పెసర పంటలో తెగుళ్ల నివారణ | pestilences prevention to Green Gram crops | Sakshi
Sakshi News home page

పెసర పంటలో తెగుళ్ల నివారణ

Aug 25 2014 6:39 PM | Updated on Jun 4 2019 5:04 PM

పెసర పంటలో తెగుళ్ల నివారణ - Sakshi

పెసర పంటలో తెగుళ్ల నివారణ

జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు సాగు చేసిన పెసర పంటకు రసం పీల్చే పురుగు, తెల్ల దోమ, మసి పేను సోకిందని జహీరాబాద్ వ్యవసాయ శాఖ ఏడీఏ వినోద్‌కుమార్,

జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు సాగు చేసిన పెసర పంటకు రసం పీల్చే పురుగు, తెల్ల దోమ, మసి పేను సోకిందని జహీరాబాద్ వ్యవసాయ శాఖ ఏడీఏ వినోద్‌కుమార్, సెల్: 8886614277 తెలిపారు. సరైన వానలు లేక కాయ ఎదుగుదల లోపించిందని చెప్పారు. ఈ సమయంలో లీటర్ నీటిలో రెండు గ్రాముల యూరియా కలిపి చేనుపై పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నారు. వర్షాలు లేక పంట త్వరగా పక్వానికి వచ్చిందని వివరించారు. తెల్లదోమ బెడద అధికంగా ఉంటే దీని నివారణకు లీటర్ నీటిలో 2 గ్రాముల పొటాషియం నైట్రేట్‌ను కలిపి పంటపై పిచికారీ చేయాలని తెలిపారు. రసం పీల్చే పురుగు నివారణకు లీటర్ నీటిలో 1.5గ్రాముల ఎస్పేట్ మందును కలిపి స్ప్రే చేయాలని సూచించారు.  
 - జహీరాబాద్ టౌన్

Advertisement
 
Advertisement
Advertisement