breaking news
-
ఏంటి సంజనా.. నీకు, నాకు పెళ్లిచూపులా?: నాగార్జున
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో నేడు దీపావళి సెలబ్రేషన్స్ జరగనున్నాయి. హోస్ట్ నాగార్జున సహా కంటెస్టెంట్లు అందరూ సాంప్రదాయంగా ముస్తాబయ్యారు. ఈ మేరకు ఓ ప్రోమో కూడా వదిలారు. పండగ పూట హౌస్‌మేట్స్‌కు కొత్త బట్టలు కానుకగా పంపించాడు నాగ్. అలాగే వారి ఫ్యామిలీస్‌తో వీడియో కాల్ మాట్లాడించాడు. దీంతో కంటెస్టెంట్లు ఎమోషనలయ్యారు. భర్త, ఇద్దరు పిల్లల్ని చూడగానే సంజనా కళ్లలో నీళ్లు తిరిగాయి.ఎమోషనల్‌గా దీపావళి స్పెషల్ ఎపిసోడ్అటు డిమాన్ పవన్, సుమన్‌ల పరిస్థితి కూడా అలాగే ఉంది. దాదాపు నెలన్నర తర్వాత ఇంట్లోవాళ్లను స్క్రీన్‌పై చూడగానే భావోద్వేగానికి లోనయ్యారు. ఇక కుర్తాపైజామాలో ఉన్న నాగార్జునను చూసి సంజనా ఓ డైలాగ్ వేసింది. పెళ్లిచూపులకు రెడీ అయినట్లుగా ఉన్నారని కాంప్లిమెంట్ ఇచ్చింది. అందుకు నాగ్.. ఏంటి? నీకు, నాకా? అని సరదాగా అన్నాడు. అది విని హౌస్మేట్స్ ఆశ్చర్యపోయారు. ఈ దీపావళి ఎపిసోడ్ నేడు రాత్రి 7 గంటలకు ప్రసారం కానుంది.చదవండి: Bigg Boss: ఇదేం ట్విస్టు! మాధురి 200% కరెక్ట్ అన్న నాగ్ -
పటాకులు.. బిర్యానీ, ఈ రెండూ ఉంటేనే పండగ: వరలక్ష్మీ శరత్‌కుమార్
‘‘దీపావళి అంటే దీపాలు... రంగు రంగుల ముగ్గులు... లక్ష్మీ పూజ. టపాసులకు మాత్రం నేను దూరం’’ అంటున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. అది మాత్రమే కాదు... తన జీవితంలో వెలుగులు నింపిన వ్యక్తి ఎవరో కూడా చెప్పారు. ఈ విశేషాలతో పాటు దీపావళి ముచ్చట్లను ‘సాక్షి’తో వరలక్ష్మి ప్రత్యేకంగా పంచుకున్నారు.⇒ నా చిన్నప్పటి దీపావళి పండగలన్నీ నాకు తీపి గుర్తులే. పండగ అంటే నాకు ముఖ్యంగా నచ్చేది కుటుంబ సభ్యులందరం కలవడం. ఇక దీపావళి అంటే మాకు పిండి వంటలు మాత్రమే కాదు... బిర్యానీ కూడా. టపాసులు, బిర్యానీ... ఈ రెండూ ఉంటేనే నాకు పరిపూర్ణంగా పండగ జరుపుకున్నట్లు ఉంటుంది. నేను టపాసులు కాల్చను... జస్ట్ చూడడం వరకే. ఇప్పుడు ఈ దీపావళికి బిర్యానీ లాగించడానికి రెడీ అయిపోయాను (నవ్వుతూ).⇒ మా ఫ్యామిలీలో ఎవరు ఎంత బిజీగా ఉన్నా పండగల సమయంలో అందరం ఇంట్లో ఉండాలనే నియమం పెట్టుకున్నాం. నేను వేరే షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ బ్రేక్ తీసుకుని, చెన్నై వెళ్లాను. నా పుట్టింటివాళ్లు, అత్తింటివాళ్లు, స్నేహితులు... ఇలా అందరం కలుసుకునేలా ఏర్పాట్లు చేసుకున్నాం. మాకు అత్తింటిల్లో దీపావళి పండగకి ప్రత్యేకంగా ఆచరించాల్సిన నియమాలు ఏమీ లేవు. సో... చిన్నప్పట్నుంచి మా ఇంట్లో జరుపుకున్నట్లే అత్తింటికి వెళ్లిన తర్వాత కూడా జరుపుకుంటున్నాను.⇒ దీపావళి అంటే రంగు రంగుల లైట్లు... బోలెడన్ని పువ్వులు. చాలా చక్కగా అలంకరిస్తాం. ఉదయం లక్ష్మీ పూజ చేయడం నుంచి సాయంత్రం దీపాలు పెట్టడం వరకూ ఇంట్లో ఉన్న అందరం కలిసి అన్నీ చేస్తాం. చిన్నప్పట్నుంచి నేను క్రాకర్స్‌కి కాస్త దూరం అని చెప్పాను కదా... నా హజ్బెండ్ (నికొలయ్ సచ్దేవ్) కూడా క్రాకర్స్‌కి దూరమే. కుటుంబం అంతా పండగపూట కలిసి ఉండటం ఆయనకు ఇష్టం. ఇక టపాసులు కాల్చాలనే మా సరదా పర్యావరణానికి హాని కలిగించేదిగా ఉండకూడదన్నది మా ఇద్దరి ఒపీనియన్. ⇒ నా జీవితంలో వెలుగులు నింపిన వ్యక్తి అంటే మా ఆయనే. ఎందుకంటే నిక్ నన్ను బాగా అర్థం చేసుకున్నారు. సపోర్టివ్‌గా ఉంటారు. డైరెక్షన్ చేయాలనే నా ఇష్టం తెలిసి, చేయమని ఆయనే ఎంకరేజ్ చేశారు. నిక్ నన్ను ప్రేమించడంతో పాటు నా మాటలకు విలువ ఇస్తారు. భార్యాభర్తల మధ్య ప్రేమతో పాటు ఒకరంటే మరొకరికి గౌరవం ఉండాలి. అప్పుడే ఆ బంధం బాగుంటుంది. దీపావళి స్పెషల్ డైరెక్షన్ఈ దీపావళికి నా కెరీర్ పరంగా స్పెషల్ అంటే ‘డైరెక్షన్’. దర్శకురాలిగా మారాలనే ఆలోచన ఎప్పట్నుంచో ఉంది. అయితే టైమ్ కుదరాలి. ఇప్పుడు సెట్ అయింది. దోస డైరీస్ బేనర్‌పై నా డైరెక్షన్లో ‘సరస్వతి’ టైటిల్‌తో రానున్న ఈ సినిమాని నా∙సోదరి పూజా శరత్‌కుమార్ నిర్మిస్తారు. ఈ సినిమాలో నేను నటిస్తాను కూడా. థ్రిల్లర్ మూవీగా ‘సరస్వతి’ ఉంటుంది. త్వరలో షూటింగ్ ఆరంభిస్తాం. -
మెరిసిపోతున్న రష్మిక మందన్నా.. దివాళీ పార్టీలో బుట్టబొమ్మ పూజా హెగ్డే !
