breaking news
-
ఒకరికి భార్య.. మరొకరికి లవర్.. ఢిల్లీలో జంట హత్యలు!
వివాహేతర సంబంధం కారణంగా తన ప్రాణాలే కోల్పోయింది ఓ మహిళ. తన భార్యను ప్రియుడు తన కళ్లముందే చచ్చేలా కొట్టడాన్ని భరించలేకపోయాడు భర్త. దాంతో ఆ ప్రియుడ్ని కూడా చంపేసి కసి తీర్చుకున్నాడు. భార్యను రక్షిద్దామని చేసిన ప్రయత్నంలో తీవ్ర కత్తిపోట్లకు గురైన భర్త కూడా ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నైతికతను మరిచి వివాహేతర సంబంధం కొనసాగిస్తే ఎంతటి అనర్థాలకు దారి తీస్తుందో ఈ ఘటన ద్వారా మరోసారి రుజువైంది. వివరాల్లోకి వెళితే.. సెంట్రల్ ఢిల్లీలో జరిగిన జంట హత్యలు కలకలం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఒకరు లవర్ కోసం, మరొకరు భార్య కోసం నడిరోడ్డుపైనే కొట్టుకున్నారు. అందరూ చూస్తుండగానే రామ్ నగర్ ఏరియాలో షాలిని(22) తనది అంటూ స్థానికంగా క్రిమినల్‌గా పేరొందిన అశూ అలియాస్ శైలేంద్ర రోడ్డుపైనే ఆమెను అడ్డగించాడు. ఇందుకు కారణంగా ఆ రౌడీ షీటర్‌తో షాలిని కొంతకాలం వివాహేతర సంబంధం నడపడమే. భర్తతో కలిసి బయటకు వెళుతన్న సమయంలో ఇది చోటు చేసుకుంది. తామిద్దరికీ ఒక బిడ్డ కూడా పుట్టాడని, తనతోనే కలిసుండాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. ఈ హఠాత్తు పరిణామంతో ఒక్కసారిగా భయపడిపోయిన షాలిని.. లవర్‌తో విభేదించింది. తాను భర్తతో ఉంటానని తెగేసి చెప్పేసింది. దాంతో ఆమెను నడిరోడ్డుపైనే విచక్షణారహితంగా కొట్టాడు ప్రియుడు. దాన్ని చూసి తట్టుకోలేకపోయిన భర్త ఆకాశ్.. భార్యను కాపాడుకునే యత్నం చేశాడు. ఒకవైపు భార్యను లవర్ చావబాదుతంటే అదే స్థాయిలో ప్రతిఘటించాడు. ఈ క్రమంలోనే ముగ్గురికి కత్తిపోట్లు బలంగా దిగాయి. వీరు ముగ్గురు రక్తమడుగులో ఉన్న సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కానీ షాలిని, ఆమె ప్రియుడు ఆశూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు డిల్లీ సెంట్రల్ డీసీపీ నిధిన్ వాల్సన్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం భార్యను కాపాడే క్రమంలో తీవ్ర కత్తిపోట్లకు గురైన భర్త ఆకాశ్ పరిస్థితి కూడా విషమంగానే ఉందన్నారు.అతిపెద్ద మ్యూజియంలో అతిపెద్ద చోరీ.. ఏడు నిమిషాల వ్యవధిలోనే..! -
Bigg Boss: ఇదేం ట్విస్టు! మాధురి 200% కరెక్ట్ అన్న నాగ్..
నిన్నటి ప్రోమోలో మాధురికి చీవాట్లు పెట్టాడు నాగార్జున (Nagarjuna Akkineni). కానీ ఎపిసోడ్లో మాత్రం ఆమెను బుజ్జగిస్తూ.. ఏకంగా రేషన్ మేనేజర్ పోస్ట్ కూడా ఇచ్చేశాడు. అటు పవన్ కల్యాణ్- తనూజలకు బయట ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్లు వివరించారు. మరి ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 18వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..నా బుజ్జి తమ్ముడు(Bigg Boss Telugu 9)నాగార్జున ఎక్కువగా వైల్డ్కార్డులతోనే మాట్లాడాడు. తమిళ బిగ్‌బాస్ బాగుందా? ఇక్కడ బాగుందా? అని అడగ్గా ఆయేషా.. తమిళ్ కంటే ఇక్కడే బాగుంది అని నవ్వింది. పచ్చళ్ల పాప రమ్యను సైతం హౌస్ బాగుందా? అని అడగ్గా చాలా బాగుందని మెలికలు తిరిగిపోయింది. బాగుందా? లేదంటే చాలా బాగున్నాడా? అని పంచ్ వేశాడు నాగ్. దీంతో రమ్య వెంటనే.. డిమాన్ పవన్ నా బుజ్జి తమ్ముడు సార్ అని తడుముకోకుండా చెప్పేసరికి హౌస్మేట్స్ షాకైపోయారు.మాధురి పవర్ పాయే..వైల్డ్‌కార్డ్స్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టేముందు వారికి స్పెషల్ పవర్స్ ఇచ్చారు కదా.. దానికి వాళ్లు అర్హులా? కాదా? అని ఆడియన్స్‌తో ఓటింగ్ వేయించాడు నాగ్. ముందుగా మాధురి వంతు వచ్చింది. ఆమెకు సంజనా డప్పు కొడితే దివ్య మాత్రం.. ఒకర్ని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయడమనేది పెద్ద పవర్.. దానికి ఈమె అర్హురాలు కాదని అభిప్రాయపడింది. ఆడియన్స్‌కు దివ్య మాటకే జై కొట్టారు. 