breaking news
-
YSRCPలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు.. పార్టీ జాతీయ అధికార ప్రతినిధులుగా మాజీ ఎంపీ మార్గాని భరత్ (రాజమండ్రి), యల్లాప్రగడ కార్తీక్ (మండపేట)లను నియమించారు.కాగా, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా నియమించిన సంగతి తెలిసిందే. రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి, ప్రతి జోన్‌కు ఒక ప్రెసిడెంట్‌ను నియమించారు. జోన్–1కి.. విశాఖ జిల్లాకు చెందిన చెన్నా జానకిరామ్ నియమితులయ్యారు. జోన్–2కి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన విప్పర్తి వేణుగోపాల్ నియమితులయ్యారు. జోన్ –3కి ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నట్ట యోనారాజు నియమితులయ్యారు.జోన్-4కి తిరుపతి జిల్లాకు చెందిన నల్లని బాబు నియమితులయ్యారు. జోన్ –5కి వైఎస్సార్ జిల్లాకు చెందిన పులి సునీల్‌కుమార్ నియమితులయ్యారు. అలాగే కాకినాడ జిల్లాకు చెందిన ఎ.లక్ష్మీశివకుమారిని వైఎస్సార్సీపీ రాష్ట్ర అంగన్వాడీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా(జోన్ –2కు)గా, తిరుపతి జిల్లాకు చెందిన ఎస్.రామచంద్రారెడ్డిని రాష్ట్ర ఐటీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్(జోన్–4)గా, తిరుపతి జిల్లాకు చెందిన దువ్వూరు మునిశేఖర్‌రెడ్డిని రాష్ట్ర ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్(జోన్–4)గా నియమించారు.పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లుగా విశాఖ జిల్లాకు చెందిన ద్రోణంరాజు శ్రీవత్సవ(జోన్ –1), కాకినాడ జిల్లాకు చెందిన తోట రాంజీ(జోన్–2), ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎ.రవిచంద్ర(జోన్–3), చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి(జోన్–4), అనంతపురం జిల్లాకు చెందిన వై.ప్రణయ్‌రెడ్డి(జోన్–5) నియమితులయ్యారు. ఎనీ్టఆర్ జిల్లాకు చెందిన వి.ఈశ్వర్‌ప్రసాద్‌ను రాష్ట్ర వాణిజ్య విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్(జోన్–3)గా నియమించారు. ఈ మేరకు కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. -
పెయింట్ కోసమే రూ.13 లక్షలు.. ఈ బైక్ ధర ఎంతో తెలుసా?
సాధారణంగా సుజుకి హయబుసా ధర కొంత ఎక్కువగానే ఉంది. అలాంటి ఈ బైకును బంగారంతో తయారు చేస్తే.. దాని ధర ఇంకెంత ఉంటుందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఒక మోటార్ ఈవెంట్లో బంగారు హయాబుసా కనిపించింది.బంగారు హయాబుసాకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని ధర అక్షరాలా రూ.1.67 కోట్లు అని సమాచారం. ఈ బైకులో చాలా వరకు గోల్డ్ బాడీవర్క్ జరిగి ఉండటాన్ని గమనించవచ్చు. ఇందులో వజ్రాలను కూడా ఉపయోగించారు. కాగా బోల్టులు కూడా బంగారమే కావడం గమనార్హం.ఇక్కడ కనిపించే బైకుకు వేసిన గోల్డ్ లీఫ్ పెయింట్ కోసం మాత్రమే రూ. 13.3 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ పెయింట్ వర్క్ మొత్తాన్ని.. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆటోమోటివ్ కళాకారులలో ఒకరైన మిస్టర్ డానీ పూర్తిచేశారు.ఇదీ చదవండి: అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం: 63వేల కార్లపై ఎఫెక్ట్!గోల్డ్ హయబుసా వెనుక టైరు.. పరిమాణంలో బుగట్టి కారు కంటే పెద్దదిగా ఉంది. కాగా ఇది 400 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే ఇంజిన్ కలిగి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో ఆటోమొబైల్ ఔత్సాహికులను తెగ ఆకట్టుకుంటోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Tharesh Kumar (@tharesh_kumar) -
అల్లు అర్జున్ స్పెషల్ వీడియో.. రెండు లారీల థాంక్స్ చెప్పిన నాగ్