బ్లాక్ డ్రెస్‌లో బాలీవుడ్ బ్యూటీ అవనీత్ కౌర్.. దివాళీకి మెరిసిపోతున్న హీరోయిన్ రష్మిక మందన్నా.. ఫస్ట్ దివాళీ పార్టీ అంటోన్న బుట్టబొమ్మ పూజా హెగ్డే.. పారిస్‌లో చిల్ అవుతోన్న మాళివిక మోహనన్.. దివాళీ మూడ్‌లో చాహల్ గర్ల్‌ఫ్రెండ్ ఆర్జే మహ్వశ్.. View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
రష్యా గ్యాస్ ప్లాంట్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి
కీవ్: కజఖ్‌స్తాన్ సరిహద్దుల్లో ఉన్న రష్యాకు చెందిన గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌పై శనివారం రాత్రి ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసింది. భారీ పేలుళ్లు సంభవించడంతోపాటు పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో, ప్లాంట్‌ను మూసివేసినట్లు రష్యా, కజకిస్తాన్ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని గాజ్ప్రోమ్ సంస్థకు చెందిన ఒరెన్‌బర్గ్ ప్లాంట్‌లో కజఖ్‌స్తాన్ నుంచి వచ్చే గ్యాస్‌ను ప్రాసెసింగ్ చేస్తారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఒరెన్‌బర్గ్ ప్లాంట్ వార్షిక సామర్థ్యం 45 బిలియన్ క్యూబిక్ మీటర్లు. డ్రోన్ దాడి కారణంగా ఈ ప్లాంట్‌లోని వర్క్‌షాప్ తీవ్రంగా దెబ్బతిందని అధికారులు తెలిపారు. ప్లాంట్‌లో తాత్కాలికంగా గ్యాస్ ప్రాసెసింగ్‌ను నిలిపివేశామన్నారు. రష్యా తమపై సాగిస్తున్న యుద్ధానికి ఇంధన వనరులే కీలకమని భావిస్తున్న ఉక్రెయిన్ తరచూ ఆయిల్, గ్యాస్ రిఫైనరీలపై డ్రోన్ దాడులకు తెగబడుతోంది. మరో డ్రోన్ దాడితో ఒరెన్‌బర్గ్ సమీపంలో నొవొకుయి బషెవ్స్క్ ఆయిల్ రిఫైనరీ ప్రధాన శుద్ధి విభాగం దెబ్బతిందని ఉక్రెయిన్ ప్రకటించింది. ఇలా ఉండగా, రష్యా ఆధునీకరించిన గ్లైడ్ బాంబును ఖర్కీవ్‌లోని లొజావా నగరంపై శనివారం మధ్యాహ్నం ప్రయోగించిందని వెల్లడించింది. యూఎంపీబీ–5 ఆర్ అని పిలిచే రాకెట్ అమర్చిన ఈ రకం బాంబులు 130 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించిన తర్వాత సంభవించే పేలుడుతో తీవ్ర విధ్వంసం సంభవిస్తుంది. -
దీపావళి స్టాక్స్ పటాకా!
కొత్త సంవత్ 2082లో కొంత ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ మార్కెట్లు ముందుకే సాగుతాయనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆదాయాల వృద్ధి వేగం పుంజుకోవడం, మళ్లీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం మొదలు కావడం, వాణిజ్య విధానాలపై స్పష్టత, భౌగోళిక రాజకీయ స్థిరత్వం వంటి అంశాలు సానుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. దేశీయంగా పాలసీలు స్థిరంగా కొనసాగడం, భారీ పెట్టుబడులు, సానుకూల ద్రవ్యపరపతి విధానాలు మొదలైనవి కీలక చోదకాలుగా నిలుస్తాయనే అంచనాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం నెమ్మదించడం, ఆర్థిక క్రమశిక్షణ, కార్పొరేట్ల రుణభారం తగ్గడం తదితర అంశాల దన్నుతో కంపెనీల ఆదాయాలు మెరుగుపడొచ్చని నువామా రీసెర్చ్ అభిప్రాయపడింది. 2026 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఫెడ్, ఈసీబీలు వడ్డీ రేట్లను మరికాస్త తగ్గించవచ్చని పేర్కొంది. ద్రవ్యోల్బణం కాస్త అదుపులో ఉన్న నేపథ్యంలో దేశీయంగా ఆర్బీఐ కూడా ఇదే బాటలో పయనించవచ్చని తెలిపింది. వేల్యుయేషన్స్ సముచిత స్థాయిలో ఉన్నాయని, అయితే గణనీయంగా పెరిగిన మిడ్–స్మాల్ క్యాప్స్‌లో మాత్రం కన్సాలిడేషన్‌కి ఆస్కారం ఉందని వివరించింది. జీఎస్టీ 2.0 సరళీకరణ, ఆదాయపు పన్నుపరమైన ఊరట, పండుగల సీజన్ మొదలైన అంశాల కారణంగా వినియోగం గణనీయంగా రికవర్ అవుతుందని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. ఆటో, కన్జూమర్ డ్యూరబుల్స్, ట్రావెల్, హోటల్స్, రిటైల్ వంటి రంగాలు మెరుగ్గా ఉండొచ్చని పేర్కొంది. మరోవైపు, ఆటో, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, తదితర రంగాలు ఆకర్షణీయంగా ఉంటాయని సెంట్రమ్ బ్రోకింగ్ తెలిపింది. నిఫ్టీ 28,500కి, సెన్సెక్స్ 95,000కు చేరొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. వినియోగ ఆధారిత సంస్థలు, ప్రైవేట్ బ్యాంకులు మెరుగ్గా రాణించవచ్చని ట్రేడ్జినీ సీవోవో త్రివేష్ తెలిపారు. వచ్చే ఏడాది కాలానికి వివిధ బ్రోకరేజీ సంస్థలు అందిస్తున్న స్టాక్ సిఫార్సులు సాక్షి పాఠకులకు ప్రత్యేకం! బ్రోకరేజ్: జేఎం ఫైనాన్షియల్ మారుతీ సుజుకీప్రస్తుత ధర: రూ. 16,399 టార్గెట్ ధర: రూ. 19,000 (వృద్ధి: 16%) కార్యకలాపాలు స్థిరపడే కొద్దీ విస్తరణ వ్యయాలు తగ్గుముఖం పట్టడం, ప్రోడక్టుల మేళవింపు సానుకూలంగా ఉండటం మార్జిన్లు మెరుగుపడేందుకు దోహదపడొచ్చు. ఇన్‌హౌస్ బ్యాటరీ ప్లాంటుతో మరిన్ని హైబ్రిడ్ వాహనాలను ప్రవేశపెట్టొచ్చు. హైబ్రిడ్ సెగ్మెంట్లో వ్యయాలు తగ్గి, లాభదాయకత పెరుగుతుంది. అయితే, తీవ్రమైన పోటీ, కొత్తగా ప్రవేశపెట్టిన ప్యాసింజర్ వాహనాలకు స్పందన అంతంతమాత్రంగానే ఉండటం వంటివి ప్రతికూలాంశాలుగా ఉండొచ్చు. యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుత ధర: రూ. 1,200 టార్గెట్ ధర: రూ. 