
టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ ఫోన్లను ఆవిష్కరించింది.

ఐఫోన్ 17లో 6.3 అంగుళాల స్క్రీన్, ఏ19 ప్రో ప్రాసెసర్, 48 ఎంపీ డ్యుయల్ ఫ్యూజన్ కెమెరా, 24 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 256 జీబీ మెమొరీ తదితర ఫీచర్లు ఉన్నాయి.

అయిదు రంగుల్లో లభిస్తుంది. అత్యంత పల్చని ఐఫోన్ 17 ఎయిర్‌ని కూడా యాపిల్ విడుదల చేసింది.

మంగళవారం క్యుపర్టినోలో జరిగిన కార్యక్రమంలో యాపిల్ సీఈవో టిమ్ కుక్.. కొత్త ఐఫోన్‌తో పాటు పలు ఉత్పత్తులను ఆవిష్కరించారు.

వాచీలు, ఎయిర్‌పాడ్స్ ఉన్నాయి. వాచ్ ఎస్‌ఈ, వాచ్ సిరీస్ 11, వాచ్ అల్ట్రా 3ని కంపెనీ ఆవిష్కరించింది.


























