breaking news
-
Jubilee Hills bypoll: ముగ్గురికీ సవాలే!
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 11న జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీల్లోని ముగ్గురు ముఖ్య నేతలకు ప్రతిష్టాత్మకంగా మారింది. తమ పార్టీని గెలిపించే బాధ్యత వీరి భుజస్కంధాలపై ఉంది. దీంతో ముగ్గురూ ఈ ఎన్నికను ఆషామాïÙగా తీసుకోవడం లేదు. తమకిది ఓ సవాల్‌గా భావించి సత్తా చాటుకోవాలనుకుంటున్నారు. అంతేకాదు, వారికీ ఎన్నిక చాలా అవసరమని.. వారి నాయకత్వానికి లిట్మస్టెస్ట్గా మారనుందని రాజకీయ పరిశీలకులు సైతం భావిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఎంతో కీలకం కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు ఎంతో అవసరం. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చాక దాదాపు రెండేళ్లకు జరుగుతున్న ఎన్నిక కావడంతో ఆయన పని తీరుకు గీటురాయి కానుంది. ఆయన పాలన తీరుకు ప్రజలిచ్చే తీర్పుగానే చాలామంది భావిస్తున్నారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక కంటోన్మెంట్‌కు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచినప్పటికీ, రేవంత్ సీఎం అయ్యాక స్వల్ప సమయంలోనే ఆ ఎన్నిక జరిగినందున దానిని ఆయన పనితీరుకు నిదర్శనమనలేదు. ఇప్పుడు మాత్రం ఆయన పాలనకు ప్రజలిచ్చే మార్కులుగా పరిగణిస్తున్నారు. 2023లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక జరుగుతుండటం తెలిసిందే. ఈ సీటును గెలుచుకుంటే నగరంలోనే సీఎంతో పాటు పార్టీ పట్టు బలపడుతుంది. అంతే కాదు.. రేవంత్‌రెడ్డి మోడల్(వెల్ఫేర్+డెవలప్మెంట్)కు విలువ పెరుగుతుంది. ఓటమి ఎదురైతే, అమలు కాని హామీలు (మహిళలకు నెలకు రూ.2500, తులం బంగారం తదితర స్కీమ్స్) ఇచ్చారనే పేరు మూటగట్టుకోవాల్సి వస్తుంది. ప్రజల నుంచి విమర్శల దాడి మరింత తీవ్రమవుతుంది. గెలిస్తే రాష్ట్రవ్యాప్తంగానూ ఉత్సాహంతో లోకల్‌బాడీ ఎన్నికలకు పార్టీకి మంచి బూస్ట్‌గా మారనుంది. కేటీఆర్‌కు సరై్వవల్ టెస్ట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు జూబ్లీహిల్స్‌లో గెలుపు ఎంతో అవసరం. తమ పార్టీ సిట్టింగ్ సీటు కావడంతో ఒక రకంగా చెప్పాలంటే ‘సర్వైవల్ టెస్ట్’. గెలిస్తే, కేటీఆర్ ప్రో–అర్బన్ ఇమేజ్ (యువత, ఐటీ సెక్టార్) బలపడుతుంది. కేటీఆర్ ప్రచారం చేస్తున్న బుల్డోజర్ రాజ్, హైడ్రా డెమాలిషన్స్, పవర్ కట్స్ వంటి వాటికి ప్రజలు మద్దతిచ్చారని భావించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ఫెయిలయిందని చెప్పేందుకూ ఇంతకు మించిన అవకాశం లేదు. కేటీఆర్ రాజకీయ సామర్థ్యానికీ నిదర్శనంగా మారనుంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పరిమితమైనప్పటి నుంచీ పార్టీ వ్యవహారాలన్నీ కేటీఆరే చూస్తున్నారు. పార్టీ ఫ్యూచర్‌కు కూడా కీలకం. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని పలువురు నేతలు పార్టీని వీడారు. ఓటమిపాలైతే పారీ్టలో మిగిలే వారు బహుశా ఉండకపోవచ్చు. కేటీఆర్ లీడర్ ప్పైనా ప్రశ్నలు వెల్లువెత్తే అవకాశముంది. అందుకే కేటీఆర్ సైతం వీటిని తేలిగ్గా తీసుకోలేదు. బూత్‌స్థాయి నేతలతో సమావేశమవుతున్నారు. డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ విజయయాత్ర తిరిగి ఇక్కడి నుంచే అని చెబుతున్నారు. గెలిస్తే సక్సెస్ స్టార్‌గా కేటీఆర్ నిలుస్తారు. కిషన్‌రెడ్డికి అవశ్యం.. బీజేపీ అభ్యర్థి