1,330 (వృద్ధి: 11%)ఆకర్షణీయమైన వేల్యుయేషన్, అసెట్ క్వాలిటీ రిస్కులు తక్కువగా ఉండటం, నిర్వహణ వ్యయాలు నెమ్మదించడం వంటివి సానుకూలాంశాలు. రాబోయే త్రైమాసికాల్లో వృద్ధి వేగం మరింత పుంజుకోవచ్చు. నికర వడ్డీ మార్జిన్లు ఊహించిన దానికంటే క్షీణించే అవకాశాలు ప్రతికూలాంశం. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ప్రస్తుత ధర: రూ. 498 టార్గెట్ ధర: రూ. 600 (వృద్ధి: 20%)వేల్యుయేషన్ మెరుగ్గా ఉండటం, ఆదాయ రికవరీ వల్ల రీ–రేటింగ్‌కి అవకాశం ఉంది. పసిడి ధరల పరుగు కొనసాగుతుండటమనేది ఆదాయ అంచనాల పెంపునకు, రుణాల పోర్ట్‌ఫోలియో మెరుగుపడేందుకు ఉపయోగపడొచ్చు. అయితే, రుణ సంబంధ వ్యయాలు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉండటం కీలక రిసు్కల్లో ఒకటిగా ఉంటుంది.ఎల్అండ్టీ ఫైనాన్స్ ప్రస్తుత ధర: రూ. 266 టార్గెట్ ధర: రూ. 300 (వృద్ధి: 13% )మాతృ సంస్థ పటిష్టంగా ఉండటం, వైవిధ్యమైన ప్రోడక్టుల పోర్ట్‌ఫోలియో, లోన్ బుక్‌లో రిటైల్ ఫైనాన్స్ వాటా 90 శాతానికి పెరగడం వంటివి సానుకూలాంశాలు. ద్వితీయార్ధంలో పండగ సీజన్ డిమాండ్‌తో వృద్ధి వేగం పటిష్టంగా ఉండొచ్చు. అసెట్ క్వాలిటీపరమైన రిసు్కలు మళ్లీ తలెత్తే అవకాశాలుండటం ప్రతికూలాంశాల్లో ఒకటిగా నిలవొచ్చు. అపోలో హాస్పిటల్స్ ప్రస్తుత ధర: రూ. 7,909 టార్గెట్ ధర: రూ. 9,000 (వృద్ధి: 14% )కొత్తగా 1,717 పడకలు జతకానుండటం, ఫార్మసీ ఔట్లెట్స్ సంఖ్య 8 శాతం పెరుగుదల, పోటీ సంస్థ మ్యాక్స్ హెల్త్‌కేర్‌తో పోలిస్తే డిస్కౌంటులో ట్రేడవుతుండటం మొదలైనవి పాజిటివ్ అంశాలు. పడకల సామర్థ్యం పెంపు ఊహించిన దానికన్నా నెమ్మదిగా ఉండటం, రెగ్యులేటరీ రిస్కుల్లాంటివి ప్రతికూలాంశాలుగా ఉండొచ్చు.బ్రోకరేజ్: చాయిస్ ఈక్విటీ బ్రోకింగ్ ఫెడరల్ బ్యాంక్ ప్రస్తుత ధర: రూ. 212 టార్గెట్ ధర: రూ. 245 (వృద్ధి: 16% )టెక్నికల్‌గా కొన్నాళ్ల నుంచి పటిష్టమైన బేస్ ఏర్పర్చుకుంటోంది. రూ. 195–215 శ్రేణిలో తిరుగాడుతోంది. కరెక్షన్ జరిగిన ప్రతిసారి సపోర్ట్ బలపడుతోంది. 220పై నిలకడగా కొనసాగితే రూ. 245–255 వైపు ర్యాలీ చేయొచ్చు. రూ. 207–205 వరకు తగ్గితే కొనుగోళ్లకు అవకాశంగా భావించవచ్చు. రూ. 195 దిగువకి పడిపోతే బలహీనపడటాన్ని సూచిస్తుంది. సిప్లా ప్రస్తుత ధర: రూ. 1,578 టార్గెట్ ధర: రూ. 1,770 (వృద్ధి: 12%) నిర్దిష్ట శ్రేణిలో కన్సాలిడేట్ అవుతూ షేరు బలపడుతున్న సంకేతాలిస్తోంది. రూ. 1,580 వద్ద తక్షణ రెసిస్టెన్స్ ఉండగా, దీన్ని నిర్ణయాత్మకంగా దాటితే మధ్యకాలికంగా, దీర్ఘకాలికంగా రూ. 1,770–1,850 వైపుగా వెళ్లొచ్చు. తగ్గితే రూ. 1,480 వద్ద సపోర్ట్ లభిస్తుంది. మొమెంటమ్ ఇండికేటర్ల ప్రకారం చూస్తే బులి‹Ùగానే కనిపిస్తోంది. అశోక్ లేల్యాండ్ ప్రస్తుత ధర: రూ. 134 టార్గెట్ ధర: రూ. 151 (వృద్ధి: 13% )కనిష్ట స్థాయిల్లో కన్సాలిడేట్ అవుతూ, స్థిరంగా రికవర్ అవుతోంది. ప్రస్తుతం వీక్లీ చార్ట్‌లో బులి‹Ùగా కనిపిస్తోంది. టెక్నికల్‌గా రూ. 140 తక్షణ రెసిస్టెన్స్‌ని దాటితే మధ్య, దీర్ఘకాలికంగా రూ. 151–రూ. 158 వరకు పెరగవచ్చు. దిగువ వైపున రూ. 131 వరకు కొనుగోలుకు అవకాశం ఉంటుంది. రూ. 126 వద్ద పటిష్టమైన మద్దతు ఉంటుంది. దానికన్నా దిగువకి పడిపోతే ర్యాలీకి స్వల్పకాలిక రిస్కులు ఉంటాయి. సెయిల్ ప్రస్తుత ధర: రూ. 129 టార్గెట్ ధర: రూ.147 (వృద్ధి: 14% )టెక్నికల్‌గా పటిష్టమైన బేస్ ఏర్పర్చుకున్న స్టాక్, ప్రస్తుతం నిర్ణయాత్మక బ్రేకవుట్కి సిద్ధంగా ఉన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. భారీ వాల్యూమ్స్‌తో రూ. 138కి ఎగువన నిలకడగా క్లోజయితే, తదుపరి దశ ర్యాలీకి దారితీయొచ్చు. దిగువన రూ. 125 స్థాయి వరకు మరింతగా షేర్లను మరింతగా కొనుగోలు చేయొచ్చు. రూ. 116 వద్ద సపోర్ట్ ఉంటుంది. బీడీఎల్ ప్రస్తుత ధర: రూ. 1,540 టార్గెట్ ధర: రూ. 1,700 (వృద్ధి: 10% )ఫిబోనకీ రిట్రేస్‌మెంట్ లెవెల్‌కి 50 శాతం వద్ద కన్సాలిడేట్ అవుతోంది. ఇదే జోన్లో సపోర్ట్ లభిస్తోంది. సాధారణంగా ర్యాలీ చేసే ముందు, ఇలాంటి కన్సాలిడేషన్ కనిపిస్తుంది. తక్షణ రెసిస్టెన్స్ రూ. 1,560 వద్ద ఉంటుంది. దీన్ని నిర్ణయాత్మకంగా దాటితే బులిష్ ధోరణి బలపడి, సమీప భవిష్యత్తులో మరింత ర్యాలీకి దోహదపడొచ్చు. తగ్గితే, రూ. 1,440 వరకు కొనుక్కోవచ్చు. రూ. 1,380 బలమైన సపోర్ట్ జోన్‌గా ఉంటుంది.బ్రోకరేజ్: మిరే అసెట్ షేర్‌ఖాన్ అంబర్ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుత ధర: రూ. 8,245 టార్గెట్ ధర: రూ. 9,300 (వృద్ధి: 13%) ఈ సంస్థ రెసిడెన్షియల్, కమర్షియల్ ఏసీలు, రిఫ్రిజిరేషన్ ఉత్పత్తులను అందిస్తోంది. కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో ఏసీలతో పాటు కంపెనీ వాషింగ్ మెషీన్ల మార్కెట్లోకి, అటు ఎల్రక్టానిక్స్లోకి, సెమీకండక్టర్ సబ్్రస్టేట్ పీసీబీలు మొదలైన వాటిల్లోకి ప్రవేశిస్తుండటం ద్వారా మార్కెట్ పరిధిని విస్తరించుకుంటోంది. ఎల్రక్టానిక్స్‌పై వచ్చే అయిదేళ్లలో రూ. 3,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. చాలెట్ హోటల్స్ ప్రస్తుత ధర: రూ. 975 టార్గెట్ ధర: రూ. 