breaking news
-
ఫెడరల్ బ్యాంక్‌లో బ్లాక్‌స్టోన్‌కు వాటా
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్‌లో తాజాగా పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్ గ్రూప్ మైనారిటీ వాటా సొంతం చేసుకోనుంది. ఇందుకు బోర్డు తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచి్చనట్లు ఫెడరల్ బ్యాంక్ పేర్కొంది. వెరసి బ్లాక్‌స్టోన్ గ్రూప్ సంస్థ ఏషియా 2 టాప్కో 13 పీటీఈ లిమిటెడ్‌కు రూ. 6,196 కోట్ల విలువైన ప్రిఫరెన్షియల్ వారంట్లను బ్యాంక్ జారీ చేయనుంది. అంతేకాకుండా బోర్డులో ఒక నాన్‌ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ను నియమించుకునేందుకు బ్లాక్‌స్టోన్ ప్రత్యేక హక్కును పొందనుంది. ఇందుకు బోర్డు అనుమతించినట్లు ఫెడరల్ బ్యాంక్ తెలియజేసింది. అయితే వారంట్లను పూర్తిగా వినియోగించుకున్న తదుపరి బ్యాంక్ ఈక్విటీలో కనీసం 5 శాతం వాటాను పొందిన తర్వాత మాత్రమే బ్లాక్‌స్టోన్‌కు నియామకఅవకాశముంటుంది. రూ. 227 ధరలో ప్రైవేట్ ప్లేస్మెంట్లో భాగంగా ఒక్కొక్కటి రూ. 227 ధరలో 27.29 కోట్ల ప్రిఫరెన్షియల్ వారంట్లను ఫెడరల్ బ్యాంక్ జారీ చేయనుంది. ఇందుకు రూ. 6,196 కోట్లను బ్లాక్‌స్టోన్ ఇన్వెస్ట్ చేయనుంది. జారీ తేదీ నుంచి వారంట్లకు గడువు 18 నెలల్లో ముగియనుంది. వారంట్లను ఈక్విటీ షేర్లుగా మారి్పడి చేసుకున్నాక బ్యాంక్‌లో బ్లాక్‌స్టోన్ వాటా 9.99 శాతానికి చేరనుంది. బ్లాక్‌స్టోన్‌కు ప్రిఫరెన్షియల్ వారంట్ల జారీ, డైరెక్టర్ ఎంపికకు ప్రత్యేక హక్కుపై నవంబర్ 19న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా బ్యాంక్ వాటాదారుల అనుమతిని కోరనుంది. బ్లాక్‌స్టోన్ పెట్టుబడుల నేపథ్యంలో ఫెడరల్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో యథాతథంగా రూ. 227 వద్ద ముగిసింది. -
Singapore: విజిటర్‌ను వేధించిన భారత నర్సుకు జైలు
సింగపూర్: భారతీయ స్టాఫ్ నర్సుకు జైలు శిక్ష పడిన ఉదంతం సింగపూర్‌లో చోటుచేసుకుంది. ఆస్పత్రికి వచ్చిన ఒక పురుషుడిని వేధించినందుకు ఒక మేల్ నర్సుకు శిక్ష పడింది. సదరు మేల్ నర్సు కోర్టు ముందు నేరాన్ని అంగీకరించిన దరిమిలా అతనికి శిక్ష ఖరారయ్యింది. ఒక సంవత్సరం, రెండు నెలల జైలు శిక్షతోపాటు, రెండు బెత్తం దెబ్బలను అతనికి శిక్షగా విధించారు.సింగపూర్‌లోని రాఫెల్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న భారతీయ స్టాఫ్ నర్సు ఏలిపె శివ నాగు(34) జూన్ 18న లైంగిక వేధింపుల ఆరోపణల్లో దోషిగా తేలాడు. ‘ది స్ట్రెయిట్స్ టైమ్స్’ తెలిపిన వివరాల ప్రకారం రాఫెల్స్ ఆసుపత్రికి వచ్చిన ఒక పురుష సందర్శకుడిని శివ నాగు లైంగిక వేధింపులకు గురిచేశాడు. బాధితుని వయస్సు తదితర వివరాలను కోర్టు పత్రాలలో గోప్యంగా ఉంచారు. జూన్ 18న బాధితుడు నార్త్ బ్రిడ్జ్ రోడ్‌లోని రాఫెల్స్ ఆస్పత్రి వెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతున్న తన తాతను చూసేందుకు వచ్చాడని డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యూజీన్ ఫువా వివరించారు.తరువాత ఏలిపె శివ నాగు ‘డిస్ఇన్ఫెక్ట్’ చేస్తానంటూ బాధితుని దగ్గరకు వెళ్లి, తన చేతికి సబ్బు రాసుకుని అతనిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యూజీన్ ఫువా కోర్టులో తెలిపారు. ఈ ఘటన తర్వాత బాధితుడు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడు. జూన్ 18న ఈ ఘటన జరిగింది. జూన్ 21న బాధితుడు ఈ ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ నేపధ్యంలో పోలీసులు శివ నాగును అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఆస్పత్రి యాజమాన్యం ఏలిపె శివ నాగును నర్సింగ్ విధుల నుంచి సస్పెండ్ చేసింది. -
