కరీంనగర్ తీగల వంతెనకు అనేక ప్రత్యేకతలున్నాయి. పూర్తివిదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన వంతెన ఇది. బుధవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు
గురువారం నుంచి సాధారణ వాహనాలకు అనుమతిస్తారు
దసరా వరకు ప్రతీ ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు సందర్శకులకు అనుమతి ఇవ్వనున్నారు
హైదరాబాద్ దుర్గం చెరువు తర్వాత రాష్ట్రంలో రెండో వంతెన కరీంనగర్‌దే
500 మీటర్ల పొడవైన రోడ్డు, ఫోర్‌లేన్
ఇటలీ నుంచి తీసుకొచ్చిన 26 పొడవైన స్టీల్ కేబుల్స్.. వాటిని కప్పుతూ డైనమిక్ లైటింగ్ సిస్టం
రూ. 8 కోట్లతో కొరియా టెక్నాలజీతో డైనమిక్ లైటింగ్ సిస్టమ్
సంగీతానికి అనుగుణంగా రంగులు మారే డైనమిక్ లైటింగ్
వంతెనకు 2 పైలాన్లు, వీటి మధ్య దూరం 220 మీటర్లు
దసరా నాటికి బోటింగ్ ప్రారంభం
వంతెన పక్కన త్వరలో రూ.69 కోట్లతో భారీ ఫౌంటేన్ నిర్మాణం