1,172 (వృద్ధి: 20%)వ్యూహాత్మక కొనుగోళ్లు, గదుల పెంపు, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం వంటివి సంస్థకు సానుకూలంగా ఉండనున్నాయి. అలాగే, కమర్షియల్ బిజినెస్ వాటా పెరుగుతుండటమనేది వృద్ధికి కీలక చోదకంగా నిలవనుంది. 2027 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 2,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 2025 డిసెంబర్ ఆఖరు నాటికి గదుల సంఖ్యను 4,500కి పెంచుకోనుంది. కమిన్స్ ఇండియా ప్రస్తుత ధర: రూ. 3,976 టార్గెట్ ధర: రూ. 4,500 (వృద్ధి: 13% )హై–హార్స్పవర్ (హెచ్‌హెచ్‌పీ) జెన్సెట్ల మార్కెట్లో అగ్రగామిగా నిలుస్తోంది. పటిష్టమైన బ్రాండింగ్, డి్రస్టిబ్యూషన్ నెట్వర్క్ ఉంది. 2025 తొలినాళ్ల నుంచి పవర్‌జెన్ వ్యాపారం పుంజుకుంది. డేటా సెంటర్లు, హాస్పిటల్స్, మొదలైన రంగాల నుంచి హెచ్‌హెచ్‌పీ జెన్సెట్లకు డిమాండ్ కొనసాగనుంది. ఎగుమతులు పటిష్టంగా ఉన్నాయి. యూరప్, ఆప్రికా, పశ్చిమాసియాలో డిమాండ్ స్థిరంగా ఉంది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ ప్రస్తుత ధర: రూ. 4,880 టార్గెట్ ధర: రూ. 6,000 (వృద్ధి: 23%) ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు, ఇంజిన్లు, యాక్సెసరీలు అందించే హెచ్ఏఎల్కి భారతదేశపు డిఫెన్స్ రంగంలో విశిష్టమైన స్థానం ఉంది. తయారీ సెగ్మెంట్ కార్యకలాపాలు పుంజుకోవడం వల్ల ఆదాయ వృద్ధి మెరుగుపడొచ్చు. రూ. 1.9 లక్షల కోట్ల ఆర్డర్ బ్యాక్లాగ్ ఉంది. రాబోయే 1–2 ఏళ్లలో రూ. లక్ష కోట్ల ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. హడ్కో ప్రస్తుత ధర: రూ. 224 టార్గెట్ ధర: రూ. 260 (వృద్ధి: 16% )సామాజిక హౌసింగ్, అర్బన్ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రభుత్వ నోడల్ ఏజెన్సీగా పని చేస్తోంది. ప్రభుత్వాలతో పటిష్టమైన సంబంధాలు ఉన్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఏయూఎం వార్షికంగా 25 శాతం పైగా, లాభం 23 శాతం పైగా వృద్ధి చెందవచ్చు. వచ్చే 18 నెలల్లో మొండిపద్దుల భారాన్ని పరిష్కరించుకోవాలని కంపెనీ నిర్దేశించుకుంది. బ్రోకరేజ్: మోతీలాల్ ఓస్వాల్ ఎస్బీఐ ప్రస్తుత ధర: రూ. 889 టార్గెట్ ధర: రూ. 1,000 (వృద్ధి: 12%)జీఎస్టీ 2.0, ఆదాయ పన్ను సంస్కరణలు, ద్రవ్య లభ్యతను పెంచేందుకు ఆర్బీఐ తీసుకున్న చర్యలు మొదలైనవి రుణ వృద్ధికి దారి తీయొచ్చని, బీఎఫ్ఎస్ఐ రంగం లాభదాయకతకు తోడ్పడవచ్చని అంచనాలు ఉన్నాయి. రిటైల్, ఎస్ఎంఈ, కార్పొరేట్ సెగ్మెంట్లవ్యాప్తంగా పటిష్టమైన కార్యకలాపాలు ఉండటం బ్యాంకుకు సానుకూలాంశం. ఎంఅండ్ఎం ప్రస్తుత ధర: రూ. 3,648 టార్గెట్ ధర: రూ. 4,091 (వృద్ధి: 12%)2026 క్యాలెండర్ సంవత్సరం నుంచి 2030 నాటికి కంపెనీ 7 ఐసీఈ ఎస్యూవీ వాహనాలను, 5 బీఈవీలను, 5 ఎల్‌సీవీలను ప్రవేశపెట్టే ప్రణాళికల్లో ఉంది. తద్వారా ఐసీఈ, ఈవీ సెగ్మెంట్లలో కంపెనీ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రికవరీ, కొత్త ఉత్పత్తుల దన్ను, ట్రాక్టర్ల మార్జిన్లు మెరుగుపడటం మొదలైనవి సంస్థకు కలిసి రానున్నాయి. భారత్ ఎల్రక్టానిక్స్ ప్రస్తుత ధర: రూ. 413 టార్గెట్ ధర: రూ. 490 (వృద్ధి: 19% )ఆర్మీ నుంచి రూ. 30,000 కోట్ల అనంత శస్త్ర ప్రాజెక్టు టెండర్లకు సంబంధించి కంపెనీ, లీడ్ ఇంటిగ్రేటరుగా వ్యవహరిస్తుండటం వల్ల కంపెనీ అర్డరు బుక్ రూ. లక్ష కోట్ల స్థాయిని దాటే అవకాశముంది. ఇది, వ్యూహాత్మక డిఫెన్స్ ప్రోగ్రాంలలో కంపెనీ నాయకత్వ స్థానాన్ని తెలియజేస్తోంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్వ్యాప్తంగా అవకాశాలతో దీర్ఘకాలికంగా కంపెనీ వృద్ధి అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. స్విగ్గీ ప్రస్తుత ధర: రూ. 432 టార్గెట్ ధర: రూ. 550 (వృద్ధి: 27% )పోటీ నెమ్మదిస్తుండటం, డార్క్ స్టోర్లను విస్తరణ క్రమంగా స్థిరపడుతుండటం మొదలైన వాటి కారణంగా కంపెనీకి చెందిన ఇన్‌స్టామార్ట్ విభాగం త్వరలో లాభదాయకంగా మారే అవకాశాలు ఉన్నాయి. జీఎస్టీ మార్పుల వల్ల వినియోగం మరింత పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి వ్యాపార వృద్ధి, గతంలో అంచనా వేసిన 20 శాతానికన్నా మెరుగ్గా 23 శాతం స్థాయిలో ఉంటుందని అంచనా. ఇండియన్ హోటల్స్ ప్రస్తుత ధర: రూ. 735 టార్గెట్ ధర: రూ. 880 (వృద్ధి: 20% )ఆక్యుపెన్సీ, ఏఆర్ఆర్ పెరుగుతుండటం వంటి అంశాల కారణంగా దేశీయంగా హాస్పిటాలిటీ పరిశ్రమ 2026 ఆర్థిక సంవత్సరంలో భారీగా వృద్ధి చెందనుంది. అలాగే ఎంఐసీఈ యాక్టివిటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ద్వితీయార్ధంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైనవి కూడా కంపెనీ వృద్ధికి దోహదపడనున్నాయి. బ్రోకరేజ్: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అసోసియేటెడ్ ఆల్కహాల్స్ అండ్ బ్రూవరీస్ (ఏఏబీఎల్) ప్రస్తుత ధర: రూ. 1,058 టార్గెట్ ధర:రూ. 