మ్యాజిక్ కవర్స్.. ఫోన్‌ను ఫుల్ చార్జ్ చేస్తుంది
ఫోన్ మన ఫ్రెండ్, మన స్టయిల్, కొన్నిసార్లు మన సీక్రెట్ కీపర్ కూడా! అలాంటి ఫోన్‌ను కాపాడే కవర్స్, ఫోన్ కేస్‌లను తక్కువ అంచనా వేయొద్దు! ఇవి కేవలం ప్రొటక్షన్ కోసం మాత్రమే కాదు. స్మార్ట్‌నెస్, సౌలభ్యం అన్నీ కలిపిన మ్యాజిక్ కవర్స్ కూడా!సోలార్ కేస్!ఫోన్ ‘లో బ్యాటరీ’ అని అరుస్తుందా? పైగా పవర్‌బ్యాంక్ కూడా మర్చిపోయారా? టెన్షన్ వద్దు! బయటకి వెళ్లి సూర్యుడి వైపు మీఫోన్‌ను చూపించండి. అప్పుడు ఈ కేస్ చెప్తుంది ‘ఓకే బ్రో, నేను ఉన్నా కదా!’ ఎందుకంటే ఇది సాధారణ ఫోన్ కవర్ కాదు. ‘అయాన్ సోలార్ కేస్’ మార్కెట్లో కొత్తగా వచ్చిన ఈఫోన్ కేస్ ఒక గంట సూర్యరశ్మిని ఉపయోగించి మీ ఫోన్‌ను ఫుల్ చార్జ్ చేస్తుంది. వైర్లు లేవు, ప్లగ్ లేదు. పైగా క్యూట్‌గా క్లాసీగా స్టయిలిష్ డిజైన్‌తో కూడా వస్తుంది. ఇది తొంభై ఐదు శాతం పవర్‌ను సమర్థంగా ట్రాన్స్ఫర్ చేయగలదు. అంటే ఎక్కడైనా, చార్జింగ్ ఎఫిషియెన్సీ పూర్తి అయితే, తర్వాతి రోజులకు ఇది, ఒక పవర్‌బ్యాంక్ లాగా బ్యాటరీని స్టోర్ కూడా చేస్తుంది. ధర 99 డాలర్లు అంటే రూ. 8,778.సెల్ఫీ స్టార్ఫోన్లో ఫొటో తీసుకుంటే వెలుతురు తక్కువగా ఉందా? వీడియో తీయాలంటే ముఖం స్పష్టంగా కనిపించడం లేదా? ఇక ఆ సమస్యలకు పూర్తి లైట్ సొల్యూషన్ వచ్చేసింది! అదే ఈ ‘సెల్ఫీ ఎల్ఈడీ రింగ్ లైట్ కేస్’. ఫోన్ కవర్లా కనిపించే ఈ కేస్‌లోనే లైట్ దాగి ఉంటుంది. బటన్ నొక్కగానే గుండ్రంగా వెలిగే రింగ్ లైట్ బయటకి వస్తుంది. ఒక్కసారి నొక్కితే లైట్ ఆన్, తర్వాతి ఆప్షన్లతో మీ ఇష్టానికి సరిపోయేలా వెలుతురు తక్కువగా లేదా ఎక్కువగా సర్దుకోవచ్చు. సెల్ఫీలు, వీడియోలు, మేకప్, రీల్లు ఏదైనా సరే, మిమ్మల్ని ఒక స్టార్లా మెరిపించే బాధ్యత ఇది తీసుకుంటుంది. అదనపు వైర్లు, బ్యాటరీల అవసరం లేకుండా, దీనిని యూఎస్బీ ద్వారా చార్జ్ చేసుకోవచ్చు. ధర బ్రాండ్, డిజైన్ బట్టి మారుతుంది.పాకెట్లో గేమ్ పార్ట్నర్పెద్ద గేమ్ కంట్రోలర్‌ను జేబులో పెట్టుకొని వెళ్లడం సాధ్యం కాదు. కాని, ఫోన్‌కు ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండే కేస్‌లో దాచేస్తే ఎలా ఉంటుంది ? అదే ఈ ‘ఎమ్కాన్ కంట్రోలర్’. ఇది బయటకి సాధారణ ఫోన్ కేసులా కనిపించినా, లోపల మాత్రం గేమింగ్ మాయ దాగి ఉంటుంది. దీని సైడ్‌లో ఉన్న రెండు బటన్లను ఒకేసారి నొక్కగానే అసలు సరదా మొదలవుతుంది! అప్పటిదాకా, ఫోన్ వెనుక దాగి ఉన్న గేమ్ కంట్రోలర్ ఒక్కసారిగా బయటకి వచ్చేస్తుంది. కనెక్ట్ చేయడం చాలా సులభం. స్క్రీన్‌ను గేమింగ్ కోణంలో సెట్ చేసి, గ్రిప్స్‌ను లాక్ చేస్తే, ఇక దీనికున్న స్మూత్ బటన్లతో ఆట నిశ్శబ్దంగా, స్మూత్‌గా సాగిపోతుంది. తక్కువ బరువుతో, స్టయిలిష్‌గా పాకెట్లో సులభంగా ఇమిడిపోయేలా దీని డిజైన్ ఉంటుంది. ధర 129 డాలర్లు, అంటే సుమారు రూ. 11,439. -
