150 ఏళ్ల తర్వాత ఒకే రోజున..

A celestial event that happens 150 years later - Sakshi

సాక్షి: ఈ నెల 16న గురు పౌర్ణిమ. ప్రతి సంవత్సరం హిందువులు ఆషాడ పౌర్ణమిని వేద వ్యాసుని జయంతికి గుర్తుగా గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. అయితే ఆ తర్వాత ఎనిమిది గంటల తేడాతో చంద్ర గ్రహణం జరగబోతోంది. ఇలా కొన్ని గంటల తేడాతో రెండు సందర్బాలు రావడం అరుదుగా జరుగుతుంది. చంద్రునికి సూర్యునికి మధ్య భూమి వచ్చి, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుకున్నప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుందని తెలిసిందే. చంద్ర గ్రహణం ఎప్పుడూ పౌర్ణమి నాడే జరుగుతుంది. ఇంతకు ముందు జులై 12, 1870న ఒకే సమయంలో చంద్ర గ్రహణం, గురుపౌర్ణిమ వచ్చాయి. మళ్లీ ఇప్పుడు దాదాపు 150 ఏళ్ల తర్వాత అలాంటి సందర్భం రాబోతోంది.

గురు పౌర్ణిమ వేళలు: 16వ తేదీ తెల్లవారు జామున 1.30 గంటలకు మొదలై సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. 

చంద్ర గ్రహణం వేళలు: 17వ తేదీ తెల్లవారు జాము 12.13 గంటలకు మొదలై, మూడు గంటలకు గరిష్ట స్థాయికి చేరుకొని 5.47కు ముగుస్తుంది. 

రెండింటి మధ్య కేవలం ఎనిమిది గంటల సమయమే తేడా. ఇంకో విశేషమేంటంటే తదుపరి చంద్ర గ్రహణం చూడాలంటే మే 26, 2021 వరకు ఆగాల్సిందే. అంటే దాదాపు రెండు సంవత్సరాల తర్వాతనే మరో చంద్ర గ్రహణం వస్తుందన్నమాట.

Read latest World News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top