1,182 (వృద్ధి: 12% )క్రమంగా ప్రీమియం లిక్కర్ బ్రాండ్స్ వైపు మళ్లుతోంది. మధ్యప్రదేశ్‌లో 20–25 శాతం వరకు మార్కెట్ వాటా ఉంది. అలాగే, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, ఉత్తర్‌ప్రదేశ్ మార్కెట్లలోకి కూడా విస్తరిస్తోంది. ఇటీవలే నికోబార్ జిన్, హిల్‌ఫోర్ట్ విస్కీ అనే ప్రీమియం బ్రాండ్లను ప్రవేశపెట్టడంతో పాటు కొత్తగా బ్రాందీ, టెకీలాలో కూడా మరిన్ని ప్రోడక్ట్లను ప్రవేశపెట్టబోతోంది. వ్యయాలు తగ్గించుకుని, స్థిరమైన మార్జిన్లను సాధించేందుకు కసరత్తు చేస్తోంది. భారతి ఎయిర్టెల్ ప్రస్తుత ధర: రూ. 2,011 టార్గెట్ ధర: రూ. 2,244 (వృద్ధి: 12%) ఏఆర్ పీయూ, డిజిటల్ వ్యాపారాలు వృద్ధి చెందుతున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏఆర్పీయూ రూ. 250గా ఉండగా, టారిఫ్‌ల పెంపుతో రూ. 300 సమీపానికి చేరే అవకాశం ఉంది. ఇక గూగుల్, ఒరాకిల్, యాపిల్, హ్యూస్‌లాంటి దిగ్గజాలతో జట్టు కట్టడం ద్వారా మొబైల్ సరీ్వసుల పరిధికి మించి ఇతర విభాగాల్లోకి ప్రవేశించడంలో కంపెనీకి తోడ్పడనుంది. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ ప్రస్తుత ధర: రూ. 541 టార్గెట్ ధర: రూ. 639 (వృద్ధి: 18% )భారతదేశపు ఇంధన పరివర్తన లక్ష్యాలతో కంపెనీకి ప్రయోజనం చేకూరనుంది. కంపెనీ ఇప్పటికే నిర్దేశించుకున్న గడువు కన్నా ముందే 20 గిగావాట్ల స్ట్రాటెజీ 2.0 టార్గెట్‌ని సాధించింది. ఇప్పుడు 2030 నాటికి 30 గిగావాట్ల కెపాసిటీ, 40 గిగావాట్‌అవర్ స్టోరేజీని సాధించే దిశగా ముందుకెళ్తోంది. రూ. 1.3 లక్షల కోట్ల భారీ పెట్టుబడుల ప్రణాళికలు ఉన్నప్పటికీ పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తోంది. ఎల్అండ్టీ ప్రస్తుత ధర: రూ. 3,839 టార్గెట్ ధర: రూ. 4,243 (వృద్ధి: 11%) క్యాపిటల్ గూడ్స్ విభా గానికి చెందిన ఈ సంస్థ కు రూ. 6.1 లక్షల కోట్ల ఆర్డర్ బుక్ ఉంది. ఇన్ఫ్రా, ఎనర్జీ, హైడ్రోకార్బన్ ప్రాజెక్టులకు సంబంధించి రూ. 14.8 లక్షల కోట్ల ఆర్డర్లు కుదిరే దశలో ఉన్నాయి. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం ద్వారా కంపెనీ లాభదాయకత మరింత మెరుగుపడనుంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ప్రస్తుత ధర: రూ. 72 టార్గెట్ ధర: రూ. 88.5 (వృద్ధి: 23%)కాసా డిపాజిట్లు 26 శాతం వృద్ధి చెందాయి. దీంతో కాసా నిష్పత్తి 48 శాతానికి, క్రెడిట్–డిపాజిట్ నిష్పత్తి 93.4 శాతానికి పెరిగాయి. నిధుల సమీకరణ వ్యయా లు తగ్గి, 2025–26 మూడో త్రైమాసికానికి మార్జిన్లు 5.7 శాతానికి చేరే అవకాశముంది. 2024–25లో రూ. 1,525 కోట్లుగా ఉన్న లాభాలు, 2026 కల్లా రూ. 4,560 కోట్లకు ఎగిసే అవకాశాలు ఉన్నాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
నేను ఆత్మహత్య చేసుకుంటున్నా
నెల్లూరు: ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నా’ అంటూ వెలుగు వీఓఏ వాట్సాప్ గ్రూపులో సెల్ఫీ వీడియో పెట్టింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆమెతో మాట్లాడారు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని నందిపాడులో వెలుగు వీఓఏగా రజియా పనిచేస్తోంది. ఆమె ఆదివారం ఆత్మహత్య చేసుకుంటున్నాంటూ వాట్సాప్ గ్రూపుల్లో సెల్ఫీ వీడియో పెట్టింది. సీసీ తనను విధుల నుంచి తప్పించి మరొకరిని పెట్టుకోవాలని చూస్తున్నారని అందులో ఆరోపించింది. కొందరు పొదుపు మహిళలు, మరో వ్యక్తి వేధిస్తున్నారని చెప్పుకొచ్చింది. విషయం తెలుసుకున్న ఎస్సై ఆదిలక్ష్మి సకాలంలో స్పందించి రజియాతో మాట్లాడి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఎస్సై మాట్లాడుతూ వెలుగు అధికారులు వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో విచారించి తగిన చర్యలు తీసుకుని కేసు నమోదు చేస్తామన్నారు. -
ENG vs NZ: హ్యారీ బ్రూక్ విధ్వంసం... ఫిల్ సాల్ట్ ధనాధన్
న్యూజిలాండ్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) ధనాధన్ దంచికొట్టాడు. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడి ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన బ్రూక్.. 22 బంతుల్లోనే అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు.మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటన (NZ vs ENG)కు వెళ్లింది. ఇందులో భాగంగా శనివారం తొలి టీ20 వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసిపోయింది. ఈ క్రమంలో క్రైస్ట్‌చర్చ్ వేదికగా సోమవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య కివీస్ జట్టు.. ఇంగ్లండ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.ఫిల్ సాల్ట్ ధనాధన్.. బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్ఈ క్రమంలో ఓపెనర్ జోస్ బట్లర్ (4) స్వల్ప స్కోరుకే వెనుదిరగగా.. మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ మాత్రం అదరగొట్టాడు. 56 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 85 పరుగులు సాధించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన జేకబ్ బెతెల్ కాసేపు మెరుపులు (12 బంతుల్లో 24) మెరిపించగా.. నాలుగో నంబర్ బ్యాటర్ బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న బ్రూక్.. ఆరు ఫోర్లు, ఐదు సిక్స్‌లు బాది 78 పరుగులు సాధించాడు. మిగతా వారిలో సామ్ కర్రాన్ 3 బంతుల్లో 8, టామ్ బాంటన్ 12 బంతుల్లో 29 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 236 పరుగులు సాధించింది.