breaking news
-
ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: రెగ్యులర్ అభ్యర్థులతో పాటు ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రాసేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఏపీ టెట్ (అక్టోబర్ 2025) షెడ్యూల్‌ను గురువారం విడుదల చేసింది. అభ్యర్థులు శుక్రవారం నుంచి నవంబర్ 23 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజును http://cse.ap.gov.in ద్వారా చెల్లించాలని సూచించింది. నవంబర్ 25న ఆన్లైన్ మాక్ టెస్ట్ నిర్వహిస్తారని, డిసెంబర్ 3 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోలని సూచించింది. డిసెంబర్ 10 నుంచి రోజూ రెండు పూటలా ఉదయం 9 నుంచి 12 గంటలకు, మ«ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఏపీ టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫలితాలను జనవరి 19వ తేదీన వెల్లడిస్తామని చెప్పారు. http://tet2dsc.apcfss.in వెబ్సైట్ నుంచి పూర్తి సమాచారం డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు హెల్ప్ డెస్క్ నంబర్లు 8121947387, 8125046997, 7995649286, 7995789286, 9963069286ను సంప్రదించవచ్చన్నారు. ఆ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరిటీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరని, ఇదే అంశాన్ని ఇటీవల సుప్రీంకోర్టు సైతం నిర్దేశించిందని పేర్కొంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, అన్ని మేనేజ్మెంట్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధిస్తున్న ఉపాధ్యాయులకు తప్పనిసరిగా టెట్ ఉండాలని నిర్దేశించింది. అయితే, ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటో తేదీ నాటికి 5 ఏళ్ల లోపు మాత్రమే ఇంకా సర్వీసు మిగిలి ఉన్నవారికి టెట్ నుంచి మినహాయింపునిచ్చింది. కాగా, ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నిర్వహణను ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. -
వెండితెరపై ‘గుమ్మడి’
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఇప్పటికీ సాధారణ జీవితం గడిపే గుమ్మడి నర్సయ్య గురించి తెలుసుకునేందుకు జెన్ జెడ్ తరం కూడా ఆసక్తి చూపిస్తోంది. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమా తెరకెక్కనుంది. కన్నడ స్టార్హీరో శివరాజ్‌కుమార్ గుమ్మడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే తన జీవితంలో ఆచరించిన ఆదర్శాలను ఈ తరానికి మరింత స్పష్టంగా పరిచయం చేయబోతున్న దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే ఈ చిత్రం గురించి చెప్పిన విశేషాలు.మూడేళ్ల పాటు రీసెర్చ్మాది కామారెడ్డి. సినిమా రంగంలో పదేళ్లుగా ఉన్నాను. చిన్నప్పుడే కమ్యూనిస్టు యోధులు తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్యల జీవిత చరిత్ర చదివాను. ఆ తర్వాత అలాంటి ఆదర్శాలతో జీవించే రియల్‌టైం పొలిటీషియన్ కోసం ఆరా తీసే క్రమంలో ఇల్లెందు వచ్చి గుమ్మడి నర్సయ్యను కలిశాను. 2019 నుంచి మూడేళ్లపాటు ఆయనతో ట్రావెల్ చేసిన వారు, ఆయన చేతిలో ఓడిపోయిన వారు ఇలా అనేక మందిని కలిసి పూర్తి స్థాయిలో సినిమా స్క్రిప్టు రెడీ చేసుకున్నాను. ఐదు సార్లు ఒకే చోటనుంచి ఎన్నిక కావడమనేది సామాన్యమైన విషయం కాదు. ఎంతో నిజాయితీ ఉంటేనే ఇలా జరుగుతుంది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను తెరపై జరిగే సన్నివేశాలతో లీనమయ్యే చేయగలిగితే సినిమా హిట్టే. గుమ్మడి జీవిత చరిత్రలో ఐదు గంటల పాటు కూర్చోబెట్టగలిగేంత విషయం ఉంది.రెండేళ్లపాటుగుమ్మడి జీవిత కథతో సినిమా తీసేందుకు రెండేళ్లకు పైగా సమయం పట్టింది. హీరోలకు కథ నచ్చితే నిర్మాతలు దొరకలేదు. నిర్మాతలు దొరికితే కథకు తగ్గ హీరోలు దొరకలేదు. ఇద్దరు లభిస్తే.. కథలో మార్పులు చేర్పులు సూచించేవారు. ఇలాంటి సినిమాలు తమిళ్, మలయాళంలో ఆడుతాయి కానీ మన దగ్గర నడవవు. చివరకు పాల్వంచకు చెందిన ఎన్.సురేశ్‌రెడ్డి ప్రవళ్లిక ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై నిర్మించేందుకు ముందుకు వచ్చారు.కేవలం 20 రోజుల్లో..ఏడాదిన్నర క్రితం స్క్రిప్టును కన్నడ స్టార్హీరో డాక్టర్ శివరాజ్‌కుమార్‌కు పంపించాను. బెంగళూరు రావాలని సెప్టెంబరులో ఆయన మేనేజర్ నుంచి కాల్ వచ్చింది. అప్పటి నుంచి కేవలం ఇరవై రోజుల్లోనే శివరాజ్‌కుమార్ గుమ్మడి పాత్రను చేసేందుకు అంగీకరించడంతో పాటు ఒక రోజు షూట్లో పాల్గొనడంతో టీజర్ రిలీజ్ చేశాం. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. జిల్లాతో పాటు వరంగల్, కరీంనగర్ జిల్లాలోని పలు లొకేషన్లలో షూటింగ్ జరిపేలా ప్లాన్ చేస్తున్నాం. గుమ్మడి పాత్రలో కనిపించేందుకు శివరాజ్‌కుమార్ చాలా ఉత్సాహంతో ఉన్నారు.వారిద్దరు ఇంకా కలుసుకోలేదురియల్ హీరో గుమ్మడి నర్సయ్య రీల్ హీరో శివరాజ్‌కుమార్‌లు ఇంకా నేరుగా కలుసుకోలేదు. కేవలం ఫోన్లోనే ఇద్దరూ మాట్లాడుకున్నారు. షూటింగ్‌కు ముందు ఒకసారి ఇద్దరు కలిసే అవకాశముంది. గుమ్మడి నర్సయ్య ట్రైలర్ రిలీజైన వెంటనే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకలోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా గుమ్మడి గౌరవం పెంచేలా భావి తరాలకు స్ఫూర్తిని ఇచ్చేలా ఈ చిత్రం ఉండబోతోంది. -
దిగజారిన పీసీబీ చీఫ్ నఖ్వీ!... ఈసారి..