తెలుగు ఇండస్ట్రీలో కొత్త శకానికి నాంది పలికిన సినిమా శివ (Shiva Movie). రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) హీరోగా నటించిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. తాజాగా ఈ సినిమా నవంబర్ 14న రీరిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక వీడియో విడుదల చేశాడు. మన శివ మూవీ రిలీజ్ అయి దాదాపు 36 ఏళ్లవుతోంది. తెలుగు సినీ చరిత్రలోనే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలోనూ ఇదొక ఐకానిక్ సినిమాగా నిలిచింది.రెండు లారీల పేపర్స్ఈ క్లాసిక్ సినిమాను సెలబ్రేట్ చేసుకునే సమయం వచ్చింది. ఈసారి థియేటర్స్‌కు రెండు లారీల పేపర్స్ తీసుకెళ్లండి అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను నాగార్జున షేర్ చేస్తూ.. డియర్ అల్లు అర్జున్ (Allu Arjun), నీకు రెండు లారీల థాంక్స్ అని ట్వీట్ చేశాడు. కాగా శివ సినిమాలో అమల హీరోయిన్గా నటించింది. 1989 అక్టోబర్ 5న రిలీజైన ఈ సినిమాకు అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మాతలుగా వ్యవహరించగా ఇళయరాజా సంగీతం అందించారు. ఇది తెలుగులో సెన్సేషన్ హిట్ అవడంతో శివ(1990) పేరుతోనే హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా హిట్ అందుకున్నాడు ఆర్జీవీ. Dear @alluarjun rendu lorryla thanks to you !!!💥💥💥#Shiva4KOnNovember14th #50YearsOfAnnapurna #SHIVA #ANRLivesOn@RGVzoomin @amalaakkineni1 @ilaiyaraaja @AnnapurnaStdios #SGopalReddy @adityamusic pic.twitter.com/5FSZAyqpp5— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 25, 2025చదవండి: సౌత్ సినిమాలు ఇప్పటికైనా చూస్తున్నారు: ప్రియమణి -
ఓటర్ల జాబితా సవరణపై సమీక్ష.. తెలంగాణలో SIR
హైదరాబాద్, రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న ప్రత్యేక విస్తృత ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision–SIR) కార్యక్రమంపై సన్నాహాలను ముఖ్య ఎన్నికల అధికారి సి. సుధర్శన్ రెడ్డి శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు (DEOs), నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారులు (EROs)*తో సమీక్షించారు.ఈ సందర్భంగా సీఈఓ సుధర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక విస్తృత సవరణలో భాగంగా చేపట్టాల్సిన అన్ని కార్యక్రమాలు నిర్ణీత గడువులో పూర్తిచేయాలని, ముఖ్యంగా టేబుల్‌టాప్ వ్యాయామం వంటి పెండింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ వారీగా పురోగతిని సమీక్షిస్తూ, ఖచ్చితమైన , లోపరహిత ఓటర్ల జాబితా తయారీపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.తదుపరి సమీక్షా సమావేశం నవంబర్ 1, 2025న వీడియో కాన్ఫరెన్స్ రూపంలో నిర్వహించబడనుందని, అప్పటికి అన్ని పనులు పూర్తవ్వాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, ఉప ముఖ్య ఎన్నికల అధికారి హరి సింగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఇటీవల సుధర్శన్ రెడ్డి ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన రెండు రోజుల జాతీయ సమావేశంలో పాల్గొన్నట్లు తెలిసింది. ఆ సమావేశంలో ఎన్నికల జాబితా నిర్వహణలో సాంకేతికత వినియోగం, పారదర్శకత పెంపు, ఓటర్ల సేవల మెరుగుదల మరియు ఉత్తమ పద్ధతుల అమలు వంటి అంశాలపై చర్చలు జరిగాయి.సీఈఓ సుధర్శన్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా, తప్పులేని, సమగ్ర ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం ఎన్నికల శాఖ యొక్క ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇదీ చదవండి:తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్ -
గురువులకు కఠిన పరీక్ష!