కివీస్ ఎదుట భారీ లక్ష్యంతద్వారా న్యూజిలాండ్‌కు 237 పరుగుల మేర భారీ లక్ష్యం విధించింది. ఇదిలా ఉంటే.. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లే ఓవల్ మైదానంలో ఏ జట్టుకైనా టీ20లలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.ఇక న్యూజిలాండ్ బౌలర్లలో కైలీ జెమీషన్ రెండు వికెట్లు కూల్చగా.. జేకబ్ డఫీ, మైకేల్ బ్రాస్‌వెల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అరుదైన మైలురాయిని చేరుకున్న హ్యారీ బ్రూక్అంతర్జాతీయ టీ20లలో హ్యారీ బ్రూక్ వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఇంగ్లండ్ తరఫున ఈ ఫార్మాట్లో 51 మ్యాచ్‌లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఖాతాలో ప్రస్తుతం 1012 పరుగులు ఉన్నాయి.అంతేకాదు.. న్యూజిలాండ్‌తో రెండో టీ20లో కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న హ్యారీ బ్రూక్ మరో ఘనతను సాధించాడు. ఇంగ్లండ్ తరఫున పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో కెప్టెన్‌గా నిలిచాడు. ఈ జాబితాలో ఇయాన్ మోర్గాన్ (21 బంతుల్లో) ముందు వరుసలో ఉన్నాడు. ఇక సారథిగా బ్రూక్‌కు ఇదే తొలి టీ20 ఫిఫ్టీ కాగా.. ఓవరాల్‌గా ఐదవది కావడం గమనార్హం.చదవండి: ‘నా వల్లే జట్టు ఓడింది.. ఓటమికి బాధ్యత నాదే.. తెలివిగా ఆడితే బాగుండేది’ -
‘కొత్త’ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు.. కోట్లలో జీతాలు
టెక్ రంగంలో నూతన ఉద్యోగాల కోసం పోటీ తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా (Meta) తాజాగా గ్రాడ్యుయేట్లను లక్ష్యంగా చేసుకుని ఎంట్రీ లెవల్ టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ, అర్హత ఉన్న అభ్యర్థులకు మెటా మంచి జీతాలు, స్టాక్ ఆప్షన్లు, ఆరోగ్య ప్రయోజనాలువంటి ఆకర్షణీయమైన ప్యాకేజ్‌లను అందిస్తోంది.కావాల్సిన అర్హతలు ఇవే..మెటా ప్రస్తుతం ఫుల్-స్టాక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ (full-stack software engineers), ప్రోడక్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ (product software engineer)లాంటి ఉద్యోగాల కోసం అభ్యర్థులను నియమిస్తోంది. ఈ ఉద్యోగాలకు..కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా అప్లైడ్ సైన్సెస్‌లో బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరి.అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ సమయంలో లేదా తరువాత ఈ కిందివాటిలో కనీసం ఒకదాన్నైనా కలిగి ఉండాలి..సంబంధిత యూనివర్సిటీ కోర్సు, ఇంటర్న్‌షిప్, థీసిస్PHP, Hack, C++, Python లాంటి లాంగ్వేజెస్‌లో 12 నెలల పని అనుభవంReact వంటి ఫ్రేమ్‌వర్క్‌లో పని చేసిన అనుభవంలార్జ్ స్కేల్ స్టోరేజ్ సిస్టమ్‌లతో పని చేయగల సామర్థ్యంiOS సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలకు మాత్రం అభ్యర్థులకు ఒక సంవత్సరం అనుభవం.. ముఖ్యంగా ఆబ్జెక్ట్-ఒరియెంటెడ్ ప్రోగ్రామింగ్, మల్టీ థ్రెడింగ్, Linux/Unix సిస్టమ్స్‌లో ఉండాలి.జీతం ఎంతంటే.. ఫార్చ్యూన్ నివేదిక ప్రకారం, ఈ ఎంట్రీ లెవల్ పాత్రలకు వార్షిక జీతం 176,000 డాలర్ల నుంచి 290,000 డాలర్ల వరకు ఉంటుంది. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ.1.46 కోట్ల నుంచి రూ.2.41 కోట్లు అన్న మాట. జీతంతో పాటు వార్షిక బోనస్‌లు, స్టాక్ ఈక్విటీలు, ఆరోగ్య భద్రతా ప్రయోజనాలు, * ఇతర కార్మిక సంక్షేమ పథకాలు ఉంటాయి.అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఉద్యోగాలు ఆన్-సైట్ మాత్రమే. అంటే వాషింగ్టన్ లేదా కాలిఫోర్నియాలోని మెటా కార్యాలయాల్లో పని చేయాల్సి ఉంటుంది. రిమోట్ వర్క్ ఆప్షన్ ఉండదు.ఈ అవకాశాల ప్రాముఖ్యత ప్రస్తుతం చాలా కంపెనీలు నూతన గ్రాడ్యుయేట్లను నియమించుకోవడంలో జాప్యం చేస్తుండగా, మెటా మాత్రం యువ ప్రతిభను గుర్తించి, వారిని ఉద్యోగాలలో చేర్చుకోవడంలో చురుకుగా వ్యవహరిస్తోంది. ఆటోమేషన్ పెరుగుతున్న ప్రస్తుత ఉద్యోగ విపణిలో, ఇది ఒక దిగ్గజ కంపెనీ నుంచి వచ్చిన సువర్ణావకాశంగా నిలిచింది.మార్క్ జుకర్‌బర్గ్ అభ్యర్థుల్లో చూసేదిదే..మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) సాంప్రదాయ విద్యా ప్రమాణాల కంటే ప్రయోజనకర నైపుణ్యాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఆయన మాటల్లోనే.."ఒకరు ఏదైనా పనిని లోతుగా నేర్చుకొని అద్భుతంగా చేయగలరని చూపగలిగితే, వారు ఆ నైపుణ్యాన్ని ఇతర రంగాల్లో కూడా వర్తింపజేయగలరు"కాబట్టి, అభ్యర్థులు తమ అభ్యాస నైపుణ్యాలను, సమస్యలపై అవగాహనను స్పష్టంగా చూపగలగాలి. మెటా లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో అవకాశాలను అందుకోవాలంటే జ్ఞానం కలిగి ఉండటం ఒక్కటే సరిపోదు.. దాన్ని ప్రయోగించగలగడం ముఖ్యమైంది.ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. చిగురించిన ఆశలు -
విలక్షణం, విశిష్టం 'కుమార్ సాను' గాత్రం!