రెండు రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీని బలోపేతం చేయడంతోపాటు అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడంపై రాంచందర్‌రావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌లు శనివారం ఇక్కడి బీజేపీ కార్యాలయంలో చర్చలు జరిపారు. ఏపీ బీజేపీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన మాధవ్, రాంచందర్‌రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లో కేంద్ర పథకాలు అమలవుతున్న తీరు, వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై సమాలోచనలు జరిపారు.సమావేశం తర్వాత రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ, పార్టీని మరింత విస్తరిస్తామని తెలిపారు. మాధవ్ మాట్లాడుతూ.. గతంలో బీజేపీ యువమోర్చా, పార్టీ ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా పనిచేసిన సందర్భాల్లో పలుమార్లు హైదరాబాద్ కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలోనూ త్వరలోనే డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటు అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ కార్యాలయానికి రావడం స్వగృహానికి వచ్చినట్లుగా ఉందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలోనూ విస్తృత పరిచయాలు ఉన్న రాంచందర్‌రావు ఇక్కడ అధ్యక్షుడు కావడం ఆనందంగా ఉందన్నారు. -
మన నగరాలకు ఫారిన్ అమ్మాయి రేటింగ్!
విదేశీయుల నోట్ల మన దేశం గొప్పదనం గురించి మనం చాలాసార్లు వినే ఉంటాం. అద్భుతమైన సంస్కృతి అని.. పండుగలు, ఆహారపానీయాలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెబుతూంటే విని గర్వంగా ఫీల్ అవుతూంటాము కూడా. కానీ.. మహిళల భద్రతకు సంబంధించిన అంశానికి వచ్చేసరికి మన గర్వం కాస్తా పటాపంచలవుతుంది. విదేశీ టూరిస్టులను మరీ ముఖ్యంగా మహిళలను వెకిలిచేష్టలతో ఇబ్బంది పెట్టే పోకిరిలు, సెల్ఫీల కోసం బలవంత పెట్టేవారు.. పిల్లికూతలతో వేధించే ఆకతాయిలు.. లైంగికదాడులకు పాల్పడే దుర్మార్గులు చాలామందే కనిపిస్తారు. థాయ్‌లాండ్‌కు చెందిన ఓ సోలో ట్రావెలర్ ఎమ్మా కూడా ఇదే చెబుతోంది. భారతదేశం అద్భుతమైన దేశమే కానీ.. మహిళల భద్రత విషయంలో ఒక్కో నగరం తీరు ఒక్కోలా ఉందని తేల్చేసింది. అంతేకాకుండా.. దేశం మొత్తమ్మీద పలు నగరాల్లో పర్యటించిన తరువాత ఒక్కో నగరానికి ర్యాకింగ్ కూడా ఇచ్చింది. @discoverwithemma_ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్‌తో ఈ ర్యాంకింగ్స్‌ను పోస్ట్ చేసింది. ‘‘గొప్పలు చెప్పడం లేదు.. నిజాయితీగా నా అనుభవాలు ఇవి’ అన్న శీర్షికతో చేసిన ఆ పోస్ట్ ఇప్పటికే వైరల్‌గా మారింది. ఎమ్మా నిజాయితీని మెచ్చుకున్న వారు కొందరు... సహజంగానే విమర్శించిన వారు మరెందరో! ఇంతకీ ఎమ్మా తన పోస్టులో ఏ నగరానికి ఏ ర్యాంక్ ఇచ్చిందంటే...దేశంలోని 29 రాష్ట్రాల్లోనూ మహిళల భద్రత విషయంలో ఎమ్మాకు బాగా నచ్చేసిన రాష్ట్రం కేరళ. పదికి పది మార్కులేసేసింది. ప్రశాంతంగా ఉంటుందని, ఇతరుల పట్ల గౌరవం కనపరుస్తారని, విదేశీయులను మనస్ఫూర్తిగా స్వాగతించే లక్షణం కేరళీయులదని కొనియాడింది. కేరళ తరువాత ఎనిమిది మార్కులతో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ రెండోస్థానంలో నిలిచింది. ఈ నగరంలో భద్రతకు ఏం ఢోకాలేదన్న భావనతో గడిపానని చెప్పుకొచ్చింది. అద్భుతమైన సీన్లు ఈ నగరం సొంతమని, హడావుడి, పరుగులు లేనేలేవంది. దక్షిణాదిలోని గోవా విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇక్కడ సరదాగానే గడిచింది కానీ.. రాత్రివేళల్లో కొన్ని ప్రాంతాల్లో తిరగాలంటే బెరుకుగా అనిపించిందని స్పష్టం చేసింది. ఈ కారణంగా గోవాకు ఎమ్మా వేసిన మార్కులు ఏడు. రాజస్థాన్‌లోని పుష్కర్, జైపూర్లు ఎమ్మా జాబితాలో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. పుష్కర్ ఆధ్యాత్మిక శోభతో అలరారితే.. కొన్ని సంఘటనలు చాలా అసౌకర్యమూ కలిగించాయని తెలిపింది. A female foreigner, discoverwithemma, who travelled to India, rated popular Indian cities on the basis of safety:Delhi : -1/10Agra : 3/10Jaipur : 5/10Pushkar : 6/10Udaipur: 8/10Mumbai : 6.5/10Goa : 8/10Kerala : 9/10 pic.twitter.com/FwVSsjKE9e— Mini Nair (@minicnair) October 24, 2025నిర్మాణశైలి విషయంలో జైపూర్ ఒక అద్భుతమైనప్పటికీ స్థానికులు కొంచెం తొందరపాటు మనుషులని తెలిపింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భద్రతకు సంబంధించి మంచి, చెడూ రెండూ కనిపించాయని తెలిపింది. ఈ నగరం చాలా బిజీ.. గందరగోళాలతో కూడిందని తెలిపింది. ప్రపంచ అద్భుతం తాజ్‌మహల్ ఉన్న ఆగ్రా తనను మైమరిపించిన మాట వాస్తవమైనప్పటికీ.. అక్కడ శబ్ధ కాలుష్యం చాలా ఎక్కువని, అలాగే విదేశీయులను దోచుకునే స్కాములకూ లెక్కలేదని వివరించింది. ఆఖరుగా... ఎమ్మా దృష్టిలో ఈ దేశం మొత్తమ్మీద అధ్వాన్నమైన నగరం... మన రాజధాని ఢిల్లీ నగరం! ఒంటరి మహిళ పర్యాటకులు ఈ నగరానికి రాకపోవడమే మంచిదని సూచిస్తోంది ఎమ్మా. ఇకనైనా మేలుకోండి..ఎమ్మా ర్యాంకింగ్స్‌పై సోషల్ మీడియాలో బోలెడన్ని ప్రతిక్రియలు వ్యక్తమయ్యాయి. నిక్కచ్చిగా, నిజాయితీగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు చాలామంది ఎమ్మాను మెచ్చుకున్నారు. వివిధ రాష్ట్రాల టూరిజమ్ బోర్డులు కూడా ఎమ్మా ర్యాంకింగ్లపై స్పందించాయి. పరిస్థితులను మెరుగు పరిచేందుకు పనిచేస్తామని హామీ ఇచ్చాయి. మరికొందరు భద్రత అనేది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుందని, వ్యక్తుల ప్రవర్తనను బట్టి కూడా మారుతూంటుందని విమర్శించిన వారూ లేకపోలేదు. ప్రియా శర్మ అనే పర్యాటకురాలు మాట్లాడుతూ విదేశీ పర్యాటకుల అభిప్రాయాలకు, అనుభవాలకు విలువ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని, పర్యాటక రంగం వృద్ధి చెందాలంటే ఎమ్మా పోస్టును ఒక మేలు కొలుపుగా తీసుకోవాలని తెలిపారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఎమ్మా పోస్టు తరువాత పర్యాటక భద్రతకు సంబంధించిన అప్లికేషన్లు, మహిళలకు మాత్రమే ప్రత్యేకమైన హాస్టళ్లు, ఒంటరి మహిళ పర్యాటకులకు గైడెడ్ టూర్లు వంటి అంశాలపై ఇంటర్నెట్లో వెతకడం ఎక్కువ కావడం!. -
కాంగ్రెస్‌కు ఓటేస్తే ఇంటికి బుల్డోజర్: కేటీఆర్
బంజారాహిల్స్/గోల్కొండ: రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా పాలన నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో ఆదివారం తెలంగాణ హోటల్స్ కార్మీక యూనియన్ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు కార్మీక నాయకులు బీఆర్ఎస్లో చేరగా వారిని గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలోనూ, అనంతరం జూబ్లీహిల్స్ ప్రచారంలోనూ కేటీఆర్ మాట్లాడారు. ‘మంత్రి ఓఎస్డీ తుపాకీతో బెదిరించారని మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లారు. మంత్రి