88% మంది మాధురిని తప్పుపట్టారు. దీంతో ఆమెకున్న స్పెషల్ పవర్ పీకేశాడు నాగ్.మాధురి.. 200% కరెక్ట్అలాగే మాధురి.. పవన్ కల్యాణ్‌తో గొడవపడిన క్లిప్పింగ్ చూపించి.. మాట్లాడిన విషయంలో తప్పులేదు.. మాట్లాడిన తీరులో తప్పుందని, దాన్ని సరిచేసుకోవాలన్నాడు. రాత్రి లైట్లు ఆఫ్ చేశాక గుసగుసలు పెట్టొద్దన్నావ్. నువ్వు 200% కరెక్ట్.. నీ స్థానంలో నేనున్నా అదే చేస్తా.. కానీ చెప్పే విధానం మార్చుకోవాలని సముదాయించాడు. ఇప్పటివరకు కమాండింగే తెలుసు.. కానీ బతిమాలడం తెలీదు.. సరే ఇకపై నేర్చుకుంటానంది మాధురి. కల్యాణ్-తనూజల బంధంపై అందరూ ఏమనుకుంటున్నారు? ఏంటనేది వీడియోలతో వారికి క్లారిటీ వచ్చేలా చేశాడు నాగ్.కన్ఫ్యూజన్లో పవన్- రీతూఅయితే తనూజకు అప్పటికే ఓ క్లారిటీ ఉంది. కల్యాణ్ చిన్నపిల్లోడు సర్ అనేసింది. అటు అతడు కూడా జనరేషన్ గ్యాప్ ఉందని చెప్పాడు. కల్యాణ్‌ను అమ్మాయిల పిచ్చి అనడం తప్పని రమ్యను హెచ్చరించాడు. ఇక డిమాన్- పవన్‌ల బంధంపై వారికే సరిగా క్లారిటీ లేకుండా పోయింది. ఏదో ఒకటి క్లారిటీ తెచ్చుకుని ఆటపై ఫోకస్ చేయమన్నాడు నాగ్. అలా ఈ ఎపిసోడ్లో మాధురి, నిఖిల్ పవర్ పోగా.. రమ్య, ఆయేషా, శ్రీనివాస్ సాయిల పవర్ మాత్రం అలాగే ఉంది. చివర్లో ఇమ్మాన్యుయేల్‌కు కళ్లు నెత్తికెక్కాయి, పొగరు పెరిగిపోయిందంటూ కాసేపు ఆడుకున్న నాగ్ చివరకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తనకు ఫుడ్ పార్టీ ఉంటుందన్నాడు. అనంతరం మాధురిని కొత్త రేషన్ మేనేజర్ చేశాడు.చదవండి: బిగ్‌బాస్‌లో షాకింగ్ ఎలిమినేషన్.. టాప్ కంటెస్టెంట్ ఔట్ -
మహేష్ ఎక్కడ? నమ్రతకు ఫ్యాన్స్ ప్రశ్న...!
దీపావళి పండుగ సెలబ్రిటీలకు చాలా ఇష్టమైన పండుగ అని చెప్పొచ్చు. వ్యక్తిగతంగా జరుపుకోవడం మాత్రమే కాదు బిజీ జీవితంలో అరుదుగా మాత్రమే కలవగలుగుతున్న సన్నిహితులకు, పరిచయస్థులకు దీపావళి బాష్ పేరిట పార్టీలు ఇవ్వడానికి కూడా ఇదే చక్కని సందర్భంగా స్టార్స్ భావిస్తారు. దాంతో ఈ సమయంలో దీపావళి పార్టీలు జోరుగా సాగుతాయి. మన టాలీవుడ్‌తో పోలిస్తే బాలీవుడ్లో ఇవి ఒక సంప్రదాయంగా మారిపోయాయి. ఈ నేపధ్యంలో ముంబైలో ఝాన్సీరెడ్డి అనే సన్నిహితులు ఇచ్చిన ఈ పార్టీకి పలువురు బంధుమిత్రులతో పాటు మన సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోడ్కర్ కూడా హాజరయ్యారు. ఈ పార్టీకి ఆమె సోదరి శిల్పా శిరోడ్కర్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లు ఇద్దరూ పార్టీలో సరదాగా గడుపుతూ సందడి చేశారు. ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ పార్టీలో మహేష్, నమ్రతల కుమార్తె తాజా యాడ్ వరల్డ్ యంగెస్ట్ సెన్సేషన్ సితార కూడా పాల్గొంది.ఈ సందర్భంగా నమ్రత తమ ఘట్టమనేని అభిమానులతో తన దీపావళి వేడుకల విశేషాలను పంచుకున్నారు. తన కుమార్తె సితార ఘట్టమనేని సోదరి శిల్పా శిరోద్కర్‌తో తాము కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు.ఆ ఛాయా చిత్రాలను పంచుకుంటూ, నమ్రత ‘వెచ్చదనం, వెలుగులు అద్భుతమైన వ్యక్తులతో నిండిన సాయంత్రం... నిజంగా మరపురాని దీపావళి రాత్రులు... మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు‘ అంటూ క్యాప్షన్‌లో రాశారు. ఈ ఫొటోలో హైదరాబాద్ నగర ప్రముఖులు పింకీ రెడ్డి వంటివారు కూడా నమ్రత బృందంలో కనిపించారు. అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? తమ అభిమాన కధానాయకుడు లేకుండా ఆయన భార్య వేడుకలు జరుపుకుంటే.. అడగకుండా ఉంటారా? అందుకే ఆ ఫొటోల కింద కామెంట్లు వెల్లువెత్తాయి. మహేష్ బాబు ఎక్కడ అంటూ పలువురు ఫ్యాన్స్ ప్రశ్నలు కురిపించారు. ఒకరు, ‘మన సూపర్ స్టార్ ఎక్కడ?‘ అని ఆరా తీయగా మరికొందరు, ‘బాబు ఎక్కడ‘ అనీ అడిగారు. నమ్రతను తన కుమార్తెతో కలిసి ఉన్న మరిన్ని ఫోటోలను షేర్ చేయమని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు అభ్యర్ధించారు. మరోవైపు రాజమౌళి తీస్తున్న సినిమా షూటింగ్లో మహేష్ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