ఆసియా టీ20 కప్-2025 టోర్నమెంట్లో చాంపియన్‌గా నిలిచిన టీమిండియా ఇప్పటి వరకు ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్, ఆసియా క్రికెట్ మండలి (ACC) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ ఇందుకు ప్రధాన కారణం.పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్తాన్ (IND vs PAK) తొలిసారిగా ఆసియా కప్ టోర్నీలో తొలిసారిగా ముఖాముఖి తలపడ్డాయి. ఈ క్రమంలో దాయాది దుశ్చర్యలకు నిరసనగా టీమిండియా ఆటగాళ్లు తొలుత లీగ్ దశలో.. పాక్ ప్లేయర్లతో షేక్‌హ్యాండ్ (No ShakeHand)కు నిరాకరించారు.పప్పులు ఉడకవని తెలుసుకునిదీనిని అవమానంగా భావించిన పాక్ బోర్డు.. టీమిండియాను నిందల పాలు చేయాలని ప్రయత్నాలు చేసింది. భారత్‌తో మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన వ్యక్తిని తప్పించాలంటూ రచ్చ చేసింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) దిగిరాకపోవడంతో తమ పప్పులు ఉడకవని తెలుసుకుని మిన్నకుండిపోయింది.అయితే, సూపర్-4 మ్యాచ్‌లోనూ భారత జట్టు షేక్‌హ్యాండ్‌కు నిరాకరించింది. ఇందుకు ప్రతిగా పాక్ ఆటగాళ్లు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. గన్ పేలుస్తున్నట్లు సెలబ్రేషన్స్ చేసుకుంటూ వక్రబుద్ధి చాటుకున్నారు. ఇక ఫైనల్లోనూ దాయాది పాక్‌తో.. సెప్టెంబరు 28న తలపడిన టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీ గెలుచుకుంది.నఖ్వీ చేతుల మీదుగా తీసుకోమునిబంధనల ప్రకారం తానే టీమిండియాకు ట్రోఫీ అందజేస్తానంటూ మొహ్సిన్ నఖ్వీ ముందుకు వచ్చాడు. అయితే, అతడు కేవలం పీసీబీ, ఏసీసీ చీఫ్ మాత్రమే కాకుండా.. పాక్ మంత్రి కూడా కావడంతో భారత జట్టు అతడి చేతుల మీదుగా కప్ అందుకునేందుకు నిరాకరించింది.ఈ క్రమంలో ట్రోఫీతో పాటు.. మెడల్స్ కూడా తనతోపాటు ఎత్తుకెళ్లిన నఖ్వీ ఇంత వరకు వాటిని తిరిగి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవల నఖ్వీకి ఇ-మెయిల్ పంపింది. ట్రోఫీ తమకు అప్పగించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఐసీసీ వద్దే పంచాయతీ తేలుతుందిఅయినప్పటికీ నఖ్వీ బుద్ధి మారలేదు. తన చేతుల మీదుగానే ట్రోఫీ ఇస్తానని.. ఇందుకోసం బీసీసీఐ ఆటగాళ్లను తన దగ్గరకు పంపించాలంటూ అహంకారం ప్రదర్శించాడు. దీంతో ఐసీసీ వద్దే పంచాయతీ తేల్చుకునేందుకు బీసీసీఐ సిద్ధమైంది.తాజా సమాచారం ప్రకారం.. బీసీసీఐ వర్గాలు ANIతో మాట్లాడుతూ.. నఖ్వీ ట్రోఫీని ఏసీసీ ప్రధాన కార్యాలయం నుంచి తరలించాడని పేర్కొన్నాయి. ‘‘కొన్నిరోజుల క్రితం బీసీసీఐ అధికారి ఒకరు యూఏఈలో ఉన్న ఏసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు.మరింత దిగజారిన పీసీబీ చీఫ్ నఖ్వీ!... ఈసారి..ఏసీసీ ఆఫీస్‌లో ట్రోఫీ ఉందా అని ఆరా తీశారు. అయితే, స్టాఫ్ చెప్పిన సమాధానం విని ఆయన ఆశ్చర్యపోయారు. ట్రోఫీని ఇక్కడి నుంచి తరలించి.. అబుదాబిలో ఓ చోటు నఖ్వీ దాచిపెట్టాడని వాళ్లు చెప్పారు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో గెలిచిన జట్టు ట్రోఫీని ఎత్తుకెళ్లిన నఖ్వీ మరీ ఇంతలా దిగజారిపోతాడని అనుకోలేదంటూ నెటిజన్లు అతడిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.కాగా ఆసియా కప్-2025 టోర్నీలో లీగ్ దశలో పాక్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత్.. సూపర్-4 మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఫైనల్లో ఐదు వికెట్ల తేడాతో గెలిచి టైటిల్ కైవసం చేసుకుంది. చదవండి: అతడు అదరగొట్టాడు.. కాబట్టి నితీశ్ రెడ్డిపై వేటు పడొచ్చు: మాజీ కెప్టెన్ -
హీరోయిన్గా బిగ్‌బాస్ బ్యూటీ రతిక.. ఏకంగా మూడు భాషల్లో!