గెలవడం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అవసరం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ కిషన్‌రెడ్డి గెలిచిన సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోనే ఉంది. ఓడితే పార్టీ దిగజారుతుంది. ఇప్పటికే పార్టీ బహిష్కృత నేత రాజాసింగ్ వ్యంగ్యా్రస్తాలు సంధించారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను గెలిపిస్తారా? బీఆర్ఎస్ను గెలిపిస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. కిషన్‌రెడ్డి ఎన్నిసార్లు కేంద్రమంత్రి అయినప్పటికీ హైదరాబాద్‌కు చేసిందేమీలేదని ప్రతిపక్ష పారీ్టలు ఇప్పటికే విమర్శిస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బీజేపీకి వచ్చినన్ని ఓట్లకన్నా ఓట్లు పెరిగితే గుడ్డిలో మెల్ల. ఇంకా తగ్గితే కిషన్‌రెడ్డి ఇమేజ్ దిగజారుతుంది. -
విరాట్ కోహ్లి రిటైర్మెంట్?.. గావస్కర్ స్పందన ఇదే
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలోనూ విరాట్ కోహ్లి (Virat Kohli) విఫలమయ్యాడు. అడిలైడ్‌లో మంచి రికార్డు కలిగి ఉన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ గురువారం నాటి మ్యాచ్‌లో మాత్రం డకౌట్ అయ్యాడు. అంతకు ముందు పెర్త్ వేదికగా తొలి వన్డేలోనూ ఈ దిగ్గజ ఆటగాడు సున్నా చుట్టడం గమనార్హం.ఈ నేపథ్యంలో అడిలైడ్ వన్డేలో కోహ్లి అవుటై.. పెవిలియన్‌కు చేరుతున్న క్రమంలో స్టేడియంలోని ప్రేక్షకులు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. ఇందుకు ప్రతిగా కోహ్లి సైతం గ్లోవ్స్ తీసి.. ఇక సెలవు అన్నట్లుగా మైదానం వీడాడు. అయితే, కోహ్లి చర్య రిటైర్మెంట్కు సంకేతమంటూ వదంతులు వ్యాపించాయి.రెండుసార్లు డకౌట్ అయినంత మాత్రాన..ఈ విషయంపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) స్పందించాడు. ‘‘వన్డేల్లో 52 సెంచరీలు చేశాడు. 14 వేలకు పైగా పరుగులు సాధించాడు. టెస్టుల్లోనూ 32 దాకా శతకాలు ఉన్నాయి. ఇప్పటికే వేలకు వేలు పరుగులు రాబట్టాడు.అలాంటి ఆటగాడు వరుసగా రెండుసార్లు డకౌట్ అయినంత మాత్రాన తప్పుపట్టాల్సిన అవసరం ఏమీలేదు. అతడిలో ఇంకా చాలా ఆట మిగిలే ఉంది. మున్ముందు ఇంకా ఆడతాడు. తదుపరి సిడ్నీ వన్డేలో భారీ ఇన్నింగ్స్ ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.నిజానికి టెస్టు, వన్డేల్లో అడిలైడ్ కోహ్లికి ఫేవరెట్ గ్రౌండ్. అక్కడ శతకాలు బాదిన చరిత్ర అతడికి ఉంది. కాబట్టి.. సహజంగానే ఈసారి వైఫల్యాన్ని అతడితో పాటు అభిమానులూ తట్టుకోలేకపోయారు. అయినా ఆటగాడి కెరీర్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.ఆ స్పందన అమోఘంఏదేమైనా కోహ్లి మైదానాన్ని వీడుతున్న వేళ అభిమానుల నుంచి వచ్చిన స్పందన అమోఘం. ఎందుకంటే అక్కడ చాలా మంది ఆస్ట్రేలియన్లు కూడా ఉన్నారు. వారంతా కూడా భారతీయ అభిమానులతో కలిసి కోహ్లికి ఓవియేషన్ ఇచ్చారు. గొప్ప ఆటగాడికి లభించే ఆదరణకు తార్కాణం అది.ఇది చాలా చాలా ప్రత్యేకం. ఇదేమీ కోహ్లి కెరీర్‌కు ముగింపు కాదు. అతడు ఆటగాళ్లు కూర్చునే స్టాండ్ వైపు వెళ్లాడు. అయితే, తన పట్ల అభిమానం చూపుతున్న వారి కోసం మాత్రమే గ్లోవ్స్ తీసి వారి పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు.అంత తేలికగా ఓటమిని ఒప్పుకోడువిరాట్ కోహ్లి.. అంత తేలికగా ఓటమిని ఒప్పుకొని ఆటను వదిలేసే రకం కాదు. వరుసగా రెండుసార్లు డకౌట్ అయిన తర్వాత అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అనుకుంటున్నారా? ఛాన్సే లేదు. ఉన్నత స్థాయిలోనే అతడు ఆటకు వీడ్కోలు పలుకుతాడు.