(అక్టోబర్ 20 ప్రముఖ గాయకుడు 'కుమార్ సాను'(Kumar Sanu) పుట్టినరోజు)“సాంసోం కీ జరూరత్ హై జైసే జిందగీ కే లియేబస్ ఎక్ సనమ్ చాహియే ఆషికీ కే లియే!”80s కిడ్స్‌కి పరిచయం అక్కర్లేని పాట ఇది. ఈ పాట పాడినవారికి కూడా పరిచయం అక్కర్లేదనుకోండి! దశాబ్దానికి పైగా బాలీవుడ్ సినీ సంగీతాన్ని ఏలిన మెలోడీ కింగ్ కేదార్ నాథ్ భట్టాచార్య ఉరఫ్ కుమార్ సాను పాడిన పాట ఇది.నదీమ్-శ్రవణ్‌తో స్వర ప్రయాణం:నదీమ్-శ్రవణ్ జోడీతో కలిసి 'కుమార్ సాను'(Kumar Sanu) పాటలు పాడిన కాలాన్ని బాలీవుడ్ కి స్వర్ణ యుగంగా చెప్పకోవచ్చు. ‘ఆషికీ’లో ప్రతి పాటా ఎన్ని వందలసార్లు విన్నా ఎప్పటికీ పాతబడదు. ‘సాంసోంకీ జరూరత్’, ‘తూ మేరీ జిందగీ హై’, ‘నజర్ కే సామ్ నే’ ఎంత మెలోడీయస్ గా ఉంటాయో ‘అబ్ తేరే బిన్’ అంత ఆవేశపరుస్తుంది. కాబట్టే ఈ పాట కుమార్ సానుకి ఫిలింఫేర్ అవార్డు తెచ్చి పెట్టింది. 1991లో ఈ పాటకుగాను మొదటిసారి ఫిలింఫేర్ అవార్డు అందుకున్న కుమార్ సాను వరసగా ఐదేళ్ళు, అంటే 1995 వరకు ఈ అవార్డు అందుకుంటూనే ఉన్నారు. ‘సాజన్’లోని ‘మేరా దిల్ భీ కిత్నా పాగల్ హై’ కుమార్ సాను ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్న పాటల్లో ఒకటి. గొంతులో ఒక రకమైన జీరతో, నాసల్ వాయస్లో పాడే కుమార్ సాను మెలోడీస్ వింటే చాలు అప్పట్లో సంగీత ప్రియుల గుండెలు విలవిల్లాడిపోయేవి. ‘దిల్ హై కె మాన్తా నహీ’ టైటిల్ సాంగ్, ‘తుమ్హే అప్నా బనానే కీ కసమ్’ (సడక్), ‘ధీరే ధీరే ప్యార్ కో బఢానా హై’ (ఫూల్ ఔర్ కాంటే), ‘గవా హై చాంద్ తారే’ (దామిని), ‘సోచేంగే తుమ్హే ప్యార్ కర్కే నహీ’ (దీవానా), ‘ఘూంఘట్ కీ ఆడ్ సే’ (హమ్ హై రాహీ ప్యార్ కే), ‘పర్ దేసీ జానా నహీ’ (రాజా హిందూస్తానీ), ‘దో దిల్ మిల్ రహే హై’, ‘మేరీ మెహబూబా’ (పర్ దేస్)- ఇలా నదీమ్-శ్రవణ్ స్వరపరిచిన పాటలను కుమార్ సాను తన గొంతుకతో ఎవర్ గ్రీన్ హిట్స్ గా మలిచారు. మొత్తమ్మీద ఈ జోడీ కాంబినేషన్ లో కుమార్ సాను 300 దాకా పాటలు పాడారు. అను మల్లిక్‌తో :నదీమ్ శ్రవణ్ తర్వాత కుమార్ సాను ఎక్కువగా పని చేసింది అను మల్లిక్ కే. ‘బాజీగర్’ కోసం కుమార్ సాను పాడిన ‘యే కాలీ కాలీ ఆంఖే’ ఫిలింఫేర్ సాధించుకుంది. అనుమల్లిక్ స్వర కల్పనలో కుమార్ సాను ‘చురాకే దిల్ మేరా’ లాంటి ఎన్నో హిట్ నంబర్స్ పాడారు. ‘దిల్ జలే’ లోని ‘జిస్కే ఆనే సే’ అనే పాట లిరిక్స్, కంపోజిషన్ పరంగా ‘ఎక్ లడ్కీ కో దేఖా తో’ పాటను పోలి ఉన్నా దానికి వచ్చినంత గుర్తింపు అయితే రాలేదు. కానీ కుమార్ సాను పాడిన క్లాసిక్ సాంగ్స్ లో ఇదీ ఒకటి. 1990ల నాటి బ్యాక్ గ్రౌండ్ తో ఆయుష్మాన్ ఖురానా, భూమి పడ్నేకర్ హీరో హీరోయిన్లుగా 2015లో వచ్చిన సినిమా ‘దమ్ లగాకే హైషా’. 90ల నాటి సినిమా గనక నేచరల్ గానే ఇందులోని హీరో హీరోయిన్లకు కుమార్ సాను పాటలంటే పిచ్చి అన్నట్లు చూపిస్తారు. ఈ సినిమాలో అను మల్లిక్, కుమార్ సానుతో రెండు పాటలు పాడించారు. ఒక పాటలో ఆయన కేమియో అప్పియరెన్స్ కూడా ఇచ్చారు. జతిన్-లలిత్‌తో:జతిన్-లలిత్ కాంబినేషన్ లో కుమార్ సాను పాడిన మెలొడీలు శ్రోతలను తన్మయత్వంలో ఓలలాడిస్తాయి. "దిల్ వాలే దుల్హనియా లేజేయేంగే" కోసం కుమార్ సాను లతా మంగేష్కర్ తో కలిసి పాడిన ‘తుఝే దేఖా తో యే జానా సనమ్’ ఇప్పటికైనా ఎప్పటికైనా మర్చిపోగలమా? ‘సీనే మే దిల్ హై’, ‘తు మేరే సాథ్ సాథ్’ (రాజు బన్ గయా జంటిల్ మ్యాన్), ‘ఐ కాష్ కే హమ్’(కభీ హా కభీ నా), ‘మై కోయీ ఐసా గీత్ గావూ’, ‘ఏక్ దిన్ ఆప్’(యస్ బాస్),‘దుష్మన్’ కోసం లతా మంగేష్కర్తో కలిసి పాడిన ‘ప్యార్ కో హో జానే దో’ లాంటి పాటలు షారుఖ్ ఖాన్ కెరీర్ లో మైలురాళ్ళ లాంటివి. కానీ జతిన్ లలిత్ కాంబినేషన్ లో కుమార్ సాను పాడిన ‘జబ్ కిసీ కీ తరఫ్’ (ప్యార్ తో హోనా హీ థా) వీటన్నింటినీ మించిన ఆల్ టైం హిట్. ఇక ‘ఖూబ్ సూరత్’సినిమా కోసం కవితా కృష్ణమూర్తితో కలిసి కుమార్ సాను పాడిన‘మేరా ఎక్ సప్నా హై’వింటే కలల్లో తేలిపోవడం ఖాయం. రాజేశ్ రోషన్‌తో:‘జబ్ కోయి బాత్ బిగడ్ జాయే’ – జుర్మ్ సినిమా కోసం రాజేశ్ రోషన్ మ్యూజిక్ డైరెక్షన్ లో కుమార్ సాను పాడిన ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో ‘కరణ్ అర్జున్’, ‘సబ్సే బడా ఖిలాడీ’, ‘కోయ్ లా’, ‘క్యా కెహ్ నా’ లాంటి సినిమాలు వచ్చాయి. 1996లో వచ్చిన ‘పాపా కెహ్తే హై’ అట్టర్ ఫ్లాప్ సినిమా. కానీ రాజేశ్ రోషన్ పాటలు మాత్రం సూపర్ హిట్. ఇందులో ఉదిత్ నారాయణ్ పాడిన ‘ఘర్ సే నికల్తే హీ’తో పాటు కుమార్ సాను పాడిన ‘యే జో థోడే సే హై పైసే’, ‘ప్యార్ మే హోతా హై క్యా జాదూ’ పాటలు చాలా కాలం పాటు గుర్తుండిపోతాయి. ఇక ‘కహో నా ప్యార్ హై’లో కుమార్ సాను పాడిన ‘చాంద్ సితారే’ చాలా ఎలిగెంట్ గా అనిపిస్తుంది. ఆర్డీ బర్మన్తో: 1995కిగాను ‘ఎక్ లడ్కీ కో దేఖా తో’ (1942 ఎ లవ్ స్టోరీ) అనే పాట కుమార్ సానుకి ఫిలింఫేర్ సాధించింది. ఆర్డీ బర్మన్ చివరిసారిగా కంపోజ్ చేసిన ఈ పాట కుమార్ సాను జర్నీకి ఒక క్లాసిక్ టచ్ ఇచ్చింది. సంగీతం, స్వరం, విధు వినోద్ చోప్రా పిక్చరైజేషన్తో పాటు జావేద్ అఖ్తర్ లిరిక్స్ వల్ల ఈ పాట అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఇదే సినిమాలో కుమార్ సాను పాడిన ‘కుఛ్ నా కహో’ చాలా హాయిగా అనిపిస్తుంది. ఎ. ఆర్. రెహమాన్‌తో సింగిల్ సాంగ్! ఎందుకంటే...:ఉదిత్ నారాయణ్ లాంటి సింగర్స్ తో ఎన్నో పాటలు పాడించిన రెహమాన్, కుమార్ సానుతో ఒకే ఒక్క పాట పాడించడం జీర్ణం కాదు. ‘కభీ న కభీ’ లో ‘మిల్ గయీ మిల్ గయీ’ అనే ఈ పాట ‘అంజలి అంజలి పుష్పాంజలి’ అనే పాట ట్యూన్ లో సాగుతుంది. ఒక ఇంటర్ వ్యూలో రహమాన్ని అసలు మ్యూజిక్ డైరెక్టర్ గానే గుర్తించను అని కుమార్ సాను చెప్పారు. ఎందుకని అడిగితే ఆయన నన్ను సింగర్ గా గుర్తించలేదు కాబట్టి అని సమాధానమిచ్చారు. ఈ మాటలు వింటే ఇద్దరికీ ఎక్కడో కుదరలేదని అర్థమవుతుంది.