సాక్షి, కడప: వైఎస్‌ఆర్ కడప జిల్లా కలెక్టరేట్‌లో కలకలం రేగింది. కలెక్టరేట్ వద్ద పులివెందులకు చెందిన ఓ వ్యక్తి. కొడుకుతో సహా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. గమనించిన సిబ్బంది తండ్రీకొడుకుని రిమ్స్‌కు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. కాగా గత కొంతకాలంగా తన భార్య కాపురానికి రావడంలేదని సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు తన సమస్యను పట్టించకోలేదని.. అందుకే ఆత్మహత్యకు యత్నించినట్టు అతను అరోపిస్తున్నాడు.
భార్య కాపురానికి రావడంలేదని..
Jan 23 2018 1:55 PM | Updated on Jan 23 2018 1:55 PM
Advertisement
Advertisement