నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఓటమి ఖాయం: లగడపాటి
ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాలుగు రాష్ట్రాల్లో ఓడిపోతుంది అని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు.
ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాలుగు రాష్ట్రాల్లో ఓడిపోతుంది అని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కు మద్దతిచ్చే విషయంపై పార్టీలు పునరాలోచన పడుతాయని ఆంధ్రా ఆక్టోపస్ అన్నారు. కాంగ్రెస్ ఓటమి తనకు బాధ కలిగించినా.. రాష్ట్రం సమైక్యంగా ఉండటానికి ఉపకరిస్తుందన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ పనితీరు, పార్టీల బలబలాల్లో తేడాలొస్తాయని లగడపాటి తెలిపారు.
ఢిల్లీలో మాత్రం కాంగ్రెస్, బీజేపీ, ఏఏపీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది అని అన్నారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం దూకుడు తగ్గుతుంది అని అన్నారు. వేర్పాటువాదంపై ఆధారపడ్డ వాళ్లు చతికిలపడుతారని ఆయన ఎద్దేవా చేశారు. సమైక్య రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తమ వద్ద అస్త్రాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. వ్యతిరేకత ఉన్న ఏ బిల్లైనా పాస్ కావడం ఇబ్బందే అని అన్నారు.