ఆరోగ్యశ్రీ చరిత్రలో చీకటి అధ్యాయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 1.42 కోట్ల మంది ప్రజలకు సంజీవని అయిన ఆరోగ్యశ్రీ పథకం చరిత్రలోనే చీకటి అధ్యాయానికి చంద్రబాబు తెరతీశారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత చికిత్సలు అందించిన ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు బిల్లుల కోసం ఏకంగా ధర్నాకు దిగాల్సిన దుస్థితి తీసుకొచ్చారు. బకాయిల విడుదల డిమాండ్‌తో ఈ నెల 23/24 తేదీల్లో విజయవాడ ధర్నా చౌక్‌లో భారీ ధర్నా చేయడానికి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశ) సిద్ధమైంది. నెట్వర్క్ ఆస్పత్రుల యజమానులు, వైద్యులు, ఇతర సహాయ సిబ్బంది పెద్దసంఖ్యలో ధర్నాలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ధర్నాకు అనుమతి కోరుతూ విజయవాడ పోలీస్ కమిషనర్‌కు ఆశ లేఖ రాసింది. గత నెల 15 నుంచి ఆశ సమ్మెబాట పట్టింది. అదేరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో ఉచిత ఓపీ, రోగనిర్ధారణ సేవలను ఆపేశారు. అయినా ప్రభుత్వం దిగిరాకపోవడంతో గత నెల 24 నుంచి ఏకంగా అన్నిరకాల వైద్యసేవలను పూర్తిస్థాయిలో నిలిపేసి సమ్మెను ఉధృతం చేశారు. సేవలన్నీ నిలిపేసి 10 రోజులైనా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆస్పత్రుల యజమానులు ఏకంగా వీధి పోరాటానికి సిద్ధమయ్యారు. పేదప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యసేవల కల్పన లక్ష్యంతో 2007లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ఈ పథకం దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచింది. దేశంలోని పేదప్రజలకు ఉచిత వైద్యసేవల కల్పనకు దిక్సూచిగా నిలిచిన ఈ మహోన్నత పథకాన్ని చంద్రబాబు కేవలం 17 నెలల పాలనలోనే అంపశయ్య ఎక్కించేశారు. పథకాన్ని కనుమరుగు చేయడంలో భాగంగా గద్దెనెక్కిన వెంటనే బీమా విధానం ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. పథకం అమలును గాలికి వదిలేసి, ఆస్పత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించటం మానేశారు. ముందు రూ.670 కోట్లు చెల్లించమని అడిగినా..నెట్వర్క్ ఆస్పత్రులకు చికిత్సలు చేసిన 40 రోజుల్లో బిల్లు చెల్లించాల్సి ఉంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయిన నాటినుంచి ఆస్పత్రుల క్లెయిమ్‌లను కనీసం ప్రాసెస్ కూడా చేయకుండా ట్రస్ట్స్థాయిలోనే తొక్కిపెట్టడం మొదలుపెట్టారు. దీంతో ఏకంగా రూ.3 వేలకోట్లకు పైగా బిల్లులు నెట్వర్క్ ఆస్పత్రులకు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున బిల్లులు ఆగిపోవడంతో ఆస్పత్రులు కూడా నిర్వహించలేని దయనీయ పరిస్థితుల్లోకి యజమానులు వెళ్లిపోయారు. చేసిన అప్పులకు వడ్డీలు, ఈఎంఐలు కట్టకపోవడంతో కొత్తగా బ్యాంకులతోపాటు ప్రైవేట్‌గాను అప్పులు పుట్టని దుస్థితి నెలకొందని వారు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ దయనీయ పరిస్థితిపై పదేపదే ప్రభుత్వానికి లేఖలు రాసినా పట్టించుకోకపోవడంతో ఆరునెలల వ్యవధిలో రెండుసార్లు సమ్మె కు పిలుపు ఇచ్చారు. తొలిసారి సమ్మె చేసినప్పుడు సీఎం దగ్గర చర్చలు జరిగాయి. బిల్లులు ఇస్తామని సీఎం హామీ ఇవ్వడంతో వారు వెనక్కి తగ్గారు. అనంతరం పరిస్థితుల్లో మార్పురాకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. వాస్తవానికి మొత్తం బకాయిల్లో రూ.670 కోట్లు వెంటనే చెల్లించి, మిగిలిన నిధుల విడుదలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఇప్పటివరకు ఆస్పత్రుల యజమానులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఆ డిమాండ్‌ను ప్రభుత్వ పెద్దలు కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదు. నెలరోజులకుపైగా సమ్మె చేస్తున్న వారిని వైద్యశాఖ మంత్రి, సీఎం స్థాయి వ్యక్తులు చర్చకు కూడా పిలవలేదు. సేవలు పూర్తిస్థాయిలో నిలిచిపోయి అనారోగ్య బాధితులు చికిత్స కోసం తీవ్ర అగచాట్లు పడుతున్నారు. ఇదిలా ఉండగా ఈవెంట్స్ మేనేజ్మెంట్పై పెట్టిన శ్రద్ధలో ఒకటో వంతు కూడా ప్రభుత్వ పెద్దలు ప్రజారోగ్యంపై పెట్టడం లేదు. -
ముమ్మాటికీ ప్రైవేటీకరణే
సాక్షి, అమరావతి: ‘పీపీపీకి.. ప్రైవేటీకరణకు చాలా తేడా ఉంది. మేం వైద్య కళాశాలలను పీపీపీలో అభివృద్ధి చేస్తున్నాం. ఈ విధానంలో విద్యార్థులు, సామాన్య ప్రజలకు ఎలాంటి నష్టం ఉండదు’ కొత్త వైద్య కళాశాలల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రచారం ఇది. చేస్తున్న ప్రచారానికి.. ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలకు ఏ మాత్రం పొంతన లేకుండా పోయింది. విద్యార్థులకు నష్టం ఉండదంటూనే ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మాదిరిగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనూ ఫీజుల దోపిడీకి రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. తద్వారా అస్మదీయుల ఆదాయం పెంపునకు ప్రభుత్వ కోటా ఎంబీబీఎస్ సీట్లకు గండికొట్టి విద్యార్థులకు తీవ్ర అన్యాయం తలపెడుతున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాధించిన 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పదింటిని పీపీపీ పేరిట ప్రభుత్వం ప్రైవేట్‌కు కట్టబెడుతున్న విషయం తెలిసిందే. ఆలిండియా కోటా సీట్లు యాజమాన్య కోటాకే.. కొత్తగా నిరి్మంచిన వైద్య కళాశాలలపై ప్రభుత్వానికి ఏమాత్రం అజమాయిషీ లేకుండా ప్రభుత్వ పెద్దలు చేస్తున్నారు. ఆలిండియా కోటా విధానానికి స్వస్తి పలకడం ద్వారా కళాశాలల్లో ప్రభుత్వ అజమాయిషీ అణుమాత్రం కూడా ఉండబోదని బాబు సర్కార్ ఇప్పటికే వెల్లడించింది. అంతేకాకుండా కారుచౌకగా కళాశాలలను కైవసం చేసుకునే వ్యక్తులు వైద్య విద్యారంగంలోనూ రూ.కోట్లు కొల్లగొట్టేందుకు వీలుగా ప్రభుత్వ కోటాలోని 110 సీట్లను యాజమాన్య కోటాకు మళ్లించి విద్యార్థులకు తీవ్ర అన్యాయం తలపెడుతున్నారు. ఒక్కో కళాశాలలో 11 చొప్పున.. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషీలో నడిచే వైద్య కళాశాలల్లో 15 శాతం ఎంబీబీఎస్ సీట్లు ఆలిండియా కోటాకు కేటాయిస్తారు. పీపీపీకి ఇస్తున్న 10 వైద్య కళాశాలల్లో ఆల్ ఇండియా కోటా ఉండబోదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అంటే ఈ కళాశాలలు వంద శాతం ప్రైవేట్ వ్యక్తుల అజమాయిïÙలోనే నడుస్తాయనే విషయాన్ని ప్రభుత్వం చెప్పకనే చెబుతోంది. ఆల్ ఇండియా కోటా ఎత్తేయడం వల్ల మన విద్యార్థులు ఒక్కో కళాశాలలో 11 చొప్పున కన్వినర్ కోటా సీట్లను నష్టపోనున్నారు. ఒక్కో వైద్య కళాశాలలో 150 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు ఉంటాయి. వీటిలో 15 శాతం అంటే 22 సీట్లు ఆలిండియా కోటాకు, మిగిలిన 128 సీట్లలో సగం (64) రాష్ట్ర స్థాయిలో కనీ్వనర్ కోటాకు, 45 సెల్ఫ్ ఫైనాన్స్, 19 ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన పరిశీలిస్తే ఆలిండియా, రాష్ట్ర కనీ్వనర్ కోటా కలిపి 86 సీట్లు ప్రభుత్వ కోటా కిందకు వస్తాయి. ఈ సీట్లకు రూ.15 వేలు మాత్రమే ఫీజు ఉంటుంది. ఆలిండియా కోటా రద్దుచేసి ప్రైవేట్ వైద్య కళాశాలల తరహాలో 150 సీట్లలో సగం కన్వినర్ కోటాకు, మిగిలిన సగం యాజమాన్య కోటా (బీ, సీ) కింద భర్తీ అవుతాయని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అంటే ప్రస్తుత విధానంలో ప్రభుత్వ కోటా కింద 86 సీట్లు కొత్త వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉండగా.. వాటిని ప్రైవేట్‌కు కట్టబెట్టడం వల్ల ఒక్కో కళాశాలలో 11 సీట్లకు గండి పడనుంది. 