
ఎంఎస్ ధోని.. భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు.

భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోని ఒకరు.

మూడు ఐసీసీ ట్రోఫీలను భారత్‌కు అందించిన నాయకుడు అతడు

2007 టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని ధోని కెప్టెన్సీలో భారత్ గెలుచుకుంది

ఐపీఎల్‌లో కూడా చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదు టైటిల్స్ అందించిన ఘనత ధోనిది.

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా ధోనికి బీసీసీఐ నుంచి నెలవారీ పెన్షన్ అందుతోంది.

క్రిక్‌ఫిట్ రిపోర్ట్ ప్రకారం బీసీసీఐ నుంచి నెలకు రూ.70,000 పెన్షన్ పొందుతాడు.

ధోని భారత్ తరపున 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.






