా ఉంటారు. వీరికి ఏటా మే నెలకు రూ.18.50 కోట్లు వేతనంగా ఇవ్వాలి. రెండేళ్లలోను మే నెలకు మొత్తం రూ.37 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా.. దానిపై ప్రభుత్వం కొర్రీలు వేస్తోంది. ఆర్థికశాఖ అడిగిన అన్ని నివేదికలు ఇంటర్ బోర్డు ఇచ్చినా వేధించడం గమనార్హం. వీరికి వేతనం చెల్లిస్తే.. సాంకేతిక, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు కూడా ఇవ్వాల్సి ఉంటుందని, దీంతో ప్రభుత్వంపై ఏటా రూ.150 కోట్ల భారం పడుతుందన్న భావనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి మే నెలలో పనిచేసేది ఒక్క కాంట్రాక్టు లెక్చరర్లు మాత్రమే. -
బంజారాహిల్స్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు.. హోటల్లో స్రీకెట్గా..
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని ఆర్–ఇన్ హోటల్లో ఓ గదిలో గత కొంతకాలంగా యువతులతో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు గురువారం దాడులు చేసి ముగ్గురు యువతులతో సహా ఏడుగురు కస్టమర్లు, వ్యభిచార గృహ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు.వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఎండీ షరీఫ్ గతంలో స్టైల్ మేకర్ సెలూన్ నిర్వహించేవాడు. ఉద్యోగాల పేరుతో వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి సెలూన్లో చేర్చుకుని వారిని అధిక డబ్బు సంపాదించవచ్చనే ఆశపెట్టి వ్యభిచారానికి తరలిస్తున్నాడు. కజకిస్థాన్, రష్యా, ఉగాండా, థాయ్‌ల్యాండ్, బంగ్లాదేశ్ తదితర దేశాల నుంచి తన సెలూన్లో ఉద్యోగాల పేరుతో రప్పించి వారిని ఖరీదైన హోటళ్లకు పంపిస్తూ వ్యభిచారం చేయిస్తున్నాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఆర్–ఇన్ హోటల్లోని గదులపై దాడులు చేసి ముగ్గురు మహిళా సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకుని పునరావాస కేంద్రానికి తరలించారు. కజకిస్థాన్‌కు చెందిన యువతితో పాటు మరో ఇద్దరు యువతులు పట్టుబడిన వారిలో ఉన్నారు. మరో ఏడుగురు విటులకు నోటీసులు జారీ చేశారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఎండీ షరీఫ్‌పై కేసు నమోదు చేశారు. నగదును సీజ్ చేసి బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సృష్టికి ప్రతిసృష్టి
సాక్షి, అమరావతి: వివాహం జరుగుతున్నప్పుడు వ«ధూవరుల తల్లిదండ్రుల్లో ఎవరైనా లేకపోతే.. శుభకార్యానికి వచ్చిన వారంతా ‘ఇలాంటి సమయంలో మీ నాన్న, అమ్మ ఉంటే ఎంత సంతోషించేవారో.. వారులేని లోటు కనిపిస్తోంది’ అంటుంటారు. ఇప్పుడు ఆ లోటును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తీరుస్తోంది. ఎప్పుడో భౌతికంగా దూరమైన వారిని సజీవ చిత్రాలుగా మలిచి కళ్లముందు సాక్షాత్కరింపజేస్తోంది. దీనిని సాంకేతిక యుగంలో ఓ అద్భుతంగా అభివర్ణించవచ్చు. చనిపోయిన వ్యక్తులను బతికున్నవారిలా చూపించే ఏఐ సాంకేతికతను ‘డిజిటల్ పునరుత్థానం’ ‘గ్రీఫ్ టెక్’ అని పిలుస్తున్నారు. ఈ సాంకేతికత చనిపోయినవారి ఫొటోలు, వీడియోలు, ఆడియో రికార్డింగ్ లు, మెసేజ్‌లు వంటి వాటిని ఉపయోగించుకుని వారి రూపాన్ని, స్వరాన్ని, ప్రవర్తనను పునఃసృష్టిస్తోంది. ఇప్పుడు ప్రతి వేడుకలోనూ ఈ విజ్ఞానం భావోద్వేగాలను పంచుతోంది.ఎలా పనిచేస్తుంది?ముందుగా ఏఐ టూల్‌కు చనిపోయిన వ్యక్తికి సంబంధించిన డేటాను ఇస్తారు. ఇందులో టెక్టŠస్ మెసేజ్‌లు, ఈ–మెయిల్లు, ఫొటోలు, వీడియోలు, ఆడియో రికార్డింగ్ లు ఉంటాయి. ఈ డేటాను ఏఐ విశ్లేషించి.. చనిపోయిన వ్యక్తి ముఖం, కదలికలు, హావభావాలు, గొంతుతో ఒక డిజిటల్ అవతార్‌ను సృష్టిస్తుంది. ఈ అవతార్‌తో మనం చాట్‌బాట్ రూపంలో మాట్లాడవచ్చు. కొన్ని ఆధునిక వ్యవస్థలు వీడియో కాల్స్ ద్వారా కూడా సంభాషించే సౌలభ్యాన్ని కల్పిస్తాయి.ఎన్నో యాప్లుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతతో ఇలాంటి వీడియోలను సృష్టించేందుకు అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. స్టోరీఫైల్ వంటి కంపెనీలు చనిపోయినవారు అంత్యక్రియల సమయంలో మాట్లాడేలా ఏఐని వినియోగిస్తున్నాయి. చనిపోయే ముందు రికార్డ్ చేసిన వీడియోలు, వాటికి ఏఐ ప్రశ్నలు, సమాధానాలు జతచేసి బంధువులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేలా చేస్తుంది. మైహెరిటేజ్ అనే సంస్థ ‘డీప్ నాస్టాల్జియా’ అనే ఫీచర్‌తో పాత ఫొటోలను కదిలే వీడియోలుగా (యానిమేటెడ్) మారుస్తోంది. ఈ ఫీచర్ చనిపోయినవారి ఫొటోలను యానిమేట్ కూడా చేస్తుంది. డీప్‌బ్రెయిన్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ‘రీ మెమరీ 2’ అనే సేవ ద్వారా చనిపోయినవారి వాస్తవిక ఏఐ అవతార్లను తయారు చేస్తోంది.