బిడ్డ బయటకు వచ్చి తుపాకీ ఇచ్చింది రేవంత్‌రెడ్డి, రోహిన్‌రెడ్డి అని చెప్పారు.. మంత్రి భర్త తుపాకీ ఇచ్చారని పోలీసులు అంటున్నారు. రాష్ట్రంలో రౌడీషీటర్ల పాలన నడుస్తోంది’అని అన్నారు. తుపాకీ రోహిన్‌రెడ్డి పెట్టిండా.. సుమంత్ పెట్టిండా అని ప్రశ్నించారు. అలీబాబా దొంగల ముఠాలా పాలన తయారైందన్నారు. లిక్కర్ బాటిల్స్ స్టిక్కర్ కాంట్రాక్ట్ కోసం సీఎం అల్లుడు, మంత్రి కొడుకు పోటీ పడ్డారని, ఎవరికీ చెప్పలేక ఐఏఎస్ రాజీనామా చేశారని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మలేదని, ఓఆర్ఆర్ లోపల కాంగ్రెస్‌కు ఒక్క సీటూ రాలేదన్నారు. హైడ్రాలో పేదవాళ్లకు మాత్రమే రూల్స్ ఉంటాయని, పెద్దవాళ్లకు రూల్స్ ఉండవన్నారు. రేవంత్‌రెడ్డి కుటుంబం, తమ్ముళ్లు, మంత్రులు దోచుకోవడంపై దృష్టి పెట్టారని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధి చరిత్ర మీకు తెలుసునని, రౌడీషీటర్లు, నేరచరిత్ర, బెదిరింపులకు పాల్పడే వాళ్లను గెలిపిస్తారా? అన్నారు. కారు కావాలో.. బుల్డోజర్ కావాలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బుల్డోజర్ ఇంటికి వస్తుందన్నారు. మైనార్టీలకు ప్రాతినిధ్యమేదీ? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రగతిని, రెండేళ్ల కాంగ్రెస్ మోసాల పాలనను చూసి ప్రజలు జూబ్లీహిల్స్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. మైనార్టీ ప్రాతినిధ్యం లేని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో తొలిసారి వచ్చిందన్నారు. ఓవైపు ముఖ్యమంత్రి సెక్యులర్ ప్రభుత్వం అంటూనే మైనార్టీలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణలో లోపాయికారిగా పని చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీతో కలిసి పనిచేస్తున్నారని, ఈ విషయంపై రాహుల్‌గాంధీ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం స్వయంగా ముఖ్యమంత్రితోపాటు ఆయన మంత్రులకూ లేదని ఎద్దేవాచేశారు. జూబ్లిహిల్స్‌లో రౌడీ కుటుంబానికి చెందిన వారికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని, లోపాయికారిగా ఓ ప్రాంతీయ పార్టీతో పొత్తుపెట్టుకుందని ఆరోపించారు. -
అయిదేళ్లలో 2,500కి జీసీసీలు
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రస్తుతం సుమారు 1,700గా ఉన్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) సంఖ్య వచ్చే అయిదేళ్లలో 2,500కు చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దీనితో ఆఫీస్ స్పేస్‌కి భారీగా డిమాండ్ ఏర్పడనుందని ఒక నివేదికలో పేర్కొంది. జీసీసీలు 100 బిలియన్ డాలర్ల పైగా ఆదాయం ఆర్జిస్తాయని, సిబ్బంది సంఖ్య 1.5–2 రెట్లు పెరుగుతుందని వివరించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జీసీసీలు రికార్డు స్థాయిలో, టాప్ ఆరు నగరాల్లో 24 మిలియన్ చ.