తెలుగు బిగ్‌బాస్ 7వ సీజన్లో పాల్గొని బాగా పాపులర్ అయింది రతిక (Rathika Ravinder). ఈ షోలో ఏకంగా రెండుసార్లు ఎంట్రీ ఇచ్చింది. అయినప్పటికీ తనపై వచ్చిన నెగెటివిటీ పోగొట్టుకోలేకపోయింది. ఇక సినిమాల్లో చిన్నాచితకా పాత్రలు వేసే రతికా హీరోయిన్గా నటిస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఎక్స్‌వై. సీవీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్రానా, అనిజ్ ప్రభాకర్, శ్రీధర్ ఇతర పాత్రలు పోషించారు. ఎంకే సాంబశివం నిర్మించిన ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో త్వరలో విడుదల కానుంది.సినిమాఇటీవల ఈ మూవీ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. పిజ్జా, సూదు కవ్వుమ్, ఇరుది సుట్రు వంటి ప్రయోగాత్మక చిత్రాలను నిర్మించడంతో పాటు మాయవన్ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సీవీ కుమార్. తాజాగా ఓ వైవిధ్యమైన కథాంశంతో ఆయన దర్శకత్వం వహించిన మరో ప్రయోగాత్మక చిత్రం ఎక్స్ వై. ఇదొక డిఫరెంట్ అండ్ న్యూ కంటెంట్ మూవీ అని ప్రేక్షకుల నుంచి కచ్చితంగా కితాబులు అందుకుంటుంది అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: హరిహరన్ ఆనందరాజా, సంగీతం: శ్రీకాంత్ కృష్ణ. చదవండి: ఆయేషాకు టైఫాయిడ్, డెంగ్యూ.. తనూజ కోసం వెక్కెక్కి ఏడ్చిన కల్యాణ్ -
లెక్క తప్పింది.. తెలంగాణ ఎక్సైజ్‌కు చుక్కెదురు!
సాక్షి, రంగారెడ్డి: ఆబ్కారీ శాఖ అంచనా తప్పింది. ఇబ్బడిముబ్బడిగా వచ్చే దరఖాస్తులతో దండిగా రాబడి ఉంటుందని భావించిన ఎక్సైజ్ శాఖకు చుక్కెదురైంది. ఆదాయంలో తేడా రాకున్నా.. దరఖాస్తుల నమోదులో మాత్రం భారీ వ్యత్యాసం కనిపించింది. గతంతో పోలిస్తే ఏకంగా పదివేల దరఖాస్తులు తక్కువ రావడంతో అధికారులను నివ్వెరపోయేలా చేసింది.అయితే, దరఖాస్తు ధర రూ.3 లక్షలు నిర్దేశించడంతో ఇది ఆదాయాన్ని గణనీయంగా పెంచింది. మద్యం షాపులకు దరఖాస్తుల సంఖ్య భారీగా పెరుగుతుందని అంచనా వేసింది. కానీ ఇందుకు భిన్నంగా 10,673 దరఖాస్తులు తక్కువ వచ్చాయి. కాగా, దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచడంతో ఆదాయం కొంత పెరిగినట్లు కన్పించినా.. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయ కిక్కు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం సహా దేశీయంగా రియల్ ఎస్టేట్, ఐటీ రంగాలు దెబ్బతినడం, అప్పటి వరకు ఆయా రంగాలపై ఆధారపడిన వాళ్లు ఉపాధిని కోల్పోయి రోడ్డున పడడం, ఇదే సమయంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడం, ఎన్నికల్లో ఖర్చుల కోసం అభ్యర్థులు తమ వద్ద ఉన్న కొద్ది మొత్తాన్ని భవిష్యత్ అవసరాల కోసం నిల్వ చేసి పెట్టుకోవడంతో ఔత్సాహిక వ్యాపారులకు మార్కెట్లో అప్పు దొరకని పరిస్థితి.అంతేకాదు షాపుల నిర్వహణ ఖర్చులు పెరగడం, ఎక్సైజ్ అధికారులకు ప్రతి నెలా గుడ్‌విల్ పేరుతో అదనపు చెల్లింపులు సైతం దరఖాస్తుల సంఖ్య తగ్గడానికి మరో కారణం. ప్రభుత్వం దరఖాస్తు ఫీజును పెంచడంతో మెజార్టీ వ్యాపారులు వైన్స్ టెండర్లను భారంగా భావించారు. అప్పటి వరకు పదుల సంఖ్యలో దరఖాస్తు చేసినవారు.. ప్రస్తుతం ఒకటి రెండు షాపులకే పరిమితమయ్యారు. ఫలితంగా ప్రభుత్వం మద్యం షాపుల టెండర్ల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. 2023–25లో గ్రేటర్ జిల్లాల్లోని ఏడు డివిజన్ల పరిధిలో మొత్తం 45,631 దరఖాస్తులు రాగా, రూ.906.62 కోట్ల ఆదాయం సమకూరింది. 2025–27 ఆర్థిక సంవత్సరంలో 639 మద్యం షాపులకు నిర్వహించిన టెండర్లలో 34,958 దరఖాస్తులే వచ్చాయి. ఫీజు పెంపు కారణంగా రూ.1,048.74 కోట్ల ఆదాయం సమకూరింది. ఇదిలా ఉంటే ఆయా మద్యం దుకాణాలకు ఈ నెల 27న ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ల సమక్షంలో లక్కీడ్రా నిర్వహించనున్నారు. -
డిజైన్ లోపంతోనే మరణ మృదంగం
