బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్‌కు అరుదైన గౌరవం దక్కింది.
ఫ్రాన్స్ అందించే రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన "నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్" పురస్కారం అందుకుంది.
ముంబయిలో జరిగిన ఈవెంట్‌లో ఇండియా ఫ్రాన్స్ రాయబారి ఫ్రాంకోయిస్ రిషియర్ ఆమెకు ఈ గౌరవాన్ని ప్రదానం చేశారు. సినిమా రంగానికి ఆమె చేసిన కృషిని, ఇండో-ఫ్రెంచ్ సహకారాన్ని ప్రోత్సహించడానికి ఐశ్వర్య చేస్తున్న నిరంతర ప్రయత్నాలను ఫ్రెంచ్ ప్రభుత్వం గుర్తించింది.