అ. గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకున్నాయి. దీంతో మొత్తం లీజుల్లో వాటి వాటా 37 శాతానికి ఎగిసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 27 శాతంగా ఉండేది. ఇక 2026, 2027 ఆర్థిక సంవత్సరాల్లో జీసీసీలు 50–55 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్‌ను తీసుకుంటాయని నివేదికలో ఇక్రా పేర్కొంది. దీనితో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ–ఎన్సీఆర్ సహా ఆరు టాప్ మార్కెట్లలో మొత్తం ఆఫీస్ స్పేస్ డిమాండ్‌లో వీటి వాటా 38–40 శాతంగా ఉంటుందని వివరించింది. వ్యయాల ఆదాపరంగా గట్టిగా పోటీనివ్వగలగడం, ప్రతిభావంతుల లభ్యత, పాలసీలపరంగా మద్దతు మొదలైన అంశాల వల్ల గ్లోబల్ కంపెనీలను భారత్ ఆకర్షించగలుగుతోందని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ అనుపమ రెడ్డి తెలిపారు. దీనితో అవి భారత్‌లో కార్యకాలపాలు విస్తరిస్తున్నాయని వివరించారు. నివేదిక ప్రకారం 2021 నుంచి మొత్తం జీసీసీల వినియోగంలో 70 శాతం వాటాతో అమెరికాకు చెందిన జీసీసీలు అగ్రస్థానంలో ఉన్నాయి. జీసీసీల కేంద్రంగా భారత్.. తయారీ కార్యకలాపాలకి చైనా ఎలాగైతే కేంద్రంగా మారిందో ప్రస్తుతం జీసీసీలకు భారత్ కేంద్రంగా మారిందని సత్వ గ్రూప్ వీపీ శివం అగర్వాల్ తెలిపారు. ఫండమెంటల్స్ పటిష్టంగా ఉండటమే ఇందుకు కారణమన్నారు. ఇంగ్లీష్ మాట్లాడగలిగే యువ సిబ్బంది, అత్యంత తక్కువ వ్యయాల్లో ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో సరీ్వసులను అందిస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఈ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలంటే అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిచేందుకు రియల్ ఎస్టేట్, ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పనిచేయాల్సి ఉంటుందని అగర్వాల్ చెప్పారు. రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు అనువుగా, ఉద్యోగులకు సౌకర్యవంతంగా ఉంటూ, సులభంగా విస్తరించేందుకు వీలుగా ఉండే ఆఫీసుల కోసం కంపెనీలు అన్వేíÙస్తున్నాయని బీహైవ్ వర్క్‌స్పేస్ సీఈవో శేష్ రావ్ పాప్లికర్ తెలిపారు. వర్క్‌ప్లేస్‌లను సరికొత్తగా తీర్చిదిద్దేందుకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. మరోవైపు, జీసీసీ కార్యకలాపాలు, ఆఫీస్ స్పేస్ డిమాండ్ పెరగడమనేది అంతర్జాతీయ బిజినెస్ హబ్‌గా భారత్‌కి పెరుగుతున్న ప్రాధాన్యతకి నిదర్శనమని స్పేజ్వన్ కో–పౌండర్ సిజో జోస్ తెలిపారు. -
YSRCPలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు.. పార్టీ జాతీయ అధికార ప్రతినిధులుగా మాజీ ఎంపీ మార్గాని భరత్ (రాజమండ్రి), యల్లాప్రగడ కార్తీక్ (మండపేట)లను నియమించారు.కాగా, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా నియమించిన సంగతి తెలిసిందే. రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి, ప్రతి జోన్‌కు ఒక ప్రెసిడెంట్‌ను నియమించారు. జోన్–1కి.. విశాఖ జిల్లాకు చెందిన చెన్నా జానకిరామ్ నియమితులయ్యారు. జోన్–2కి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన విప్పర్తి వేణుగోపాల్ నియమితులయ్యారు. జోన్ –3కి ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నట్ట యోనారాజు నియమితులయ్యారు.జోన్-4కి తిరుపతి జిల్లాకు చెందిన నల్లని బాబు నియమితులయ్యారు. జోన్ –5కి వైఎస్సార్ జిల్లాకు చెందిన పులి సునీల్‌కుమార్ నియమితులయ్యారు. అలాగే కాకినాడ జిల్లాకు చెందిన ఎ.లక్ష్మీశివకుమారిని వైఎస్సార్సీపీ రాష్ట్ర అంగన్వాడీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా(జోన్ –2కు)గా, తిరుపతి జిల్లాకు చెందిన ఎస్.