సాక్షి, అమరావతి: సర్వీస్‌లో ఉన్నవారికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణపై ఉపాధ్యాయుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తమకు టెట్ ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలల్లో టీచర్లుగా పనిచేస్తున్నవారికీ టెట్ తప్పనిసరి అని, పదోన్నతులకు ఈ పరీక్ష విధిగా ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న తీర్పునిచ్చింది. సర్వీస్‌లో ఉన్నవారు సైతం రెండేళ్ల కాలంలో టెట్ పాస్ కావాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా 2011 నుంచి టెట్ అమల్లోకి వచ్చింది. అయితే, దీనికి ముందే సర్వీసులో చేరిన ఉపాధ్యాయులకు, అన్ని మేనేజ్మెంట్ స్కూళ్లలోని వారికి కూడా తమ తీర్పు వర్తిస్తుందని సుప్రీం పేర్కొంది. ఉద్యోగ విరమణకు ఐదేళ్ల కంటే తక్కువ సర్వీసు ఉన్నవారికి మినహాయింపు ఇచ్చింది. దీంతో ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో కలవరం మొదలైంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ‘సుప్రీం’ తీరుపై తమ వైఖరి ప్రకటించాయి. రివ్యూ పిటిషన్లు సైతం దాఖలు చేశాయి. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నందున, కేంద్రం దీనిపై చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఏపీలో మాత్రం ఇదేమీ లేకుండా నేరుగా టెట్–2025 (అక్టోబర్) నిర్వహణకు షెడ్యూల్ ఇవ్వడం, ఇన్ సర్వీస్ టీచర్లు సైతం రాయాలని ఉత్తర్వులు జారీ చేయడం తీవ్ర గందరగోళానికి దారి తీస్తోంది. రాష్ట్రంలోని అన్ని మేనేజ్మెంట్ పాఠశాలల్లో సుమారు 2.87 లక్షల మంది, ప్రభుత్వ పాఠశాలల్లో 1.87 లక్షలమంది ఉపాధ్యాయులున్నారు. 2008 వరకు జరిగిన డీఎస్సీలకు టెట్ లేదు. దీనికిముందు విధుల్లో చేరిన లక్షమంది పైగా ఉపాధ్యాయులు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వచ్చే రెండేళ్లలో టెట్ పూర్తి చేయాలి. అయితే, ఐదేళ్లలో ఉద్యోగ విరమణ చేసే ప్రభుత్వ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చినా వీరికి పదోన్నతులకు అర్హత ఉండదు. ఇలా 1986, 1989 డీఎస్సీల ద్వారా ఉద్యోగాల్లో చేరి ఐదేళ్లలో రిటైర్ కానున్నవారు 32 వేల మంది వరకు ఉండగా, మిగిలిన 1.30 లక్షల మంది తప్పనిసరిగా టెట్ రాయాల్సిందే. సుప్రీం తీర్పుపై రివ్యూకు వెళ్లాలని గత రెండు నెలల్లో అనేకసార్లు ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తులు చేశాయి. కానీ, అవేమీ పట్టించుకోకుండా టెట్ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష రాయాలని చెప్పడంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రివ్యూ పిటిషన్ వేయాలి: ఏపీటీఎఫ్ అమరావతి టెట్ గురించి సుప్రీంకోర్టు తీర్పుపై ఇన్ సర్వీస్ టీచర్ల తరఫున ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. 2011కు ముందు నియామకమైన ఉపాధ్యాయులందరికీ టెట్ నుంచి ఉపశమనం కలిగించేలా ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేయాలన్నారు. ఏ చర్యలు లేకుండా ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా టెట్ వర్తింపజేస్తూ మార్గదర్శకాలను విడుదల చేయడాన్ని ఖండించారు. ఎయిడెడ్ టీచర్లకు టెట్ అవసరమా?: టీచర్స్ గిల్డ్ రాష్ట్రంలో ఎయిడెడ్ స్కూళ్లలో పనిచేస్తున్న 3 వేల మంది ఉపాధ్యాయులకు టెట్ నిర్వహణపై ప్రభుత్వ నిర్ణయం ప్రకటించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ డిమాండ్ చేసింది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇచ్చే అన్ని సదుపాయాలు ఎయిడెడ్ వారికీ కల్పించినప్పుడు మాత్రమే ఈ పరీక్ష రాస్తామని గిల్డ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి.చిట్టిబాబు ఎల్కే చిన్నప్ప, ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలా లేదు: వైఎస్సార్‌టీఏ ‘సుప్రీం’ తీర్పు తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలోనూ టెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని, ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఎందుకంత తొందర అని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ వి.రెడ్డి శేఖర్ రెడ్డి ఆక్షేపించారు. సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ నిర్వహణపై పునరాలోచించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా నోటిఫికేషన్ విడుదల చేయడం ఏంటని ప్రశ్నించారు. తమను మానసికంగా ఇబ్బంది పెట్టడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని ఆరోపించారు. సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. సర్వీసులో ఉన్నవారికి టెట్ ఏంటి? సర్వీస్‌లో ఉన్న సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేయడంలో అర్థం లేదని ఏపీ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం విమర్శించింది. ఉపాధ్యాయులు ఉద్యోగంలోకి రావడానికి అవసరమైన విద్యార్హతలు, వృత్తి విద్యార్హతలతో పాటు పోటీ పరీక్షల్లో విజయం సాధించారని, వారందరి బోధనా సామర్థ్యాన్ని ప్రభుత్వం అప్పుడే పరీక్షించి, అంగీకరించిందని పేర్కొంది. ఆర్టీఈ–2009 చట్టం కంటే ముందున్నవారికి చట్టాన్ని వర్తింపజేయడంలో అర్థం లేదని సంఘం పేర్కొంది. కేంద్రం ఆలోచన తెలియకుండా పరీక్షా?: పీఎస్టీయూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్ నిర్వహణకు సిద్ధమవడం సరికాదని, దీనిపై కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఏంటో సమీక్షించకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వు ఇచ్చిన వెంటనే అమలు చేయడం ఏంటని ఏపీ ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు లెక్కల జమాల్ రెడ్డి ప్రశ్నించారు. చాలా రాష్ట్రాలు తీర్పుపై రివ్యూ పిటిషన్లు వేస్తుంటే కూటమి ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం శోచనీయమన్నారు. ఇప్పుడు ఇచి్చన టెట్ నోటిఫికేషన్లో ఇన్ సర్వీస్ వారిని మినహాయించాలని డిమాండ్ చేశారు. ఇన్ సర్వీస్ టీచర్లకు మినహాయించాలి ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నిర్వహించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై తెలంగాణ, తమిళనాడు సహా పలు రాష్ట్రాలు, ఉపాధ్యాయ సంఘాలు రివ్యూ పిటిషన్లు వేసినా, ఏపీ ప్రభుత్వం, విద్యాశాఖ మాత్రం స్పందించలేదని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. వెంటనే సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. సీఎం జోక్యం చేసుకుని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి పార్లమెంటులో చట్టం చేసి మినహాయింపు తేవాలన్నారు.. ఇవేమీ చేయకుండా టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా పరీక్ష రాయాలని చెప్పడం సరికాదని విమర్శించారు. -
మన నగరాలకు ఫారిన్ అమ్మాయి రేటింగ్!
విదేశీయుల నోట్ల మన దేశం గొప్పదనం గురించి మనం చాలాసార్లు వినే ఉంటాం. అద్భుతమైన సంస్కృతి అని.. పండుగలు, ఆహారపానీయాలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెబుతూంటే విని గర్వంగా ఫీల్ అవుతూంటాము కూడా. కానీ.. మహిళల భద్రతకు సంబంధించిన అంశానికి వచ్చేసరికి మన గర్వం కాస్తా పటాపంచలవుతుంది. విదేశీ టూరిస్టులను మరీ ముఖ్యంగా మహిళలను వెకిలిచేష్టలతో ఇబ్బంది పెట్టే పోకిరిలు, సెల్ఫీల కోసం బలవంత పెట్టేవారు.. పిల్లికూతలతో వేధించే ఆకతాయిలు.. లైంగికదాడులకు పాల్పడే దుర్మార్గులు చాలామందే కనిపిస్తారు. థాయ్‌లాండ్‌కు చెందిన ఓ సోలో ట్రావెలర్ ఎమ్మా కూడా ఇదే చెబుతోంది. భారతదేశం