8 బీ కేటగిరీకి, మూడు ఎన్ఆర్ఐ కోటా కిందకు వెళతాయి. తద్వారా ఏడాదికి బీ కేటగిరి సీటుకు రూ.13.20 లక్షలు, సీ కేటగిరి సీటుకు రూ.39.60 లక్షలు చొప్పున ప్రైవేట్ వ్యక్తులకు ఆదాయం సమకూరనుంది.ఈ లెక్కన 10 వైద్య కళాశాలల్లో 110 సీట్లు యాజమాన్య కోటాకు మళ్లించి ఏడాదికి బీ కేటగిరి సీట్ల రూపంలో రూ.10.56 కోట్లు, సీ కేటగిరి సీట్ల రూపంలో రూ.11.88 కోట్ల చొప్పున విద్యార్థుల నుంచి ప్రైవేట్ వ్యక్తులు ముక్కుపిండి వసూలు చేసుకోవడానికి లైసెన్స్ ఇచ్చేస్తున్నారు. విద్యార్థులకు తీరని ద్రోహం ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఎంబీబీఎస్ చదివేవారు మెడికల్ పీజీ కోర్సులు చదవాలంటే.. అడ్మిషన్ల సమయంలో స్థానికేతరులుగా మారిపోతున్నారు. ఈ నేపథ్యంలో కొన్నేళ్లుగా విద్యార్థులు, తల్లిదండ్రుల ఆలోచన ధోరణిలో మార్పు వస్తోంది. ఢిల్లీ ఎయిమ్స్, ఇతర ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు వస్తే తప్ప.. మిగిలిన సందర్భాల్లో ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చదవడానికి ఇష్టపడటం లేదు. నీట్ యూజీలో టాప్ స్కోర్ సాధించిన విద్యార్థులు ఆలిండియా కోటా కింద రాష్ట్ర కళాశాలల్లోనే చేరుతున్నారు. ఈ పోకడ రానురాను ఇంకా పెరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తూ విద్యార్థులపై ఫీజుల భారం మోపుతుండటమే కాకుండా.. ఏకంగా 110 సీట్లను యాజమాన్య కోటాకు మళ్లించడంపై విద్యార్థి లోకం మండిపడుతోంది. -
నాగార్జున లానే...మాకూ న్యాయం కావాలి అంటున్న నటీనటులు
ఓ చేత్తో భారతీయ సినిమాల స్థాయిని అమాంతం పెంచేస్తున్న సాంకేతిక విప్లవం మరో చేత్తో భారతీయ సినీ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. విఎఫ్ఎక్స్లూ, ఏఐలూ వాడేస్తూ తెరపై అద్భుతాలను ఆవిష్కరిస్తున్న తెరవేల్పులు.. అదే టెక్నాలజీ తమ కొంప ముంచుతుందేమోనని బెంబేలెత్తుతుండడం సాంకేతికత అనే కత్తికి ఉన్న రెండు వైపులా పదనుకు అద్దం పడుతోంది.ఇటీవల తమ పర్సనాలిటీ రైట్స్(Personality Rights) కాపాడాలంటూ న్యాయ స్థానాల గడప తొక్కిన వారిలో బాలీవుడ్ నుంచి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఆ తర్వాత మన టాలీవుడ్ నుంచి నాగార్జునలు ఉండగా ప్రస్తుతం అదే బాటలో అనేక మంది న్యాయం కావాలంటూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. తన గొంతు, రూపం...తదితర తనకు సంబంధించిన వాటిని తన అనుమతి లేకుండా దుర్వినియోగం చేయడాన్ని నిరోధించాలని నాగార్జున కోరగా ఢిల్లీ హైకోర్ట్ దీనిపై సానుకూలంగా స్పందించింది. దీంతో అభిషేక్ బచ్చన్, ఆశా భోంస్లే, సునీల్ శెట్టి, కరణ్ జోహార్ అక్షయ్ కుమార్ హృతిక్ రోషన్ అనేక మంది బాలీవుడ్ నటులతో పాటు గాయకులు దర్శకులు కూడా తమ వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోరుతూ న్యాయస్థానాల బాట పట్టడం కనిపిస్తోంది. తమ వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని, తమ సెలబ్రిటీ స్టేటస్ దుర్వినియోగం కాకుండా రక్షణ కల్పించాలని బాంబే హైకోర్టు ఢిల్లీ హైకోర్టులను వీరు ఆశ్రయిస్తున్నారు.భయపెడుతున్న ఏఐ..