రామచంద్రారెడ్డిని రాష్ట్ర ఐటీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్(జోన్–4)గా, తిరుపతి జిల్లాకు చెందిన దువ్వూరు మునిశేఖర్‌రెడ్డిని రాష్ట్ర ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్(జోన్–4)గా నియమించారు.పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లుగా విశాఖ జిల్లాకు చెందిన ద్రోణంరాజు శ్రీవత్సవ(జోన్ –1), కాకినాడ జిల్లాకు చెందిన తోట రాంజీ(జోన్–2), ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎ.రవిచంద్ర(జోన్–3), చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి(జోన్–4), అనంతపురం జిల్లాకు చెందిన వై.ప్రణయ్‌రెడ్డి(జోన్–5) నియమితులయ్యారు. ఎనీ్టఆర్ జిల్లాకు చెందిన వి.ఈశ్వర్‌ప్రసాద్‌ను రాష్ట్ర వాణిజ్య విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్(జోన్–3)గా నియమించారు. ఈ మేరకు కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. -
పెయింట్ కోసమే రూ.13 లక్షలు.. ఈ బైక్ ధర ఎంతో తెలుసా?
సాధారణంగా సుజుకి హయబుసా ధర కొంత ఎక్కువగానే ఉంది. అలాంటి ఈ బైకును బంగారంతో తయారు చేస్తే.. దాని ధర ఇంకెంత ఉంటుందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఒక మోటార్ ఈవెంట్లో బంగారు హయాబుసా కనిపించింది.బంగారు హయాబుసాకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని ధర అక్షరాలా రూ.1.67 కోట్లు అని సమాచారం. ఈ బైకులో చాలా వరకు గోల్డ్ బాడీవర్క్ జరిగి ఉండటాన్ని గమనించవచ్చు. ఇందులో వజ్రాలను కూడా ఉపయోగించారు. కాగా బోల్టులు కూడా బంగారమే కావడం గమనార్హం.ఇక్కడ కనిపించే బైకుకు వేసిన గోల్డ్ లీఫ్ పెయింట్ కోసం మాత్రమే రూ. 13.3 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ పెయింట్ వర్క్ మొత్తాన్ని.. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆటోమోటివ్ కళాకారులలో ఒకరైన మిస్టర్ డానీ పూర్తిచేశారు.ఇదీ చదవండి: అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం: 63వేల కార్లపై ఎఫెక్ట్!గోల్డ్ హయబుసా వెనుక టైరు.. పరిమాణంలో బుగట్టి కారు కంటే పెద్దదిగా ఉంది. కాగా ఇది 400 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే ఇంజిన్ కలిగి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో ఆటోమొబైల్ ఔత్సాహికులను తెగ ఆకట్టుకుంటోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Tharesh Kumar (@tharesh_kumar) -
‘మహిళ వేషంలో బిన్ లాడెన్’.. మాజీ సీఐఏ అధికారి వెల్లడి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌కు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సంచలంగా మారింది. 2001, సెప్టెంబర్ 11 ఉగ్ర దాడులతో అమెరికాకు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా మారిన అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్.. మహిళ వేషంలో టోరా బోరా కొండల నుండి తప్పించుకున్నాడని కేంద్ర నిఘా సంస్థ(సీఐఏ) మాజీ అధికారి జాన్ కిరియాకౌ తాజాగా వెల్లడించారు. 2001లో టోరా బోరా కొండలలో అమెరికా దళాలు ఒసామా బిన్ లాడెన్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించినప్పుడు, అతడు మహిళా వేషం ధరించి అక్కడి నుంచి తప్పించుకున్నాడని తెలిపారు.