అద్భుతమైన దేశమే కానీ.. మహిళల భద్రత విషయంలో ఒక్కో నగరం తీరు ఒక్కోలా ఉందని తేల్చేసింది. అంతేకాకుండా.. దేశం మొత్తమ్మీద పలు నగరాల్లో పర్యటించిన తరువాత ఒక్కో నగరానికి ర్యాకింగ్ కూడా ఇచ్చింది. @discoverwithemma_ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్‌తో ఈ ర్యాంకింగ్స్‌ను పోస్ట్ చేసింది. ‘‘గొప్పలు చెప్పడం లేదు.. నిజాయితీగా నా అనుభవాలు ఇవి’ అన్న శీర్షికతో చేసిన ఆ పోస్ట్ ఇప్పటికే వైరల్‌గా మారింది. ఎమ్మా నిజాయితీని మెచ్చుకున్న వారు కొందరు... సహజంగానే విమర్శించిన వారు మరెందరో! ఇంతకీ ఎమ్మా తన పోస్టులో ఏ నగరానికి ఏ ర్యాంక్ ఇచ్చిందంటే...దేశంలోని 29 రాష్ట్రాల్లోనూ మహిళల భద్రత విషయంలో ఎమ్మాకు బాగా నచ్చేసిన రాష్ట్రం కేరళ. పదికి పది మార్కులేసేసింది. ప్రశాంతంగా ఉంటుందని, ఇతరుల పట్ల గౌరవం కనపరుస్తారని, విదేశీయులను మనస్ఫూర్తిగా స్వాగతించే లక్షణం కేరళీయులదని కొనియాడింది. కేరళ తరువాత ఎనిమిది మార్కులతో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ రెండోస్థానంలో నిలిచింది. ఈ నగరంలో భద్రతకు ఏం ఢోకాలేదన్న భావనతో గడిపానని చెప్పుకొచ్చింది. అద్భుతమైన సీన్లు ఈ నగరం సొంతమని, హడావుడి, పరుగులు లేనేలేవంది. దక్షిణాదిలోని గోవా విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇక్కడ సరదాగానే గడిచింది కానీ.. రాత్రివేళల్లో కొన్ని ప్రాంతాల్లో తిరగాలంటే బెరుకుగా అనిపించిందని స్పష్టం చేసింది. ఈ కారణంగా గోవాకు ఎమ్మా వేసిన మార్కులు ఏడు. రాజస్థాన్‌లోని పుష్కర్, జైపూర్లు ఎమ్మా జాబితాలో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. పుష్కర్ ఆధ్యాత్మిక శోభతో అలరారితే.. కొన్ని సంఘటనలు చాలా అసౌకర్యమూ కలిగించాయని తెలిపింది. A female foreigner, discoverwithemma, who travelled to India, rated popular Indian cities on the basis of safety:Delhi : -1/10Agra : 3/10Jaipur : 5/10Pushkar : 6/10Udaipur: 8/10Mumbai : 6.5/10Goa : 8/10Kerala : 9/10 pic.twitter.com/FwVSsjKE9e— Mini Nair (@minicnair) October 24, 2025నిర్మాణశైలి విషయంలో జైపూర్ ఒక అద్భుతమైనప్పటికీ స్థానికులు కొంచెం తొందరపాటు మనుషులని తెలిపింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భద్రతకు సంబంధించి మంచి, చెడూ రెండూ కనిపించాయని తెలిపింది. ఈ నగరం చాలా బిజీ.. గందరగోళాలతో కూడిందని తెలిపింది. ప్రపంచ అద్భుతం తాజ్‌మహల్ ఉన్న ఆగ్రా తనను మైమరిపించిన మాట వాస్తవమైనప్పటికీ.. అక్కడ శబ్ధ కాలుష్యం చాలా ఎక్కువని, అలాగే విదేశీయులను దోచుకునే స్కాములకూ లెక్కలేదని వివరించింది. ఆఖరుగా... ఎమ్మా దృష్టిలో ఈ దేశం మొత్తమ్మీద అధ్వాన్నమైన నగరం... మన రాజధాని ఢిల్లీ నగరం! ఒంటరి మహిళ పర్యాటకులు ఈ నగరానికి రాకపోవడమే మంచిదని సూచిస్తోంది ఎమ్మా. ఇకనైనా మేలుకోండి..ఎమ్మా ర్యాంకింగ్స్‌పై సోషల్ మీడియాలో బోలెడన్ని ప్రతిక్రియలు వ్యక్తమయ్యాయి. నిక్కచ్చిగా, నిజాయితీగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు చాలామంది ఎమ్మాను మెచ్చుకున్నారు. వివిధ రాష్ట్రాల టూరిజమ్ బోర్డులు కూడా ఎమ్మా ర్యాంకింగ్లపై స్పందించాయి. పరిస్థితులను మెరుగు పరిచేందుకు పనిచేస్తామని హామీ ఇచ్చాయి. మరికొందరు భద్రత అనేది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుందని, వ్యక్తుల ప్రవర్తనను బట్టి కూడా మారుతూంటుందని విమర్శించిన వారూ లేకపోలేదు. ప్రియా శర్మ అనే పర్యాటకురాలు మాట్లాడుతూ విదేశీ పర్యాటకుల అభిప్రాయాలకు, అనుభవాలకు విలువ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని, పర్యాటక రంగం వృద్ధి చెందాలంటే ఎమ్మా పోస్టును ఒక మేలు కొలుపుగా తీసుకోవాలని తెలిపారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఎమ్మా పోస్టు తరువాత పర్యాటక భద్రతకు సంబంధించిన అప్లికేషన్లు, మహిళలకు మాత్రమే ప్రత్యేకమైన హాస్టళ్లు, ఒంటరి మహిళ పర్యాటకులకు గైడెడ్ టూర్లు వంటి అంశాలపై ఇంటర్నెట్లో వెతకడం ఎక్కువ కావడం!. -
