

మహేశ్ బాబు ‘మురారి’ మూవితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సొనాలి బింద్రె. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస అవకాశాలు లభించాయి. ఖడ్గం, మన్మధుడు, ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనె పెళ్లి చేసుకొని వెండితెరకు దూరమైంది. ఆ తర్వాత టీవీ రంగంలోకి వెళ్లింది.

కొన్నాళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడి అమెరికాలో చికిత్స తీసుకొని కోలుకుంది.

చాలా కాలం తర్వాత ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ సొట్టబుగ్గల సుందరి ‘ది బ్రోకెన్ న్యూస్’ సీజన్ 2లో నటించింది.

మే 3నుంచి ప్రముఖ ఓటీటీ జీ5లో ఈ వెబ్ సిరీస్ స్క్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ఈ వెబ్‌సిరీస్ ప్రమోషన్‌లో బిజీగా ఉంది సొనాలి.