ఓ వైపు సోషల్ మీడియాతోనే నానా ఇబ్బందులు పడుతున్న సెలబ్రిటీలను కృత్రిమ మేధస్సు (ఏఐ) మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు వెలుగు చూడడం మిగిలిన వారిని కూడా అప్రమత్తం చేస్తోంది. ఏఐ దుర్వినియోగం నుంచి రక్షణ కల్పించాలని కూడా నాగార్జున, అక్షయ్ కుమార్ లు తమ పిటిషన్ లో కోరడం గమనార్హం. దాదాపు 150 కి పైగా చిత్రాలలో పనిచేసిన అక్షయ్ కుమార్, స్క్రీన్ మేయర్ ‘అక్షయ్ కుమార్‘, చిత్రాలు, పోలిక, వాయిస్, విలక్షణమైన ప్రదర్శన శైలి, ప్రవర్తన ఇతర గుర్తించదగిన లక్షణాలను దుర్వినియోగం చేయడాన్ని నివారించాలనుకుంటున్నారు. అదే విధంగా హృతిక్ రోషన్ దాఖలు చేసిన దావాలో ’ఏదో ఒక రకమైన ’ఏఐ సృష్టించిన నకిలీ చిత్రాలు వీడియోలు, నకిలీ వస్తువులు, మోసపూరిత ప్రకటనలు, తప్పుడు బ్రాండ్ ఎండార్స్మెంట్లు ప్లాట్‌ఫారమ్‌లలో సోషల్ మీడియా ప్రొఫైల్‌లను అనుకరించడం ద్వారా తన వ్యక్తిత్వాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేయడాన్ని అడ్డుకోవాలని కోరారు. ఆయన తన దావాలో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఇ–కామర్స్ సైట్లను కూడా ప్రతివాదులుగా ఆయన చేర్చాడు.న్యాయస్థానాలు ఏం చేయనున్నాయి?సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణపై న్యాయస్థానాలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఢిల్లీ హైకోర్టు బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ వ్యక్తిత్వ హక్కులను కాపాడుతూ, ఆన్ లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ఆమె పేరు, చిత్రాలను వాణిజ్య లాభం కోసం చట్టవిరుద్ధంగా ఉపయోగించకుండా నిషేధించింది. ప్రముఖ వ్యక్తి గుర్తింపును వారి అనుమతి లేదా అనుమతి లేకుండా ఉపయోగించినప్పుడు, అది సంబంధిత వ్యక్తికి వాణిజ్యపరంగా హాని కలిగించడమే కాకుండా, గౌరవంగా జీవించే హక్కును కూడా ప్రభావితం చేస్తుందని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. ‘ఒకరి వ్యక్తిత్వ హక్కులను అనధికారికంగా దోపిడీ చేసే కేసుల్లో కోర్టులు వాటిని చూసి కళ్ళు మూసుకోలేవు ఆ అనధికార దోపిడీ ఫలితంగా బాధిత పార్టీలకు ఏదైనా హాని జరగకుండా వారిని రక్షించాలి‘ అని జస్టిస్ తేజస్ కరియా సెప్టెంబర్ 9న జారీ చేసిన ఒక ఉత్తర్వులో పేర్కొన్నారు. అదే విధంగా సునీల్ శెట్టి దావాపై ఇచ్చిన ఆదేశాలలో, ‘సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వాది (షెట్టి) డీప్‌ఫేక్ చిత్రాలను అనధికారికంగా సృష్టించడం/అప్లోడ్ చేయడం అతని వ్యక్తిత్వ హక్కులను మాత్రమే కాకుండా గౌరవంగా జీవించే హక్కును కూడా తీవ్రంగా ఉల్లంఘించడమే‘ అని కోర్టు స్పష్టం చేసింది.అయితే రెండు వైపులా పదును ఉన్న టెక్నాలజీ చట్టాలు, నిబంధనలపై అవగాహన లేని పిచ్చోళ్ల చేతిలో రాయిలా అవుతుండగా . మరోవైపు చట్టాల్ని లెక్కచేయని అతి తెలివి మంతులూ పెరుగుతున్నారు. ఈ నేపధ్యంలో భవిష్యత్తులో పర్సనాలిటీ రైట్స్‌కు సంబంధించిన న్యాయ వివాదాలు పెద్ద సంఖ్యలో చోటు చేసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. -
PAK VS SA 2nd Test: బాబర్ విఫలమైనా, ఆదుకున్న కెప్టెన్
రావల్పిండి వేదికగా పాకిస్తాన్, సౌతాఫ్రికా జట్ల మధ్య ఇవాళ (అక్టోబర్ 20) రెండో టెస్ట్ మ్యాచ్ (Pakistan vs South Africa) మొదలైంది. ఈ మ్యాచ్ తొలి రోజు ఆట బ్యాలెన్స్‌గా సాగింది. ఇరు జట్లు ఆధిపత్యం విషయంలో సమంగా నిలిచాయి. ఓ సెషన్లో పాక్ ఆధిపత్యం సాధిస్తే.. మరో సెషన్లో సౌతాఫ్రికా ఆధిక్యత ప్రదర్శించింది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్ (16), మహ్మద్ రిజ్వాన్ (19) విఫలమైనా.. కెప్టెన్ షాన్ మసూద్ (87), ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (57) అర్ద సెంచరీలతో తమ జట్టును ఆదుకున్నారు. సౌద్ షకీల్ (42), సల్మాన్ అఘా (10) క్రీజ్‌లో ఉన్నారు.