సీతారామం సినిమాతో అందరి మనసులు దోచేసింది మృణాల్ ఠాకూర్. సినిమాల్లో, ఫంక్షన్స్‌లో మృణాల్ ఎంతో అందంగా కనిపించడానికి కారణం ఎవరో తెలుసా?
ఆమె సోదరి లోచన్ ఠాకూర్. మృణాల్‌ను చిన్నప్పటినుంచి అందంగా ముస్తాబు చేస్తూనే వస్తోంది.
స్కూల్‌లో గెటప్స్ వేసేటప్పుడు, కాలేజీలో డ్యాన్స్ ఫంక్షన్‌లో, ఇప్పుడు సినిమాల్లోనూ మృణాల్‌కు మేకప్ ఆర్టిస్ట్‌గా వ్యవహరిస్తోంది.
లోచన్ బర్త్‌డే సందర్భంగా మృణాల్ తన సోదరితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది.
నన్ను మీరాబాయిగా, చిన్ని కృష్ణుడిగా, రాజస్తానీ డ్యాన్సర్‌గా ఎప్పుడూ ఏదో ఒక గెటప్‌లో రెడీ చేస్తూ ఉన్నావు.
అంతేనా.. సూపర్ 30, హాయ్ నాన్న చిత్రాల్లోనూ నా లుక్‌తో మ్యాజిక్ సృష్టించావు.
నీ క్రియేటివిటీకి, ఓపికకు, ప్రేమకు ఎల్లప్పుడూ కృతజ్ఞురాలినే! నువ్వు లేకుండా ఏదీ సాధ్యమయ్యేదే కాదు.
నువ్వు నా సోదరివి మాత్రమే కాదు సోల్‌మేట్ కూడా!
నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మేకప్‌ను నీ వృత్తిగా ఎంచుకుని దాని ద్వారా ఎంతోమంది కళ్లలో ఆనందాన్ని నింపుతున్నావు.
ఇంతకంటే గర్వకారణం ఇంకేముంటుంది. ఇంత మంచి సిస్టర్‌ను ఇచ్చినందుకు థాంక్యూ అమ్మా అని తన పోస్ట్‌కు క్యాప్షన్ జోడించింది.