ప్రైవేటు బస్సుల్లో ఎడాపెడా మార్పులు
సాక్షి, హైదరాబాద్: ఏపీలోని కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఓ భారీ లోపాన్ని ఎత్తిచూపింది. ప్రమాదానికి గురైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సును తొలుత సాధారణ సీటర్ బస్సుగా రిజిస్టర్ చేయించిన యాజమాన్యం.. ఆ తర్వాత దాన్ని నిబంధనలకు విరుద్ధంగా స్లీపర్ బస్సుగా మార్పించింది. బస్సు తయారీ సంస్థలు స్లీపర్, సాధారణ సీటర్ బస్సులకు అనుగుణంగా వాటి నిర్మాణంలో భద్రతా ప్రమాణాలు పాటిస్తాయి. కానీ ట్రావెల్స్ నిర్వాహకులు బస్సుల తయారీ కంపెనీల ప్రమాణాలను కాదని సొంతంగా బస్సుల నిర్మాణాన్ని మారి్పంచుకుంటున్నారు.సీటర్ బస్సుల కంటే స్లీపర్ బస్సులకే ఎక్కువ డిమాండ్ ఉండటంతో గిరాకీ తగ్గిపోతుందన్న ఉద్దేశంతో పాత సీటర్ బస్సులను అక్రమంగా స్లీపర్ సరీ్వసుగా మార్చి నడుపుతున్నారు. బస్సుల్లో ఎక్కువ సరుకులు పట్టేలాగా కూడా సొంతంగా మార్పులు చేయించుకుంటున్నారు. అలాగే స్లీపర్ బస్సుల్లో కర్టెన్లు, దుప్పట్లు, దిండ్లు వాడుతుండటం, నడిచే ప్రాంతం ఇరుకుగా ఉండటం, బెర్తులకు రక్షణ రాడ్లు ఉండటం తదితర కారణాలతో ఇవి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఏర్పడే లోపాలు, సమతూకం అగి్నప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులు తప్పించుకోవడాన్ని కష్టంగా మారుస్తున్నాయి. ఈ లోపాలన్నీ రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సమయాల్లో వెలుగుచూస్తున్నా అధికారులు లంచాలు తీసుకొని వదిలేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్లీపర్ బస్సుల తయారీ నిబంధనలు ఇలా.. ⇒ స్లీపర్ బస్సుల్లో బెర్తులు 2+1 లేఅవుట్లో (ఒకవైపు 2 బెర్తులు, మరోవైపు ఒకటి). ⇒ ట్విన్ యాక్సిల్ బస్సులకు 30 బెర్తులకే (లోయర్ 15, అప్పర్ 15) పరిమితి. మొత్తం 30–36 బెర్తులు. ⇒ స్లీపర్ బస్సుల్లో 2+2 లేఅవుట్‌కు అనుమతి లేదు. ఒక బెర్తు 6 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు. ⇒ లోయర్ బెర్తు ఎత్తు 200–350 మి.మీ., హెడ్‌రూమ్ 800 మి.మీ. (నాన్–ఏసీ), 600 మి.మీ. (ఏసీ), కుషన్ మందం కనీసం 75 మి.మీ. ⇒ బస్సు పొడవు 12 మీటర్లు, బస్సు ఎత్తు 4.5 మీటర్లు. ⇒ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కనీసం 4 ( రెండు రూఫ్ హ్యాచ్‌లు) ఉండాలి. అత్యవసర సమయాల్లో కిటికీ అద్దాలు పగలగొట్టేందుకు అన్ని సీట్ల వద్ద హ్యామర్ ఉండాలి. విదేశాల్లో స్లీపర్ బస్సులపై ఆంక్షలు, నిషేధం... ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు స్లీపర్ బస్సులను నిషేధించాయి. కొన్ని దేశాల్లో కఠిన ఆంక్షలున్నాయి. 2012 నుంచి చైనా స్లీపర్ బస్సుల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. అంతకు ముందున్న బస్సులను కఠిన ఆంక్షల మధ్య మాత్రమే తిప్పుతోంది. కేవలం నాలుగేళ్లలో స్లీపర్ బస్సుల్లో జరిగిన ప్రమాదాల్లో 231 మంది మరణించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే జర్మనీ సైతం స్లీపర్ బస్సులను పూర్తిగా నిషేధించింది. పాత బస్సులను కూడా తొలగించింది. ఆ్రస్టియా, ఇటలీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాల్లో పరిమిత సంఖ్యలో, నిబంధనల ప్రకారం ఉన్న బస్సులనే అనుమతిస్తున్నారు. మంటలు అంటుకొనే అవకాశం తక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆయా దేశాలు డీజిల్ బస్సులకు బదులు ఎలక్ట్రిక్ బస్సులకు వీలు కల్పిస్తున్నాయి. -