సాక్షి, అమరావతి : స్లీపర్ బస్సుల డిజైన్ లోపమే ప్రయాణికుల పాలిట మరణమృదంగం మోగిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలకు, ప్రధానంగా రాత్రి వేళల్లో ప్రయాణానికి స్లీపర్ బస్సుల డిజైన్ ఎంతమాత్రం అనుకూలం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బస్ ఆపరేటర్లు లాభాపేక్షతో ఏఐఎస్ ప్రమాణాలను బేఖాతరు చేస్తుండటం సామాన్య ప్రయాణికుల పాలిట యమపాశంగా మారుతోంది. కర్నూలు జిల్లాలో 19మంది సజీవ దహనమైన కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం మరోసారి స్లీపర్ బస్సుల్లో భద్రతా లోపాలను వెలుగులోకి తెచ్చింది. కాగా చైనా, జర్మనీతోపాటు పలు యూరోపియన్ దేశాలు స్లీపర్ బస్సులను నిషేధించిన విషయాన్ని నిపుణులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ట్యాంకు, బ్యాటరీ పక్క పక్కనే.. ఫ్యూయల్ ట్యాంకు, బ్యాటరీ కాంపోనెంట్ పక్కపక్కనే ఉండటం స్లీపర్ బస్సుల డిజైన్‌లో ప్రధానలోపం. దాంతో ఏదైనా ప్రమాదం సంభవిస్తే తక్షణం మంటలు చెలరేగి బస్సు కేవలం కొన్ని నిముషాల్లోనే దగ్ధమైపోతోంది. 2023లో తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా పాలెంలో బస్సుప్రమాదం తీవ్రత పెరగడానికి అదే కారణమని దర్యాప్తులో వెల్లడైంది. కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున సంభవించిన ప్రమాద తీవ్రతకు కూడా అదే కారణమై ఉంటుందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. సీజీ లోపం.. బోల్తా కొడుతున్న బస్సులు స్లీపర్ బస్సుల్లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ(సీజీ) సక్రమంగా లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బరువైన ఇంజిన్, చాసిస్ అట్టడుగున ఉండటంతో సీజీ తక్కువగా ఉంటోంది. అప్పర్ బెర్త్‌లపైకి ప్రయాణికులు చేరుకోగానే సీజీ పెరిగి బస్సు స్థిరత్వం తగ్గుతుంది. ఇక నిర్దేశిత ప్రమాణాల కంటే స్లీపర్ బస్సులు ఎత్తు ఎక్కువగా ఉంటున్నాయి. దాంతో కూడా సీజీ తగ్గుతోంది. బస్సు ఇరుకైన మలుపుల్లో తిరుగుతున్నప్పుడు, రోడ్డుపై ఏదైనా హఠాత్తుగా అడ్డం వస్తే బ్రేక్ వేయగానే బస్సు వెంటనే అదుపు తప్పి బోల్తా పడుతోంది. తప్పించుకునేందుకు ఐదు నిమిషాలే సమయం.. స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే తప్పించుకునేందుకు గరిష్టంగా ఐదారు నిమిషాలే సమయం ఉంటుంది. ఆ అయిదు నిమిషాల్లో బస్సులో ఉండే 35 నుంచి 50 మంది ప్రయాణికులు తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. బస్సుకు అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే తలుపులు లాక్ అయిపోతాయి. ప్రయాణికులు అందరూ వెనుక వైపు నుంచే బయటకు రావాల్సి ఉంటుంది. అయిదు నిముషాల్లో ప్రయాణికులు అందరూ బయటపడటం కష్టసాధ్యం. ఇరుకైన మార్గం స్లీపర్ బస్సుల్లో ప్రయాణికులు అటూ ఇటూ వెళ్లేందుకు రెండు వైపులా ఉండే బెర్త్‌ల మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది. ఓ వైపు రెండు బెర్త్‌లు మరో వైపు ఒక బెర్త్‌తో సీట్లు ఉంటాయి. సాధాణంగా ఒక స్లీపర్ బస్సులో 33 నుంచి 36 బెర్త్‌లు ఉంటాయి. మల్టీ యాక్సెల్ బస్సుల్లో 36 నుంచి 40 బెర్త్‌ల వరకు ఏర్పాటు చేస్తారు. ఆ బెర్త్‌ల మధ్య ఒక వ్యక్తి మాత్రమే అదీ నెమ్మదిగా నడిచేందుకు అవకాశం ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లోనే ఒకేసారి ఇద్దరు మనుషులు నడిచేందుకు అవకాశం ఉండదు. అటువంటిది ఏదైనా ప్రమాదం సంభవిస్తే ప్రయాణికుల కంగారు, ఆందోళనతో ఒకేసారి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించి ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాటకు దారితీస్తుంది. దాంతో మృతుల సంఖ్య పెరుగుతుంది. డ్రైవర్లకు మగత... స్లీపర్ బస్సులు ఉదయం వేళల్లో ప్రయాణానికి డిజైన్ చేసినవి. రాత్రి వేళల్లో ప్రయాణానికి ఉద్దేశించినవి కావు. రాత్రి వేళల్లో స్లీపర్ బస్సులు ప్రయాణిస్తున్నప్పుడు స్లీపర్బస్సుల్లో వాతావరణం చాలా నిశ్శబ్ధంగా ఉంటుంది. దీనికి తోడు చుట్టూ చీకటి, బస్సు అత్యంత వేగంతో దూసుకుపోతుండటంతో డ్రైవర్లను మగత కమ్మేస్తుంది. ముఖ్యంగా రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు తమకు కొంత మగత కమ్ముతుందని 2018లో కేంద్ర రవాణాశాఖ నిర్వహించిన సర్వేలో కొందరు డ్రైవర్లు చెప్పడం గమనార్హం. చైనా, జర్మనీలలో నిషేధం డిజైన్ లోపం కారణంగా స్లీపర్ బస్సులను పలు దేశాలు ఇప్పటికే నిషేధించాయి. చైనా 13 ఏళ్ల క్రితమే స్లీపర్ బస్సును నిషేధించడం గమనార్హం. 