జాన్ కిరియాకౌ ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెరికా సైన్యంలో రహస్యంగా చొరబడిన అల్ ఖైదా కార్యకర్త సహాయంతో ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్.. మహిళ వేషం వేసుకుని, టోరా బోరా నుంచి తప్పించుకున్నాడని తెలిపారు. సీఐఏలో 15 ఏళ్లు పనిచేసి, పాకిస్తాన్లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలకు నాయకత్వం వహించిన కిరియాకౌ, అమెరికాలో సైనిక శ్రేణుల్లో అల్ ఖైదా కార్యకర్తల చొరబాట్లను తెలియజేశారు. 9/11 దాడుల అనంతరం అమెరికా సంయమనంగా వ్యవహరించింది, ఆఫ్ఘనిస్తాన్‌లో బాంబు దాడులను చేపట్టేందుకు నెల్లాళ్లు వేచివుందన్నారు. ఈ తరుణంలోనే అల్ ఖైదా చొరబాటుదారునిగా తేలిన అనువాదకుడు ఉగ్రవాది బిన్ లాడెన్ తప్పించుకునేందుకు అవకాశం కల్పించాడని తెలిపారు. EP-10 with Former CIA Agent & Whistleblower John Kiriakou premieres today at 6 PM IST“Osama bin Laden escaped disguised as a woman...” John Kiriakou“The U.S. essentially purchased Musharraf. We paid tens of millions in cash to Pakistan’s ISI...” John Kiriakou“At the White… pic.twitter.com/pM9uUC3NIC— ANI (@ANI) October 24, 2025లాడెన్ తప్పించుకున్న ఘటన దరిమిలా యూఎస్ ఉగ్రవాద నిరోధక దృష్టి పాకిస్తాన్ వైపు మళ్లిందని జాన్ కిరియాకౌ తెలిపారు. ఈ నేపధ్యంలో అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌తో చర్చలు జరిగాయని, అతను అమెరికా నుంచి ఆర్థిక, సైనిక సహాయానికి బదులుగా దేశంలోకి యూఎస్ కార్యకలాపాలను అనుమతించాడని పేర్కొన్నారు. అదే సమయంలో సీఐఏ పాకిస్తాన్ గ్రూప్ లష్కరే తోయిబా, అల్-ఖైదా మధ్య గల సంబంధాలను గుర్తించిందన్నాను. ఇది అమెరికా నిఘా వ్యవహారాల్లో మైలురాయిగా నిలిచిందన్నారు.భారత్-పాక్‌ల గురించి మాట్లాడిన జాన్ కిరియాకౌ 2002లో భారతదేశం- పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తుందని అమెరికా నిఘా సంస్థలు భయపడ్డాయని, పార్లమెంట్ దాడి, ఆపరేషన్ పరాక్రమ్ సమయంలో పెరిగిన ఉద్రిక్తతలే దీనికి కారణమన్నారు. నాడు అమెరికా ఈ ముప్పును తీవ్రంగా పరిగణించిందని, అందుకే ఇస్లామాబాద్ నుండి అమెరికన్ కుటుంబాలను ఖాళీ చేయించామని అన్నారు. ఆ సమయంలో వాషింగ్టన్ దృష్టి అల్ ఖైదా, ఆఫ్ఘనిస్తాన్పైననే ఉందని, అందుకే భారతదేశ ఆందోళనలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన వివరించారు.2008 ముంబై దాడుల గురించి కిరియాకౌ మాట్లాడుతూ ఈ దాడుల వెనుక పాకిస్తాన్ మద్దతు కలిగిన కశ్మీరీ ఉగ్రవాద గ్రూపుల హస్తం ఉందని అమెరికా నిఘా సంస్థలు భావించాయన్నారు. పాకిస్తాన్.. భారతదేశంలో ఉగ్రవాదాన్ని వ్యాపింపజేస్తోందని ఆయన అన్నారు. పార్లమెంట్, ముంబై దాడుల తర్వాత భారత్ సంయమనం పాటించిందని, అయితే ఇప్పుడు భారత్ వ్యూహాత్మక సహనాన్ని కలిగి ఉండలేని స్థితిలో ఉందని ఆయన అన్నారు. ఎప్పుడు యుద్ధం వచ్చినా, భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోతుందని ఆయన కిరియాకౌ హెచ్చరించారు. నిరంతరం భారతీయులను రెచ్చగొట్టడంలో అర్థం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, 2011 మే 2న అమెరికా నేవీ సీల్ టీమ్ 6 పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో బిన్ లాడెన్‌ను హతమార్చినట్లు అధికారికంగా ప్రకటించబడింది. కేవలం 2001లో అమెరికా పట్టుకునేందుకు యత్నించిన సమయంలో లాడెన్ తప్పించుకున్నాడనేది మాజీ సీఐఏ అధికారి వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.