భావోద్వేగంతో ఆందోళన చనిపోయినవారిని ఏఐతో పునఃసృష్టించడం వల్ల అనేక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. చనిపోయిన వ్యక్తి సమ్మతి లేకుండా వారి డేటాను ఉపయోగించడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏఐ అవతార్‌తో మాట్లాడినప్పుడు.. కుటుంబ సభ్యులు అది నిజమైన వ్యక్తి కాదని తెలుసుకోలేకపోవడం వల్ల భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ సాంకేతికత దుఃఖాన్ని తగ్గించడానికి బదులుగా, కొంతమందిని చనిపోయినవారితో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. బాధను మరింతగా పెంచుతుంది. ఇది వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. అలాగే ఈ సాంకేతికతను దుర్వినియోగం చేసి ప్రజలను మోసం చేసే ప్రమాదం కూడా పొంచి ఉంది. -
రైల్వే బోర్డు కీలక నిర్ణయం: తక్షణమే అమల్లోకి..
దేశంలో పెరుగుతున్న మధుమేహ రోగుల సంఖ్యకు దృష్టిలో ఉంచుకుని.. రైల్వే బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లకు టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు, మీకు డయాబెటిక్ ఆహారం అవసరమని ముందుగానే సూచించవచ్చు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని రైల్వే బోర్డు వెల్లడించింది.రైల్వే బోర్డు సీనియర్ అధికారి దీని గురించి మాట్లాడుతూ, అన్ని ప్రీపెయిడ్ రైళ్లు ఇప్పుడు ఐదు రకాల ఆహార ఎంపికలను అందిస్తాయని తెలిపారు. అవి శాఖాహారం, మాంసాహారం, జైన్ భోజనం, డయాబెటిక్ శాఖాహారం, డయాబెటిక్ మాంసాహారం. దీని అర్థం డయాబెటిస్ ఉన్నవారికి శాఖాహారం & మాంసాహారం రెండూ ఉంటాయి.భారతదేశంలో.. ప్రతి సంవత్సరం సగటున 1.6 మిలియన్ల మంది డయాబెటిస్ కారణంగా మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రాజధాని ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లలో ఆహార ఎంపికలను విస్తరించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది.మధుమేహ రాజధానిగా భారత్!భారతదేశం ప్రస్తుతం ప్రపంచ మధుమేహ రాజధానిగా గుర్తింపు పొందుతోంది. ఇక్కడ దాదాపు 220 మిలియన్ల మంది టైప్ 2 డయాబెటిస్తో బాధపడుతున్నారు. కాగా ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో వృద్ధులు మాత్రమే ఈ వ్యాధితో బాధపడేవారు. కానీ ఇప్పుడు యువకులు కూడా పెద్ద సంఖ్యలో దీనికి బలైపోతున్నారు.ది లాన్సెట్ 2023 నివేదిక ప్రకారం.. భారతదేశంలో 212 మిలియన్ల మంది డయాబెటిక్ రోగులు ఉన్నారు. ఈ సంఖ్య చైనాలో 149 మిలియన్లు, యునైటెడ్ స్టేట్స్లో కేవలం 42 మిలియన్లు మాత్రమే. దీని అర్థం చైనా & యునైటెడ్ స్టేట్స్ రెండింటి సంఖ్యలను కలిపినా, మొత్తం ఇప్పటికీ 191 మిలియన్లుగానే ఉంది. ఒక్క భారతదేశంలో మాత్రమే 210 మిలియన్లకు పైగా డయాబెటిక్ రోగులు ఉన్నారు.ఇదీ చదవండి: ఇవి జరిగితేనే.. బంగారం ధరలు తగ్గుతాయి! -
రూ. వెయ్యి కోసం చంపేశారు
రంగారెడ్డి జిల్లా: డబ్బు కోసం స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసింది. ముగ్గురు స్నేహితులు కలిసి మరో స్నేహితుడిని హత్య చేసిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ నరేందర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... మైలార్‌దేవ్‌పల్లి వట్టెపల్లి ప్రాంతానికి చెందిన అఫ్రోజ్ (25) ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి అతను తన స్నేహితులు సోహెల్, అబ్బు, రిజ్వాన్‌లతో కలిసి అర్ధరాత్రి వరకు గడిపాడు. ఈ సమయంలో స్నేహితుల మధ్య డబ్బు విషయమై చోటు చేసుకున్న వివాదం ఘర్షణకు దారి తీసింది. రూ.వెయ్యి కోసం చెలరేగిన గొడవ దాడి వరకు వెళ్లింది. దీంతో ముగ్గురు స్నేహితులు కలిసి అఫ్రోజ్‌పై కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి కుప్పకూలాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా అతను అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. -
తిరిగొచ్చిన ఉంగరం! ఆరు దశాబ్దాలు జ్ఞాపకం..