2009 నుంచి 2012 మధ్య చైనాలో స్లీపర్ బస్సుల ప్రమాదాల్లో ఏకంగా 252 మంది మరణించారు. అన్ని ప్రమాదాలూ తెల్లవారు జామున 2 గంటల నుంచి ఉదయం 5గంటల మధ్యే సంభవించాయి. స్లీపర్ బస్సులపై అధ్యయనంలో నిపుణులు వాటి డిజైన్ లోనే లోపం ఉందని గుర్తించారు. ఆ వెంటనే చైనా ప్రభుత్వం స్లీపర్ బస్సుల రిజి్రస్టేషన్‌ను నిలిపివేసింది. జర్మనీ 2006లోనే స్లీపర్ బస్సులను నిషేధించింది. జర్మనీతోపాటు పలు యూరోపియన్ దేశాలు స్లీపర్ బస్సులను నిషేధించాయి. ఇష్టానుసారం మార్పులు» బస్ ఆపరేటర్ల లాభాపేక్ష కూడా ప్రమాదాలలను మరింత పెంచుతోంది. స్లీపర్ బస్సుల భద్రతా ప్రమాణాల కోసం ‘ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్–119 (ఏఐఎస్ 119) ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. కానీ బస్ ఆపరేటర్లు ఆ ప్రమాణాలకు విరుద్ధంగా బస్సుల బాడీ బిల్డింగ్ చేస్తున్నారు. » ప్రమాదం సంభవిస్తే ప్రయాణికులు వెంటనే తప్పించుకునేందుకు స్లీపర్ బస్సుల్లో కనీసం 4 అత్యవసర ద్వారాలు (ఎమర్జెన్సీ విండో) ఉండాలి. అందులో రెండు పైకప్పు నుంచి బయటకు వచ్చేందుకు వీలుగా ఉండాలి. కానీ బస్ ఆపరేటర్లు స్లీపర్ బస్సుల్లో ఒకట్రెండు ఎమర్జెన్సీ విండోలే ఏర్పాటు చేస్తున్నారు. పైకప్పు నుంచి బయటకు వచ్చేందుకు ఒక్క ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఏర్పాటు చేయడం లేదు. » బస్సులో కింది బెర్త్ కనీసం 350 ఎంఎం ఎత్తులో ఉండాలి. కానీ 150 ఎంఎం నుంచి 200 ఎంఎం ఎత్తులోనే కింది బెర్త్‌ను ఏర్పాటు చేస్తున్నారు. » బస్సులో మండే స్వభావం అతి తక్కువగా ఉండే మెటీరియల్ మాత్రమే వాడాలి. ఈ నిబంధనను బస్సు ఆపరేటర్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. బెర్త్ కవర్లు నుంచి కర్టెన్లు, ఇతర వస్తువులన్నీ త్వరగా మండే స్వభావం ఉన్న మెటీరియల్‌తోనే తయారు చేస్తున్నారు. దాంతో అగ్ని ప్రమాదం సంభవిస్తే అగ్ని కీలలు వేగంగా బస్సంతా వ్యాపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైన బస్సులో ఇనుప ఉచలు మినహా పూర్తిగా దగ్ధం కావడమే అందుకు ఉదాహరణ. » ప్రమాదం సంభవిస్తే కిటికీ అద్దాలు పగులగొట్టేందుకు ప్రతి సీటు వద్దా ప్రమాణిక సుత్తి ఉండాలి. కానీ బస్ ఆపరేటర్లు వాటిని ఏర్పాటు చేయడం లేదు. ఇటీవల జరిగిన కొన్ని స్లీపర్ బస్సుల ప్రమాదాలు..» 2022 అక్టోబరులో మహారాష్ట్రలో వరత్నాయి నుంచి ముంబాయి వెళుతున్న బస్సు అగ్ని ప్రమాదానికి గురైన ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. » 2023, జులై 1న మహారాష్ట్రలో ఓ స్లీపర్ బస్సు హైవే డివైడర్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో 25 మంది మృత్యువాత పడ్డారు.» 2023లో రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న బస్సు గురుగ్రాం వద్ద ప్రమాదానికి గురై 25 మంది మృతి చెందారు. » 2023లో తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన స్లీపర్ బస్సు ప్రమాదంలో 45 మంది దుర్మరణం చెందారు. -
రూ. వెయ్యి కోసం చంపేశారు
రంగారెడ్డి జిల్లా: డబ్బు కోసం స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసింది. ముగ్గురు స్నేహితులు కలిసి మరో స్నేహితుడిని హత్య చేసిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ నరేందర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... మైలార్‌దేవ్‌పల్లి వట్టెపల్లి ప్రాంతానికి చెందిన అఫ్రోజ్ (25) ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి అతను తన స్నేహితులు సోహెల్, అబ్బు, రిజ్వాన్‌లతో కలిసి అర్ధరాత్రి వరకు గడిపాడు. ఈ సమయంలో స్నేహితుల మధ్య డబ్బు విషయమై చోటు చేసుకున్న వివాదం ఘర్షణకు దారి తీసింది. రూ.వెయ్యి కోసం చెలరేగిన గొడవ దాడి వరకు వెళ్లింది. దీంతో ముగ్గురు స్నేహితులు కలిసి అఫ్రోజ్‌పై కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి కుప్పకూలాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా అతను అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. -
భారత్... నాలుగేళ్లలో అమెరికాను దాటేస్తుంది!