సిడ్నీ మ్యాచ్ తర్వాత.. సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డే సిరీస్ ఉంది. ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలే ఉన్నాయి. రోహిత్ శర్మతో కలిసి విరాట్ వన్డే వరల్డ్‌కప్-2027 ఆడతాడనే భావిస్తున్నా. లేదంటే టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా ఫ్యాన్స్కూడా నిరాశ చెందుతారనడంలో సందేహం లేదు.ఆ ఛాన్సే లేదుఏదేమైనా కోహ్లి తన పట్ల అభిమానం చూపిన వారికి కృతజ్ఞతగా మాత్రమే గ్లోవ్స్ తీశాడు. ఒకవేళ తను సెంచరీ చేసి ఉంటే బ్యాట్ ఎత్తి అభివాదం చేసేవాడు. కాబట్టి కోహ్లి రిటైర్మెంట్ అంటూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు’’ అని గావస్కర్ స్పోర్ట్స్‌తక్‌తో పేర్కొన్నాడు. కాగా పెర్త్ వన్డేలో ఆసీస్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా.. అడిలైడ్‌లో రెండు వికెట్ల తేడాతో ఓడి సిరీస్‌ను చేజార్చుకుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20ల, టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన కోహ్లి.. వన్డేల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.చదవండి: IND vs AUS: టీమిండియా కొంపముంచిన 22 ఏళ్ల కుర్రాడుA tough day for the King of Cricket 👑@imVkohli waved goodbye to the Adelaide crowd 🏏💬#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/yAG1uQFPA8— Star Sports (@StarSportsIndia) October 23, 2025 -
సూర్యుడిలో భారీ పేలుడు
వాషింగ్టన్: సూర్యుడిలో మన కంటికి కనిపించని అవతలి వైపు భారీ పేలుడు సంభవించడంతో శక్తివంతమైన తరంగాలు(షాక్‌వేవ్స్) మన సౌర వ్యవస్థలోకి వెలువడినట్లు ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నెల 21వ తేదీన ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్(సీఎంఈ) ఢీకొట్టడంతో శుక్ర గ్రహం(వీనస్)లో స్వల్పభాగం దెబ్బతిన్నట్లు కనిపెట్టారు. సౌర ఉద్గారం తదుపరి లక్ష్యం ఏమిటి? మన భూగోళమేనా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. సెకన్‌కు దాదాపు 2,474 కిలోమీటర్ల వేగంతో సూర్యుడి నుంచి షాక్‌వేవ్స్ వెలువడినట్లు అమెరికా వైమానిక దళం వెల్లడించింది. ఇది అత్యంత వేగవంతమైన, శక్తివంతమైన కరోనల్ మాస్ ఎజెక్షన్ అని శాస్త్రవేత్తలు స్పష్టంచేశారు. 1972, 2017లో ఈ తరహా ఉద్గారాలు సూర్యగోళం నుంచి సౌరవ్యవస్థలోకి వెలువడ్డాయి. అప్పట్లో విద్యుత్ గ్రిడ్లకు అంతరాయం ఏర్పడింది. ఇలాంటి ఉద్గారాలను సౌర తుఫాన్లు అని కూడా అంటారు. భూమికి ఉన్నట్లుగా శుక్ర గ్రహానికి రక్షణ అయస్కాంత క్షేత్రం లేదు. అందుకే సూర్యుడి ఉద్గారాల వల్ల ప్రభావితమైనట్లు చెబుతున్నారు. షాక్‌వేవ్స్ పయనిస్తున్న ప్రాథమిక మార్గంలోనే శుక్రగ్రహం ఉంది. అయితే, ఈ తరంగాలు మరింత విస్తరించి, భూమిని తాకే అవకాశం లేకపోలేదని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే, ఈ తరంగాల వల్ల భూమికి నష్టమేమీ ఉండదని నేషనల్ ఓషియానిక్, అటా్మస్పియరిక్ అడ్మిని్రస్టేషన్(ఎన్ఓఏఏ) నిపుణులు స్పష్టంచేశారు. సూర్యుడి అవతలి వైపు నుంచి వెలువడే తరంగాలు భూమిని ప్రభావితం చేయబోవని, మనకు ఎలాంటి ముప్పు ఉండదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. కరోనల్ మాస్ ఎజెక్షన్‌ను వాతావరణ నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. -
ఆశ్చర్యం.. ఐటమ్ బ్యూటీ ఇంత మోసం చేసిందా?