పాకిస్తాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 17 పరుగులు చేసిన ఇమామ్ ఉల్ హాక్‌ను 35 పరుగుల వద్దే సైమన్ హార్మర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆతర్వాత అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (Shan Masood) పాక్ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 111 పరుగులు జోడించారు.ఆతర్వాత హార్మర్ పాక్‌కు మరో స్ట్రోక్ ఇచ్చాడు. 146 పరుగుల వద్ద షఫీక్‌ను ఔట్ చేశాడు. ఈ దశలో ఎప్పటిలాగే భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన బాబర్ ఆజమ్ (Babar Azam) వరుస బౌండరీలతో అలరించాడు.16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బాబర్‌ను కేశవ్ మహారాజ్ దెబ్బేశాడు. కేశవ్ బౌలింగ్‌లో టోనీ డి జోర్జీకి క్యాచ్ ఇచ్చి బాబర్ పెవిలియన్‌కు చేరాడు. ఆతర్వాత షాన్ మసూద్.. సౌద్ షకీల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 45 పరుగులు జోడించి ఔటయ్యాడు. సెంచరీకి 13 పరుగుల ముందు మసూద్‌ను కేశవ్ మహారాజ్ ఔట్ చేశాడు.ఆతర్వాత వచ్చిన మరో పాక్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 19 పరుగులు చేసి రబాడ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. రిజ్వాన్ వికెట్ పడ్డాక జాగ్రత్తగా ఆడిన పాకిస్తాన్ మరో వికెట్ కోల్పోకుండా తొలి రోజు ఆట ముగించింది.కాగా, రెండు టెస్ట్‌లు, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్టు పాక్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో పాక్ 93 పరుగుల తేడాతో పర్యాటక జట్టుపై విజయం సాధించింది.చదవండి: ఆఫ్ఘనిస్తాన్ భరతం పట్టిన జింబాబ్వే బౌలర్ -
వేటగాళ్ల ఉచ్చుకు ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాచర్ బలి
పాములపాడు: వన్యప్రాణుల కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ ఉచ్చుకు తగిలి ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాచర్ మృతి చెందగా.. మరో నలుగురు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ దుర్ఘటన నంద్యాల మండలం పాములపాడు మండలం బానకచెర్ల గ్రామ సమీపంలోని అడవిలో ఆదివారం జరిగింది. అటవీ అధికారుల కథనం మేరకు.. ఈ నెల 18న రాత్రి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ప్రొటెక్షన్ వాచర్లు రాముడు, రాంభూపాల్, విజయ్‌కుమార్, అరుణ్‌కుమార్, లక్ష్మణ్‌నాయక్ విధుల్లో భాగంగా వాహనంలో బయల్దేరారు. రోడ్డు పక్కన అడవిలో చెట్ల పక్కన ఒక ద్విచక్ర వాహనం కనిపించడంతో అనుమానం వచ్చి అడవిలోకి వెళ్లి చూశారు. దారిలో వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ ఉచ్చు తగలి ప్రొటెక్షన్ వాచర్ లక్ష్మణ్‌నాయక్ (54) కిందపడ్డాడు. మిగతా వారు వస్తుండగా ‘విద్యుత్ ఉంది.. రావొద్దు’ అంటూ కేక వేసి కుప్పకూలిపోయాడు. అప్పటికే ఇద్దరికి స్వల్పంగా తీగ తగిలింది. లక్ష్మణ్‌నాయక్‌ను వెంటనే ఆత్మకూరు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. వాహనంపై టీడీపీ ఎంపీ శబరి ఫొటో స్టిక్కర్ ఘటనా స్థలంలో లభించిన ద్విచక్ర వాహనం నంద్యాల జిల్లా మిడుతూరు మండలం తలముడిపికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. వాహనంపై టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఫొటోతో కూడిన స్టిక్కర్ అతికించి ఉంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, అటవీ అధికారులు వేటగాళ్లు ఏర్పాటు చేసిన తీగను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు.. ఆర్జేడీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోమవారం (అక్టోబర్20)రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) 143 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అనూహ్యంగా పొత్తు పెట్టుకునేందుకు చర్చలు జరుపుతున్న ఇండియా కూటమి అభ్యర్థులపై పోటీగా ఆర్జేడీ ఐదుగురు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఇక ఆర్జేడీ విడుదల చేసిన జాబితాలో 24 మంది మహిళలు,18 మంది ముస్లిం అభ్యర్థులు ఉన్నారు.