బెస్ట్ కో-సింగర్ ఎవరంటే...: కుమార్ సాను లతా మంగేష్కర్, అనురాధా పౌడ్వాల్, సాధనా సర్గమ్ లాంటి సింగర్స్ తో కలిసి ఎన్ని పాటలు పాడినా అల్కా యాగ్నిక్ తో పాడిన పాటలు వింటే మాత్రం తేనెలో ముంచి తేల్చినట్లే అనిపిస్తుంది. ‘ముఝ్ సే మొహబ్బత్ కా’, ‘యే ఇష్క్ హై క్యా’, ‘తేరీ మొహబ్బత్ నే’, ‘హమ్ కో సిర్ఫ్ తుమ్ సే ప్యార్ హై’, ‘జాదూ హై తేరా హీ జాదూ’, ‘జో హాల్ దిల్ కా’ లాంటి పాటలు ఈ కాంబినేషన్‌కి గొప్ప ఉదాహరణలు. కుమార్ సాను పేరు వెనక కథ:కుమార్ సానుకి లెజెండరీ సింగర్ కిశోర్ కుమార్ అంటే గొప్ప గౌరవం. 1983లో సాను భట్టాచార్యగా బెంగాలీలో సింగింగ్ కెరీర్ ఆరంభించిన కేదార్ నాథ్ భట్టాచార్య, 1988లో ‘హీరో హీరాలాల్’ అనే హిందీ సినిమాలో తొలిసారి పాడారు. 1989లో జగ్ జీత్ సింగ్ ఆయన్ను కల్యాణ్ జీ-ఆనంద్ జీ జోడీలోని కల్యాణ్ జీకి పరిచయం చేశారు. వాళ్ళ సూచనతో కిశోర్ కుమార్ పేరులోని కుమార్ కి ‘సాను’ కలిపి కుమార్ సాను గా తన పేరు మార్చుకున్నారు. అంతే కాదు ‘కిశోర్ కుమార్ కీ యాదే’ పేరుతో కిశోర్ దా పాపులర్ సాంగ్స్ పాడుతూ ఒక ఆల్బమ్ కూడా రిలీజ్ చేశారు.కుమార్ సాను తెలుగులో ఏ పాటలు పాడారంటే...:మన తెలుగులోనూ కుమార్ సాను ‘దేవుడు వరమందిస్తే’, ‘మెరిసేటి జాబిలి నువ్వే’, ‘ఒక్కసారి చెప్పలేవా’, 'నీ నవ్వులే వెన్నలని' లాంటి హిట్ సాంగ్స్ పాడారు. ఆయన విలక్షణమైన గొంతుక తెలుగువారికి బాగా నచ్చేసింది. కుమార్ సాను సెకండ్ ఇన్నింగ్స్:2004లో పాలిటిక్స్ లోకి వెళ్ళిన కుమార్ సాను ఎనిమిదేళ్ళ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి తిరిగి వచ్చారు. ‘రౌడీ రాథోడ్’, ‘గన్స్ & గులాబ్స్’ లాంటి సినిమాల్లో పాడారు. అక్టోబర్ 20, 1957లో పుట్టిన కుమార్ సానుకి ఇప్పుడు 68 ఏళ్ళు. ఈ వయసులోనూ ఆయన గొంతు ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఈ మధ్యనే ‘కుమార్ సాను అఫీషియల్’ పేరుతో యూట్యూబ్‌లో ఆయన సొంత మ్యూజిక్ లేబుల్ ఒకటి ప్రారంభించారు. అందులోని పాటలు వింటే ఈ విషయం అర్థమవుతుంది.మొత్తం ఎన్ని పాటలు పాడారంటే...:కుమార్ సాను మాతృభాష అయిన బెంగాలీతో పాటు హిందీ, తెలుగు సహా 16కి పైగా భాషల్లో పాటలు పాడారు. ఒకే రోజు 28 పాటలు పాడిన గాయకుడిగా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్నారు. బీబీసీ రూపొందించిన ‘ఆల్ టైం 40 సాంగ్స్ ఆఫ్ బాలీవుడ్’లో కుమార్ సాను పాటలే ఎక్కువగా కనిపిస్తాయి. 2009లో పద్మశ్రీ అందుకున్నారు. మెలోడీ కింగ్ అని శ్రోతలతో పిలిపించుకున్న కుమార్ సాను ఇప్పుడు ఎక్కువగా పాడలేకపోతుండవచ్చు. కానీ ఆయన పాడిన ప్రతి పాటా ఇప్పటికీ అభిమానుల గుండెల్లో మార్మోగుతూనే ఉంటుంది.-శాంతి ఇషాన్ (Shanti Ishan) -
కర్నాటకలో ఆర్ఎస్ఎస్ మార్చ్‌కి నో
కలబురిగి: కర్నాటకలో రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్) తలపెట్టిన ర్యాలీకి అధికారులు అనుమతి నిరాకరించారు. మంత్రి ప్రియాంక్ ఖర్గే సొంత నియోజకవర్గం చిట్టాపూర్‌లో ఆదివారం ఆర్ఎస్ఎస్ ‘రూట్ మార్చ్’నిర్వహించాలని భావించింది. ఈ మేరకు తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంది. అయితే, శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశముందంటూ తహశీల్దార్ అనుమతి నిరాకరించారు. ఆ దరఖాస్తును తిరస్కరించారు. కలబురిగి జిల్లా చిట్టాపూర్ పట్టణంలో అక్టోబర్ 19వ తేదీన ఆర్ఎస్ మార్చ్ నిర్వహణకు అనుమతి కోరిందని తహశీల్దార్ చెప్పారు. భీమ్ ఆర్మీ, ఇండియన్ దళిత్ పాంథర్స్ కూడా అదే రోజు ర్యాలీలు జరుపుతామని దరఖాస్తు చేసుకున్నాయన్నారు. వీటితో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశాలున్నాయంటూ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నుంచి అందిన నివేదిక మేరకు ఆర్ఎస్ఎస్ ర్యాలీకి నో చెప్పామన్నారు. అదేవిధంగా, ర్యాలీకి అనుమతివ్వక మునుపే ఏర్పాటు చేశారంటూ పట్టణ ప్రధాన రహదారిపైని ఆర్ఎస్ఎస్ కటౌట్లు, బ్యానర్లను శనివారం భారీ పోలీసు బందోబస్తు నడుమ మున్సిపల్ సిబ్బంది తొలగించి వేశారు. ప్రభుత్వ ప్రాంగణాలు, భవనాల్లో అనుమతి లేకుండా ఏ సంస్థలు గానీ వ్యక్తులు గానీ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదంటూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం సైతం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.