సామాన్యులైనా సెలబ్రిటీలు అయినా సరే మనుషులే. కాబట్టి అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం లాంటివి చేస్తుంటారు. ఈసారి బాలీవుడ్ ఐటమ్ బ్యూటీ మలైకా అరోరా.. అలాంటి ఓ పొరపాటు చేసి దొరికిపోయింది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఇంతకీ అసలేమైంది? ఏంటి విషయం?ఐటమ్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న మలైకా అరోరాకు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే 'గబ్బర్ సింగ్' చిత్రంలో కెవ్వు కేక పాటలో డ్యాన్స్ చేసి ఇక్కడ కూడా క్రేజ్ సంపాదించుకుంది. చాన్నాళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన మలైకా.. ఈ మధ్యనే మళ్లీ సాంగ్స్ చేస్తోంది. రీసెంట్గా థియేటర్లలో రిలీజైన 'థామా'లోనూ ఓ క్రేజీ సాంగ్ చేసింది. సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా 50వ పుట్టినరోజు వేడుకల్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమాలు) సినిమా సెలబ్రిటీ.. బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడం, సెలబ్రిటీలు సందడి చేయడం సాధారణమే. అయితే మలైకా తన 50వ పుట్టినరోజు అని చెప్పింది. కానీ నెటిజన్లు మాత్రం ఆమె అబద్ధం చెబుతోందని అంటున్నారు. ఎందుకంటే గతంలో 2019లో 46వ బర్త్ డేని జరుపుకొంది. అంటే ఇప్పుడు 52వ ఏడాదిలోకి వస్తుంది. కానీ విచిత్రంగా కేక్‌పైన 50 అని నంబర్ కనిపించింది. వికిపీడియా లేని టైంలో ఇలాంటివి ఏమైనా చేశారంటే సరేలే అనుకోవచ్చు. ఇంత టెక్నాలజీ ఉన్న ఈ కాలంలోనూ ఇలాంటి రెండేళ్ల వయసు తగ్గించుకోవడం ఏంటోనని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.మలైకా విషయానికొస్తే.. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ని 1998లో పెళ్లి చేసుకుంది. కానీ 2017లో విడాకులు ఇచ్చేసింది. వీళ్లకు అర్హాన్ ఖాన్ అనే కొడుకు కూడా ఉన్నారు. అర్భాజ్కి విడాకులు ఇచ్చేసిన తర్వాత మలైకా.. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో కొన్నాళ్లు డేటింగ్ చేసింది. ప్రస్తుతానికి సింగిల్‌గానే ఉంటోంది.(ఇదీ చదవండి: రెండోసారి తల్లి కాబోతున్న 'జయం' చైల్డ్ ఆర్టిస్ట్) -
సృష్టికి ప్రతిసృష్టి
సాక్షి, అమరావతి: వివాహం జరుగుతున్నప్పుడు వ«ధూవరుల తల్లిదండ్రుల్లో ఎవరైనా లేకపోతే.. శుభకార్యానికి వచ్చిన వారంతా ‘ఇలాంటి సమయంలో మీ నాన్న, అమ్మ ఉంటే ఎంత సంతోషించేవారో.. వారులేని లోటు కనిపిస్తోంది’ అంటుంటారు. ఇప్పుడు ఆ లోటును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తీరుస్తోంది. ఎప్పుడో భౌతికంగా దూరమైన వారిని సజీవ చిత్రాలుగా మలిచి కళ్లముందు సాక్షాత్కరింపజేస్తోంది. దీనిని సాంకేతిక యుగంలో ఓ అద్భుతంగా