సాక్షి, హైదరాబాద్: సైన్స్ టెక్నాలజీ రంగాల్లో వేగంగా ఎదుగుతున్న భారతదేశం ఇంకో నాలుగేళ్లలోనే విజ్ఞాన శాస్త్ర ప్రచురణల్లో అమెరికాను అధిగమించే అవకాశం ఉందని ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ అధ్యాపకుడు డా.జాన్ పి.ఏ.ఇయోనిడిస్ స్పష్టం చేశారు. ప్రస్తుతం మూడోస్థానంలో ఉన్న భారత్ వృద్ధిరేటును ఇదే స్థాయిలో కొనసాగిస్తే ఇది సాధ్యమేనని తెలిపారు. హైదరాబాద్ సమీపంలోని వోక్సెన్ యూనివర్శిటీ ఐదవ స్నాతకోత్సవానికి ప్రపంచ ప్రసిద్ధ గ్రీకు-అమెరికన్ వైద్య శాస్త్రవేత్త, రచయిత ప్రొఫెసర్ ఇయోనిడిస్ హాజరయ్యారు. స్నాతకోత్సవం సందర్భంగా, వోక్సెన్ యూనివర్శిటీకి చెందిన బిజినెస్, టెక్నాలజీ, ఆర్ట్స్ అండ్ డిజైన్, లిబరల్ ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీస్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్‌లకు చెందిన సుమారు 800 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. శాస్త్ర, పరిశోధన రంగాలకు అందించిన సేవలకు గుర్తింపుగా వోక్సెన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఇయోనిడిస్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. వర్శిటీ ఛాన్సలర్ ప్రవీణ్ కె.పూలా ఈ డాక్టరేట్‌ను ప్రొఫెసర్ ఇయోనిడిస్‌కు అందించారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఇయోనిడిస్ మాట్లాడుతూ..“ప్రపంచం సాంకేతికంగా ఎంత పురోగమించినప్పటికీ ఈ రోజుకూ సుమారు 400 కోట్లమంది రోజుకు వెయ్యి రూపాయల్లోపు ఆదాయంతో జీవిస్తున్నారు. ఇంకో 70 కోట్ల మంది రెండు వందల రూపాయల కంటే తక్కువ ఆదాయంతో బతుకుతున్నారు. పర్యావరణ కాలుష్యం, మద్యం, మత్తు పదార్థాలు, నివారించగల వ్యాధులతో ఏటా కోట్లాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితి మానవత్వానికే ఒక సవాలు’’ అన్నారు. అందుకే మానవ పురోగతిని సాంకేతిక ఆవిష్కరణలతో, యుటోపియన్ కలలతో కొలవలేవమని, ప్రతి మనిషికి గౌరవం, బాధ్యత, విలువను జోడించడమే అసలైన పురోగతి అని స్పష్టం చేశారు. శాస్త్రరంగంలో భారతదేశం సాధించిన అద్భుత పురోగతిని ప్రశంసిస్తూ “పరిశోధన పత్రాల ప్రచురణలో భారత్ ఇప్పటికే ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. ఇదే వృద్ధి కొనసాగితే 2029 నాటికి అమెరికాను అధిగమించగలదు. శాస్త్ర ఆవిష్కరణలు మొదలుకొని ఆర్థిక వ్యవస్థ విస్తరణ వరకూ అన్నింటినీ అర్థవంతంగా, అవసరమైనంతగా సాధించవచ్చునని భారత్ రుజువు చేస్తోంది’’ అన్నారు. వోక్సెన్ విశ్వవిద్యాలయ పట్టభద్రులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘మీ ప్రయాణం ఈ రోజు ముగియదు. ఇదొక కొత్త ఆరంభం. భవిష్యత్తును మలచగల అద్భుత అవకాశం మీ చేతుల్లో ఉంది. మీ విజయానికి నైతికతను, మీ లక్ష్యాలకు మానవతను, మీ పురోగతికి సామాజిక బాధ్యతను జోడించండి.” అని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ ఇయనిడిస్ అత్యంత ప్రభావవంతమైన వైద్య పరిశోధకులలో ఒకరిగా గుర్తింపు పొందారు. 2005లో ప్రచురించిన ఆయన ప్రసిద్ధ పేపర్ “ వై మోస్ట్ పబ్లిష్డ్ రీసెర్చ్ ఫైండింగ్స్ ఆర్ ఫాల్స్” ప్రపంచ వైద్య శాస్త్ర రంగంలో అత్యధికంగా ఉటంకించబడిన పరిశోధనలలో ఒకటి. వోక్సెన్ యూనివర్శిటీ ఛాన్సలర్ ప్రవీణ్ కె. పులా మాట్లాడుతూ “ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, క్రీడా వేదికలతో కూడిన విశ్వవిద్యాలయాన్ని నిర్మించాలన్న లక్ష్యం నుంచి వోక్సెన్ పుట్టింది. నిజమైన విజయం ఓపిక, కృషి, దృష్టి, మరియు జట్టు పనితీరుతో వస్తుంది. విజయం వ్యక్తిగతం కాదు, సార్వజనీనమైనది. విద్యార్థులారా, మీరు చేసే పనిపట్ల అభిరుచి కలిగి ఉండండి, ఓపికను కోల్పోకండి, ఎల్లప్పుడూ ‘మానవ విలువలకు ప్రాధాన్యమివ్వండి.” అన్నారు.