ఆర్జేడీ 143 మంది అభ్యర్థులను ప్రకటించడంతో మహాగఠ్‌బంధన్ (విపక్షాల మహా కూటమి)లో సీట్ల పంపకాల ఫార్ములా ఆర్జేడీ (143), కాంగ్రెస్ (55), సీపీఐఎంఎల్(20), సీపీఐ(6),సీపీఎం(4),వీఐపీ (15) సీట్లు ఉన్నాయి. ఓ వైపు కాంగ్రెస్ ఇప్పటికే 60 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. RJD releases its list of candidates for the Bihar Assembly Election 2025, fielding candidates in 143 seats. RJD leader Tejashwi Yadav will contest from the Raghopur assembly seat in Vaishali district. pic.twitter.com/wSsMEj8gdm— ANI (@ANI) October 20, 2025 -
పటాకులు.. బిర్యానీ, ఈ రెండూ ఉంటేనే పండగ: వరలక్ష్మీ శరత్‌కుమార్
‘‘దీపావళి అంటే దీపాలు... రంగు రంగుల ముగ్గులు... లక్ష్మీ పూజ. టపాసులకు మాత్రం నేను దూరం’’ అంటున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. అది మాత్రమే కాదు... తన జీవితంలో వెలుగులు నింపిన వ్యక్తి ఎవరో కూడా చెప్పారు. ఈ విశేషాలతో పాటు దీపావళి ముచ్చట్లను ‘సాక్షి’తో వరలక్ష్మి ప్రత్యేకంగా పంచుకున్నారు.⇒ నా చిన్నప్పటి దీపావళి పండగలన్నీ నాకు తీపి గుర్తులే. పండగ అంటే నాకు ముఖ్యంగా నచ్చేది కుటుంబ సభ్యులందరం కలవడం. ఇక దీపావళి అంటే మాకు పిండి వంటలు మాత్రమే కాదు... బిర్యానీ కూడా. టపాసులు, బిర్యానీ... ఈ రెండూ ఉంటేనే నాకు పరిపూర్ణంగా పండగ జరుపుకున్నట్లు ఉంటుంది. నేను టపాసులు కాల్చను... జస్ట్ చూడడం వరకే. ఇప్పుడు ఈ దీపావళికి బిర్యానీ లాగించడానికి రెడీ అయిపోయాను (నవ్వుతూ).⇒ మా ఫ్యామిలీలో ఎవరు ఎంత బిజీగా ఉన్నా పండగల సమయంలో అందరం ఇంట్లో ఉండాలనే నియమం పెట్టుకున్నాం. నేను వేరే షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ బ్రేక్ తీసుకుని, చెన్నై వెళ్లాను. నా పుట్టింటివాళ్లు, అత్తింటివాళ్లు, స్నేహితులు... ఇలా అందరం కలుసుకునేలా ఏర్పాట్లు చేసుకున్నాం. మాకు అత్తింటిల్లో దీపావళి పండగకి ప్రత్యేకంగా ఆచరించాల్సిన నియమాలు ఏమీ లేవు. సో... చిన్నప్పట్నుంచి మా ఇంట్లో జరుపుకున్నట్లే అత్తింటికి వెళ్లిన తర్వాత కూడా జరుపుకుంటున్నాను.⇒ దీపావళి అంటే రంగు రంగుల లైట్లు... బోలెడన్ని పువ్వులు. చాలా చక్కగా అలంకరిస్తాం. ఉదయం లక్ష్మీ పూజ చేయడం నుంచి సాయంత్రం దీపాలు పెట్టడం వరకూ ఇంట్లో ఉన్న అందరం కలిసి అన్నీ చేస్తాం. చిన్నప్పట్నుంచి నేను క్రాకర్స్‌కి కాస్త దూరం అని చెప్పాను కదా... నా హజ్బెండ్ (నికొలయ్ సచ్దేవ్) కూడా క్రాకర్స్‌కి దూరమే. కుటుంబం అంతా పండగపూట కలిసి ఉండటం ఆయనకు ఇష్టం. ఇక టపాసులు కాల్చాలనే మా సరదా పర్యావరణానికి హాని కలిగించేదిగా ఉండకూడదన్నది మా ఇద్దరి ఒపీనియన్. ⇒ నా జీవితంలో వెలుగులు నింపిన వ్యక్తి అంటే మా ఆయనే. ఎందుకంటే నిక్ నన్ను బాగా అర్థం చేసుకున్నారు. సపోర్టివ్‌గా ఉంటారు. డైరెక్షన్ చేయాలనే నా ఇష్టం తెలిసి, చేయమని ఆయనే ఎంకరేజ్ చేశారు. నిక్ నన్ను ప్రేమించడంతో పాటు నా మాటలకు విలువ ఇస్తారు. భార్యాభర్తల మధ్య ప్రేమతో పాటు ఒకరంటే మరొకరికి గౌరవం ఉండాలి. అప్పుడే ఆ బంధం బాగుంటుంది. దీపావళి స్పెషల్ డైరెక్షన్ఈ దీపావళికి నా కెరీర్ పరంగా స్పెషల్ అంటే ‘డైరెక్షన్’. దర్శకురాలిగా మారాలనే ఆలోచన ఎప్పట్నుంచో ఉంది. అయితే టైమ్ కుదరాలి. ఇప్పుడు సెట్ అయింది. దోస డైరీస్ బేనర్‌పై నా డైరెక్షన్లో ‘సరస్వతి’ టైటిల్‌తో రానున్న ఈ సినిమాని నా∙సోదరి పూజా శరత్‌కుమార్ నిర్మిస్తారు. ఈ సినిమాలో నేను నటిస్తాను కూడా. థ్రిల్లర్ మూవీగా ‘సరస్వతి’ ఉంటుంది. త్వరలో షూటింగ్ ఆరంభిస్తాం.