అభివర్ణించవచ్చు. చనిపోయిన వ్యక్తులను బతికున్నవారిలా చూపించే ఏఐ సాంకేతికతను ‘డిజిటల్ పునరుత్థానం’ ‘గ్రీఫ్ టెక్’ అని పిలుస్తున్నారు. ఈ సాంకేతికత చనిపోయినవారి ఫొటోలు, వీడియోలు, ఆడియో రికార్డింగ్ లు, మెసేజ్‌లు వంటి వాటిని ఉపయోగించుకుని వారి రూపాన్ని, స్వరాన్ని, ప్రవర్తనను పునఃసృష్టిస్తోంది. ఇప్పుడు ప్రతి వేడుకలోనూ ఈ విజ్ఞానం భావోద్వేగాలను పంచుతోంది.ఎలా పనిచేస్తుంది?ముందుగా ఏఐ టూల్‌కు చనిపోయిన వ్యక్తికి సంబంధించిన డేటాను ఇస్తారు. ఇందులో టెక్టŠస్ మెసేజ్‌లు, ఈ–మెయిల్లు, ఫొటోలు, వీడియోలు, ఆడియో రికార్డింగ్ లు ఉంటాయి. ఈ డేటాను ఏఐ విశ్లేషించి.. చనిపోయిన వ్యక్తి ముఖం, కదలికలు, హావభావాలు, గొంతుతో ఒక డిజిటల్ అవతార్‌ను సృష్టిస్తుంది. ఈ అవతార్‌తో మనం చాట్‌బాట్ రూపంలో మాట్లాడవచ్చు. కొన్ని ఆధునిక వ్యవస్థలు వీడియో కాల్స్ ద్వారా కూడా సంభాషించే సౌలభ్యాన్ని కల్పిస్తాయి.ఎన్నో యాప్లుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతతో ఇలాంటి వీడియోలను సృష్టించేందుకు అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. స్టోరీఫైల్ వంటి కంపెనీలు చనిపోయినవారు అంత్యక్రియల సమయంలో మాట్లాడేలా ఏఐని వినియోగిస్తున్నాయి. చనిపోయే ముందు రికార్డ్ చేసిన వీడియోలు, వాటికి ఏఐ ప్రశ్నలు, సమాధానాలు జతచేసి బంధువులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేలా చేస్తుంది. మైహెరిటేజ్ అనే సంస్థ ‘డీప్ నాస్టాల్జియా’ అనే ఫీచర్‌తో పాత ఫొటోలను కదిలే వీడియోలుగా (యానిమేటెడ్) మారుస్తోంది. ఈ ఫీచర్ చనిపోయినవారి ఫొటోలను యానిమేట్ కూడా చేస్తుంది. డీప్‌బ్రెయిన్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ‘రీ మెమరీ 2’ అనే సేవ ద్వారా చనిపోయినవారి వాస్తవిక ఏఐ అవతార్లను తయారు చేస్తోంది.భావోద్వేగంతో ఆందోళన చనిపోయినవారిని ఏఐతో పునఃసృష్టించడం వల్ల అనేక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. చనిపోయిన వ్యక్తి సమ్మతి లేకుండా వారి డేటాను ఉపయోగించడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏఐ అవతార్‌తో మాట్లాడినప్పుడు.. కుటుంబ సభ్యులు అది నిజమైన వ్యక్తి కాదని తెలుసుకోలేకపోవడం వల్ల భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ సాంకేతికత దుఃఖాన్ని తగ్గించడానికి బదులుగా, కొంతమందిని చనిపోయినవారితో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. బాధను మరింతగా పెంచుతుంది. ఇది వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. అలాగే ఈ సాంకేతికతను దుర్వినియోగం చేసి ప్రజలను మోసం చేసే ప్రమాదం కూడా పొంచి ఉంది. -
సినీ ఇండస్ట్రీలో పురుషాహంకారం.. ఎన్నో పోరాటాలు చేశా!
సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలంటే పురుషాహంకారాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఈ విషయంలో తాను ఎన్నో పోరాటాలు చేశానని జాన్వీ కపూర్ వెల్లడించారు. ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ టాక్ షోలో సినిమా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న కొన్ని సమస్యలపై జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘‘ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ.. ఇక్కడికి వచ్చాకే కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను. సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే పురుషాహంకారాన్ని ఎదుర్కోవాలి. ఈ విషయంలో ఎన్నో పోరాటాలు చేశాను.నలుగురు మహిళలు ఉన్న ప్రదేశంలో నా అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పగలను. అదే ప్రదేశంలో నలుగురు పురుషులు ఉంటే మాత్రం నా అభిప్రాయాన్ని నేను స్వేచ్ఛగా చెప్పలేక పోతున్నాను. ఎందుకంటే వారు నొచ్చుకోకుండా చె ప్పాలి. ఇందుకు చాలా నేర్పు కావాలి. ఒక్కోసారి మనల్ని మనం తక్కువ చేసుకోవాలి. కొన్నిసార్లు మనకు నచ్చని విషయాలను నచ్చలేదని స్ట్రయిట్‌గా చెప్పకుండా నాకు అర్థం కావడం లేదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.కొన్నిసార్లు మౌనంగా ఉండి పోవాల్సి వచ్చింది. ఇలా ఎన్నో రాజకీయాలను ఎదుర్కొన్నాను’’ అని చెప్పుకొచ్చారు జాన్వీ కపూర్. ఈ షోకు ఓ వ్యాఖ్యాతగా ఉన్న ట్వింకిల్ ఖన్నా కూడా జాన్వీ కపూర్ మాటలను స పోర్ట్ చేస్తూ, 1990 సమయంలో తాను ఈ తరహా పరిస్థితులను ఫేస్ చేశానని చె ప్పారు. -
ఇండో–కొరియన్ హారర్
వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ కామెడీ సినిమా ‘వీటీ 15’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తుండగా, హాస్య నటుడు సత్య మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వరుణ్ తేజ్ కెరీర్‌లోని ఈ 15వ సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇండియా, విదేశీ లొకేషన్స్‌లో ఇప్పటికే మూడు మేజర్ షూటింగ్ షెడ్యూల్స్‌ను పూర్తి చేశారు.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. వరుణ్ తేజ్‌తో పాటు ఈ చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ‘‘వరుణ్ తేజ్ కెరీర్లో స్పెషల్ ప్రాజెక్ట్ ఇది. హారర్–కామెడీ, ఇండో–కొరియన్ బ్యాక్‌డ్రాప్, యునిక్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ‘తొలి ప్రేమ’ (2018) తర్వాత వరుణ్ తేజ్–సంగీత దర్శకుడు ఎస్. తమన్ల కాంబినేషన్లో మరోసారి అదరగొట్టే ఆల్బమ్ రానుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఇక ఈ చిత్రానికి మేకర్స్ ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ అనుకుంటున్నారని, రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రం కథనం సాగుతుందని సమాచారం. -
బస్సులో కాదు.. ఎయిర్ బస్‌లో..
నాగర్‌కర్నూల్: పూలుపండ్ల ఫంక్షన్ (నిశ్చితార్థం) కోసం సాధారణంగా ప్రైవేట్ బస్సులు బుక్ చేసి కార్యక్రమానికి తీసుకెళ్లడం తెలిసిందే. అయితే తండ్రి కోరిక మేరకు ఓ వ్యక్తి రెండు విమానాల్లో 500 మంది గ్రామస్తులను, బంధువులను తీసుకెళ్లడం విమానాశ్రయ ఉద్యోగులను, ఇతర ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాలు.. నాగర్‌కర్నూల్‌కు చెందిన మేకల అయ్యప్ప కుమారుడు మేకల జగపతి (జవహర్‌నగర్ మాజీ మేయర్ కావ్యకు సోదరుడు) గోవాలో ఎంగేజ్మెంట్ ఫంక్షన్ చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ కార్యక్రమానికి కుటుంబసభ్యులు, బంధువులతోపాటు గ్రామస్తులను సైతం ఫ్లైట్‌లో గోవా తీసుకెళ్లాలని వాళ్ల తండ్రి నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా తన ఆలోచనను అమల్లో పెట్టి వారిని తీసుకెళ్లిన తీరుతో ఎయిర్‌పోర్టులో సందడిగా మారింది. శనివారం రెండు విమానాల్లో కేవలం మేకల వారి బంధువులు, స్నేహితులు మాత్రమే ఉండటంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది, ఉద్యోగులు ఆశ్చర్యానికి గురయ్యారు. తన తండ్రి కోరిక మేరకు వచ్చిన బంధువులు, స్నేహితులు, గ్రామస్తులకు ఈ సందర్భంగా మేకల కావ్య కృతజ్ఞతలు చెప్పారు. -
అమ్మని విడిచి ఉండలేక.. 15వ అంతస్తు నుంచి దూకి..