నీదైతే ఎక్కడికెళ్లినా నీ దగ్గరకు వస్తుంది. నీది కాకపోతే ప్రపంచం మొత్తం వెతికినా తిరిగి రాదు.’ అన్నట్లు.. అచ్చం ఒక ఉంగరానికి జరిగింది. 1969లో న్యూయార్క్‌లోని సీడార్ బీచ్‌లో అల్ఫ్రెడ్ డి స్టెఫానో అనే వ్యక్తి ఒక రోజు ఈత కొడుతున్నప్పుడు, అతని విలువైన క్లాస్ రింగ్ జారి నీటిలో పడిపోయింది. సముద్రంలో పడ్డ ఆ ఉంగరం, ఇక ఎప్పటికీ దొరకదని భావించి, దానికి మనసులోనే ఫుల్స్టాప్ పెట్టేసుకున్నాడు. కాని, కాలం మరో అద్భుతాన్ని దాచిపెట్టింది. దాదాపు 56 ఏళ్ల తర్వాత, డేవిడ్ ఓర్లొవ్స్కీ అనే మరో వ్యక్తి, మెటల్ డిటెక్టర్ పట్టుకుని బీచ్‌లో నిధి నిక్షేపాల కోసం వెతుకుతుండగా, అనుకోకుండా ఆ ఉంగరం అతని చేతికి చిక్కింది. మొదట అది సాధారణ ఆభరణమేమోనని అనుకున్నాడు. కాని, దానిపై చెక్కి ఉన్న పేరు, కాలేజీ గుర్తు చూసి ఆశ్చర్యపోయాడు. అదే సమయానికి, అతని భార్య ‘నువ్వు నీ ఉంగరం కోల్పోతే, దొరికిన వారు తిరిగి ఇస్తే ఎంత ఆనందిస్తావు?’ అని ప్రశ్నించింది. భార్య మాటలు అతన్ని కదిలించాయి. వెంటనే, ఉంగరం అసలు యజమాని కోసం వెతకడం ప్రారంభించాడు. అలా సోషల్ మీడియా సహాయంతో ఫేస్బుక్లో గాలించి, చివరికి డి స్టెఫానోకు ఆ ఉంగరం చేరేలా చేశాడు. దాదాపు ఆరు దశాబ్దాలుగా దాచుకున్న జ్ఞాపకం అకస్మాత్తుగా తిరిగి చేతిలోకి రావడంతో అతని కళ్లలో ఆనందబాష్పాలు వెల్లువెత్తాయి. (చదవండి: నీటికి బదులు బీర్! స్పెషల్ హైడ్రేషన్ స్టయిల్..) -
ఆ రెండు చోట్లా ఉప ఎన్నికలు ఖాయం
సాక్షి, హైదరాబాద్/శ్రీనగర్‌కాలనీ: బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలపై రాబోయే రోజుల్లో అనర్హత వేటు పడటం ఖాయమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు తప్పవని, అలాగే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై కేటీఆర్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికలో పార్టీ గెలుపు ఖాయమని అన్నారు.భారీ మెజారిటీకోసం కష్టపడాలని నేతలకు సూచించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నాయకులందరూ కలసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్కు ఉన్న బలాన్ని ఈ ఉప ఎన్నికలో చాటాల్సిన అవసరం ఉందన్నారు. ‘బీఆర్ఎస్ నాయకులు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు హైదరాబాద్ సమస్యలపై అవగాహన ఉంది.హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అమలు చేసిన పథకాలను ప్రజలకు మరోసారి గుర్తు చేయాలి’అని కేటీఆర్ సూచించారు. ప్రచారంలో కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు గుర్తు చేయడంతో పాటు నగరంలో రోజురోజుకూ దిగజారుతున్న పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మురికినీటి కాలువల నిర్వహణ వంటి సమస్యలను ఎత్తి చూపాలన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని పక్కన పెట్టి, కాంగ్రెస్ కేవలం రాజకీయాలకే పాల్పడుతోందన్నారు. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్రజూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని, ఈ నియో జకవర్గంలో తిరిగి గులాబీ జెండాను ఎగురవేస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణభవన్‌లో షేక్‌పేట డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు తోట మహేశ్‌తో పాటు పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు. వారికి కేటీఆర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.