ఈ సందర్భంగా వోక్సెన్ యూనివర్శిటీ వార్షిక నివేదిక 2025ను రిజిస్ట్రార్ అభిజిత్ శిరోద్కర్ విడుదల చేశారు. ఈ నివేదికలో 450కి పైగా పరిశోధన పత్రాలు, 60+ పేటెంట్లు, 190కు పైగా అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాలు, 25కు పైగా విదేశీ అకడమిక్ ప్రతినిధి బృందాల సందర్శనలు, అలాగే జపాన్‌కి చెందిన సన్వా సప్లై సంస్థ నుండి వచ్చిన కోటి యెన్ ఎండోమెంట్ వంటి ప్రధాన విజయాలను వివరించారు.రిజిస్ట్రార్ అభిజిత్ శిరోద్కర్ మాట్లాడుతూ “భారత ఉన్నత విద్య వ్యవస్థ పునర్నిర్మాణమే లక్ష్యంగా వోక్సెన్ ముందుకు సాగుతోంది. అత్యున్నత విద్యా ప్రమాణాలు, వాస్తవిక దృక్పథంతో కూడిన పాఠాలు, అంతర్జాతీయంగా గుర్తింపు.. అందరినీ కలుపుకు పోవడం అన్న నాలుగు ప్రాథమిక విలువల ఆధారంగా ముందుకు వెళుతున్నాం. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 18 శాతం మంది ఎక్కువ విద్యార్థులు చేరారు. కొత్తగా 45 అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఏర్పడ్డాయి. క్యాంపస్ ప్లేస్మెంట్లలోనూ 163 అగ్రస్థాయి రిక్రూటర్లు పాల్గొన్నారు, వాటిలో 98 శాతం పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలు. ఎంబీఏ గ్రాడ్యుయేట్ల సగటు జీతం రూ.9.9 లక్షలుగా ఉంది. బీటెక్, బీబీఏ ప్రోగ్రామ్‌లు కూడా బలమైన వృద్ధిని చూపాయి.” అని తెలిపారు. -
Jubilee Hills bypoll: ముగ్గురికీ సవాలే!
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 11న జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీల్లోని ముగ్గురు ముఖ్య నేతలకు ప్రతిష్టాత్మకంగా మారింది. తమ పార్టీని గెలిపించే బాధ్యత వీరి భుజస్కంధాలపై ఉంది. దీంతో ముగ్గురూ ఈ ఎన్నికను ఆషామాïÙగా తీసుకోవడం లేదు. తమకిది ఓ సవాల్‌గా భావించి సత్తా చాటుకోవాలనుకుంటున్నారు. అంతేకాదు, వారికీ ఎన్నిక చాలా అవసరమని.. వారి నాయకత్వానికి లిట్మస్టెస్ట్గా మారనుందని రాజకీయ పరిశీలకులు సైతం భావిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఎంతో కీలకం కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు ఎంతో అవసరం. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చాక దాదాపు రెండేళ్లకు జరుగుతున్న ఎన్నిక కావడంతో ఆయన పని తీరుకు గీటురాయి కానుంది. ఆయన పాలన తీరుకు ప్రజలిచ్చే తీర్పుగానే చాలామంది భావిస్తున్నారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక కంటోన్మెంట్‌కు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచినప్పటికీ, రేవంత్ సీఎం అయ్యాక స్వల్ప సమయంలోనే ఆ ఎన్నిక జరిగినందున దానిని ఆయన పనితీరుకు నిదర్శనమనలేదు. ఇప్పుడు మాత్రం ఆయన పాలనకు ప్రజలిచ్చే మార్కులుగా పరిగణిస్తున్నారు. 2023లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక జరుగుతుండటం తెలిసిందే. ఈ సీటును గెలుచుకుంటే నగరంలోనే సీఎంతో పాటు పార్టీ పట్టు బలపడుతుంది. అంతే కాదు.. రేవంత్‌రెడ్డి మోడల్(వెల్ఫేర్+డెవలప్మెంట్)కు విలువ పెరుగుతుంది. ఓటమి ఎదురైతే, అమలు కాని హామీలు (మహిళలకు నెలకు రూ.2500, తులం బంగారం తదితర స్కీమ్స్) ఇచ్చారనే పేరు మూటగట్టుకోవాల్సి వస్తుంది. ప్రజల నుంచి విమర్శల దాడి మరింత తీవ్రమవుతుంది. గెలిస్తే రాష్ట్రవ్యాప్తంగానూ ఉత్సాహంతో లోకల్‌బాడీ ఎన్నికలకు పార్టీకి మంచి బూస్ట్‌గా మారనుంది. కేటీఆర్‌కు సరై్వవల్ టెస్ట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు జూబ్లీహిల్స్‌లో గెలుపు ఎంతో అవసరం. తమ పార్టీ సిట్టింగ్ సీటు కావడంతో ఒక రకంగా చెప్పాలంటే ‘సర్వైవల్ టెస్ట్’. గెలిస్తే, కేటీఆర్ ప్రో–అర్బన్ ఇమేజ్ (యువత, ఐటీ సెక్టార్) బలపడుతుంది. కేటీఆర్ ప్రచారం చేస్తున్న బుల్డోజర్ రాజ్, హైడ్రా డెమాలిషన్స్, పవర్ కట్స్ వంటి వాటికి ప్రజలు మద్దతిచ్చారని భావించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ఫెయిలయిందని చెప్పేందుకూ ఇంతకు మించిన అవకాశం లేదు. కేటీఆర్ రాజకీయ సామర్థ్యానికీ నిదర్శనంగా మారనుంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పరిమితమైనప్పటి నుంచీ పార్టీ వ్యవహారాలన్నీ కేటీఆరే చూస్తున్నారు. పార్టీ ఫ్యూచర్‌కు కూడా కీలకం. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని పలువురు నేతలు పార్టీని వీడారు. ఓటమిపాలైతే పారీ్టలో మిగిలే వారు బహుశా ఉండకపోవచ్చు. కేటీఆర్ లీడర్ ప్పైనా ప్రశ్నలు వెల్లువెత్తే అవకాశముంది. అందుకే కేటీఆర్ సైతం వీటిని తేలిగ్గా తీసుకోలేదు. బూత్‌స్థాయి నేతలతో సమావేశమవుతున్నారు. డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ విజయయాత్ర తిరిగి ఇక్కడి నుంచే అని చెబుతున్నారు. గెలిస్తే సక్సెస్ స్టార్‌గా కేటీఆర్ నిలుస్తారు. కిషన్‌రెడ్డికి అవశ్యం.. బీజేపీ అభ్యర్థి గెలవడం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అవసరం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ కిషన్‌రెడ్డి గెలిచిన సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోనే ఉంది. ఓడితే పార్టీ దిగజారుతుంది. ఇప్పటికే పార్టీ బహిష్కృత నేత రాజాసింగ్ వ్యంగ్యా్రస్తాలు సంధించారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను గెలిపిస్తారా? బీఆర్ఎస్ను గెలిపిస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. కిషన్‌రెడ్డి ఎన్నిసార్లు కేంద్రమంత్రి అయినప్పటికీ హైదరాబాద్‌కు చేసిందేమీలేదని ప్రతిపక్ష పారీ్టలు ఇప్పటికే విమర్శిస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బీజేపీకి వచ్చినన్ని ఓట్లకన్నా ఓట్లు పెరిగితే గుడ్డిలో మెల్ల. ఇంకా తగ్గితే కిషన్‌రెడ్డి ఇమేజ్ దిగజారుతుంది. -
పూజా హెగ్డేకు రూ. 5 కోట్లా..?
సక్సెస్ వల్ల ఇమెజ్ వస్తుంది. ఆ ఇమేజ్ను వాడుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. అలాంటప్పుడు తెరపైకి వచ్చే మొదటి విషయం పారితోషకం. సాధారణంగా ఇప్పుడు హీరోయిన్ల పారితోషకం రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకూ ఉంటోంది. అది వారి ఇమేజ్ను బట్టి పెరగొచ్చు, తగ్గొచ్చు. అయితే క్రేజ్ ఉన్న హీరోయిన్లు ప్రత్యేక పాటలో నటించడానికి పారితోషికాన్ని కాస్త ఎక్కువగానే డిమాండ్ చేస్తుంటారు. చాలా మంది హీరోయిన్లు ప్రత్యేక పాటలో నటిస్తూ పారితోషకాన్ని అధిక మొత్తంలో పుచ్చుకుంటున్నారు. ఇందుకు పూజా హెగ్డే అతీతం కాదు. ఈ అమ్మడు ఇంతకుముందు తెలుగులో రంగస్థలం చిత్రంలో జిల్జిల్జిగేలు రాజా అనే ఐటమ్ సాంగ్‌లో నటించి బాగా పాపులర్ అయ్యారు. ఆ తరువాత కూలీ చిత్రంలో మోనికా పాటలో నటించి అందరిని అలరించారు. తాజాగా మరో భారీ చిత్రంలో ప్రత్యేక పాటలో చిందేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే 5, 6 మంది హీరోయిన్లు నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో దీపికా పడుకొనే, జాన్వీకపూర్, మృణాల్‌ఠాకూర్, రష్మిక మందన్నా వంటి స్టార్ హీరోయిన్ల పేరు చోటు చేసుకున్నట్లు సమాచారం. తాజాగా ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాటలో పూజాహెగ్డేను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. 5నిమిషాలపాటు సాగే ఈ పాటలో నటించడానికి ఈ అమ్మడు రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇకపోతే ఈ మధ్య అవకాశాలు లేని ఈ బ్యూటీ ఇప్పుడు మళ్లీ బిజీ అవుతున్నారు.