ఫరీదాబాద్: హర్యానాలోని గ్రేటర్ ఫరీదాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. తల్లి తమతో పాటు ఉండకూడదని భార్య, అత్తామామలు, బావమరుదులు వేధిస్తుండటంతో తీవ్రంగా కలత చెందిన ఒక యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుని మామ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన కుమార్ గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో రేడియోథెరపిస్ట్గా పనిచేస్తున్నాడు. అతనికి తొమ్మిదేళ్ల క్రితం నేహా రావత్‌తో వివాహం జరిగింది. వారికి ఆరేళ్ల కుమార్తె ఉంది. ఈ దంపతులు గతంలో నోయిడాలో ఉండేవారు. అక్కడ నేహా ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండేది.. మృతుడి మామ ప్రకాష్ సింగ్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుండటంతో వారు కుమార్తెను చూసుకోలేకపోయారు. ఈ నేపధ్యంలో యోగేష్ తన తల్లిని తమతో పాటు ఉండేలా చూసుకోవాలని అనుకున్నాడు. అయితే నేహా ఇందుకు అంగీకరించలేదు.ఆరు నెలల క్రితం యోగేష్ తన కుమార్తెతో సహా గ్రేటర్ ఫరీదాబాద్‌లోని సెక్టార్ 87లోని పెర్ల్ సొసైటీకి మారాడు. అయితే నేహా.. నోయిడా నుండి యోగేష్‌తో పాటు ఇక్కడికి రాలేదు. దీంతో యోగేష్ తమ కుమార్తెను చూసుకునేందుకు తన తల్లిని తీసుకువచ్చాడు. ఇంతలో నేహా తన యోగేష్‌తో పాటు ఉండేందుకు పెర్ల్ సొసైటీ అపార్ట్‌మెంట్‌కు వచ్చింది. తరువాత యోగేష్ తల్లి తమతో ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. నేహా తల్లిదండ్రులు, సోదరులు ఆశిష్ రావత్, అమిత్ రావత్ కూడా ఈ విషయమై యోగేష్‌తో గొడవ పడ్డారు. దీంతో యోగేష్ తీవ్రంగా కలత చెందాడు.గురువారం, యోగేష్ తన భార్య నేహాను గ్వాలియర్‌లోని తమ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తూ, నేహాను నోయిడాలో దింపి, ఒంటరిగా తమ అపార్ట్‌మెంట్‌కు తిరిగి వచ్చాడు. శుక్రవారం రాత్రి పెర్ల్ సొసైటీలోని 15వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని అతని మామ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు మృతుని భార్య నేహా రావత్, అత్త శాంతి రావత్, మామ వీర్ సింగ్ రావత్, నేహా సోదరులు ఆశిష్, అమిత్ రావత్ లపై కేసు నమోదు చేశామని భూపాని పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సంగ్రామ్ దహియా మీడియాకు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: కెనడాపై ఉరిమిన ట్రంప్.. సుంకాలు 10 శాతం పెంపు -
రూ. వెయ్యి కోసం చంపేశారు
రంగారెడ్డి జిల్లా: డబ్బు కోసం స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసింది. ముగ్గురు స్నేహితులు కలిసి మరో స్నేహితుడిని హత్య చేసిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ నరేందర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... మైలార్‌దేవ్‌పల్లి వట్టెపల్లి ప్రాంతానికి చెందిన అఫ్రోజ్ (25) ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి అతను తన స్నేహితులు సోహెల్, అబ్బు, రిజ్వాన్‌లతో కలిసి అర్ధరాత్రి వరకు గడిపాడు. ఈ సమయంలో స్నేహితుల మధ్య డబ్బు విషయమై చోటు చేసుకున్న వివాదం ఘర్షణకు దారి తీసింది. రూ.వెయ్యి కోసం చెలరేగిన గొడవ దాడి వరకు వెళ్లింది. దీంతో ముగ్గురు స్నేహితులు కలిసి అఫ్రోజ్‌పై కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి కుప్పకూలాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా అతను అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