కమలానికి జూబ్లీహిల్స్ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు జరుగుతోంది. నామినేషన్ల పర్వం ముగియడంతో బరిలో నిలిచిన పార్టీలు, అభ్యర్థుల బలాబలాలు, ఇతర అంశాలు చర్చకు వస్తున్నాయి. వచ్చేనెల 11న పోలింగ్ జరగనుంది. ప్రచారానికి ఇంకా సమయం ఉండటంతో ఓటర్లను ఆకట్టుకునే వ్యూహాలకు అన్ని పార్టీలు పదునుపెడుతున్నాయి. ఇలాంటి కీలక పరిస్థితుల్లో పార్టీ అభ్యర్థి గెలుపునకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలంతా సమన్వయంతో కలిసి పనిచేస్తారా లేదా అన్నదే బీజేపీలో పెద్ద ప్రశ్నగా మారింది. పార్టీలో నాయకుల మధ్య సమన్వయం ఉందని చెప్పుకోవడానికి ఈ ఎన్నిక మంచి అవకాశంగా నాయకత్వం భావిస్తోంది.కిషన్‌రెడ్డిపైనే భారం.. ఎన్నికల ప్రచారంలో ముఖ్యనేతలు ఎక్కువ సంఖ్యలోనే పాల్గొంటున్నా.. ఇదంతా ప్రణాళికాబద్ధంగా జరుగుతుందా లేదా అన్న సందేహాలు పార్టీ నాయకుల్లో వ్యక్తమౌతున్నాయి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండడంతో ఇక్కడ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే భారమంతా ఆయనపైనే పడుతోంది. పార్టీ గెలిచినా ఓడినా బాధ్యత అంతా కిషన్‌రెడ్డిదే అనే ప్రచారం పార్టీలో సాగుతోంది. దీంతో కిషన్‌రెడ్డి ఈ ఎన్నికను సవాల్‌గా తీసుకున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం కిషన్‌రెడ్డి మార్గదర్శనంలోనే ఎన్నికల ప్రచారం జరుగుతోంది. కొన్ని నెలలుగా కిషన్‌రెడ్డి ఈ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో పాటు పలు కార్యక్రమాలను ఇక్కడి నుంచే ప్రారంభించారు. డివిజన్లవారీగా ఇన్చార్జిలను నియమించి ప్రచారం చేపడుతున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన లంకల దీపక్‌రెడ్డికి 25 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికల్లో కూడా ఆయనకే పార్టీ టికెట్ ఇవ్వటంతో ఈసారి కచి్చతంగా మెరుగైన ప్రదర్శన చూపడంతోపాటు గెలుపు వాకిట నిలిచే అవకాశాలు కొట్టిపారేయలేమని కమలం నేతలు అంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల ఇమేజ్.. నియోజకవర్గంలో దీపక్‌రెడ్డికి ఉన్న పరిచయాలను బేరీజు వేస్తే బీజేపీ గెలుపు కష్టమేమీ కాదన్న ఆశాభావంతో ఆ పార్టీ నేతలున్నారు. ఏపీ ప్రాంత ఓట్లకు గాలం... ఈ నియోజకవర్గ పరిధిలో ఆంధ్ర ప్రాంతానికి చెందినవారి ఓట్లు కూడా గణనీయంగా ఉండడంతో ఆ ఓట్లపై కన్నేసినట్టు పార్టీ వర్గాల సమాచారం. పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీఎన్వీ మాధవ్, మాజీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే సుజనాచౌదరి తదితరులున్నారు. వీరి ద్వారా ఆంధ్ర ప్రాంత ఓటర్లను ఆకర్షించేలా ప్రత్యేక ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. వారి ఓట్లను వేయించుకోగలిగితే విజయావకాశాలు మెరుగవుతాయనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఈ దిశలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. వివిధ కులాలు, వర్గాల ముఖ్యనేతలు, సంఘాలు, ప్రభావం చూపే వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. తమ పార్టీల్లోని ఆయా సామాజికవర్గాల ముఖ్యనేతల ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. గతంలో ఇక్కడ టీడీపీ ప్రాబల్యం ఉండగా... ఇప్పుడు ఆ పార్టీ పోటీలో లేకపోవడంతో టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్ల కోసం బీజేపీ ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తోందని పైకి చెబుతున్నా.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేనలు బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది. -
బియ్యపు గింజంత కంప్యూటర్!
ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లు ఇవన్నీ పెద్దవిగా అనిపిస్తున్నాయా? అయితే రెడీగా ఉండండి! ఇప్పుడు ప్రపంచంలోనే అతి చిన్న కంప్యూటర్ వచ్చేసింది. అది కూడా ఒక బియ్యపు గింజ కంటే చిన్నది. అమెరికాలోని మిషిగన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని రూపొందించారు. కేవలం 0.3 మిల్లీమీటర్లు పరిమాణంలో ఉంటుంది. కాని, ఇది చేసే పనులు తెలిస్తే, పెద్ద పెద్ద కంప్యూటర్లు కూడా షాక్ అవుతున్నాయి. అంతేకాదు, ఈ సూక్ష్మ యంత్రాన్ని శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తే, ఇది క్యాన్సర్ కణాలను గమనిస్తుంది. క్యాన్సర్ కణితి లోపలి ఉష్ణోగ్రతను కొలుస్తుంది, ఇంకా డాక్టర్లకు రియల్‌టైమ్ డేటా పంపిస్తుంది. అంటే ఇది డాక్టర్ జేబులో దాగి ఉన్న గూఢచారిలా పనిచేస్తుంది. ప్రస్తుతం ఇంకా పరిశోధన దశలో ఉన్న ఈ కంప్యూటర్, భవిష్యత్తులో పర్యావరణ పరిశీలన, భద్రతా సెన్సర్లు, ఇంకా మన ఊహలకు మించి ఉండే స్మార్ట్ పరికరాల్లోనూ తన మాయాజాలాన్ని చూపబోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. (చదవండి: సూట్‌కేస్ ఓపెన్ చేస్తే.. లైట్ ఆన్!) -
ఐర్లాండ్ అధ్యక్ష ఎన్నికల్లో కేథరీన్ కొన్నోలీ ఘనవిజయం
డబ్లిన్: ఐర్లాండ్ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో కేథరీన్ కొన్నోలీ ఘనవిజయం సాధించారు. శనివారం జరిగిన ఐర్లాండ్ అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి కేథరీన్ కొన్నోలీ ఘన విజయం సాధించారు. ఆమె 63.4శాతం ఓట్లతో గెలుపొందగా.. ప్రత్యర్థి హీదర్ హంప్రీస్ 29.5శాతం ఓట్లతో పరాజయం పాలయ్యారు.ఐర్లాండ్ అధ్యక్షురాలిగా ఎన్నికైన కేథరీన్ కొన్నోలీకి గాల్వే ఎంపీగా సేవలందించిన అనుభవం ఉంది. అలాగే బారిస్టర్‌గా, క్లినికల్ సైకాలజిస్ట్‌గా పనిచేశారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం.. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో జరిగిన మీడియా సమావేశంలో యూరోపియన్ యూనియన్‌పై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య విలువలు, శాంతి కోసం పోరాడతానని హామీ ఇచ్చారు.‘నేను వినే అధ్యక్షురాలిని, ఆలోచించే అధ్యక్షురాలిని, అవసరమైనప్పుడు మాట్లాడే అధ్యక్షురాలిని అవుతాను. మనం కలిసి అందరికీ విలువ ఇచ్చే కొత్త గణతంత్రాన్ని నిర్మించగలము’ అని ప్రకటించారు.
